graduates
-
దయాగుణం కలిగి ఉండండి
బెంగళూరు: గొప్ప తెలివితేటలే కాదు, తోటివారి పట్ల దయాగుణం కలిగి ఉండటం ఎంతో అవసరమని యువ పట్టభద్రులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉద్బోధించారు. ఆదివారం ఆయన బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ(ఎన్ఎల్ఎస్ఐయూ)లో జరిగిన 32వ స్నాతకోత్సవంలో ప్రసంగించారు. అకడెమిక్ బ్లాక్ విస్తరణ పనులకు అనంతరం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రసంగించారు. ‘నిజమైన నాయకత్వ ప్రతిభ గలవారు తమ బలాలతోపాటు బలహీనతలను కూడా గుర్తించగలరు. తమకున్న బలంతో ఇతరులకు తోడ్పాటునిస్తూ, తమ బలహీనతలను అధిగమించేందుకు ఇతరుల సాయం తీసుకుంటారు’అని సీజేఐ వివరించారు. అడ్డంకులను అధిగమించే క్రమంలో కుటుంబంతోపాటు స్నేహితుల మద్దతు ఎంతో అవసరమని చెప్పారు. తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంతో సహనంతో మెలగాలన్నారు. ‘నిర్ణయం తీసుకునే ప్రక్రియ అనిశి్చతితో కూడి ఉంటుంది, అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అనిశ్చితి కొనసాగేది కొంతకాలమే. మీరు ఎంచుకునే మార్గం ఏదైనప్పటికీ, భవిష్యత్తులో మీ సొంత నిర్ణయాలు సానుకూల పరిణామాలను కలిగిస్తాయి. ఈ క్రమంలో సహనం, వినయం అనే సద్గుణాలను ఎన్నడూ వీడరాదని కోరుతున్నాను’అని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. ‘వేగంగా మారుతున్న ప్రపంచం, అవసరాలు, వాతావరణ మార్పులు, సోషల్ మీడియా వంటి కొత్త వినోద సాధనాలు, సామాజిక దురాచారాలను మార్చాలనే ఆత్రుత సంక్లిష్ట సమస్యలకు స్వల్పకాలిక ఫలితాలను కోరేలా చేస్తున్నాయి’అంటూ ఆయన ఇలాంటి సమయంలో సహనంతో మెలగాల్సిన అవసరం ఎంతో ఉందని నొక్కిచెప్పారు. ‘హడావుడిగా తీసుకునే నిర్ణయాలకు ఎక్కువ శక్తిని వెచి్చంచాల్సి ఉంటుంది. ఇలాంటివి దీర్ఘకాలంలో మీ మానసిక ఆరోగ్యానికి చేటు కల్గిస్తాయి. దీర్ఘకాలంలో సానుకూల లక్ష్యాలను సాధించడం కూడా కష్టమవుతుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది’అని ఆయన యువ న్యాయవాదులను హెచ్చరించారు. న్యాయమూర్తిగా 24 ఏళ్లపాటు పనిచేశాక నాకో విషయం అర్థమయింది. మనదేశంలోని కోర్టుల్లో మనం మూడో వ్యక్తిగా కాకుండా మొదటి వ్యక్తిగా వాదిస్తాం ఎందుకంటే.. కోర్టుల్లో మనం క్లయింట్ల కోసం వాదించం. మనమే క్లయింట్లుగా వాదనలు సాగిస్తాం. వారికి ప్రతినిధులుగా మాత్రమే కాదు, వారి గొంతుక, వారి లాయర్‌గా, విజేతలుగా ఉంటాం’అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
బ్యాంకుల్లో అప్రెంటిస్‌లుగా గ్రాడ్యుయేట్లు
ముంబై: గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగావకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా కీలక ప్రకటన చేశారు.అప్రెంటిస్‌లుగా 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి బ్యాంకులు యోచిస్తున్నాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా శుక్రవారం తెలిపారు. 12 నెలల అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా అభ్యర్థులకు ప్రత్యేక నైపుణ్యంపై శిక్షణ ఇస్తారు. వీరికి నెలకు రూ.5,000 స్టైపెండ్‌ను బ్యాంకులు చెల్లిస్తాయని మెహతా వెల్లడించారు.‘నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం లేని మార్కెటింగ్, రికవరీ వంటి అనేక విభాగాలు ఉన్నాయి. వారికి ఆయా విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాము. 21–25 ఏళ్ల వయసున్న గ్రాడ్యుయేట్లు అర్హులు. అభ్యర్థి పన్ను చెల్లింపుదారు కాకూడదు. అలాగే ఐఐటీ, ఐఐఎం వంటి అగ్రశ్రేణి సంస్థల నుంచి డిగ్రీని కలిగి ఉండకూడదు.బ్యాంకింగ్ సేవలను చివరి మైలు వరకు తీసుకువెళ్లే అప్రెంటిస్‌లను బిజినెస్ కరస్పాండెంట్లుగా కూడా నియమించుకోవచ్చు. శిక్షణ పూర్తి అయ్యాక వారిలో కొందరు ఉద్యోగులుగా చేరే అవకాశమూ ఉంది. అన్ని బ్యాంకులు నెలరోజుల్లోగా అప్రెంటిస్‌లను నియమించుకోనున్నాయి. ఈ స్కీమ్ అమలుకు ప్రభుత్వ మద్దతు కూడా ఉంది’ అని చెప్పారు. అయితే ఎంత మందిని అప్రెంటిస్‌లుగా చేర్చుకుంటారనేది వెల్లడి కాలేదు. ఐబీఏ ఈ స్కీమ్‌పై కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ సెక్రటరీతో గురువారం చర్చించింది. -
గెలిస్తే గ్రాడ్యుయేట్లకు గ్రీన్ కార్డ్.. ట్రంప్ హామీ
భారతదేశంలో మాత్రమే కాకుండా.. చాలా దేశాల్లోని విద్యార్థులు అమెరికాలో గ్రాడ్యుయేట్ చేయాలని ఉవ్విల్లూరుతూ ఉంటారు. అలాంటి వారు గ్రీన్ కార్డు పొందాలని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.జరగబోయే ఎన్నికల్లో తాను గెలిస్తే.. అమెరికాలోని కాలేజీల్లో చదువుకుని గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమాతో పాటే వారికి గ్రీన్ కార్డు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అధికారిలోకి వచ్చిన మొదటి రోజే ఇది అమలయ్యేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు కూడా గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.కరోనా సమయంలో దీన్ని అమలు చేయలేకపోయామని, ఇప్పుడు కూడా అమెరికా, చైనా నుంచి వస్తున్న విద్యార్థులు వీసా సమస్యల కారణంగా మన దేశంలో ఉండలేకపోతున్నారని అన్నారు. అమెరికాలో చదువుకుని వారు సొంత దేశాలకు వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.గతంలో అమెరికాలోని విదేశీయలను వెళ్లగొట్టిన ట్రంప్ ఇప్పుడు రూటు మార్చారు. రెండోసారి అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు ఎన్నికల బరిలో డిగ్గనున్నట్లు సమాచారం. సాధారణంగా వలస విధానం మీద తీవ్రంగా విరుచుకుపడే ట్రంప్.. ఈ సారి మాత్రం దీనికి భిన్నంగా వ్యాఖ్యానించారు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి.. తాను ఎన్నికల్లో గెలిస్తే గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.అమెరికాలోకి అక్రమంగా చొరబడే వారి వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని.. లీగల్‌గా అమెరికాలోకి వస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్రంప్ గతంలోని చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. అక్రమ వలసదారుల వల్లే నిరుద్యోగం, నేరాలు, దోపీడీ వంటివి పెరుగుతున్నాయని ట్రంప్ అన్నారు. -
పాతికేళ్లలోపు వారికి.. ఉద్యోగాల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, ఇంజనీరింగ్ వంటివి పూర్తికాగానే ఏదో ఓ ఉద్యోగం కోసం వెతుకులాట తప్పదు. కొందరు పైచదువులకు వెళ్లినా చాలా మంది ఉద్యోగం కోసం చూస్తుంటారు. కానీ ఉద్యోగాలు దొరకని పరిస్థితి. దేశంలో పాతికేళ్ల వయసులోపు పట్టభద్రుల్లో 42శాతం మంది ఇలా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారే. 25 ఏళ్లు దాటినవారిలోనూ 15శాతం మంది నిరుద్యోగులే. కోవిడ్ నాటి పరిస్థితులు దాదాపు చక్కబడినా, భారత్ ఆర్థిక వృద్ధి వేగవంతమైందన్న అంచనాలున్నా.. కొత్తగా ఉద్యోగాల్లో చేరే గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత శాతం ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు. అదే 35ఏళ్లు పైబడిన గ్రాడ్యుయేట్లలో 5 శాతమే నిరుద్యోగం ఉందని అంటున్నారు. ‘‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2023: సోషల్ ఐడెంటీస్ అండ్ లేబర్ మార్కెట్ ఔట్ కమ్స్’’పేరిట అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘జాతీయ గణాంక సంస్థ, జాతీయ ఆర్థిక, కుటుంబ ఆరోగ్య సర్వేలు, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా, ఎంప్లాయ్మెంట్–అన్ ఎంప్లాయ్మెంట్ తదితర నివేదికల ఆధారంగా ఈ అధ్యయనం చేసినట్టు వర్సిటీ వర్గాలు తెలిపాయి. ప్రేమ్‌జీ వర్సిటీ నివేదికలో ఏముందంటే.. ♦ అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అధ్యయన నివేదికలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం.. దీర్ఘకాలికంగా చూస్తే భారత్‌లో జీడీపీ వృద్ధికి–ఉద్యోగాల వృద్ధికి సంబంధం లేకుండా పోయింది. వేగంగా జీడీపీ వృద్ధి సాధించేందుకు అనుసరించే విధానాలు వేగంగా ఉద్యోగాల కల్పనకు తోడ్పడటం లేదు. ♦ కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోవడంతో.. జీవనం గడిపేందుకు మళ్లీ వ్యవసాయం, స్వయం ఉపాధి వైపు మళ్లారు. దీనితో ఈ రెండు రంగాల్లో 2020 ఏప్రిల్–జూన్ మధ్య ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఆ తర్వాత పురుషులకు సంబంధించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోవిడ్ ముందటి కాలానికి చేరుకోగా.. మహిళలకు కొంత మేర మాత్రమే అవకాశాలు వచ్చాయి. ♦ వ్యవస్థీకృత మార్పుల ప్రభావంతో.. కరోనా అనంతర కాలంలో వ్యవసాయం నుంచి పురుషులు వైదొలిగినా, నిర్మాణ రంగంలో అవకాశాలు వచ్చాయి. కానీ మహిళలు మాత్రం వర్క్‌ఫోర్స్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయితే 2004 నుంచీ స్తంభించిపోయిన మహిళా ఉద్యోగిత శాతం.. 2019 తర్వాతి నుంచి కొంతమేర పెరిగింది. ♦ 2004లో క్యాజువల్ వేజ్ వర్కర్లతోపాటు వారి వారసులలో 80శాతం మంది అదే ఉపాధిలో ఉండగా.. 2019 నాటికి చాలా వరకు మార్పు వచ్చింది. కానీ ఎస్సీ, ఎస్టీవర్గాల్లో మాత్రం అలాగే కొనసాగుతోంది. అంతేకాదు 20 మందికిపైగా ఉద్యోగులున్న సంస్థల యజమానుల్లో ఎస్సీ, ఎస్టీలు చాలా తక్కువగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. చాలా రంగాల్లో ఇప్పటికే పనిచేస్తున్న అనుభవజు్ఞలైన ఉద్యోగులనే కొనసాగిస్తున్నారు. చాలా దేశాల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు కూడా పెంచుతున్నారు. సంస్థల మూసివేతలు పెరుగుతున్నాయి. యువకులకు శిక్షణనిచ్చి, వారి నుంచి ఉత్పాదక పెంచే సేవలు అందుకోవడానికి జాప్యమయ్యే పరిస్థితిలో నైపుణ్యాలున్న పాతవారినే కొనసాగిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, కోవిడ్ మహమ్మారి ప్రభావం చిన్న, మధ్యతరహా సంస్థలపై తీవ్రంగా పడింది. వాటిలో ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందినవారు ఎక్కువగా ఉపాధి కోల్పోవడంతో ఆ వర్గాల్లో నిరుద్యోగం పెరిగింది. – డి.పాపారావు, ఆర్థిక, సామాజిక రంగాల విశ్లేషకులు నైపుణ్యాల కొరతతోనూ సమస్య దేశంలోని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఇంగ్లిష్‌లో తగిన ప్రావీణ్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. చదువుకుంటూ ఉద్యోగం చేసే అవకాశం, నైపుణ్యాలను పెంచుకునే అవకాశం వారికి తక్కువ. చిన్నదైనా ప్రభుత్వ ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు, డిగ్రీ వంటివి పూర్తికాగానే డెలివరీ బాయ్స్, కాల్ సెంటర్ ఉద్యోగాలు వంటివి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. కానీ చదువుకు తగ్గ ఉద్యోగం కోసం ఎదురుచూడక తప్పడం లేదు. యువతలో నైపుణ్యాల కల్పనతోపాటు బీకామ్, బీఎస్సీ, బీఏ వంటి కోర్సులు చదివిన వారికి కూడా ప్రైవేట్ పరిశ్రమలు, సంస్థలు ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. – రమణ భూపతి, క్వాలిటీ థాట్‌గ్రూప్ చైర్మన్ , ఎడ్టెక్ కంపెనీ -
భారతీయ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: భారతీయ వైద్య విద్యార్థులకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ గుడ్ న్యూస్ అందించింది. ఇకపై భారత్‌లో మెడికల్ గ్రాడ్యూయేట్ పూర్తి చేసిన విద్యార్థులు విదేశాల్లో కూడా ప్రాక్టిస్ చేయోచ్చని పేర్కొంది. ఈ మేరకు రల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యూకేషనల్ (WFME) నుంచి జాతీయ వైద్య మండలి (NMC) పది సంవత్సరాల వరకు గుర్తింపు పొందింనట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ గుర్తింపుతో భారత్‌లో వైద్య విద్యనభ్యసించిన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌లలో పీజీ కోర్సుల్లో చేరడంతో పాటు ప్రాక్టీస్ చేయవచ్చు. 2024 నుంచి భారతీయ వైద్య విద్యార్థులు విదేశాల్లో విద్య, ప్రాక్టీస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెసులుబాటుతో ఇప్పటికే దేశంలో ఉన్న 706 మెడికల్ కాలేజీలతోపాటు రాబోయే 10 ఏళ్లలో కొత్తగా ఏర్పాటు చేయబోయే కళాశాలలు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు పొందనున్నాయి. దీని వల్ల దేశంలో వైద్య విద్య ప్రమాణాలు మెరుపడటమే కాకుండా భారతీయ వైద్య విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా అపార అవకాశాలు లభించనున్నాయి ఈ సందర్భంగా ఎన్ఎమ్సీలోని ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు సభ్యుడు యోగేందర్ మాలిక్ మాట్లాడుతూ.. WFME గుర్తింపుతో భారతీయ వైద్య విద్య అంతార్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. దీనివల్ల భారతీయ వైద్య కళాశాలలకు, నిపుణులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా తమ కెరీన్‌ను కొనసాగించవచ్చని తెలిపారు. ఎన్ఎమ్సీ అంతర్జాయంగా గుర్తింపు పొందడం ద్వారా విదేశీ విద్యార్థులను భారత వైద్య కళాశాలు ఆకర్షిస్తాయని చెప్పారు. కాగా డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ అనేది ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన వైద్య విధ్యను అందించేందుకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థ. డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు ప్రక్రియ కోసం ప్రతి వైద్య కళాశాల నుంచి 60 వేల డాలర్లు రుసుము వసూలు చేస్తోంది. దీంతో దేశంలోని 706 వైద్య కళాశాలలు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు కోసం మొత్తంగా సుమారు 4,23,60,000 డాలర్లు ఖర్చు చేయనుంది. చదవండి: గణతంత్ర వేడుకలకు బైడెన్!.. ఆహ్వానించిన ప్రధాని మోదీ -
వేలాది ఉద్యోగాల కోత మాత్రమేనా..అమెజాన్ మరో సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక మాంద్యం హెచ్చరికల మధ్య టెక్ దిగ్గజం అమెజాన్ మరో కీలకనిర్ణయం తీసుకుంది. పదివేలకుపైగా ఉద్యోగులకు ఉద్వాసన పలకడమేకాదు.. కొత్త నియామకాలను కూడా ఆలస్యం చేస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో జాయిన్ కావాల్సిన యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ల జాయింనింగ్స్ కూడా వాయిదా వేసుకుంది. (చదవండి: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్: ‘సీక్రెట్’ ఫీచర్ ఒక్కసారే!) తాజా నివేదికల ప్రకారం అమెజాన్‌లో కొత్త నియామకాలు 2023, మే నాటికి ప్రారంభం కావాల్సిఉంది. కానీ ప్రస్తుత గ్లోబల్ మాంద్యం పరిస్థితుల కారణంగా ఈ నియామకాలను 2023 చివరి వరకు పొడిగిస్తోందని తెలుస్తోంది. ఈమేరకు వారికి ఇంటర్నల్ మెయిల్లో సమాచారం అందించిందట. ఆర్థిక సవాళ్ల దృష్ట్యా, నియామకాలలో కొందరికి ప్రారంభ తేదీలను ఆరు నెలల వరకు ఆలస్యం చేస్తున్నామనీ, అలాగే ఆలస్యం కారణంగా ప్రభావితమైన కొత్త ఉద్యోగులకు పరిహారం చెల్లిస్తామని కూడా అమెజాన్ తెలిపింది. ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ నిబంధనలకు కట్టుబడి ఉన్నామంటూ వారికి ఈ మెయిల్ సందేశాన్ని పంపింది. అంతేకాదు కంపెనీలో జాయిన్ అయ్యారా లేదా అనేదానితో సంబంధం లేకుండా 13వేల డాలర్లు (దాదాపు రూ. 10 లక్షలు) ఒకేసారి చెల్లింపును అందుకుంటారని ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. (ఇది కూడా చదవండి: నథింగ్ స్మార్ట్‌ఫోన్ (1)పై బంపర్ ఆఫర్: ఏకంగా 22 వేల తగ్గింపు ) కాగా వార్షిక నిర్వహణ ప్రణాళిక సమీక్షలో భాగంగా, సర్దుబాట్లలో భాగంగా అమెజాన్ ఉద్యోగుల తొలగింపులకు నిర్ణయించింది. రిటైల్ , మానవ వనరుల విభాగాలలో 10వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత తాజా పరిణామం సంచలనంగా మారింది. మరోవైపు ఉద్యోగుల కోతను సమర్ధించుకున్న అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ 2023లో మరిన్ని తొలగింపులు ఉంటాయనే సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే. -
టీడీపీ దొంగాట!.. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో వక్రబుద్ధి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన విద్యాసంస్థలు, కళాశాలలు ఉండడంతో రెచ్చిపోతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి, ఫోర్జరీ సంతకాలతో నాన్‌టీచింగ్ సిబ్బందినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. దీనికి తిరుపతి కేంద్రంగా వ్యవహారం నడుస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కనీయకుండా అత్యంత చాకచక్యంగా ముందుకు నడుపుతున్నట్టు సమాచారం. మార్ఫింగ్ చేసి.. నమోదు చేసి టీడీపీ సానుభూతిపరులు, ఆ పార్టీ నేతలకు సంబంధించిన పాఠశాలలు, కళాశాలలను ఎమ్మెల్సీ ఓటు బ్యాంక్‌గా ఉపయోగించుకుంటున్నారు. యూజీసీ జాబితాలో లేని యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారిని ఎంచుకుంటున్నారు. వారికి ఎంతో కొంత డబ్బులిచ్చి నకిలీ సర్టిఫికెట్లను సృష్టిస్తున్నట్టు సమాచారం. అందులో టీడీపీ నేతలు తాము ఎంచుకున్న కళాశాలలు, పాఠశాలల సిబ్బంది ఫొటోలు మార్ఫింగ్ చేసి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసేపనిలో నిమగ్నమైనట్టు ఇప్పటికే ఫిర్యాదులు వస్తున్నాయి. ఆపై వారికి అనుకూలంగా ఉన్న గెజిటెడ్ అర్హత లేని ప్రయివేటు కళాశాలల ప్రిన్సిపాళ్లతోనే సంతకాలు చేయించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బీఎల్వోలు, మండల స్థాయిలో విచారణాధికారులు అత్యంతపటిష్టంగా ఓటర్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది. తిరుపతిలోని ఓ విద్యాసంస్థలో 54 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఉన్నవారు 18 మంది మాత్రమే. మిగిలిన వారు నాన్ టీచింగ్ సిబ్బంది. వారందరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. నాన్ టీచింగ్ సిబ్బందిని ఉపాధ్యాయులుగా చిత్రీకరించే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. ఒకటి రెండు రోజుల్లో అనర్హులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చంద్రగిరి పరిధిలోని ఓ కన్వెన్షన్ హాల్లో రెండు రోజుల క్రితం టీడీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మండల, గ్రామస్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్లను చేర్పించాలని కోరారు. ‘మీకెంత కావాలి?.. డబ్బులు కాకుండా ఇంకేమైనా కావాలా?’ అని అడిగారు. ఎక్కువ మంది డబ్బే డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం హాజరైన వారందరికీ మందు, విందు ఏర్పాటు చేశారు. టీడీపీ అడ్డదారులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదు ప్రక్రియ సమయం దగ్గరపడుతుండడంతో టీడీపీలో హడావుడి మొదలైంది. తమకు అనుకూలంగా ఓట్లు వేయించే వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు ఆ పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. అందుకు పక్కాప్రణాళికలు రచించారు. అనర్హులను ఓటర్లుగా నమోదుచేసే ప్రక్రిను దిగ్విజయంగా పూర్తిచేసేపనిలో తలమునకలయ్యారు. చిత్తూరుకు సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళా శాలలో దాదాపు 35మంది పనిచేస్తున్నారు. ఇందులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఉన్నవారు 12 మంది మాత్రమే. కానీ మొత్తం మందిని ఓటర్లుగా చూపేందుకు అక్కడ టీడీపీ నేతలు వ్యూహాలు రచించి అమలు చేస్తున్నారు. పూతలపట్టుకు సమీపంలోని ఓ ప్రయివేటు కళాశాలలో 17 మంది సిబ్బంది దాకా పనిచేస్తున్నారు. ఇందులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు అర్హత ఉన్నవారు 8 మంది మాత్రమే. మిగిలిన వారు అనర్హులైనా ఓటర్లుగా చిత్రీకరించే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. గూడూరులో ప్రముఖ విద్యాసంస్థలో మొత్తం 43 మంది వరకు పనిచేస్తుండగా అందులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు అర్హత ఉన్నవారు 25 మంది మాత్రమే. కానీ అక్కడ టీడీపీ నేత ఒకరు సిబ్బంది అందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని సదరు యాజమాన్యానికి హుకుం జారీచేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో 14 మంది సిబ్బంది ఉండగా అందులో ఎమ్మెల్సీ ఓటు హక్కుకు అర్హులు 08 మంది మాత్రమే. స్థానికంగా టీడీపీ నేత దగ్గరుండి అందరినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు నకిలీ పత్రాలు సృష్టించే పనిలో ఉండడం గమనార్హం. ప్రచారంలో బిజీబిజీ చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన తూర్పురాయలసీమ నియోజకవర్గ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు శ్యాంప్రసాద్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డి దూసుకుపోతున్నారు. అయితే టీడీపీ నుంచి అభ్యర్థుల ప్రకటన రాకముందే ఆ పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతూ అడ్డదారులు తొక్కడం విమర్శలకు తావిస్తోంది. -
కొత్త పట్టభద్రులకు కొలువులే కొలువులు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఈ ఏడాది రెండో అర్ధభాగం(జూలై–డిసెంబర్ మధ్యకాలం)లో కొత్త పట్టభద్రుల (ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్)కు 59 శాతం కంపెనీ లు, పరిశ్రమలు, సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీమ్‌లీజ్ ఎడ్టెక్ ఇండియా ఆధ్వర్యంలో రూపొందించి న ‘కెరీర్ ఔట్లుక్ రిపోర్ట్’పేర్కొంది. ఇది ఈ ఏడాది తొలి అర్ధభాగంకన్నా 12% అధి కంగా ఉండనుందని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 865 కంపెనీలు, 18 పరిశ్రమలు, 14 ప్రదేశాల్లో అందుబాటులోకి రానున్న ఉద్యోగ అవకాశాలను విశ్లేషిస్తూ నివేదికను రూపొందించినట్లు టీమ్‌లీజ్ ఎడ్టెక్ తెలిపింది. అత్యధికంగా ఐటీ రంగం 65% మంది ఫ్రెషర్లను తీసుకొనేందుకు ఆసక్తి కనబరుస్తుండగా ఈ– కామర్స్ రంగం 48%, టెలికమ్యూనికేషన్స్ రంగం 47% మంది కొత్త పట్టభద్రులకు ఉద్యో గాలివ్వాలని భావిస్తున్నట్లు నివేదిక వివరించింది. అవకాశాలు పెరిగాయి... దేశంలో ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాల కల్పన గణనీయంగా మెరుగైంది. విద్యారంగం, పరిశ్రమల మధ్య సమన్వయం వల్ల నవతరం మంచి నైపుణ్యాలతో బయటకు వస్తోంది – శంతనూ రూజ్, సీఈవో, వ్యవస్థాపకుడు టీమ్‌లీజ్ ఎడ్టెక్ -
అత్యధికులు విద్యాధికులే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో అత్యధికులు విద్యాధికులు ఉన్నారు. ఎండీ (జనరల్) ఒకరు, పీహెచ్‌డీలు చేసిన వారు ఐదుగురు, ముగ్గురు పోస్టు గ్రాడ్యుయేట్లు, బీటెక్ గ్రాడ్యుయేట్లు ఇద్దరు, ఎనిమిది మంది గ్రాడ్యుయేట్లు మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఇంటర్మీడియట్ చదివిన వారు ముగ్గురు, పదో తరగతి వరకు చదివిన వారు ఇద్దరున్నారు. ► పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వైద్యుడు. ఆయన ఎండీ (జనరల్ మెడిసిన్) చదివారు. ► విద్యుత్, అటవీ పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంఏ చదివాక.. సోషియాలజీలో పీహెచ్డీ చేసి డాక్టరేట్ అందుకున్నారు. ► వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జునలు పీహెచ్డీ చేసి డాక్టరేట్ సాధించారు. ► మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్ ఎమ్మెస్సీ చదివి.. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అట్మాస్ఫియరిక్ సైన్స్ అండ్ గ్లోబల్ వార్మింగ్‌పై పీహెచ్డీ చేస్తున్నారు. ► వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని ఎంబీఏ చదివారు. ► ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు బీటెక్ చదివారు. ► జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు న్యాయశాస్త్రంలో పట్టభద్రులు. హోంమంత్రిగా ఎస్సీ మహిళలు.. వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో సబితా ఇంద్రారెడ్డికి హోంశాఖను కేటాయించారు. దేశ చరిత్రలో హోంమంత్రిగా మహిళను నియమించడం అదే తొలిసారి. అలాగే, 2019, మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశాక ఏర్పాటుచేసిన కేబినెట్లో హోంశాఖ మంత్రిగా ఎస్సీ వర్గానికి చెందిన మహిళ మేకతోటి సుచరితకు కేటాయించారు. హోంశాఖ మంత్రిగా ఎస్సీ వర్గానికి చెందిన మహిళను నియమించడం దేశ చరిత్రలో అదే ప్రథమం. ఇక పునర్వ్యవస్థీకరణ ద్వారా సీఎం వైఎస్ జగన్ ఏర్పాటుచేసిన మంత్రివర్గంలోనూ హోంశాఖ మంత్రిగా మళ్లీ ఎస్సీ వర్గానికే చెందిన మహిళ తానేటి వనితను నియమించడం గమనార్హం. -
వైద్య విద్య కఠినతరం .. ‘ఎగ్జిట్’ దాటితేనే ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో నాసిరకమైన వైద్య విద్యకు చెక్ పెట్టేలా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విదేశాల్లో నాణ్యమైన ఎంబీబీఎస్ పూర్తి చేసినవారికే మన దేశంలో శాశ్వత మెడికల్ రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. ఏ దేశంలోనైనా గుర్తింపు పొందిన వైద్య కాలేజీల్లోనే చదవాలని విద్యార్థులకు సూచించింది. మన దేశంలో మాదిరిగా వైద్య విద్య కోర్సు (నాలుగున్నరేళ్లు), ఇంటర్న్‌షిప్ (ఏడాది) రెండూ కలిపి ఐదున్నరేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. విద్యార్థులు తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియంలోనే ఆయా దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేయాలి. కోర్సు పూర్తయి వచ్చాక, స్వదేశంలో మరో 12 నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. ఎగ్జిట్ పరీక్షలో పాసై తీరాలి. పదేళ్లలోపే ఎంబీబీఎస్ కోర్సు, ఇంటర్న్‌షిప్ మొత్తం పూర్తిచేయాలి. అప్పుడే మనదేశంలో రిజి స్ట్రేషన్‌కు, ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి లేదా ఏదైనా ఆసుపత్రిలో పనిచేయడానికి వీలుపడుతుందని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. చదవండి: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు ప్రారంభం సీటు రాక .. తక్కువ ఫీజుతో.. ఈ ఏడాది 15.44 లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, దాదాపు 8.70 లక్షల మంది అర్హత సాధించారు. కానీ, మన దేశంలో కేవలం 85 వేల ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే చాలామంది విదేశాల్లో ఎంబీబీఎస్ కోసం వెళ్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కలిపి మొత్తం 5,200 బీబీఎస్ సీట్లున్నాయి. కానీ 20 వేల మందికిపైగా నీట్ అర్హత సాధించి ఉంటా రని అంచనా. మరోవైపు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీటు పొందాలంటే డొనేషన్లు పెద్ద మొత్తంలో ఉంటున్నాయి. బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.50 లక్షలు, ఎన్ఆర్ఐ సీటు ఫీజు రూ.23 లక్షల వరకు ఉంటోంది. విదేశాల్లో చదివితే రూ. 30 లక్షల నుంచి రూ.40 లక్షలవుతోంది. ఈ కారణంగానే చాలా మంది విద్యార్థులు చైనా, రష్యా, ఉక్రెయిన్, నేపాల్, కజకిస్తాన్, జార్జియా, ఫిలిప్పీన్స్, కిర్గిస్తాన్, బంగ్లాదేశ్, అర్మేనియా, పాకిస్తాన్ ల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఎఫ్ఎంజీఈ ఉత్తీర్ణత 14 శాతమే... విదేశాల్లో ఎంబీబీఎస్ అంత నాణ్యతతో ఉండటం లేదన్న అభిప్రాయం ఉంది. పలు దేశాల్లో చదివి వచ్చినవారు అనేకమంది ఇక్కడ రిజిస్ట్రేషన్‌కు ముందు రాసే పరీక్షలో ఉత్తీర్ణులు కాకపోవడం ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేశాక మనదేశంలో ప్రాక్టీస్ చేసేలా లైసెన్స్ పొందడానికి మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) పాస్ కావాలి. 2015–18 మధ్య జరిగిన ఎఫ్ఎంజీఈ పరీక్షలకు 61,418 మంది విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు హాజరుకాగా, కేవలం 8,731 మంది మాత్రమే పాసయ్యారని కేంద్రం వెల్లడించింది. అంటే 14.22 శాతమే ఉత్తీర్ణులయ్యారన్నమాట. చైనా, రష్యా, ఆయా దేశాల్లో చదివినవారు చాలా తక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారని కేంద్రం తెలిపింది. ప్రతి విద్యార్థికీ ఈఎఫ్ఎంజీఈ పరీక్ష రాయడానికి మూడుసార్లు అవకాశముంటుంది. కొత్త నిబంధనల మేర కు విదేశాల్లో వైద్యవిద్య ఎంతవరకు సాధ్యమవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. చదవండి: కోవిషీల్డ్ బూస్టర్ కోసం సీరమ్ దరఖాస్తు నాణ్యమైన విద్యకు తోడ్పాటు ఎన్ఎంసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు విదేశాల్లో నాణ్యమైన వైద్య విద్యను అభ్యసించడానికి తోడ్పడతాయి. తద్వారా ఇక్కడ ఎఫ్ఎంజీఈ పరీక్ష పాసవడానికి, ప్రాక్టీస్ చేయడానికి వీలుకలుగుతుంది. మన దేశంలో మాదిరి కోర్సు కాలవ్యవధి, ఇలాంటి సిలబస్ ఉన్న వియత్నాంలో చదివేం దుకు అడ్మిషన్ తీసుకున్నా. – నర్మద తూతూ మంత్రం చదువుకు చెక్ కొన్ని విదేశీ మెడికల్ కాలేజీలు తూతూమంత్రంగా చదువుచెప్పి మన విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నాయి. వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకే ఎన్ఎంసీ ఈ నిబంధనలు తీసుకొచ్చింది. – డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ హెల్త్ వర్సిటీ -
కొలువుల చదువులు.. నైపుణ్యాభివృద్ధికి ఇంటర్న్‌షిప్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వాటి ఫలాలు విద్యార్థులకు అందేలా కార్యాచరణ రూపొందించారు. డిగ్రీ పూర్తి చేసి కాలేజీల నుంచి బయటకు వచ్చే విద్యార్థులు వెంటనే ఉద్యోగావకాశాలను అందుకొనేలా పూర్తిస్థాయి సామర్థ్యాలు, నైపుణ్యాలతో తీర్చిదిద్దేలా ప్రణాళికలను అమల్లోకి తెస్తున్నారు. డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులతో పాటు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయించారు. మూడేళ్ల డిగ్రీలో చేరే విద్యార్థులు కూడా పదినెలలు ఇంటర్న్‌షిప్ చేసేలా కోర్సులను రూపొందించారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో నైపుణ్యం పొందేలా క్షేత్రస్థాయిలో శిక్షణ ఇప్పిస్తారు. ఇందుకు రాష్ట్రంలోని అన్ని కాలేజీలను వివిధ పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న 27,119 సంస్థలతో అనుసంధానిస్తున్నారు. విద్యార్థులు తమ కోర్సులతో సంబంధమున్న అంశాల్లో అందుబాటులో ఉన్న సంస్థలో ఇంటర్న్‌షిప్ చేయవచ్చు. ఇందుకు ఉన్నత విద్యామండలి పోర్టల్‌లోని లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్)లో వీటిని పొందుపరుస్తారు. జిల్లాలవారీగా ఈ సంస్థలను ఎంపిక చేసి జాబితాను వెబ్సైట్లో పెడతారు. జిల్లాల్లో ఆయా సంస్థలతో సమన్వయం చేసేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. ఇందులో వర్సిటీల ఉపకులపతులు, కొన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు ముందుగానే జిల్లాలోని కంపెనీలను సంప్రదించి, ఇంటర్న్‌షిప్‌కు ఏర్పాట్లు చేస్తాయి. ఇంటర్న్‌షిప్ కోసం విద్యార్థులు కోఆర్డినేటర్ల సహకారంతో ఆయా సంస్థలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ సంస్థలు వాటికి అవసరమైన సంఖ్యలో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లో అవకాశం కల్పిస్తాయి. మైక్రో నుంచి మెగా సంస్థల వరకు.. ఇంటర్న్‌షిప్‌కోసం రాష్ట్రంలోని మైక్రో స్థాయి నుంచి మెగా పరిశ్రమల వరకు ఉన్నత విద్యా మండలి గుర్తించింది. ఇందులో మాన్యుఫాక్చరింగ్, సర్వీసు విభాగాల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో మంచి పనితీరు కనబరిచే వారికి ఆ కంపెనీలే ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్న్‌షిప్ ద్వారా ఆయా సంస్థలకు కూడా మానవవనరులు అందుబాటులోకి వస్తాయి. ఉభయ ప్రయోజనకరంగా ఈ ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. మరోపక్క విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని, బాధ్యతను పెంపొందించడానికి ఉన్నత విద్యా మండలి కమ్యూనిటీ ప్రాజెక్టులను సిద్ధం చేసింది. సమాజంపై విద్యార్థులకు అవగాహన పెరగడంతో పాటు అక్కడి సమస్యలకు తాము నేర్చుకున్న విఙ్ఙానం ద్వారా పరిష్కారాలను అన్వేషించేలా చేస్తారు. వీటి ద్వారా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సమస్యలను అధిగమించే తత్వం ఏర్పడుతుంది. ఇంటర్న్‌షిప్ కోసం జిల్లాల వారీగా ఎంపిక చేసిన సంస్థలు జిల్లా పేరు మైక్రో స్మాల్ మీడియం లార్జ్ మెగా మొత్తం అనంతపురం 1,631 962 65 107 14 2,779 చిత్తూరు 1,453 1,443 107 232 34 3,269 తూర్పు గోదావరి 1,031 971 67 150 16 2,235 గుంటూరు 1,436 1,252 43 67 7 2,805 కృష్ణా 1,134 1,018 77 131 5 2,365 కర్నూలు 619 524 28 59 11 1,241 ప్రకాశం 1,118 1,813 35 45 1 3,012 నెల్లూరు 726 688 58 121 15 1,608 శ్రీకాకుళం 778 603 16 30 11 1,438 విశాఖపట్నం 788 1,041 139 317 36 2,321 విజయనగరం 543 376 17 43 6 985 పశ్చిమ గోదావరి 832 794 57 87 4 1,774 వైఎస్సార్ కడప 799 441 9 29 9 1,287 మొత్తం 12,888 11,926 718 1,418 169 27,119 వీటిలో మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్ విభాగాల సంఖ్య ఇలా కేటగిరీ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీస్ మైక్రో 11,510 1,378 స్మాల్ 10,169 1,757 మీడియం 569 149 లార్జ్ 1,191 227 మెగా 144 25 ఇంటర్న్‌షిప్ కోసం వివిధ జిల్లాల్లో గుర్తించిన కొన్ని ముఖ్యమైన సంస్థలు 400 ఎండబ్ల్యూ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏపీ జెన్కో, తలారిచెరువు, అనంతపురం హ్యుందాయ్ ట్రాన్సిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కియా మోటార్స్ అనంతపురం విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ పిస్టన్ రాడ్ ప్లాంట్ అనంతపురం అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్, కరకంబాడి, చిత్తూరు కోల్గేట్ పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ ఎక్స్‌ట్రాన్ సర్వర్స్ మాన్యుఫాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు హీరో మోటోకార్్ప లిమిటెడ్, చిత్తూరు గుంటూరు టెక్స్టైల్ పార్కు, గుంటూరు జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్, గుంటూరు మైహోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, గుంటూరు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, గుంటూరు ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్, ఇబ్రహీంపట్నం, కృష్ణా ది కేసీపీ లిమిటెడ్ సిమెంటు యూనిట్, కృష్ణా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, కృష్ణా ది రామ్‌కో సిమెంట్స్ లిమిటెడ్, కృష్ణా గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, కర్నూలు జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్, కర్నూలు ఎస్బీజీ క్లింటెక్ ప్రాజెక్టు కో ప్రైవేట్ లిమిటెడ్. కర్నూలు టీజీవీ స్రాక్ లిమిటెడ్, కర్నూలు అమ్మన్ ట్రై స్పాంజ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, నెల్లూరు హిందుస్తాన్ నేషనల్ గ్లాస్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నెల్లూరు ఎన్జీసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నెల్లూరు సెంబ్కార్్ప ఎనర్జీ లిమిటెడ్, నెల్లూరు అరబిందో ఫార్మా లిమిటెడ్, శ్రీకాకుళం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, శ్రీకాకుళం శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, శ్రీకాకుళం స్మార్ట్‌కెమ్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రీకాకుళం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, విశాఖపట్నం హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, విశాఖపట్నం ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ విశాఖపట్నం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం మైలాన్ లేబొరేటరీస్ లిమిటెడ్, విజయనగరం శారదా మెటల్స్ అండ్ అల్లాయిస్ లిమిటెడ్, విజయనగరం ఎస్ఎంఎస్ ఫార్మాస్యుటికల్స్ లిమిటెడ్, విజయనగరం నవభారత్ లిమిటెడ్, పశ్చిమగోదావరి పాండురంగ ఎనర్జీ సిస్టమ్ ప్రయివేటు లిమిటెడ్, పశ్చిమ గోదావరి వీఈఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, పశ్చిమ గోదావరి ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, వైఎస్సార్ కడప ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్, వైఎస్సార్ కడప టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్, వైఎస్సార్ కడప మిడ్వెస్ట్ నియోస్టోన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకాశం జేసీ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకాశం కల్లామ్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, ప్రకాశం పెరల్ డిస్టిలరీ లిమిటెడ్, ప్రకాశం ఇంజినీరింగ్ విద్యార్థులకు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్లులు కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ 1. వ్యవసాయంలో నేల ఆరోగ్యం , పంట రీసైక్లింగ్ కోసం సిఫార్సు చేసే వ్యవస్థ అభివృద్ధి 2. వ్యవసాయం కోసం స్ప్రింక్లర్లలో అధునాతన సాంకేతికతను ఉపయోగించి స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు 3. అంటువ్యాధులకు సంబంధించి కంప్యూటర్ సహాయక ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ రూపకల్పన ------------ సివిల్ ఇంజనీరింగ్ 1. ల్యాండ్ స్లైడ్ల కోసం ప్రత్యేకంగా జియోసింథటిక్స్ ఉపయోగించి నేల స్థిరీకరణ 2. జీఐఎస్ ఉపయోగించి భూగర్భ జలాల గుర్తింపు 3. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి నివాస భవనంలో భూఉష్ణ శక్తి వినియోగం -------------- మెకానికల్ ఇంజనీరింగ్ 1. అగ్రికల్చరల్ పెస్టిసైడ్ స్ప్రేయర్ – కోవిడ్ శానిటైజేషన్ డ్రోన్ 2. గ్రామీణ ప్రాంతాల్లో వంట కోసం బయోగ్యాస్ కంప్రెషన్ - స్టోరేజ్ సిస్టమ్ 3. వ్యవసాయం కోసం స్కాచ్ యోక్ మెకానిజం ఉపయోగించి డ్యూయల్ సైడ్ వాటర్ పంపింగ్ సిస్టమ్ ------------ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ 1. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా స్మార్ట్ అగ్రికల్చర్ విధానం, మాయిశ్చర్ హ్యుమిడీటీని గుర్తించడం 2. ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్మార్ట్ రెస్క్యూ సిస్టమ్ 3. స్మార్ట్ మాస్క్ – సామాజిక దూర హెచ్చరిక --------------- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 1. వ్యవసాయ అవసరాల కోసం నేలలో నీటిశాతం, తేమను కనుగొనేందుకు సోలార్ పవర్‌తో నడిచే ఆటో ఇరిగేషన్ సిస్టమ్ వినియోగం 2. మెరుగైన ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఇ హెల్త్ కేర్ కంప్యూటింగ్ విధానం అనుసరణ 3. జిగ్బీ ఆధారిత సోలార్ పవర్ ఫారెస్ట్ ఫైర్ డిటెక్షన్ కంట్రోల్ సిస్టమ్ డిగ్రీ నాన్‌ప్రొఫెషనల్ విద్యార్థుల కోసం డిగ్రీ నాన్ ప్రొఫెషనల్ విద్యార్ధులకు కూడా వివిధ అంశాల్లో కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులను ఉన్నత విద్యామండలి నిర్వహించనుంది. ఆర్ట్స్ విద్యార్థులకు 51, కామర్స్ విద్యార్థులకు 50, సైన్సు విద్యార్థులకు 38 ప్రాజెక్టులు ఉంటాయి. విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందించడం, ఉమెన్, యూత్ ఎంపవర్‌మెంటుతో పాటు వివిధ క్యాంపుల నిర్వహణ అంశాలతో ఈ ప్రాజెక్టులను రూపొందించారు. ఇదో విప్లవాత్మక కార్యక్రమం: రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి చదువు పూర్తిచేసి బయటకు వచ్చేనాటికి వారిని సమగ్ర నైపుణ్యాలతో తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను చేపట్టాం. పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌తో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా మన విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొనేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళికను అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే వివిధ పరిశ్రమలతో కాలేజీలను అనుసంధానిస్తున్నాం. రాష్ట్రస్థాయి కమిటీతో పాటు జిల్లాల స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేశారు. కాలేజీలు, పరిశ్రమలు, బిజినెస్ ఎంటర్ప్రయిజర్లను అనుసంధానం చేసి విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తాం. చదువు పూర్తయ్యేసరికి విద్యార్థి పూర్తి నైపుణ్యం సాధించేలా చేస్తాం. ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక కార్యక్రమం. -
విద్యార్థులకు గుడ్‌న్యూస్ అందించిన మైక్రోసాఫ్ట్...!
సాంకేతిక నైపుణ్యాలు, ఉపాది అవకాశాలను విద్యార్థుల్లో పెంపొందించడంకోసం మైక్రోసాఫ్ట్, ఫ్యూచర్ రెడీ టాలెంట్ వర్చువల్ ఇంటర్నషిప్ ప్రోగ్రాంను లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను మైక్రోసాఫ్ట్ ఆహ్వనిస్తుంది. సుమారు 50 వేల మంది విద్యార్థులు ఇంటర్నషిప్ ప్రోగ్రాంలో పాల్గొనవచ్చును. మైక్రోసాఫ్ట్ అజూర్ , గిట్‌హబ్ టూల్స్ వంటి సాధనాలను ఉపయోగించి వ్యాపార సవాళ్లను పరిష్కరించడానికి, వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి విద్యార్థులను సిద్ధం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తెలిపింది. చదవండి: ఒక్క రోజులోనే కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు...! ఈ ప్రోగ్రాంతో విద్యార్థులు గిట్‌హబ్ స్టూడెంట్ డెవలపర్ ప్యాక్‌ను యాక్సెస్ చేయవచ్చును. ఈ ప్రోగాంలో 2021 గ్రాడ్యుయేషన్ పూర్తైన విద్యార్థులు పాల్గొనవచ్చును. వారితో పాటుగా 2022, 2023లో గ్రాడ్యుయేట్ అయ్యే విద్యార్థులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గోనేందుకు మైక్రోసాఫ్ట్ అవకాశాన్ని కల్పిస్తోంది. ఏదైనా స్పెషలైజేషన్‌ను కల్గిన విద్యార్థులు ఈ ప్రోగాంకు దరఖాస్తు చేసుకోవచ్చుని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఫ్యూచర్ రెడీ టాలెంట్ ‘https://futurereadytalent.in’ వెబ్సైట్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చును. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29. ఇంటర్న్‌షిప్ వ్యవధి సుమారు 8 వారాల పాటు ఉండనుంది. మైక్రోసాఫ్ట్ తన లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ మైక్రోసాఫ్ట్ లెర్న్ ద్వారా లెర్నింగ్ మాడ్యూల్స్ సర్టిఫికేషన్లను విద్యార్థులకు అందిస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వనుంది. చదవండి: Startup: దేశంలోనే ఫస్ట్ ప్లేస్..స్టార్టప్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నగరం ఇదే! -
చట్టసభలను అధ్యయనం చేయాలనుకుంటున్నారా?
భారత పార్లమెంట్.. ముఖ్యంగా రాజ్యసభ కార్యకలాపాలను అధ్యయనం చేయాలని, అవగాహన పెంచుకోవాలని కోరుకునే అభ్యర్థులకు మంచి అవకాశం. రాజ్యసభలో ఫెలోషిప్, ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పించేందుకు రాజ్యసభ దరఖాస్తులు ఆహ్వా నిస్తోంది. ఈ నేపథ్యంలో.. రాజ్యసభ ఫెలోషిప్, ఇంటర్న్‌షిప్‌ల పూర్తి సమాచారం... ఆర్ఎస్ఆర్ఎస్ అంటే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలోని వివిధ అంశాలపై పరిశోధనలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో.. 2009లో డాక్టర్ ఎస్.రాధాకృష్ణన్ చైర్ అండ్ రాజ్యసభ ఫెలోషిప్స్ పథకాన్ని రాజ్యసభ ఏర్పాటు చేసింది. దీనికి ‘రాజ్యసభ రీసెర్చ్ అండ్ స్టడీ’ (ఆర్ఎస్ఆర్ఎస్) స్కీమ్‌గా పేరుపెట్టారు. ఇందులో రాజ్యసభ ఫెలోషిప్‌లు నాలుగు, రాజ్యసభ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ ఇంటర్న్‌షిప్‌లు పది అందిస్తున్నారు. వీటికి గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాజ్యసభ ఇంటర్న్‌షిప్– అర్హతలు ► భారత పార్లమెంటులోని వివిధ విధానపరమైన అంశాలను..ముఖ్యంగా రాజ్యసభ కార్యకలాపాలను విద్యార్థులకు పరిచయం చేయడమే ఈ ఇంటర్న్‌షిప్ లక్ష్యం. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు రాజ్యసభ ఇంటర్న్‌షిప్‌కు అర్హులు. గ్రాడ్యుయేట్స్ ఐదుగురు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఐదుగురికి(మొత్తం 10 మంది) ఇంటర్న్స్‌గా అవకాశం కల్పిస్తారు. రాజ్యసభ సెక్రటేరియట్ ద్వారా సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో ఇంటర్న్స్ ఎంపిక జరుగుతుంది. వేసవి సెలవుల్లో ఈ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ► ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులను సచివాలయంలోని కీలకమైన లెజిస్లేటివ్ సెక్షన్, బిల్ ఆఫీస్, టేబుల్ ఆఫీస్, కమిటీ సెక్షన్స్ మొదలైన వాటిలో సంబంధిత బ్రాంచ్ సూపర్విజన్/మెంటారింగ్ కింద నియమిస్తారు. ఎంపికైన తేదీ నుంచి రెండు నెలలపాటు ఈ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. వీరికి నెలకు రూ.10వేల చొప్పున స్టయిఫండ్ చెల్లిస్తారు. ► ఇంటర్న్‌షిప్ గడువు నాటికి ఇంటర్న్లు తాము చేసిన పని, నేర్చుకున్న అంశాలతో నివేదికను తమకు కేటాయించిన సూపర్వైజర్/మెంటార్‌కు సమర్పించాల్సి ఉంటుంది. విజయవంతంగా ప్రోగ్రామ్ పూర్తి చేసినవారికి రాజ్యసభ నుంచి సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. రాజ్యసభ ఫెలోషిప్– అర్హతలు ► మొత్తం నాలుగు ఫెలోషిప్స్ అందిస్తున్నారు. ఈ ఫెలోషిప్ స్కీమ్ ద్వారా అభ్యర్థులు పార్లమెంటరీ సంస్థల పనితీరు, ఆయా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై అధ్యయనం చేస్తారు. సంబంధిత విద్యార్హత, సోషల్ సైన్స్, లా ఇతర సంబంధిత అంశాల్లో కనీసం మాస్టర్స్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు/అనుభవం గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఫిల్, పీహెచ్డీ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. వీటికి మాజీ పార్లమెంటు సభ్యులు/రాష్ట్ర శాసనసభ సభ్యులు, పార్లమెంటు/రాష్ట్ర శాసనసభ సచివాలయాల మాజీ అధికారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు 25ఏళ్ల నుంచి 65ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ► కాలవ్యవధి: ఫెలోషిప్ 18 నెలల పాటు ఉంటుంది. అవసరాన్ని బట్టి మరో ఆరు నెలల వరకు పొడిగించే అవకాశం ఉంది. ► అధ్యయనం చేయాల్సిన అంశాలు: ప్రధాన చట్టాల మదింపు, పార్లమెంటరీ కమిటీల పనితీరు, ప్రధాన పార్లమెంటరీ కమిటీల సమర్థత, భారతీయ పార్లమెంట్లో సంస్థాగత/విధానపరమైన సంస్కరణలు, ఇతర కామన్వెల్త్ పార్లమెంట్ల ప్రత్యేకతలపై అధ్యయనం చేయాలి. రాజ్యసభ సెక్రటేరియట్ సూచించిన అంశాలపై కూడా పరిశోధన చేయాల్సి ఉంటుంది. ► రీసెర్చ్ గ్రాంట్: రాజ్యసభ ఫెలోషిప్స్ కేవలం నలుగురు మాత్రమే పొందగలరు. ప్రతి ఫెలోషిప్‌కు రీసెర్చ్ గ్రాంట్‌గా రూ.8లక్షలను పలు దఫాలుగా అందిస్తారు. దీంతోపాటు మరో రూ.50 వేలు కంటిజెన్సీ ఫండ్‌గా ఇస్తారు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► రాజ్యసభ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు: rksahoo.rs@sansad.nic.in ► రాజ్యసభ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు: rssei.rsrs@sansad.nic.in ► దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021 ► వెబ్సైట్: https://rajyasabha.nic.in/rsnew/ fellowship/felloship_main.asp -
పట్టభద్రుల చైతన్యం.. గణనీయంగా పెరిగిన పోలింగ్
సాక్షి, హైదరాబాద్: పట్టభద్రులు చైతన్యం కనబరిచారు. రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గాలకు ఆదివారం నిర్వహిం చిన ఎన్నికల్లో గణనీయంగా పోలింగ్ శాతం పెరిగింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్ చెదురుమదురు ఘటనలు తప్ప ప్రశాంతంగా ముగిసింది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 64.87 శాతం, వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 76.35% పోలింగ్ నమోదైనట్టు ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. సాయంత్రం 4 తర్వాత జరిగిన పోలింగ్‌ను పరిగణనలోకి తీసుకుని ఆర్వోలు ఈ ప్రకటన చేశారు. అయితే, సాయంత్రం నాలుగు గంటల నాటికి హైదరాబాద్ స్థానానికి 59.96 శాతం, నల్లగొండ స్థానానికి 64.7 శాతం పోలింగ్ నమోదైందని సీఈవో శశాంక్ గోయల్ ప్రకటించారు. సోమవారం కచ్చితమైన పోలింగ్ గణాంకాలను ప్రకటిస్తామని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎండ తీవ్రత తగ్గాక సాయంత్రం 4 గంటల నుంచి పోలింగ్ ముగిసే సమయం వరకు చాలా పోలింగ్ కేంద్రాల్లో పెద్దసంఖ్యలో ఓటర్లు క్యూలైన్లలో నిలబడి ఉండటంతో నిబంధనల ప్రకారం వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. కొన్ని చోట్లలో రాత్రి 7 గంటలు దాటిన తర్వాత కూడా పోలింగ్ జరిగింది. కొన్ని పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూంలకు బ్యాలెట్ పెట్టెలు రావాల్సి ఉందని, అప్పుడే స్పష్టమైన పోలింగ్ గణాంకాలు వెల్లడవుతాయని శశాంక్ గోయల్ ‘సాక్షి’కి తెలిపారు. బ్యాలెట్ పెట్టెల్లో భవితవ్యం ‘హైదరాబాద్’మండలి స్థానం నుంచి ఏకంగా 93 మంది, ‘నల్లగొండ’స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో భారీ సైజు బ్యాలెట్ పేపర్లు, జంబో బ్యాలెట్ బాక్స్‌లను ఉపయోగించి పోలింగ్ నిర్వహించారు. జంబో బ్యాలెట్ బ్యాక్సుల్లో ఓటర్ల తీర్పు నిక్షిప్తమై ఉంది. ఈ నెల 17న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ‘హైదరాబాద్’, నల్లగొండ పట్టణంలోని మార్కెట్ శాఖ గిడ్డంగిలో ‘నల్లగొండ’ఓట్లను లెక్కించనున్నారు. పట్టిష్టమైన భద్రత ఏర్పాట్లతో బ్యాలెట్ పెట్టెలను ఆయా ప్రాంతాల్లో నిల్వచేశామని సీఈవో శశాంక్ గోయల్ తెలిపారు. ఓట్ల నమోదు నుంచి కనిపించిన చైతన్యం చివరిసారిగా 2015 మార్చిలో జరిగిన ఎన్నికల్లో ‘హైదరాబాద్’స్థానానికి 39 శాతం పోలింగ్ జరగగా, తాజా ఎన్నికల్లో 64.87 శాతానికి పెరిగింది. అప్పటి ఎన్నికల్లో ‘నల్లగొండ’స్థానానికి 58 శాతం పోలింగ్ నమోదు కాగా తాజా 74 శాతానికి పెరిగింది. గత ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో 2,96,318 మంది ఓటర్లు ఉండగా, ఈసారి 5,31,268 మందికి పెరిగారు. నల్లగొండ స్థానంలో 2,81,138 మంది ఓటర్లు ఉండగా, ఈసారి 5,05,565 మందికి పెరిగారు. గత ఎన్నికల నాటితో పోలిస్తే ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో మార్పులు రావడం, భారీగా పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావడం, రాజకీయపార్టీలు, అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించడం, ఆదివారం పోలింగ్ నిర్వహించడం వంటి కారణాలతో ఈసారి పోలింగ్ శాతం పెరగడానికి దోహదపడిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. హోంమంత్రిపై ఈసీకి నివేదిక టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి మేడమ్‌కు ఓటు వేశానని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చేసిన కామెంట్స్‌పై ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమర్పించిన నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని సీఈవో శశాంక్ గోయల్ తెలిపారు. నివేదిక పరిశీలించి చర్యలపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. -
ఆశావహంగా ఉండండి..
న్యూఢిల్లీ: విద్యాభ్యాసం పూర్తి చేసుకుని బైటి ప్రపంచంలోకి అడుగుపెడుతున్న గ్రాడ్యుయేట్లు ఆశావహంగాను, కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆసక్తిగాను ఉండాలని టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సూచించారు. అంతే కాకుండా కొంత అసహనంగా కూడా ఉండాలని, దాన్నుంచే కొత్త సాంకేతిక విప్లవం రాగలదని ఆయన పేర్కొన్నారు. 2020 గ్రాడ్యుయేట్ల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పిచాయ్ ఈ విషయాలు తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులతో పాటు పలువురు ప్రముఖులు ఈ వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఈ స్నాతకోత్సవం ఇలా జరుగుతుందని మీరెవరూ ఊహించి ఉండరు. మీరు వేడుకగా జరుపుకోవడానికి బదులు కోల్పోయిన అవకాశాలు, తల్లకిందులైన ప్రణాళికల గురించిన ఆందోళనతో జరుపుకోవాల్సి వస్తోందని మీరు బాధపడుతూ ఉండొచ్చు. ఇలాంటి కష్టకాలంలో ఆశావహంగా ఉండటం కష్టమే. కానీ ఆశావహంగా ఉండగలిగితే, ఈ ఏడాది గ్రాడ్యుయేట్లయిన మీరు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టగలరు. చరిత్రలో నిల్చిపోగలరు‘ అని సుందర్ చెప్పారు. మెరుగైన ప్రపంచం.. ఒక తరం సాధించిన పురోగతి మరో తరానికి పునాదిరాయి కాగలదని సుందర్ తెలిపారు. నేటి యువత ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. పురోగతి సాధించాలంటే కాస్త అసహనం కూడా ఉండాలన్నారు. ‘కొన్ని టెక్నాలజీ సంబంధిత విషయాలు మీకు విసుగు తెప్పించవచ్చు. అసహనానికి గురిచేయొచ్చు. ఆ అసహనాన్ని కోల్పోవద్దు. దాన్నుంచే కొత్త సాంకేతిక విప్లవం సృష్టి జరగొచ్చు, మా తరం కనీసం కలలో కూడా ఉహించని కొత్తవన్నీ మీరు నిర్మించవచ్చేమో. కాబట్టి అసహనంగా ఉండండి. ప్రపంచానికి అవసరమైన పురోగతి దాన్నుంచే వస్తుంది‘ అని సుందర్ పేర్కొన్నారు. నేనూ సవాళ్లు ఎదుర్కొన్నా.. గూగుల్ సీఈవో స్థాయికి ఎదిగే క్రమంలో తానూ పలు సవాళ్లు ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా సుందర్ చెప్పారు. తన చిన్నతనంలో టెక్నాలజీ పెద్దగా అందుబాటులో ఉండేది కాదని, కానీ ప్రస్తుత తరం పిల్లలు కంప్యూటర్లతోనే పెరుగుతున్నారన్నారు. ‘నేను స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి అమెరికా రావడం కోసం మా నాన్న దాదాపు ఏడాది జీతం వెచ్చించి విమానం టికెట్ కొనిచ్చారు. నేను విమానం ఎక్కడం అదే మొదటిసారి. నన్ను అక్కడ (భారతదేశం) నుంచి ఇక్కడి దాకా (అమెరికా) తీసుకొచ్చినది కేవలం అదృష్టం ఒక్కటే కాదు. టెక్నాలజీ అంటే నాకున్న అమితాసక్తి, కొత్తవి నేర్చుకోవాలనే అభిలాష కూడా ఇందుకు కారణం‘ అని సుందర్ తెలిపారు. -
‘ఉపాధి హామీ’ వైపు నిరుద్యోగ యువత చూపు
లక్నో : కరోనా సృష్టించిన విధ్వంసం బడుగు జీవులను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై.. పొట్ట చేత పట్టుకొని పట్టణ బాట పట్టిన వలస జీవులు తిరిగి పల్లెలకు తిరిగివచ్చేలా చేసింది. లాక్‌డౌన్‌తో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, రిటైల్ తదితర రంగాలు కుదేలు కావడంతో ఉపాధి కోల్పోయి సొంతూరుకు చేరుకున్న నిరుద్యోగులు ‘ఉపాధి హామీ’ పనులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ దశాబ్ధంలోనే అత్యధికంగా, ఏప్రిల్ 1 నుంచి దాదాపు 35 లక్షల మంది పనులు లేక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎమ్జీఎన్ఆర్ఈజీఏ)కింద దరఖాస్తు చేసుకున్నారు. లాక్డౌన్ తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చిన 30 లక్షల మంది వలస కార్మికుల కుటుంబాలకు గ్రామీణ ఉపాధి పథకాన్ని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పెంచింది. అయితే వలస కార్మికులే కాకుండా నిరుద్యోగులు కూడా ఉపాధి హామీ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. యూపీ రాజధాని లక్నోకి150 కిలోమీటర్ల దూరంలో ఉన్న జునైద్‌పుర్ గ్రామానికి చెందిన రోషన్ ఉపాధి హామీకి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నాడు. పీజీ చదువుకున్న రోషన్ రోడ్డు పనులు, పూడిక తీయడం వంటి పనులు చేయడానికి ముందుకొచ్చాడు. లాక్‌డౌన్‌తో ఉద్యోగం కోల్పోవడంతో ఇంటికొచ్చానని ఎంఏ డిగ్రీ చేసిన కుమార్ అన్నాడు. బీబీఏ డిగ్రీ పట్టా ఉన్నా, సరైన పని దొరకలేదు. చివరకు 6నుంచి 7వేల జీతం వచ్చే ఉద్యోగం దొరికినా, లాక్‌డౌన్‌తో అదికూడా పోయింది. అందుకే తిరిగి ఇంటికి వచ్చానని తెలిపాడు. తాను ఎంఏ, బీఈడీ పూర్తి చేశానని, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగానే లాక్డౌన్ వచ్చిందని సుర్జిత్ కుమార్ అన్నాడు. దీంతో చేసేదేమీలేక ఉపాధి హామీ పథకానికి దరఖాస్తు చేసుకున్నానని చెప్పాడు. లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు కోల్పోయిన వారందరూ ఉపాధి హామీకి దరఖాస్తు చేసుకుంటున్నారని జునైద్‌పుర్ గ్రామపెద్ద వీరేంద్ర సింగ్తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా 14 కోట్ల మందికి ఎమ్జీఎన్ఆర్ఈజీఏ కార్డులు ఉన్నాయి. వీరందరికీ 100 రోజుల పనిదినాలను కల్పించడానికి ఏడాదికి 2.8 లక్షల కోట్ల రూపాయలు అవసరం కానుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏడాదిలో వంద రోజులు ఉపాధి కల్పించడం కోసం ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005ను తీసుకొచ్చింది. -
గత ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వలేదు
-
నేడు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో త్వరలో ఖాళీకానున్న పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ నియోజకవర్గం పట్టభద్రుల స్థానం నుంచి కె.స్వామిగౌడ్, ఉపాధ్యాయుల స్థానాల్లో మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ నియోజకవర్గం నుంచి పి.సుధాకర్‌రెడ్డి, వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానం నుంచి పూల రవీందర్‌ల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఇక హైదరాబాద్ స్థానిక సంస్థల నుంచి మే 1వ తేదీతో ఎంఎస్ ప్రభాకర్‌రావు పదవీకాలం పూర్తికానుంది. ఇక ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీల కోటాలో కె.రవికిరణ్‌వర్మ (గోదావరి జిల్లాల నియోజకవర్గం), బొడ్డు నాగేశ్వరరావు (కృష్ణా–గుంటూరు జిల్లాల నియోజకవర్గం), ఉపాధ్యాయ ఎమ్మెల్సీల కోటాలో జి.శ్రీనివాసులనాయుడు (ఉత్తరాంధ్ర జిల్లాల నియోజకవర్గం)ల పదవీ కాలం పూర్తికానుంది. అలాగే విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ప్రతి నిధిగా ఎన్నికైన ఎంవీవీఎస్ మూర్తి ఇటీవల మృతి చెందడంతో ఆ స్థానానికి ఉపఎన్నికలు నిర్వహిం చేందుకూ ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఇదీ షెడ్యూల్.. నోటిఫికేషన్ జారీ: ఫిబ్రవరి 25 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: మార్చి 5 నామినేషన్ల పరిశీలన: మార్చి 6 నామినేషన్ల ఉపసంహరణ గడువు: మార్చి 8 ఎన్నికలు: మార్చి 22 (ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు) కౌంటింగ్: మార్చి 26 ఎన్నికల ప్రక్రియ పూర్తి: మార్చి 28లోపు -
అధిక వేతన ప్యాకేజ్‌లు వారికే..
సాక్షి, న్యూఢిల్లీ : ఇతర ఉన్నత విద్యా సంస్థలతో పోలిస్తే ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎంలే అధిక వేతన ప్యాకేజీలను ఆకర్షిస్తున్నాయని ఓ సర్వే వెల్లడించింది. మెటిల్ ఆన్లైన్ టాలెంట్ సొల్యూషన్ ప్రొవైడర్ నిర్వహించిన అథ్యయనంలో అగ్రశ్రేణి ఐఐఎం విద్యార్ధులే సగటు ఎంబీఏ గ్రాడ్యుయేట్‌తో పోలిస్తే 121 శాతం అధిక వేతన ప్యాకేజ్ పొందుతున్నారని తేలింది. ఇక టాప్ ఐఐటీల గ్రాడ్యుయేట్లు సగటు ఇంజనీర్, సీఎస్ , ఐటీ గ్రాడ్యుయేట్లతో పోలిస్తే137 శాతం అధిక ప్రారంభవేతనాలను పొందుతున్నారని వెల్లడించింది. ఇక వేతన ప్యాకేజ్‌ల్లో ఎన్ఐటీలను కొత్తగా ఏర్పాటైన ఐఐటీలు అధిగమిస్తున్నాయని, ఇక మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి అత్యున్నత నైపుణ్యాలను సంతరించుకోవడంతో టాప్ ఐఐటీ గ్రాడ్యుయేట్లకు మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా 114 ఇంజనీరింగ్ కాలేజీలు, 80 మేనేజ్మెంట్ విద్యాసంస్థల్లో సర్వే చేపట్టారు. ఇక టెక్నాలజీ విభాగంలో అత్యధిక సగటు వార్షిక వేతనం రూ 14.8 లక్షలుగా నమోదైంది. జనరల్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో దాదాపు 31 శాతం హైరింగ్ జరిగింది. సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకు ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ కంటే 118 శాతం అధికంగా వేతనాన్ని ఆఫర్ చేశారు. -
పాలిటిక్స్‌లోకి పట్టభద్రులు..!
వెంట నడిచే అనుచర గణం.. హోదా తెచ్చిపెట్టే అధికార దర్పం.. రాజకీయమంటే అదో ‘ప్రత్యేకమైన’ ఆసక్తి.. అందుకే పాలిటిక్స్‌లోకి వచ్చేందుకు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. డాక్టర్లు, ఇంజినీర్లు, వివిధ రంగాల్లో స్థిరపడిన వారే కాదు.. విద్యావంతులు సైతం బరిలోకి దిగేందుకు ఎన్ని‘కలలు’ కంటున్నారు. విద్యాసంస్థల నిర్వాహకులు కూడా అధికార పీఠమెక్కేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే కొందరు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండగా.. మరికొందరు ఏదో ఒక పార్టీలో చేరి సార్వత్రిక ఎన్నికల సమరంలో తలపడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సాక్షి, కామారెడ్డి: రాజకీయాల్లోకి వచ్చేందుకు విద్యా వంతులు, విద్యాసంస్థల నిర్వాహకులు ఆస క్తి చూపుతున్నారు. అధికార పీఠమెక్కేందు కు అవసరమైన బాటలు వేసుకుంటున్నా రు. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికే పలువురు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. కొందరు విద్యావంతులు, విద్యాసంస్థల నిర్వాహకులు వివిధ రాజకీయ పా ర్టీల గొడుగు కిందకు చేరగా, ఇంకొందరు ఏదో పార్టీలో చేరడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి సిద్ధం కావాలని యత్నిస్తున్నారు. ఎలాగైనా ఏదో ఒక పార్టీ ద్వారా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో అడుగులు వేస్తున్నారు. ఎల్లారెడ్డిలో పోటీ అధికమే.. ఇక, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి ప్రస్తుత ఎమ్మెలే ఏనుగు రవీందర్‌రెడ్డి తిరిగి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఆయన భార్య మంజులారెడ్డి పేరు కూడా ప్రచారంలో ఉంది. అయితే, ఈ నియోజక వర్గంలో తెలంగాణ జన సమితి పార్టీ నుంచి ప్రముఖ న్యాయవాది రచనారెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు సంబంధించి భూ నిర్వాసితుల పక్షాన న్యాయపోరాటం చేసి అందరి దృష్టిని ఆకర్షించిన రచనారెడ్డి ప్రొఫెసర్ కోదండరాం కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి ఆవిర్భావ బృందంలో ఒకరుగా ఉన్నారు. ఆమె ఇక్కడి నుంచి పోటీ చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే ప్రొఫెసర్ కోదండరాం దగ్గర పరిశోధన విద్యార్థిగా ఉన్న లింగంపేట మండలానికి చెందిన ఓయూ విద్యార్థి నాయకుడు నిజ్జెన రమేశ్ కూడా ఎల్లారెడ్డి నుంచి పోటీకి సన్నద్ధమవుతున్నారు. తాడ్వాయి మండలం బ్రహ్మాజివాడి గ్రామానికి చెందిన ప్రొఫెసర్ ఎల్లన్నయాదవ్ సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర నాయకుడిగా నియోజక వర్గాన్ని చుట్టి వస్తున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఉన్నత హోదాలో అధికారిగా ఉన్న ఒకరు అధికార పార్టీ టికెట్‌ను ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. బాన్సువాడ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తిరిగి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న విద్యావంతుడు మల్యాద్రిరెడ్డి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన గ్రూప్ వన్ అధికారుల సంఘం రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్‌గౌడ్ కూడా రాజకీయాలపై ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన జు క్కల్ నుంచి పోటీ చేయడానికి కొందరు ఆ సక్తి చూపుతున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ నుం చి సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే తిరిగి బరిలో నిలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నా యి. కాంగ్రెస్ నుంచి విద్యావంతురాలైన మాజీ ఎమ్మెల్యే అరుణతార పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరో ఇద్దరు విద్యావంతులు కూడా ఇతర పార్టీల వైపు చూస్తు న్నట్టు తెలుస్తోంది. జిల్లా రాజకీయాల్లో వి ద్యావంతులు, విద్యా సంస్థల యజమాను లు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతుండడంపై అంతటా చర్చ జరుగుతోంది. రేసులో నిలిచేదెవరో..? జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండగా, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజక వర్గాలపైనే ఎక్కువ మంది విద్యావంతులు దృష్టి సారించారు. అధికార పార్టీతో పాటు ఇతర పార్టీల తరఫున ఎన్నికల బరిలో నిలవడానికి పలువురు విద్యావంతులు, విద్యాసంస్థల నిర్వాహకులు ఆరాటపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజక వర్గమైన జుక్కల్‌లో ఇప్పుడిప్పుడే ఒకరిద్దరు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తిరిగి బరిలో నిలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఉపాధ్యాయ నాయకురాలు సుమిత్రానంద్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. గతంలోనే ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నించారు. ఈ సారి కూడా ఆమె ఎమ్మెల్యే టిక్కెట్ రేసులో ఉంటారని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నియోజక వర్గ ఇన్‌చార్జీగా కొనసాగిన, ప్రస్తుత ఫుడ్ కమిషన్ చైర్మన్ కొమ్ముల తిర్మల్‌రెడ్డి కూడా ఎమ్మెల్యే టిక్కెట్ రేసులో నిలిచే అవాకశం ఉంది. అయితే, టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తిరిగి పోటీ చేయనుండడంతో టిక్కెట్ ఆశిస్తున్న వాళ్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ వైపు దృష్టి సారించే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ తిరిగి పోటీ చేస్తారని భావిస్తున్నారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న విద్యావంతుడు డాక్టర్ మురళీధర్‌గౌడ్ కూడా కామారెడ్డి నియోజక వర్గంలో పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. 2004 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఈ సారి టిక్కెట్ కోసం ప్రయత్నించవచ్చని చెబుతున్నారు. లేదంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు. పట్టణంలో ఫ్రొబెల్స్ స్కూల్ యజమాని, జెడ్పీ మాజీ చైర్మన్ కేపీ వెంకటరమణారెడ్డి ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన కూడా కామారెడ్డి నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. సాందీపని విద్యాసంస్థల డైరెక్టర్ హరిస్మరణ్‌రెడ్డి ఆర్ఎస్ఎస్ ముఖ్యనేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన బీజేపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఉంది. అలాగే, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లైబ్రరీ ఇన్‌చార్జీగా కొనసాగుతున్న ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రంజిత్ మోహన్ కూడా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీకి దిగాలని, లేదంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. పట్టణంలో ఆర్కే డిగ్రీ కళాశాల నిర్వాహకుడు, గతంలో విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో క్రియాశీలకంగా పని చేసిన ముస్కు జైపాల్‌రెడ్డి కూడా బీజేపీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. -
పట్టభద్రులూ ఆలోచించి ఓటేయండి
- చంద్రబాబు నిరుద్యోగులకు ఉద్యోగం కానీ, భృతి కానీ ఇవ్వలేదు - ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్న ప్రత్యేకహోదాను కేంద్రానికి తాకట్టుపెట్టారు - ప్రభుత్వ వ్యతిరేకత తెలుపుతూ వెన్నపూసకు ఓటు వేయండి - పొరపాటు చేస్తే అధికారపార్టీ అరాచకాలు ఎక్కువవుతాయి - ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనంతపురం : 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయని చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ఇదే మంచి తరుణమని, పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటికో ఉద్యోగం, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఈ మూడేళ్లలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? అనేది పట్టభద్రులు ఆలోచించాలన్నారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా పల్లవి పాడిన చంద్రబాబునాయుడు ఈరోజు ప్రత్యేకహోదా నినాదాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన విషయాన్ని గమనంలో ఉంచుకోవాలన్నారు. ఈ మూడేళ్లలో అధికారపార్టీ నాయకులు అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు మితిమీరిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమాత్రం పొరబాటు చేసినా టీడీపీ అరాచకాలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని, యువత అప్రమత్తం కావాలని సూచించారు. ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వం తెలుసుకోవాలన్నా, వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రత్యేకహోదా ఉద్యమానికి మరింత ఊతం ఇవ్వాలన్నా వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ప్రభుత్వం తమపై వస్తున్న వ్యతిరేకతను గుర్తించి కాస్తోకూస్తో అయినా మంచి పనులు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఓటరుగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ మొదటి ప్రాధాన్యత ఓటును గోపాల్‌రెడ్డికి వేయాలని కోరారు. -
గ్రాడ్యుయేట్లు, టీచర్లకు స్మార్ట్ఫోన్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తుండడంతో అధికార తెలుగుదేశంపార్టీ ఓట్ల కొనుగోలుకు తెరలేపింది. పట్టభద్రులకు ఒక్కో ఓటుకు రూ.4వేలు విలువచేసే స్మార్ట్ ఫోన్, ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్లకు రానుపోను చార్జీలు ఇచ్చేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. అలాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు డబ్బులు ఎరవేసి శనివారం రాత్రి నుంచి శిబిరాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి తనకు అనుకూలంగా ఓటు వేసే వారికి స్మార్ట్ ఫోన్లు, ఎన్నికల ఖర్చులు పంపిణీ ప్రారంభించింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాల శాసనమండలి ఎన్నికలకు సోమవారంతో ప్రచారం గడువు ముగుస్తుంది. ఈ నెల 9వ తేదీ పోలింగ్ జరుగుతుంది. పోలింగ్‌కు మూడు రోజులే గడువు ఉండటంతో అధికారపార్టీ ఓట్లు కొనుగోలు చేసే పనిలో పడింది. రాజధాని అమరావతి నిర్మాణంలో తెలుగుదేశంపార్టీ నుంచి వేల కోట్ల రూపాయల లబ్ధిపొందిన చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రముఖ కాంట్రాక్టర్ టీడీపీ తరపున పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు పోటీచేస్తున్న వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, వాసుదేవనాయుడు తరపున ఓటర్లకు పంపిణీ చేయడానికి పెద్ద సంఖ్యలో స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేశారు. ఇందులో భాగంగా ఆదివారం నాటికి జిల్లాలో సుమారు 75వేల మొబైల్ ఫోన్లు చేరవేశారు. ఓటరు జాబితా ప్రకారం పట్టభద్రులకు స్థానిక టీడీపీ నాయకులు స్లిప్ అందజేస్తారు. ఓటర్లు ఆ స్లిప్‌ను నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న నాయకుడి వద్దకు తీసుకెళ్తే స్మార్ట్ ఫోన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల్లో ఉండే పట్టభద్రులు తమ ప్రాంతానికి వచ్చి ఓటు వేయడంకోసం వారికి ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చులకు డబ్బులు అందించేందుకు గాను జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు పెద్ద మొత్తంలో నగదు సరఫరా అయింది. దీంతోపాటు ఆయా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను చేర వేసేందుకు నియోజక వర్గానికి పది చొప్పున ప్రత్యేకంగా వాహనాలను సమకూర్చేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉపాధ్యాయ ఓటర్లను ప్రలోభపెట్టడంకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కుదిరితే తాయిలాలు ఇవ్వడం, లేకపోతే బెదిరించి తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. స్థానిక ఓటర్లను చేజారనియొద్దు స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న తెలుగుదేశంపార్టీ ప్రజాప్రతినిధులను ఒక్కరిని కూడా చేజారకుండా చూసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జిల్లా నాయకులకు సూచించారు. ఆదివారం ఆయన పార్టీ అభ్యర్థి వాకాటి నారాయ ణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో ఎన్నికల గురించి ఫోన్లో చర్చించారు. అవసరమైతే ఏ స్థాయిలో అయినా అధికా ర దుర్వినియోగం చేసి అసంతృప్తి ఓటర్లను కట్టడి చేయాలని సూచించారు. సోమవారం సాయంత్రానికి ఏ రకంగానైనా పరిస్థితి అనుకూలంగా మలిచే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. -
పట్టభద్రులు మేల్కొనాలి
► టీడీపీ ప్రభుత్వానికి ఓటుతో గుణపాఠం చెప్పాలి ► వెన్నపూస గోపాల్‌రెడ్డికి ఓటేసి గెలిపించుకుందాం ► కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి కడప అగ్రికల్చర్: టీడీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేం దుకు ఎమ్మెల్సీ ఎన్నికలను సద్వినియోగం చేసుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పట్టభద్రులకు పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క హామీని అమలు చేయకుండా నిరుద్యోగులు, పట్టభద్రులు.. ఇలా అన్ని వర్గాలను మోసం చేసిం దని ఆయన తెలిపారు. ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే వైఎస్సార్ సీపీ తరఫున పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది: కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఎంపీ మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇంటికో ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని ఓట్లు దండుకుందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేయడమే పనిగా ముందుకు వెళుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కేజే రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను, నిరుద్యోగులను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ముంచారన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని, పరిశ్రమలు నెలకొల్పుతున్నానని చెప్పి అందినకాడికి దండుకుని నిరుద్యోగులను మోసగించారన్నారని తెలిపారు. సామాన్యులను మోసం చేసిన ఘనుడు కేజే రెడ్డి: కర్నూలు జిల్లాలో సామాన్యులను సైతం మోసం చేసిన ఘనుడు కేజే రెడ్డి అని ఆరోపించారు. ఈయన బాగోతం కర్నూలు జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. అటువంటి మోసగాడికి, అక్రమార్కుడిని సీఎం చంద్రబాబు చేరదీసి అభ్యర్థిగా నిలబెట్టడం దారుణమన్నారు. నీతి, నిజాయితీ పనిచేసే వెన్నపూసను గెలిపించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ఈయన్ను గెలిపిస్తే నిరుద్యోగులు, యువకుల తరఫున శాసనమండలిలో టీడీపీని నిలదీస్తారని చెప్పారు. సమావేశంలో మేయర్ కె సురేష్‌బాబు, గోపాల్‌రెడ్డి తనయుడు రవీంద్రరెడ్డి, పార్టీ నాయకుడు మధువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓటుతో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి కడప ఎడ్యుకేషన్: నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబుకు పట్టభద్రులు ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజారహ్మతుల్లా పిలుపునిచ్చారు. కడప నగరంలో పలు విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల్లో ఆదివారం వెన్నపూసకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ నిరుద్యోగులను, రైతులను.. ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితులో లేరని తెలిపారు. యువతంతా ఓటింగ్‌లో పాల్గొని ఓటు వేసి వెన్నపూసను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు మహేశ్వరరెడ్డి, యాసిన్, రహీమ్, సాయిదత్త, రవితేజ పాల్గొన్నారు. -
బోగస్ పట్టభద్రుల ఓటర్లను తొలగించండి
–అధికార పార్టీ నేతలు అక్రమంగా లబ్ధిపొందేందుకు బోగస్ ఓటర్లను చేర్పించారు –రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేస్తాం – వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్ రెడ్డి కర్నూలు(అగ్రికల్చర్): పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో అధికారపార్టీ నేతలు అధికారులను గుప్పిట్లో పెట్టుకొని అడ్డగోలుగా బోగస్ ఓటర్లను చేర్పించారని, వీటిని వెంటనే తొలగించాలని వైఎస్ఆర్సీపీ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుదేశం నేతలు ఓటమి భయంతో ఇలా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ...పట్టభధ్రుల ఓటర్ల నమోదుకు ఎన్నికల కమిషన్ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిన అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. తెలుగుదేశం నేతల ఆధ్వర్యంలో ఓటర్ల జాబితాను తయారు చేసినట్లు అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. 2013 అక్టోబరులోపు డిగ్రీ, తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారినే ఓటర్లుగా నమోదు చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా పదో తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్ చేసిన వారిని ఓటర్లుగా నమోదు చేయడం దారుణమనా్నరు. ఒక్క కర్నూలు జిల్లాలోనే దాదాపు 8500 బోగస్ పట్టభద్రుల ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోందని, దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ప్రభుత్వానికి పట్టభద్రులు వ్యతిరేకంగా ఉన్నందున టీడీపీ నేతలు బోగస్ ఓటర్లతో ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రోజాను అడ్డుకోవడం దారుణం ఎమ్మెల్యే రోజాను అమరావతిలో నిర్వహించిన మహిళా పార్లమెంటు సదస్సుకు అనుమతించకపోవడం అత్యంత దారుణమని వైఎస్ఆర్సీపీ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు మహిళా ప్రజాప్రతినిధి పట్ల అమానుషంగా ప్రవర్తించడం బాధాకరమని చెప్పారు. వెంటనే ప్రభుత్వం రోజాకు క్షమాపన చేప్పాలని డిమాండ్ చేశారు.