విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ అందించిన మైక్రోసాఫ్ట్‌...! | Microsoft Invites Applications For 50000 Virtual Internships | Sakshi
Sakshi News home page

Microsoft: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ అందించిన మైక్రోసాఫ్ట్‌...!

Published Thu, Sep 23 2021 3:54 PM | Last Updated on Thu, Sep 23 2021 4:02 PM

Microsoft Invites Applications For 50000 Virtual Internships - Sakshi

సాంకేతిక నైపుణ్యాలు, ఉపాది అవకాశాలను విద్యార్థుల్లో పెంపొందించడంకోసం మైక్రోసాఫ్ట్‌,  ఫ్యూచర్‌ రెడీ టాలెంట్‌ వర్చువల్‌ ఇంటర్నషిప్‌ ప్రోగ్రాంను లాంచ్‌ చేసింది. ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను మైక్రోసాఫ్ట్‌ ఆహ్వనిస్తుంది. సుమారు 50 వేల మంది విద్యార్థులు ఇంటర్నషిప్‌ ప్రోగ్రాంలో పాల్గొనవచ్చును.   మైక్రోసాఫ్ట్ అజూర్ , గిట్‌హబ్ టూల్స్ వంటి సాధనాలను ఉపయోగించి వ్యాపార సవాళ్లను పరిష్కరించడానికి, వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి విద్యార్థులను సిద్ధం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తెలిపింది.
చదవండి:  ఒక్క రోజులోనే కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు...!


ఈ ప్రోగ్రాంతో విద్యార్థులు గిట్‌హబ్‌ స్టూడెంట్ డెవలపర్ ప్యాక్‌ను యాక్సెస్ చేయవచ్చును. ఈ ప్రోగాంలో 2021 గ్రాడ్యుయేషన్‌ పూర్తైన విద్యార్థులు పాల్గొనవచ్చును. వారితో పాటుగా 2022, 2023లో గ్రాడ్యుయేట్‌ అయ్యే విద్యార్థులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గోనేందుకు మైక్రోసాఫ్ట్‌ అవకాశాన్ని కల్పిస్తోంది. ఏదైనా స్పెషలైజేషన్‌ను కల్గిన విద్యార్థులు ఈ ప్రోగాంకు  దరఖాస్తు చేసుకోవచ్చుని మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. 

ఫ్యూచర్ రెడీ టాలెంట్ ‘https://futurereadytalent.in’ వెబ్‌సైట్‌లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చును. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29. ఇంటర్న్‌షిప్ వ్యవధి సుమారు 8 వారాల పాటు ఉండనుంది. మైక్రోసాఫ్ట్ తన లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ మైక్రోసాఫ్ట్ లెర్న్ ద్వారా లెర్నింగ్ మాడ్యూల్స్ సర్టిఫికేషన్‌లను విద్యార్థులకు అందిస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా, కృత్రిమ మేధస్సు,  సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇవ్వనుంది.
చదవండి: Startup: దేశంలోనే ఫస్ట్‌ ప్లేస్‌..స్టార్టప్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన నగరం ఇదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement