భారతదేశంలో మాత్రమే కాకుండా.. చాలా దేశాల్లోని విద్యార్థులు అమెరికాలో గ్రాడ్యుయేట్ చేయాలని ఉవ్విల్లూరుతూ ఉంటారు. అలాంటి వారు గ్రీన్ కార్డు పొందాలని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.
జరగబోయే ఎన్నికల్లో తాను గెలిస్తే.. అమెరికాలోని కాలేజీల్లో చదువుకుని గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమాతో పాటే వారికి గ్రీన్ కార్డు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అధికారిలోకి వచ్చిన మొదటి రోజే ఇది అమలయ్యేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు కూడా గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
కరోనా సమయంలో దీన్ని అమలు చేయలేకపోయామని, ఇప్పుడు కూడా అమెరికా, చైనా నుంచి వస్తున్న విద్యార్థులు వీసా సమస్యల కారణంగా మన దేశంలో ఉండలేకపోతున్నారని అన్నారు. అమెరికాలో చదువుకుని వారు సొంత దేశాలకు వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.
గతంలో అమెరికాలోని విదేశీయలను వెళ్లగొట్టిన ట్రంప్ ఇప్పుడు రూటు మార్చారు. రెండోసారి అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు ఎన్నికల బరిలో డిగ్గనున్నట్లు సమాచారం. సాధారణంగా వలస విధానం మీద తీవ్రంగా విరుచుకుపడే ట్రంప్.. ఈ సారి మాత్రం దీనికి భిన్నంగా వ్యాఖ్యానించారు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి.. తాను ఎన్నికల్లో గెలిస్తే గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.
అమెరికాలోకి అక్రమంగా చొరబడే వారి వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని.. లీగల్గా అమెరికాలోకి వస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్రంప్ గతంలోని చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. అక్రమ వలసదారుల వల్లే నిరుద్యోగం, నేరాలు, దోపీడీ వంటివి పెరుగుతున్నాయని ట్రంప్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment