వాషింగ్టన్ : వీసా దారులకు అమెరికా జోబైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.అమెరికా పౌరుల భాగస్వాములకు సరైన డాక్యుమెంట్లు లేకపోయినా పర్మనెంట్ రెడిడెంట్స్ (గ్రీన్ కార్డ్) పొందే ప్రక్రియను సులభతరం చేస్తూ జో బైడెన్ కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు వైట్ హౌస్ తెలిపింది.
నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్, మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌లు పోటీపడుతున్నారు.ఈ తరుణంలో అమెరికా పౌరుల్ని ప్రసన్నం చేసుకునేందుకు జోబైడెన్ సర్కార్ పీఆర్ నిబంధనల్ని సడలించేందుకు సిద్ధమైంది.
అయితే ఈ కొత్త రూల్స్ ప్రకారం..అమెరికా పీఆర్ కోసం అప్లయ్ చేసుకునేందుకు కాదని, ఇప్పటికే పీఆర్‌కు అర్హులైన వారికి మాత్రమే ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నట్లు సమాచారం. గ్రీన్ కార్డ్ కావాలంటే అర్హులైన వారు వారి సొంత దేశంలోని యూఎస్ ఎంబసీ కార్యాలయం నుంచి అప్లయ్ చేసుకోవాల్సి ఉంది. కొత్త రూల్స్ అమెరికా విడిచి వెళ్లే అవసరం లేకుండా అక్కడి నుంచే పీఆర్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు.
అమెరికా ఇమిగ్రేషన్ నిర్ణయంతో జూన్ 17,2024 ముందు వరకు వివాహ అయ్యిండి.. కనీసం అమెరికా పౌరులుగా కనీసం 10ఏళ్లు ఉంటే పీఆర్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు.ఇమ్మిగ్రేషన్ అధికారుల అంచనా ప్రకారం..పీఆర్ కోసం అప్లయ్ చేసుకునే వారి సంఖ్య 5లక్షలు ఉండొచ్చని అంచనా.అదనంగా, అమెరికన్ సిటిజన్లు దత్తత తీసుకున్న 50వేల మంది పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment