
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అమెరికాలో అక్రమ వలసదారులను పంపించేశారు. ఇక, తాజాగా గ్రీన్‌కార్డుల(పౌరసత్వం) విషయమై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vanse) కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌కార్డు పొందినంత మాత్రాన వారికి అమెరికాలో ఎల్లకాలం ఉండిపోయే హక్కు లేదని బాంబు పేల్చారు. దీంతో, గ్రీన్‌కార్డు పొందిన వారికి టెన్షన్ మొదలైంది.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికా పౌరులుగా ఎవరిని గుర్తించాలో మాకు తెలుసు. గ్రీన్‌కార్డులు పొందినంత మాత్రన వారు జీవితాంతం అమెరికాలో ఉండలేరు. వారికి అలా జీవించే హక్కు లేదు. ఇది వాక్‌స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాదు, జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. అమెరికాలో నేరాలకు పాల్పడటం, సుదీర్ఘ కాలం దేశాన్ని వీడటం, ఇమిగ్రేషన్ నిబంధనలను పాటించకపోవడం వంటివి జరిగితే.. గ్రీన్‌కార్డును రద్దు చేయవచ్చు. దీనికి గురించి అమెరికా చట్టాలు చెబుతున్నాయి’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, వాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి.
ఇక, ఇదే సమయంలో వ్యాపారులకు ఇచ్చే గోల్డ్ కార్డ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. అమెరికా గోల్డ్ కార్డ్ పొందాలంటే విదేశీ పౌరులు 5 మిలియన్ల డాలర్లు(రూ.43 కోట్ల 46 లక్షలు) చెల్లించి అమెరికాలో నివసించే, పని చేసే హక్కును కల్పిస్తారని తెలిపారు. అమెరికా సమాజంలోకి ఎవరిని చేర్చుకోవాలో అమెరికన్లే నిర్ణయిస్తారని ఆయన స్పష్టం చేశారు.
Vice President JD Vance on the arrest of Mahmoud Khalil:
"A green card holder doesn't have an indefinite right to be in the United States. My attitude on this is this is not fundamentally about free speech." pic.twitter.com/48kfYb3brw— The American Conservative (@amconmag) March 14, 2025
ఇక, ఇదే సమయంలో వ్యాపారులకు ఇచ్చే గోల్డ్ కార్డ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. అమెరికా గోల్డ్ కార్డ్ పొందాలంటే విదేశీ పౌరులు 5 మిలియన్ల డాలర్లు(రూ.43 కోట్ల 46 లక్షలు) చెల్లించి అమెరికాలో నివసించే, పని చేసే హక్కును కల్పిస్తారని తెలిపారు. కాగా, అమెరికాలో అమల్లో ఉన్న ఈబీ-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసాను సరికొత్త గోల్డ్‌కార్డ్ భర్తీ చేయనుంది. ఇక అమెరికా వర్క్ వీసాలను అత్యధికంగా దక్కించుకొంటున్న దేశాల్లో భారత్ టాప్‌లో ఉంది. అక్టోబర్ 2022-సెప్టెంబర్ 2023 నాటికి జారీ చేసిన వర్క్ వీసాల్లో 72.3శాతం భారతీయులకే జారీ అయ్యాయి.
మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ ఫెడరల్ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను ఆయన గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) సవాల్ చేశారు. అత్యవసర పిటిషన్‌గా విచారణ చేట్టాలన్న అభ్యర్థనకు కోర్టు అంగీకరించింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే(జనవరి 20వ తేదీన) విదేశీయులకు జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఉత్తర్వులపై సంతకం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment