
గ్రీన్ కార్డ్ పాట్లు
ఇండియా నుంచి అమెరికా వెళ్లిన వారు గ్రీన్ కార్డ్ కోసం ఎన్ని తిప్పలు పడుతు న్నారు? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘గ్రీన్ కార్డ్’. శతృఘ్న రాయపాటి, స్టెఫానీ, జోసెలిన్, చలపతిరావు ముఖ్య పాత్రల్లో రమ్స్ దర్శకత్వంలో శ్రీనివాస్ గుప్తా, మోహన్.ఆర్, నరసింహ, నాగ శ్రీనివాస రెడ్డి నిర్మించారు. ‘‘వీసా తీసుకుని అమెరికా చేరుకున్న ఓ కుర్రాడి కథే ‘గ్రీన్ కార్డ్’. 15 ఏళ్లుగా అమెరికాలో గమనించిన పరిస్థితులు, అక్కడ మన పిల్లలు ఎలా ఉంటున్నారనేది చిత్రంలో చూపించాం. త్వరలో పాటలు, సినిమా రిలీజ్ చేస్తాం’’ అని రమ్స్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కు, హెన్నీ ప్రిన్స్, ప్రణయ్ కుమార్, కెమెరా: నవీన్, నాగ శ్రీనివాస్ రెడ్డి.