virtual classroom
-
తొలి వర్చువల్ స్కూల్ షురూ.. దేశంలో ఎక్కడి నుంచైనా చేరొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే తొలి వర్చువల్ స్కూల్‌ను ప్రారంభించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థలు ఈ స్కూల్లో చేరేందుకు అర్హులేనని తెలిపారు. ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్-డీఎంవీఎస్లో బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. 9-12వ తరగతి వరకు 13 నుంచి 18 ఏళ్ల వయసు విద్యార్థులు చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. నీట్, సీయూఈటీ, జేఈఈ వంటి పరీక్షలకు వర్చువల్ పాఠశాలలో నిపుణులతో శిక్షణ ఇస్తామని తెలిపారు కేజ్రీవాల్. ఢిల్లీ మోడల్ వర్చువల్ పాఠశాలను దేశ విద్యారంగంలో మైలురాయిగా అభివర్ణించారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ‘దూరం వంటి అనేక కారణాలతో చాలా మంది పిల్లలు బడికి వెళ్లలేకపోతున్నారు. అమ్మాయిలను దూరప్రాంతాలకు పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడంలేదు. అలాంటి వారందరి కోసమే ఢిల్లీ వర్చువల్ స్కూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. వర్చువల్ విధానంలోనే తరగతులు జరుగుతాయి. టీచర్లు పాఠాలు చెప్పే వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు.’ అని వెల్లడించారు కేజ్రీవాల్. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా ఈ వర్చువల్ స్కూల్ పనిచేస్తుంది. మార్కుల మెమోలు, ఇతర ధ్రువీకరణ పత్రాలు అన్నీ డీబీఎస్ఈ జారీ చేస్తుంది. ఇవి ఇతర బోర్డులు ఇచ్చే ధ్రువపత్రాలతో సమానం. వీటి ఆధారంగా విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరవచ్చు. వర్చువల్ స్కూల్లో చేరే విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయరు. తొలి బ్యాచ్‌లో ఎంత మంది విద్యార్థులను తీసుకోవాలో ఇంకా ఏమీ నిర్ణయించలేదని, రిజిస్ట్రేషన్ల ఆధారంగా నిర్ణయించనున్నట్లు అధికారులు తెలిపారు. స్కూల్‌నెట్, గూగుల్ కలిసి అభివృద్ధి చేసిన స్కూలింగ్ ప్లాట్‌ఫాం ద్వారా ఆన్లైన్లో పాఠాలు బోధిస్తారు. విద్యార్థుల అటెండన్స్ తీసుకునేందుకు ఈ ఆన్లైన్ ప్లాట్‌ఫాంలోనే ప్రత్యేక ఫీచర్ ఉంటుంది. పరీక్షలు వర్చువల్ మోడ్‌లో జరిగినా కాపీకి ఆస్కారం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక్కో టాపిక్‌పై విద్యార్థుల అవగాహనను తెలుసుకునేలా పరీక్షలు ఉంటాయి. వీటిలో కాపీ కొట్టేందుకు అవకాశాలు చాలా తక్కువ. అయితే.. రెండు టెర్మ్-ఎండ్ పరీక్షల కోసం విద్యార్థులు తప్పనిసరిగా ఢిల్లీకి రావాల్సి ఉంటుంది. ఢిల్లీలోని ఎంపిక చేసిన పాఠశాలల్లో కంప్యూటర్ ద్వారా విద్యార్థులు ఈ పరీక్షలు రాయాలి. వర్చువల్ స్కూల్లో ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో పాఠాలు బోధిస్తారు. आज शिक्षा के क्षेत्र में बहुत बड़ी क्रांति की शुरुआत हो रही है। आज देश का पहला वर्चुअल स्कूल दिल्ली में शुरू। https://t.co/PIms2geisB — Arvind Kejriwal (@ArvindKejriwal) August 31, 2022 ఇదీ చదవండి: ప్రాక్టికల్స్‌లో ఫెయిల్.. టీచర్‌ను చెట్టుకు కట్టేసి చితకబాదిన విద్యార్థులు -
Online Classes: నాన్నా.. ఓ చిప్స్ ప్యాకెట్.. అడ్డూ అదుపూ లేకుండా తింటే...
‘ఏమైనా చేసి పెట్టనా?’ ఆన్లైన్ క్లాసుల పేరుతో కంప్యూటర్‌కో, టీవీలకో అతుక్కుపోయిన పిల్లలను తల్లులు అడిగే ప్రశ్న ఇది. ‘ఆన్లైన్ క్లాసప్పుడు తినడానికి కాస్తా చిప్స్ ప్యాకెట్ తీసుకురా డాడీ..’ ఇదీ.. బయటకెళ్ళే తండ్రి వద్ద పిల్లల గారాబం. రెండూ కాదనుకుంటే ఆన్లైన్ తిండి ఎలాగూ ఉంది. ఆకలితో సంబంధం లేకుండా టైమ్ పాస్ కోసం అన్నట్టుగా ఫోన్లోనే ఏ ఫుడ్ డెలివరీ సంస్థలోనో నూడుల్సో, పిజ్జానో, బర్గరో ఆర్డర్ ఇచ్చేయడమే. అడ్డూఅదుపూ లేకుండా తీసుకునే ఆహారం వల్ల భవిష్యత్‌లో ఊబకాయం, ఫ్యాటీ లివర్ (కొవ్వుతో కూడిన కాలేయం), మధుమేహం వంటి సమస్యలతో పాటు బాలికల్లో హార్మోన్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. మొత్తం మీద ఆన్లైన్ తరగతుల పుణ్యమా అని విద్యార్థులకు చిరుతిళ్లు పెరుగుతున్నాయి. స్కూలుకు పంపేప్పుడు లంచ్ బాక్స్ కట్టిస్తే సరిపోయేది... ఇప్పుడు అస్తమానం ఏదో ఒకటి చెయ్యక లేక కొనివ్వక తప్పడం లేదని తల్లులు అంటున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్‌కి ఇవి అదనం అన్నమాట. వరసబెట్టి తీసుకునే ఈ అదనపు తిండి పూర్తిగా అనవసరం అని ఆహార నిపుణులు చెబుతున్నారు. పైగా చిప్స్, నూడుల్స్ వంటి మసాలా జంక్ ఫుడ్స్ దీర్ఘకాలంలో పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వైద్యులు అంటున్నారు. పాఠశాలలకు వెళ్లే సాధారణ రోజుల్లో మితాహారం తీసుకునే విద్యార్థి, ఇంటి దగ్గర ఆన్లైన్ చదువప్పుడు అవసరానికి మించి తినేస్తున్నాడని, అదీ జంక్ పుడ్ కావడం ఆందోళన కలిగించే అంశమని చెబుతున్నారు. జీర్ణకోశం జర జాగ్రత్త.. సాధారణంగా రోజూ తీసుకునే ఆహారం కన్నా... ఆన్లైన్ క్లాసుల సమయంలో విద్యార్థులు రెండు రెట్లు ఎక్కువ తీసుకుంటున్నారని హైదరాబాద్‌కు చెందిన న్యూట్రిషనిస్టు శ్రావణి తెలిపారు. తన దగ్గరకొచ్చిన పిల్లల నుంచి ఈ వివరాలు సేకరించినట్టు ఆమె చెప్పారు. ఇందులో ఎక్కువ ఆయిల్‌తో ఆహారం, జంక్ ఫుడ్స్ ఉంటున్నాయని తెలిపారు. దీనివల్ల తక్షణ జీర్ణ సమస్యలే కాదు... దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. ►విద్యార్థులు తీసుకునే ఆయిల్, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం వల్ల స్వల్ప కాలంలోనే ఎసిడిటీ బారినపడుతున్నారు. రసాయనాలతో నిల్వ ఉంచిన చిప్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ మలబద్దకం, కడుపులో మంట వంటి సమస్యలకు లోనవుతున్నారు. ►దినచర్యలో మార్పులు రావడం, ఆలస్యంగా నిద్రలేవడం, హడావిడిగా ఆన్లైన్ క్లాసుల కోసం కంప్యూటర్లకు అతుక్కుపోవడం వల్ల పీచు ఎక్కువగా ఉండే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీని బదులు జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇవన్నీ జీర్ణకోశ సంబంధమైన సమస్యలకు దారి తీస్తున్నాయి. ►మసాలాలు తినడం వల్ల పేగుల్లో కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి నిద్ర పోవడానికి ఉపయోగపడే రసాయనాల ఉత్పత్తిని మందగింపజేస్తాయి. ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. కళ్ళ మంట, తొందరగా అలసిపోవడం దీనివల్లేనని అంటున్నారు. ►5 ఏళ్లలోపు పిల్లల్లో నడవడిక (బిహేవియర్) సంబంధమైన సమస్యలుంటున్నాయి. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, సామాజిక వ్యవస్థతో సంబంధాలు పూర్తిగా తెగిపోతున్నాయని మానసిక వైద్య నిపుణులు తెలిపారు. నిద్రలేకపోవడం, సెల్‌ఫోన్‌తో ఆడుకోవాలన్పించడం, ఏ చిన్నదానికైనా చికాకు పడటం కన్పిస్తోందని తల్లిదండ్రులు అంటున్నారు. ఆకలేసినప్పుడే ఆహారం ఇవ్వాలి పిల్లలకు ఆకలేస్తుందనుకున్నప్పుడే ఆహారం ఇవ్వాలి. ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండే తాజా పండ్లు అలవాటు చేయడంపై తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలి. దీంతో పాటు చిన్నచిన్న శారీరక శ్రమ కల్గించే ఆటలు ఆడేలా పిల్లలను ప్రోత్సహించాలి. ఆన్లైన్ పేరుతో పిల్లలు ఎలక్ట్రానిక్స్ వస్తుల ముందే ఎక్కువసేపు ఉంటారు. కాబట్టి టీవీ చూడకుండా చేయాలి. షటిల్, క్యారమ్స్ వంటి మానసిక ఉల్లాసం కల్గించే ఆటలపై దృష్టి మళ్లించాలి – డాక్టర్ ఉపేందర్ షావా (పిల్లల జీర్ణకోశ వ్యాధుల నిపుణులు) చేసి పెట్టక తప్పట్లేదు మా పాప ఆన్లైన్ క్లాసులప్పుడు ఏదో ఒక చిరు తిండి కావాలంటుంది. రోజుకు రెండు మూడుసార్లు ఏదో ఒకటి చేసి పెట్టాల్సిందే. లేదంటే కొనివ్వాల్సిందే. మంచిది కాదని తెలిసినా తçప్పడం లేదు. స్కూలుకు పంపితే లంచ్‌తో సరిపెట్టేవాళ్ళం. కాకపోతే అప్పుడప్పుడు స్నాక్స్ ఇచ్చేవాళ్ళం. – ఎం.శ్వేత (9వతరగతి విద్యార్థిని తల్లి, ఖమ్మం) -సాక్షి, హైదరాబాద్ చదవండి: Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల.. -
విద్యార్థులకు గుడ్‌న్యూస్ అందించిన మైక్రోసాఫ్ట్...!
సాంకేతిక నైపుణ్యాలు, ఉపాది అవకాశాలను విద్యార్థుల్లో పెంపొందించడంకోసం మైక్రోసాఫ్ట్, ఫ్యూచర్ రెడీ టాలెంట్ వర్చువల్ ఇంటర్నషిప్ ప్రోగ్రాంను లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను మైక్రోసాఫ్ట్ ఆహ్వనిస్తుంది. సుమారు 50 వేల మంది విద్యార్థులు ఇంటర్నషిప్ ప్రోగ్రాంలో పాల్గొనవచ్చును. మైక్రోసాఫ్ట్ అజూర్ , గిట్‌హబ్ టూల్స్ వంటి సాధనాలను ఉపయోగించి వ్యాపార సవాళ్లను పరిష్కరించడానికి, వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి విద్యార్థులను సిద్ధం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తెలిపింది. చదవండి: ఒక్క రోజులోనే కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు...! ఈ ప్రోగ్రాంతో విద్యార్థులు గిట్‌హబ్ స్టూడెంట్ డెవలపర్ ప్యాక్‌ను యాక్సెస్ చేయవచ్చును. ఈ ప్రోగాంలో 2021 గ్రాడ్యుయేషన్ పూర్తైన విద్యార్థులు పాల్గొనవచ్చును. వారితో పాటుగా 2022, 2023లో గ్రాడ్యుయేట్ అయ్యే విద్యార్థులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గోనేందుకు మైక్రోసాఫ్ట్ అవకాశాన్ని కల్పిస్తోంది. ఏదైనా స్పెషలైజేషన్‌ను కల్గిన విద్యార్థులు ఈ ప్రోగాంకు దరఖాస్తు చేసుకోవచ్చుని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఫ్యూచర్ రెడీ టాలెంట్ ‘https://futurereadytalent.in’ వెబ్సైట్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చును. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29. ఇంటర్న్‌షిప్ వ్యవధి సుమారు 8 వారాల పాటు ఉండనుంది. మైక్రోసాఫ్ట్ తన లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ మైక్రోసాఫ్ట్ లెర్న్ ద్వారా లెర్నింగ్ మాడ్యూల్స్ సర్టిఫికేషన్లను విద్యార్థులకు అందిస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వనుంది. చదవండి: Startup: దేశంలోనే ఫస్ట్ ప్లేస్..స్టార్టప్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నగరం ఇదే! -
ఆన్లైన్ క్లాసుల కోసం జియోమీట్.. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో
వీడియో కాలింగ్ విభాగంలో సరికొత్త ఫీచర్‌కి అదనపు హంగులు జోడించింది జియోమీట్. భారతీయుల అవసరాలకు తగ్గట్టుగా స్థానిక భాషల్లో ఈ యాప్‌ని ఉపయోగించే విధంగా మార్పులు చేసింది. జియోమీట్ అంటే కరోనా సంక్షోభం తర్వాత జీవన శైలిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆఫీసు పనులు, అకాడమిక్ వ్యవహరాలు అన్నీ వర్చువల్ పద్దతిలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో జూమ్, గూగుల్ మీట్ వంటి వీడియో కాలింగ్ యాప్స్ అవసరం పెరిగిపోయింది. దీంతో మారిన పరిస్థితులకు తగ్గట్టుగా జియోమీట్ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది జియో నెట్వర్క్. స్థానిక భాషల్లో పల్లె, పట్నం తేడా లేకుండా జియో నెట్వర్క్ దేశమంతటా విస్తరించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జియోమీట్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే వీరికి మరింత అనువుగా ఉండేలా ఇంగ్లిష్తో పాటు స్థానిక భాషల్లో జియోమీట్‌ను ఉపయోగించుకునేలా మార్పులు చేశారు. ఆగస్టు 15 నుంచి హింది, మరాఠి, గుజరాత్ భాషలను ఈ యాప్‌లో అందుబాటులోకి తెచ్చింది. అతి త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ భాషలను కూడా యాడ్ చేస్తామని జియో సంస్థ తెలిపింది. డేటా సేవర్ సాధారణంగా కాన్ఫరెన్స్‌లు , ఆన్లైన్ క్లాసులు గంటల తరబడి జరుగుతుంటాయి. దీని వల్ల డేటా వాడకం ఎక్కువ అవుతుంది. తమ వీడియో కాలింగ్ యాప్‌లో డేటా యూసేజీ తక్కువగా ఉంటుందని జియో అంటోంది. తక్కువ డేటా ఉపయోగిస్తూ హై డెఫినేషన్‌లో ఎక్కువ సేపు ఆన్లైన్ క్లాసులు, వర్చువల్ సమావేశాల్లో పాల్గొనవచ్చని హామీ ఇస్తోంది. చదవండి : Apple Days Sale: ఆపిల్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, క్యాష్ బ్యాక్..! -
ఆన్‘లైన్’ తప్పుతున్న చదువులు
ఈ ఫోటోలో బర్రెలు కాస్తున్న విద్యార్థి కడారి శివ. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి. ఓ ప్రైవేట్ పాఠశాలలో అతను 7వ తరగతి, అక్క నందీశ్వరి 8వ తరగతి చదువుతున్నారు. ఇంట్లో ఒకే స్మార్ట్‌ఫోన్ ఉంది. ఇద్దరూ పాఠాలు వినలేని పరిస్థితి. దీనితో నందీశ్వరి పాఠాలకు హాజరవుతుండగా.. శివ బర్రెలు కాయడానికి వెళుతున్నాడు. (పాపం పసివాళ్లు.. ఆన్లైన్ పాఠాల్లేవ్.. పనులే) స్మార్ట్ ఫోన్లు లేక.. పశువులు కాస్తూ.. ఈ ఫొటోలో ఉన్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కొత్తమారేడుబాకకు చెందిన విద్యార్థులు కల్లూరి సాయి, వర్షసాగర్. ఆన్లైన్ క్లాసులు వినడానికి స్మార్ట్ఫోన్లు లేక పశువులు కాసేందుకు వెళ్తున్నారు. సిగ్నల్ సరిగా లేక పొలానికి.. నిర్మల్ జిల్లా కుంటాల మండలం దౌనెల్లికి చెందిన పుష్పలత –భూషణ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు బిడ్డలు రుత్విక, కార్తీక ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్ సరిగా రాక ఆన్లైన్ క్లాసులు వినే పరిస్థితి లేదు. దానికితోడు ఇద్దరూ చిన్న పిల్లలు కావడంతో తల్లిదండ్రులు పొలానికి తీసుకెళ్తున్నారు. తండ్రితో కలిసి పశువుల వెంట.. ఈ ఫోటోలోని విద్యార్థి మల్లెబోయిన వరుణ్. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలు లేకపోవడం, ఆన్లైన్ క్లాసులకు హాజరవడంతో ఇబ్బందులతో తండ్రితో కలిసి పశువులు, మేకలు కాయడానికి వెళ్తున్నాడు. తల్లిదండ్రులతో కలిసి బావి వద్ద చిన్నచిన్న వ్యవసాయ పనులు చేస్తున్నాడు. వీడియోలు చూస్తున్నాడని... మంచిర్యాల జిల్లా ధర్మారం శివార్లలోని పొలాల వద్ద పత్తిచేనులో కలుపుమొక్కలు తీస్తున్న బాలుడి ఇతను. స్మార్ట్‌ఫోన్ ఇస్తే ఆన్లైన్ క్లాసులు వినకుండా వీడియోలు చూస్తున్నాడని, ఇంట్లో ఉండకుండా తిరుగుతున్నాడని.. అందుకే పత్తి చేనుకు తీసుకొచ్చి పనిచెప్పామని కుటుంబీకులు చెప్తున్నారు. ఇంటిపెద్ద కరోనాకు బలవడంతో.. ఈ ఫొటోలో ఉన్న మహిళ నిర్మల, కుమారుడు నితిన్, కూతురు నిఖిత. వారిది సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం. ఆమె భర్త భాస్కర్ మూడు నెలల కింద కరోనా బారినపడి మృతి చెందాడు. ఆయన చికిత్స కోసమని చేసిన రూ.3 లక్షల అప్పులు తీర్చాల్సిన బాధ్యత, ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు, వృద్ధురాలైన అత్తను పోషించాల్సిన బాధ్యత ఆమెపై పడింది. ఆన్లైన్ క్లాసులు సరిగా అర్థంకావడం లేదని పిల్లలు చెప్పడంతో.. ఆర్థిక ఇబ్బందులైనా తప్పుతాయన్న ఉద్దేశంతో వారిని వ్యవసాయ పనులకు తీసుకెళ్తున్నట్టు నిర్మల ఆవేదన వ్యక్తం చేసింది. బడులు తెరిస్తే పంపిస్తానని తెలిపింది. తాంసిలో కలుపు మొక్కలు తీస్తున్న సాయితేజ ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సాయితేజ 8వ తరగతి చదువుతున్నాడు. ఆన్లైన్ పాఠాలు వినడానికి సెల్‌ఫోన్ లేకపోవడంతో తల్లిదండ్రులతో కలిసి పంట చేనుకు వెళ్తున్నాడు. తల్లిదండ్రులతో కలిసి కలుపు మొక్కలు తీస్తూ కనిపించాడు. పత్తి చేనులో కలుపుతీస్తూ.. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నాగారానికి చెందిన శ్రీను, వంశీ, అఖిల్, జైతు బుధవారం పత్తి చేన్లలో కలుపు తీస్తూ కనిపించారు. ఆన్లైన్ క్లాసులు వినడం లేదా? అని ప్రశ్నించగా.. ‘క్లాసులు సరిగా జరగడం లేదు, వ్యవసాయ పనులకే వెళ్తున్నాం’ అని చెప్పారు. -
ఆశావహంగా ఉండండి..
న్యూఢిల్లీ: విద్యాభ్యాసం పూర్తి చేసుకుని బైటి ప్రపంచంలోకి అడుగుపెడుతున్న గ్రాడ్యుయేట్లు ఆశావహంగాను, కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆసక్తిగాను ఉండాలని టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సూచించారు. అంతే కాకుండా కొంత అసహనంగా కూడా ఉండాలని, దాన్నుంచే కొత్త సాంకేతిక విప్లవం రాగలదని ఆయన పేర్కొన్నారు. 2020 గ్రాడ్యుయేట్ల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పిచాయ్ ఈ విషయాలు తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులతో పాటు పలువురు ప్రముఖులు ఈ వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఈ స్నాతకోత్సవం ఇలా జరుగుతుందని మీరెవరూ ఊహించి ఉండరు. మీరు వేడుకగా జరుపుకోవడానికి బదులు కోల్పోయిన అవకాశాలు, తల్లకిందులైన ప్రణాళికల గురించిన ఆందోళనతో జరుపుకోవాల్సి వస్తోందని మీరు బాధపడుతూ ఉండొచ్చు. ఇలాంటి కష్టకాలంలో ఆశావహంగా ఉండటం కష్టమే. కానీ ఆశావహంగా ఉండగలిగితే, ఈ ఏడాది గ్రాడ్యుయేట్లయిన మీరు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టగలరు. చరిత్రలో నిల్చిపోగలరు‘ అని సుందర్ చెప్పారు. మెరుగైన ప్రపంచం.. ఒక తరం సాధించిన పురోగతి మరో తరానికి పునాదిరాయి కాగలదని సుందర్ తెలిపారు. నేటి యువత ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. పురోగతి సాధించాలంటే కాస్త అసహనం కూడా ఉండాలన్నారు. ‘కొన్ని టెక్నాలజీ సంబంధిత విషయాలు మీకు విసుగు తెప్పించవచ్చు. అసహనానికి గురిచేయొచ్చు. ఆ అసహనాన్ని కోల్పోవద్దు. దాన్నుంచే కొత్త సాంకేతిక విప్లవం సృష్టి జరగొచ్చు, మా తరం కనీసం కలలో కూడా ఉహించని కొత్తవన్నీ మీరు నిర్మించవచ్చేమో. కాబట్టి అసహనంగా ఉండండి. ప్రపంచానికి అవసరమైన పురోగతి దాన్నుంచే వస్తుంది‘ అని సుందర్ పేర్కొన్నారు. నేనూ సవాళ్లు ఎదుర్కొన్నా.. గూగుల్ సీఈవో స్థాయికి ఎదిగే క్రమంలో తానూ పలు సవాళ్లు ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా సుందర్ చెప్పారు. తన చిన్నతనంలో టెక్నాలజీ పెద్దగా అందుబాటులో ఉండేది కాదని, కానీ ప్రస్తుత తరం పిల్లలు కంప్యూటర్లతోనే పెరుగుతున్నారన్నారు. ‘నేను స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి అమెరికా రావడం కోసం మా నాన్న దాదాపు ఏడాది జీతం వెచ్చించి విమానం టికెట్ కొనిచ్చారు. నేను విమానం ఎక్కడం అదే మొదటిసారి. నన్ను అక్కడ (భారతదేశం) నుంచి ఇక్కడి దాకా (అమెరికా) తీసుకొచ్చినది కేవలం అదృష్టం ఒక్కటే కాదు. టెక్నాలజీ అంటే నాకున్న అమితాసక్తి, కొత్తవి నేర్చుకోవాలనే అభిలాష కూడా ఇందుకు కారణం‘ అని సుందర్ తెలిపారు. -
వారికి స్మార్ట్‌ఫోన్, టీవీలు ఇస్తాను: రాహుల్ గాంధీ
తిరువనంతపురం: కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పాఠశాలలను మూసి వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం కేరళలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఓ 14 ఏళ్ల పేద విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడేలా చేసింది. కుటుంబంలో టీవీ, స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో ఆన్లైన్ తరగతులకు హాజరు కాలేకపోతున్నాననే బాధతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన బాలిక.. ఈ రోజు వాలంచెరిలోని ఆమె ఇంటి సమీపంలో మృతదేహంగా కనిపించింది. ఆ పక్కనే ఖాళీగా ఉన్న కిరోసిన్ బాటిల్ కూడా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. బాలిక మృతదేహం దొరికిన ప్రదేశంలో సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంజేరి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి పంపారు.(ఆ బాలికపై దాడి అమానుషం : రాహుల్) మృతి చెందిన బాలిక 9 వ తరగతి చదువుతుందని.. క్లాస్‌లో ఎప్పుడు ఫస్ట్ వస్తుందని పాఠశాల అధికారులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు తమ వద్ద ఒక చిన్న టీవీ ఉందని.. కానీ మూడు నెలలుగా అది రిపేర్‌లో ఉందని తెలిపారు. లాక్డౌన్ కారణంగా గత మూడు నెలలుగా తమకు పని లేదని.. అందువల్లే టీవీని బాగు చేయించలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ, రాహుల్ గాంధీ ఈ ఘటనపై స్పందించారు. బాలిక మరణం తనను కలచి వేసిందని పేర్కొన్నారు. అంతేకాక నియోజకవర్గంలో టీవీ, స్మార్ట్ఫోన్లు అందుబాటులో లేని కుటుంబాలకు తాను సాయం చేస్తానని తెలిపారు. వారి జాబితాను ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు రాసిన లేఖలో రాహుల్ కోరారు. -
హైక్లాస్ గురుకులాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు కొత్త అంశాలను ఒకేసారి బోధించేందుకు అత్యాధునికమైన వర్చ్యువల్ క్లాస్‌రూంల వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ వర్చ్యువల్ క్లాస్‌రూంల విధానంలో పాఠ్యాంశాలు బోధించడమే కాకుండా.. వివిధ జిల్లాల్లోని విద్యార్థులతో ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా మాట్లాడే అవకాశముంటుంది. అలాగే గురుకుల పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో.. తాడేపల్లిలోని కంట్రోల్ కేంద్రం నుంచే ఎప్పటికప్పుడు తనిఖీ చేసే అవకాశం ఏర్పడింది. 105 గురుకులాల్లో వర్చ్యువల్ క్లాస్రూంలు రాష్ట్రంలో గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో మొత్తం 189 విద్యాసంస్థల్ని నిర్వహిస్తుండగా.. ప్రస్తుతం 105 గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో వర్చ్యువల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేశారు. గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయం నుంచి వర్చ్యువల్ క్లాస్ రూంలతో మాట్లాడేందుకు స్టూడియో నిర్మించారు. ఈ స్టూడియో నుంచే రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఒకేసారి పాఠాలు బోధించడంతో పాటు.. నేరుగా మాట్లాడవచ్చు. రాష్ట్రంలోని విశాఖపట్నం, యర్రగొండపాలెం, కురుపాం, పార్వతీపురం, శ్రీకాళహస్తి, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, తనకల్లు తదితర ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి, అధికారులు మాట్లాడారు. వసతులు, విద్యా బోధనపై మంత్రి స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ విద్యార్థుల రక్షణ, విద్యాసంస్థల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా పర్యవేక్షణ కోసం రాష్ట్రంలోని గిరిజన విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పాఠశాలల్లో నాలుగు కెమెరాలు అమర్చినట్లు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ పి.రంజిత్ బాషా వెల్లడించారు. ఈ కెమెరాల సాయంతో పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహారం, ఇతర వసతుల్ని, విద్యార్థుల భద్రతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది. సీసీ కెమెరాల ఏర్పాటుతో విద్యాసంస్థల్లోని బాలికలకు రక్షణ ఉంటుందని, క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడే అవకాశముంటుందని రంజిత్ బాషా పేర్కొన్నారు. ఈ కెమెరాలను క్షేత్రస్థాయిలో ఆపేందుకు వీలులేకుండా తాడేపల్లిలోని కమాండ్ కంట్రోల్ యూనిట్ ఎప్పటికప్పుడు నియంత్రిస్తుంది. విద్యాసంస్థల్లోని ఆర్థిక లావాదేవీలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేందుకు, టీచర్లు, విద్యార్థుల హాజరును నిర్ధారించుకొని ఆ మేరకు సరుకులు, ఇతర వస్తువులు విడుదల చేయడానికి ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. -
‘విద్యార్థుల ప్రగతే టీచర్లకు అవార్డులు’
సాక్షి, విజయవాడ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఉత్తమ ఉపాధ్యాయులను గురువారం ఏపీ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి సన్మానించారు. ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ లెక్చరర్ల సుదీర్ఘ సమస్యను పరిష్కరించి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించిన సందర్బంగా మంత్రి శ్రీవాణిని జూనియర్ కళాశాలల అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి గిరిజన విద్యా సంస్థల్లో వర్చువల్ క్లాస్ రూములను, కేంద్రీకృత సీసీ కెమెరాల వ్యవస్థను ప్రారంభించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 105 గిరిజన విద్యాసంస్థల్లో వర్చువల్ క్లాస్ రూములు ప్రారంభమైయ్యాయి. విద్యకు, ఉపాధ్యాయులకు జగన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. తొమ్మిది ప్రమాణాలకు అనుగుణంగా గిరిజన విద్యాసంస్థల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పిల్లలు సాధించిన ప్రగతినే టీచర్లు తమ అవార్డులుగా భావించాలని, మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. -
మల్టీపర్పస్ వర్చువల్ క్లాస్రూమ్ ప్రారంభం
ముంబై: యూనివర్సిటీ విద్య ఇక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో లక్షలాది మంది విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. ముంబై యూనివర్సిటీలో శనివారం బహుళార్ధసార్థక వాస్తవిక తరగతి గది (ఎంవీసీ)ని గవర్నర్ శంకర్ నారాయణన్ ప్రారంభించారు. హార్వర్డ్ యూనివర్సిటీ తరహాలో పని చేసే ఈ ఎంవీసీ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులు సైతం నిపుణులైన బోధకుల నుంచి ప్రత్యేక ప్రసంగాలు వినవచ్చు. వర్క్‌షాప్‌లు, సదస్సులను తిలకించవచ్చు. ఈ సందర్భంగా గవర్నర్ కె.శంకర్ నారాయణన్ మాట్లాడుతూ ప్రపంచస్థాయి వర్సిటీల సరసన ముంబై యూనివర్సిటీ ఉండేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీనికోసం కాలపరిమితిని నిర్దేశించుకొని తగిన రోడ్‌మ్యాప్ ద్వారా లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేయాలని వైస్ చాన్సలర్ రాజన్ వెలుకర్‌కు సూచించారు. ప్రపంచంలోని టాప్ 200 వర్సిటీల్లో భారత్‌లోని ఒక్క వర్సిటీ కూడా లేకపోవడం విచారంగా ఉందన్నారు. అయితే ఈ అంశంలో ముంబై వర్సిటీ సరికొత్త చరిత్ర సృష్టించాలని ఆకాంక్షించారు. ‘మన విద్యార్థులు అమెరికా, జర్మనీలోని యూనివర్సిటీలకు ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. అక్కడి స్థాయి విద్యను మనం ఎందుకు అందించలేకపోతున్నామ’ని ఆయన ప్రశ్నించారు. దీన్ని అధిగమించేందుకు క్యాంపస్ అభివృద్ధితో పాటు తాజా కోర్సులను ఎప్పటికప్పుడు విద్యార్థులకు పరిచయం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ అధ్యాపక బృందం లేకపోవడంతోనే ప్రపంచ ర్యాంకింగ్‌లో భారత వర్సిటీలకు స్థానం లభించడం లేదన్నారు. ఆధునిక సాంకేతిక నిపుణులైన అధ్యాపకులు రానంతవరకు మన వర్సిటీలు ప్రపంచస్థాయి ర్యాంకింగ్‌ను దక్కించుకోలేవని తెలిపారు. ఎంవీసీ లాంటివి అమలుచేసేందుకు రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం అందుతుందన్నారు. ఈ వర్చువల్ క్లాస్రూమ్ ఉపాధ్యాయుల శిక్షణకు, నైపుణ్యాన్ని మెరుగుపరచుకునేందుకు, పనిచేసే వారికి సాయంత్రం వేళలో విద్యను అందించేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ తరహాలో... రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థుల చెంతకు అన్లైన్ చదువు పాఠాలు చేరేలా ముంబై యూనివర్సిటీ సరికొత్త పంథాను ఎంచుకుంది. హార్వర్డ్ యూనివర్సిటీ స్థాయిలో కొత్త మల్టీపర్పస్ వర్చువల్ క్లాస్రూమ్ (ఎంవీసీ)ను పరిచయం చేసింది. నిపుణుల ప్రత్యేక బోధనలు, చర్చాగోష్టి, సదస్సులను ఎంవీసీ సహాయంతో ముఖాముఖి నిర్వహించే వెసులుబాటును కల్పించింది. దీనివల్ల లెక్చరర్ల కొరత సమస్యకు కూడా పరిష్కారం లభించనుంది. పరిమిత వనరులతో ఆయా అంశాలపై విద్యార్థులు పట్టు సాధించుకునే అవకాశం ఉంది. ఎంవీసీలో భవిష్యత్‌లో అన్లైన్ కోర్సులను కూడా చేర్పించే అవకాశముంది. ఇప్పటికే ఈ వర్సిటీకి చెందిన 700 అనుబంధ కళాశాలల్లో 420 కళాశాలలు ఈ డిజిటల్ వ్యవస్థ కోసం పేరును నమోదుచేసుకున్నాయి. అయితే ఏ-వ్యూ వర్చువల్ లెర్నింగ్ టూల్‌ను అమృతా యూనివర్సిటీ డిజైన్ చేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్య శాఖ మంత్రి డీపీ సావంత్, ముంబై వర్సిటీ వైస్ చాన్సలర్ నరేశ్ చంద్ర, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.