భారతీయుల ‘గ్రీన్‌కార్డు’ ఆశలపై నీళ్లు? | Green cards targeted in US senators' bill seeking to curb legal immigration | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 9 2017 7:05 AM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM

స్థానికులకే ఉద్యోగావకాశాలను పెంచే దిశగా కఠినమైన నిర్ణయాలతో ముందుకెళ్తున్న అమెరికా మరో పిడుగులాంటి ప్రతిపాదనను కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. ఇప్పటికే హెచ్‌1బీ వీసాలను తగ్గించేలా కార్యనిర్వాహక ఆదేశాలు సిద్ధమవుతుంటే.. ఇప్పుడు భారత అమెరికన్లకు తీవ్ర ప్రభావం చూపేలా గ్రీన్‌కార్డు (అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పర్చుకునే)ల సంఖ్యను సగానికి తగ్గించే బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది. అమెరికాలోకి వస్తున్న వలసలను పదేళ్లలో సగానికి తగ్గించే ఉద్దేశంతో రూపొందించిన రైజ్‌ (ద రిఫార్మింగ్‌ అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ ఫర్‌ స్ట్రాంగ్‌ ఎంప్లాయ్‌మెంట్‌) బిల్లును డెమొక్రటిక్‌ ఎంపీ టామ్‌ కాటన్, రిపబ్లికన్‌ ఎంపీ డేవిడ్‌ పర్‌డ్యూలు అమెరికన్‌ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement