White House Passage of Bill That Eliminates Per Country Quota For Green Cards - Sakshi
Sakshi News home page

Green Card: అమెరికాలో ఉద్యోగాలు కోరుకునే భారతీయులకు గుడ్‌న్యూస్‌

Published Fri, Dec 9 2022 11:30 AM | Last Updated on Fri, Dec 9 2022 1:27 PM

White house passage of bill that eliminates per country quota for green cards - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో ఉద్యోగాలు కోరుకునే భారతీయులకు మేలు చేకూర్చే ప్రక్రియ మరో అడుగు ముందుకు పడింది. ఈక్వల్‌ యాక్సెస్‌ టు గ్రీన్‌ కార్డ్‌ ఫర్‌ లీగల్‌ ఎంప్లాయ్‌మెంట్‌(ఈగిల్‌) యాక్ట్‌–2022ను అమెరికా అధ్యక్ష భవనం ఓకే చెప్పింది. బిల్లుపై ఈ వారంలోనే అక్కడి పార్లమెంట్‌ దిగువ సభలో ఓటింగ్‌ చేపట్టనున్నారు.

ఇన్నాళ్లూ ప్రతి సంవత్సరంలో జారీచేసే గ్రీన్‌కార్డుల్లో ఒక్కో దేశానికి సంబంధించిన నిర్దిష్ట సంఖ్యలోనే కార్డులు ఇస్తారు. ఎవరికైనా  అధిక వృత్తి నైపుణ్యాలు ఉన్నాసరే.. అప్పటికే ఆ దేశ కోటా పూర్తయితే వారికి గ్రీన్‌ కార్డు అమెరికా ఇవ్వలేకపోతోంది. ఈ పరిమితిని ఎత్తేస్తోంది. అంటే ఏ దేశంలో పుట్టాడనే అంశంతో సంబంధంలేకుండా అత్యున్నత వృత్తి నైపుణ్యం గల వ్యక్తులను ఒకే దేశం నుంచి ఎక్కువ సంఖ్యలో తీసుకునేందుకు ఈగల్‌ చట్టం అవకాశం కల్పిస్తుంది.

చదవండి: (ఎలన్‌ మస్క్‌కు చుక్కలు చూపిస్తున్నారు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement