Internships
-
నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్: టెక్ సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లను మించి .!
న్యూఢిల్లీ: ఇండియాలో పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లు అంతగా పాపులర్ కాలేదు. చాలావరకు నామమాత్రపు చెల్లింపులే ఉంటాయి. చెప్పాలంటే ఒక్కోసారి ఇంటర్న్లే కంపెనీకి తిరిగి చెల్లించాల్సి అవసరం కూడా ఉంది. కానీ అదృష్టవశాత్తూ ప్రతీచోటా ఇలాంటి పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక సాంకేతిక సంస్థలు ఇంటర్న్‌కి ఒక సగటు భారతీయ ఉద్యోగి జీతం కంటే మంచి వేతనాన్ని అందిస్తాయి. ముఖ్యంగా దేశీయ టెక్ దిగ్గజాల సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లకు లభించే వేతనం కంటే ఎక్కువ చెల్లించే కంపెనీలున్నాయి. కంపెనీలను సమీక్షించే ప్లాట్‌ఫారమ్ గ్లాస్‌డోర్ అత్యధిక చెల్లింపు ఇంటర్న్షిప్స్ ఇచ్చే టాప్ 25 సంస్థల జాబితాను సిద్ధం చేసింది. విద్యార్థులు, కొత్త గ్రాడ్యుయేట్లకు, ఇంటర్న్‌లకు టాప్ డాలర్‌ను చెల్లించే కంపెనీలను గుర్తించడంలో సహాయపడటానికి అత్యధికంగా చెల్లించే 25 కంపెనీలకు గ్లాస్‌డోర్ ఈ ర్యాంకులు ఇచ్చింది. ముఖ్యంగా గ్లోబల్‌గా అనేక టెక్, ఇతర కంపెనీల్లో లేఆఫ్‌లు ఆందోళన రేపుతున్న తరుణంలో ఇంటర్న్‌షిప్ ద్వారా అడుగుపెట్టాలని ఆశించే వారికిఇది ఊరటనిస్తుందని కంపెనీ తెలిపింది. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) గ్లాస్‌డోర్ నివేదిక ప్రకారం, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన డిజిటల్ చెల్లింపుల సంస్థ స్ట్రైప్ ఈ జాబితాలో టాప్‌లో నిలిచింది. ఇంటర్న్‌కు నెలవారీ రూ. 7.40 లక్షల (9,064 డాలర్లు ) స్టైఫండ్‌ను ఆఫర్ చేసింది. అంటే ఒక ఇంటర్న్ ఏడాదికి రూ. 81 లక్షల కంటే ఎక్కువ సంపాదించగలడు. మెటా, స్నాప్, టిక్‌టాక్ వంటి సామాజిక దిగ్గజాల నుండి స్ట్రైప్, కాయిన్‌బేస్ వంటి ఫిన్‌టెక్ కంపెనీల వరకు, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజాల దాకా ఈ జాబితాలో 16 టెక్ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇంకా సిటీ, క్యాపిటల్ వన్ వంటి ఐదు ఫైనాన్స్ కంపెనీలు, బెయిన్ అండ్ కంపెనీ, మెకిన్సే సహా మూడు కన్సల్టింగ్ సంస్థలు, ఏకైక సంస్థ ఆటో కంపెనీ రివియన్ ఉండటం విశేషం. (వినియోగదారులకు మరో షాక్: వీటి ధరలు త్వరలోనే పెరగనున్నాయ్!) -
కొలువుల చదువులు.. డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం పొందేలా
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వాటి ఫలాలు విద్యార్థులకు అందేలా కార్యాచరణ రూపొందించారు. డిగ్రీ పూర్తి చేసి కాలేజీల నుంచి బయటకు వచ్చే విద్యార్థులు వెంటనే ఉద్యోగావకాశాలను అందుకొనేలా పూర్తిస్థాయి సామర్థ్యాలు, నైపుణ్యాలతో తీర్చిదిద్దేలా ప్రణాళికలను అమల్లోకి తెస్తున్నారు. డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులతో పాటు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయించారు. మూడేళ్ల డిగ్రీలో చేరే విద్యార్థులు కూడా పదినెలలు ఇంటర్న్‌షిప్ చేసేలా కోర్సులను రూపొందించారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో నైపుణ్యం పొందేలా క్షేత్రస్థాయిలో శిక్షణ ఇప్పిస్తారు. చదవండి: AP పటిష్టంగా ఫౌండేషన్.. మూడు దశల్లో స్కూళ్ల మ్యాపింగ్ ప్రక్రియ ఇందుకు రాష్ట్రంలోని అన్ని కాలేజీలను వివిధ పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న 27,119 సంస్థలతో అనుసంధానిస్తున్నారు. విద్యార్థులు తమ కోర్సులతో సంబంధమున్న అంశాల్లో అందుబాటులో ఉన్న సంస్థలో ఇంటర్న్‌షిప్ చేయవచ్చు. ఇందుకు ఉన్నత విద్యామండలి పోర్టల్‌లోని లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్)లో వీటిని పొందుపరుస్తారు. జిల్లాలవారీగా ఈ సంస్థలను ఎంపిక చేసి జాబితాను వెబ్సైట్లో పెడతారు. జిల్లాల్లో ఆయా సంస్థలతో సమన్వయం చేసేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. ఇందులో వర్సిటీల ఉపకులపతులు, కొన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు ముందుగానే జిల్లాలోని కంపెనీలను సంప్రదించి, ఇంటర్న్‌షిప్‌కు ఏర్పాట్లు చేస్తాయి. ఇంటర్న్‌షిప్ కోసం విద్యార్థులు కోఆర్డినేటర్ల సహకారంతో ఆయా సంస్థలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ సంస్థలు వాటికి అవసరమైన సంఖ్యలో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లో అవకాశం కల్పిస్తాయి. చదవండి: మన టాయిలెట్స్‌లాగే బడిలోనివీ శుభ్రంగా ఉండాలి.. సీఎం జగన్ ట్వీట్ మైక్రో నుంచి మెగా సంస్థల వరకు.. ఇంటర్న్‌షిప్‌కోసం రాష్ట్రంలోని మైక్రో స్థాయి నుంచి మెగా పరిశ్రమల వరకు ఉన్నత విద్యా మండలి గుర్తించింది. ఇందులో మాన్యుఫాక్చరింగ్, సర్వీసు విభాగాల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో మంచి పనితీరు కనబరిచే వారికి ఆ కంపెనీలే ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్న్‌షిప్ ద్వారా ఆయా సంస్థలకు కూడా మానవవనరులు అందుబాటులోకి వస్తాయి. ఉభయ ప్రయోజనకరంగా ఈ ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. మరోపక్క విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని, బాధ్యతను పెంపొందించడానికి ఉన్నత విద్యా మండలి కమ్యూనిటీ ప్రాజెక్టులను సిద్ధం చేసింది. సమాజంపై విద్యార్థులకు అవగాహన పెరగడంతో పాటు అక్కడి సమస్యలకు తాము నేర్చుకున్న విజ్ఞానం ద్వారా పరిష్కారాలను అన్వేషించేలా చేస్తారు. వీటి ద్వారా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సమస్యలను అధిగమించే తత్వం ఏర్పడుతుంది. ఇదో విప్లవాత్మక కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి చదువు పూర్తిచేసి బయటకు వచ్చేనాటికి వారిని సమగ్ర నైపుణ్యాలతో తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను చేపట్టాం. పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌తో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా మన విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొనేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళికను అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే వివిధ పరిశ్రమలతో కాలేజీలను అనుసంధానిస్తున్నాం. రాష్ట్రస్థాయి కమిటీతో పాటు జిల్లాల స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేశారు. కాలేజీలు, పరిశ్రమలు, బిజినెస్ ఎంటర్ప్రైజర్లను అనుసంధానం చేసి విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తాం. చదువు పూర్తయ్యేసరికి విద్యార్థి పూర్తి నైపుణ్యం సాధించేలా చేస్తాం. ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక కార్యక్రమం. -రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ఇంటర్న్‌షిప్ కోసం వివిధ జిల్లాల్లో గుర్తించిన కొన్ని ముఖ్యమైన సంస్థలు ► 400 ఎండబ్ల్యూ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏపీ జెన్కో, తలారిచెరువు, అనంతపురం ►హ్యుందాయ్ ట్రాన్సిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కియా మోటార్స్ అనంతపురం ►విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ పిస్టన్ రాడ్ ప్లాంట్ అనంతపురం ►అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్, కరకంబాడి, చిత్తూరు ►కోల్గేట్ పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ ►ఎక్స్‌ట్రాన్ సర్వర్స్ మాన్యుఫాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు ►హీరో మోటోకార్ప్ లిమిటెడ్, చిత్తూరు ► గుంటూరు టెక్స్టైల్ పార్కు, గుంటూరు ►జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్, గుంటూరు ►మైహోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, గుంటూరు ►సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, గుంటూరు ► ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్, ఇబ్రహీంపట్నం, కృష్ణా ► ది కేసీపీ లిమిటెడ్ సిమెంటు యూనిట్, కృష్ణా ►రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, కృష్ణా ►ది రామ్‌కో సిమెంట్స్ లిమిటెడ్, కృష్ణా ►గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, కర్నూలు ►జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్, కర్నూలు ►ఎస్బీజీ క్లింటెక్ ప్రాజెక్టు కో ప్రైవేట్ లిమిటెడ్. కర్నూలు ►టీజీవీ స్రాక్ లిమిటెడ్, కర్నూలు ►అమ్మన్ ట్రై స్పాంజ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, నెల్లూరు ►హిందుస్తాన్ నేషనల్ గ్లాస్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నెల్లూరు ►ఎన్జీసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నెల్లూరు ►సెంబ్‌కార్ప్ ఎనర్జీ లిమిటెడ్, నెల్లూరు ►అరబిందో ఫార్మా లిమిటెడ్, శ్రీకాకుళం ►డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, శ్రీకాకుళం ►శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, శ్రీకాకుళం ►స్మార్ట్‌కెమ్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రీకాకుళం ► డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, విశాఖపట్నం ►హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, విశాఖపట్నం ►ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ విశాఖపట్నం ►విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం ► మైలాన్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, విజయనగరం ► శారదా మెటల్స్ అండ్ అల్లాయిస్ లిమిటెడ్, విజయనగరం ►ఎస్ఎంఎస్ ఫార్మాçస్యూటికల్స్ లిమిటెడ్, విజయనగరం ►నవభారత్ లిమిటెడ్, పశ్చిమగోదావరి ► పాండురంగ ఎనర్జీ సిస్టమ్ ప్రైవేటు లిమిటెడ్, పశ్చిమ గోదావరి ►వీఈఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, పశ్చిమ గోదావరి ►ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, వైఎస్సార్ ►ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్, వైఎస్సార్ కడప ► టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్, వైఎస్సార్ కడప ►మిడ్వెస్ట్ నియోస్టోన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకాశం ►జేసీ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకాశం ►కల్లామ్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, ప్రకాశం ►పెరల్ డిస్టిలరీ లిమిటెడ్, ప్రకాశం ఇంజనీరింగ్ విద్యార్థులకు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్లులు కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ 1.వ్యవసాయంలో నేల ఆరోగ్యం , పంట రీసైక్లింగ్ కోసం సిఫార్సు చేసే వ్యవస్థ అభివృద్ధి 2.వ్యవసాయం కోసం స్ప్రింక్లర్లలో అధునాతన సాంకేతికతను ఉపయోగించి స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు 3.అంటువ్యాధులకు సంబంధించి కంప్యూటర్ సహాయక ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ రూపకల్పన సివిల్ ఇంజనీరింగ్ 1.ల్యాండ్ స్లైడ్ల కోసం ప్రత్యేకంగా జియోసింథటిక్స్ ఉపయోగించి నేల స్థిరీకరణ 2.జీఐఎస్ ఉపయోగించి భూగర్భ జలాల గుర్తింపు 3.పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి నివాస భవనంలో భూఉష్ణ శక్తి వినియోగం మెకానికల్ ఇంజనీరింగ్ 1.అగ్రికల్చరల్ పెస్టిసైడ్ స్ప్రేయర్ – కోవిడ్ శానిటైజేషన్ డ్రోన్ 2.గ్రామీణ ప్రాంతాల్లో వంట కోసం బయోగ్యాస్ కంప్రెషన్ – స్టోరేజ్ సిస్టమ్ 3.వ్యవసాయం కోసం స్కాచ్ యోక్ మెకానిజం ఉపయోగించి డ్యూయల్ సైడ్ వాటర్ పంపింగ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ 1.ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా స్మార్ట్ అగ్రికల్చర్ విధానం, మాయిశ్చర్ హ్యుమిడిటీని గుర్తించడం 2.ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్మార్ట్ రెస్క్యూ సిస్టమ్ 3.స్మార్ట్ మాస్క్ – సామాజిక దూర హెచ్చరిక ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 1.వ్యవసాయ అవసరాల కోసం నేలలో నీటిశాతం, తేమను కనుగొనేందుకు సోలార్ పవర్‌తో నడిచే ఆటో ఇరిగేషన్ సిస్టమ్ వినియోగం 2.మెరుగైన ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఇ హెల్త్ కేర్ కంప్యూటింగ్ విధానం అనుసరణ 3.జిగ్బీ ఆధారిత సోలార్ పవర్ ఫారెస్ట్ ఫైర్ డిటెక్షన్ కంట్రోల్ సిస్టమ్ డిగ్రీ నాన్‌ప్రొఫెషనల్ విద్యార్థుల కోసం డిగ్రీ నాన్ ప్రొఫెషనల్ విద్యార్ధులకు కూడా వివిధ అంశాల్లో కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులను ఉన్నత విద్యామండలి నిర్వహించనుంది. ఆర్ట్స్ విద్యార్థులకు 51, కామర్స్ విద్యార్థులకు 50, సైన్సు విద్యార్థులకు 38 ప్రాజెక్టులు ఉంటాయి. విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందించడం, ఉమెన్, యూత్ ఎంపవర్‌మెంటుతో పాటు వివిధ క్యాంపుల నిర్వహణ అంశాలతో ఈ ప్రాజెక్టులను రూపొందించారు. -
కొలువుల చదువులు.. నైపుణ్యాభివృద్ధికి ఇంటర్న్‌షిప్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వాటి ఫలాలు విద్యార్థులకు అందేలా కార్యాచరణ రూపొందించారు. డిగ్రీ పూర్తి చేసి కాలేజీల నుంచి బయటకు వచ్చే విద్యార్థులు వెంటనే ఉద్యోగావకాశాలను అందుకొనేలా పూర్తిస్థాయి సామర్థ్యాలు, నైపుణ్యాలతో తీర్చిదిద్దేలా ప్రణాళికలను అమల్లోకి తెస్తున్నారు. డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులతో పాటు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయించారు. మూడేళ్ల డిగ్రీలో చేరే విద్యార్థులు కూడా పదినెలలు ఇంటర్న్‌షిప్ చేసేలా కోర్సులను రూపొందించారు. విద్యార్థులకు పూర్తిస్థాయిలో నైపుణ్యం పొందేలా క్షేత్రస్థాయిలో శిక్షణ ఇప్పిస్తారు. ఇందుకు రాష్ట్రంలోని అన్ని కాలేజీలను వివిధ పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న 27,119 సంస్థలతో అనుసంధానిస్తున్నారు. విద్యార్థులు తమ కోర్సులతో సంబంధమున్న అంశాల్లో అందుబాటులో ఉన్న సంస్థలో ఇంటర్న్‌షిప్ చేయవచ్చు. ఇందుకు ఉన్నత విద్యామండలి పోర్టల్‌లోని లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్)లో వీటిని పొందుపరుస్తారు. జిల్లాలవారీగా ఈ సంస్థలను ఎంపిక చేసి జాబితాను వెబ్సైట్లో పెడతారు. జిల్లాల్లో ఆయా సంస్థలతో సమన్వయం చేసేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. ఇందులో వర్సిటీల ఉపకులపతులు, కొన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు ముందుగానే జిల్లాలోని కంపెనీలను సంప్రదించి, ఇంటర్న్‌షిప్‌కు ఏర్పాట్లు చేస్తాయి. ఇంటర్న్‌షిప్ కోసం విద్యార్థులు కోఆర్డినేటర్ల సహకారంతో ఆయా సంస్థలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ సంస్థలు వాటికి అవసరమైన సంఖ్యలో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లో అవకాశం కల్పిస్తాయి. మైక్రో నుంచి మెగా సంస్థల వరకు.. ఇంటర్న్‌షిప్‌కోసం రాష్ట్రంలోని మైక్రో స్థాయి నుంచి మెగా పరిశ్రమల వరకు ఉన్నత విద్యా మండలి గుర్తించింది. ఇందులో మాన్యుఫాక్చరింగ్, సర్వీసు విభాగాల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో మంచి పనితీరు కనబరిచే వారికి ఆ కంపెనీలే ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్న్‌షిప్ ద్వారా ఆయా సంస్థలకు కూడా మానవవనరులు అందుబాటులోకి వస్తాయి. ఉభయ ప్రయోజనకరంగా ఈ ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. మరోపక్క విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని, బాధ్యతను పెంపొందించడానికి ఉన్నత విద్యా మండలి కమ్యూనిటీ ప్రాజెక్టులను సిద్ధం చేసింది. సమాజంపై విద్యార్థులకు అవగాహన పెరగడంతో పాటు అక్కడి సమస్యలకు తాము నేర్చుకున్న విఙ్ఙానం ద్వారా పరిష్కారాలను అన్వేషించేలా చేస్తారు. వీటి ద్వారా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. సమస్యలను అధిగమించే తత్వం ఏర్పడుతుంది. ఇంటర్న్‌షిప్ కోసం జిల్లాల వారీగా ఎంపిక చేసిన సంస్థలు జిల్లా పేరు మైక్రో స్మాల్ మీడియం లార్జ్ మెగా మొత్తం అనంతపురం 1,631 962 65 107 14 2,779 చిత్తూరు 1,453 1,443 107 232 34 3,269 తూర్పు గోదావరి 1,031 971 67 150 16 2,235 గుంటూరు 1,436 1,252 43 67 7 2,805 కృష్ణా 1,134 1,018 77 131 5 2,365 కర్నూలు 619 524 28 59 11 1,241 ప్రకాశం 1,118 1,813 35 45 1 3,012 నెల్లూరు 726 688 58 121 15 1,608 శ్రీకాకుళం 778 603 16 30 11 1,438 విశాఖపట్నం 788 1,041 139 317 36 2,321 విజయనగరం 543 376 17 43 6 985 పశ్చిమ గోదావరి 832 794 57 87 4 1,774 వైఎస్సార్ కడప 799 441 9 29 9 1,287 మొత్తం 12,888 11,926 718 1,418 169 27,119 వీటిలో మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్ విభాగాల సంఖ్య ఇలా కేటగిరీ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీస్ మైక్రో 11,510 1,378 స్మాల్ 10,169 1,757 మీడియం 569 149 లార్జ్ 1,191 227 మెగా 144 25 ఇంటర్న్‌షిప్ కోసం వివిధ జిల్లాల్లో గుర్తించిన కొన్ని ముఖ్యమైన సంస్థలు 400 ఎండబ్ల్యూ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏపీ జెన్కో, తలారిచెరువు, అనంతపురం హ్యుందాయ్ ట్రాన్సిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కియా మోటార్స్ అనంతపురం విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ పిస్టన్ రాడ్ ప్లాంట్ అనంతపురం అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్, కరకంబాడి, చిత్తూరు కోల్గేట్ పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ ఎక్స్‌ట్రాన్ సర్వర్స్ మాన్యుఫాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు హీరో మోటోకార్్ప లిమిటెడ్, చిత్తూరు గుంటూరు టెక్స్టైల్ పార్కు, గుంటూరు జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్, గుంటూరు మైహోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, గుంటూరు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, గుంటూరు ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్, ఇబ్రహీంపట్నం, కృష్ణా ది కేసీపీ లిమిటెడ్ సిమెంటు యూనిట్, కృష్ణా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, కృష్ణా ది రామ్‌కో సిమెంట్స్ లిమిటెడ్, కృష్ణా గ్రీన్కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, కర్నూలు జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్, కర్నూలు ఎస్బీజీ క్లింటెక్ ప్రాజెక్టు కో ప్రైవేట్ లిమిటెడ్. కర్నూలు టీజీవీ స్రాక్ లిమిటెడ్, కర్నూలు అమ్మన్ ట్రై స్పాంజ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, నెల్లూరు హిందుస్తాన్ నేషనల్ గ్లాస్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నెల్లూరు ఎన్జీసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నెల్లూరు సెంబ్కార్్ప ఎనర్జీ లిమిటెడ్, నెల్లూరు అరబిందో ఫార్మా లిమిటెడ్, శ్రీకాకుళం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, శ్రీకాకుళం శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, శ్రీకాకుళం స్మార్ట్‌కెమ్ టెక్నాలజీస్ లిమిటెడ్, శ్రీకాకుళం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, విశాఖపట్నం హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, విశాఖపట్నం ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ విశాఖపట్నం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం మైలాన్ లేబొరేటరీస్ లిమిటెడ్, విజయనగరం శారదా మెటల్స్ అండ్ అల్లాయిస్ లిమిటెడ్, విజయనగరం ఎస్ఎంఎస్ ఫార్మాస్యుటికల్స్ లిమిటెడ్, విజయనగరం నవభారత్ లిమిటెడ్, పశ్చిమగోదావరి పాండురంగ ఎనర్జీ సిస్టమ్ ప్రయివేటు లిమిటెడ్, పశ్చిమ గోదావరి వీఈఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, పశ్చిమ గోదావరి ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, వైఎస్సార్ కడప ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్, వైఎస్సార్ కడప టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్, వైఎస్సార్ కడప మిడ్వెస్ట్ నియోస్టోన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకాశం జేసీ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకాశం కల్లామ్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, ప్రకాశం పెరల్ డిస్టిలరీ లిమిటెడ్, ప్రకాశం ఇంజినీరింగ్ విద్యార్థులకు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్లులు కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ 1. వ్యవసాయంలో నేల ఆరోగ్యం , పంట రీసైక్లింగ్ కోసం సిఫార్సు చేసే వ్యవస్థ అభివృద్ధి 2. వ్యవసాయం కోసం స్ప్రింక్లర్లలో అధునాతన సాంకేతికతను ఉపయోగించి స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు 3. అంటువ్యాధులకు సంబంధించి కంప్యూటర్ సహాయక ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ రూపకల్పన ------------ సివిల్ ఇంజనీరింగ్ 1. ల్యాండ్ స్లైడ్ల కోసం ప్రత్యేకంగా జియోసింథటిక్స్ ఉపయోగించి నేల స్థిరీకరణ 2. జీఐఎస్ ఉపయోగించి భూగర్భ జలాల గుర్తింపు 3. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి నివాస భవనంలో భూఉష్ణ శక్తి వినియోగం -------------- మెకానికల్ ఇంజనీరింగ్ 1. అగ్రికల్చరల్ పెస్టిసైడ్ స్ప్రేయర్ – కోవిడ్ శానిటైజేషన్ డ్రోన్ 2. గ్రామీణ ప్రాంతాల్లో వంట కోసం బయోగ్యాస్ కంప్రెషన్ - స్టోరేజ్ సిస్టమ్ 3. వ్యవసాయం కోసం స్కాచ్ యోక్ మెకానిజం ఉపయోగించి డ్యూయల్ సైడ్ వాటర్ పంపింగ్ సిస్టమ్ ------------ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ 1. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా స్మార్ట్ అగ్రికల్చర్ విధానం, మాయిశ్చర్ హ్యుమిడీటీని గుర్తించడం 2. ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్మార్ట్ రెస్క్యూ సిస్టమ్ 3. స్మార్ట్ మాస్క్ – సామాజిక దూర హెచ్చరిక --------------- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 1. వ్యవసాయ అవసరాల కోసం నేలలో నీటిశాతం, తేమను కనుగొనేందుకు సోలార్ పవర్‌తో నడిచే ఆటో ఇరిగేషన్ సిస్టమ్ వినియోగం 2. మెరుగైన ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఇ హెల్త్ కేర్ కంప్యూటింగ్ విధానం అనుసరణ 3. జిగ్బీ ఆధారిత సోలార్ పవర్ ఫారెస్ట్ ఫైర్ డిటెక్షన్ కంట్రోల్ సిస్టమ్ డిగ్రీ నాన్‌ప్రొఫెషనల్ విద్యార్థుల కోసం డిగ్రీ నాన్ ప్రొఫెషనల్ విద్యార్ధులకు కూడా వివిధ అంశాల్లో కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులను ఉన్నత విద్యామండలి నిర్వహించనుంది. ఆర్ట్స్ విద్యార్థులకు 51, కామర్స్ విద్యార్థులకు 50, సైన్సు విద్యార్థులకు 38 ప్రాజెక్టులు ఉంటాయి. విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందించడం, ఉమెన్, యూత్ ఎంపవర్‌మెంటుతో పాటు వివిధ క్యాంపుల నిర్వహణ అంశాలతో ఈ ప్రాజెక్టులను రూపొందించారు. ఇదో విప్లవాత్మక కార్యక్రమం: రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి చదువు పూర్తిచేసి బయటకు వచ్చేనాటికి వారిని సమగ్ర నైపుణ్యాలతో తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను చేపట్టాం. పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌తో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా మన విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొనేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళికను అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే వివిధ పరిశ్రమలతో కాలేజీలను అనుసంధానిస్తున్నాం. రాష్ట్రస్థాయి కమిటీతో పాటు జిల్లాల స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేశారు. కాలేజీలు, పరిశ్రమలు, బిజినెస్ ఎంటర్ప్రయిజర్లను అనుసంధానం చేసి విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తాం. చదువు పూర్తయ్యేసరికి విద్యార్థి పూర్తి నైపుణ్యం సాధించేలా చేస్తాం. ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక కార్యక్రమం. -
విద్యార్థులకు గుడ్‌న్యూస్ అందించిన మైక్రోసాఫ్ట్...!
సాంకేతిక నైపుణ్యాలు, ఉపాది అవకాశాలను విద్యార్థుల్లో పెంపొందించడంకోసం మైక్రోసాఫ్ట్, ఫ్యూచర్ రెడీ టాలెంట్ వర్చువల్ ఇంటర్నషిప్ ప్రోగ్రాంను లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను మైక్రోసాఫ్ట్ ఆహ్వనిస్తుంది. సుమారు 50 వేల మంది విద్యార్థులు ఇంటర్నషిప్ ప్రోగ్రాంలో పాల్గొనవచ్చును. మైక్రోసాఫ్ట్ అజూర్ , గిట్‌హబ్ టూల్స్ వంటి సాధనాలను ఉపయోగించి వ్యాపార సవాళ్లను పరిష్కరించడానికి, వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి విద్యార్థులను సిద్ధం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తెలిపింది. చదవండి: ఒక్క రోజులోనే కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు...! ఈ ప్రోగ్రాంతో విద్యార్థులు గిట్‌హబ్ స్టూడెంట్ డెవలపర్ ప్యాక్‌ను యాక్సెస్ చేయవచ్చును. ఈ ప్రోగాంలో 2021 గ్రాడ్యుయేషన్ పూర్తైన విద్యార్థులు పాల్గొనవచ్చును. వారితో పాటుగా 2022, 2023లో గ్రాడ్యుయేట్ అయ్యే విద్యార్థులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గోనేందుకు మైక్రోసాఫ్ట్ అవకాశాన్ని కల్పిస్తోంది. ఏదైనా స్పెషలైజేషన్‌ను కల్గిన విద్యార్థులు ఈ ప్రోగాంకు దరఖాస్తు చేసుకోవచ్చుని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఫ్యూచర్ రెడీ టాలెంట్ ‘https://futurereadytalent.in’ వెబ్సైట్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చును. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29. ఇంటర్న్‌షిప్ వ్యవధి సుమారు 8 వారాల పాటు ఉండనుంది. మైక్రోసాఫ్ట్ తన లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ మైక్రోసాఫ్ట్ లెర్న్ ద్వారా లెర్నింగ్ మాడ్యూల్స్ సర్టిఫికేషన్లను విద్యార్థులకు అందిస్తుంది. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వనుంది. చదవండి: Startup: దేశంలోనే ఫస్ట్ ప్లేస్..స్టార్టప్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నగరం ఇదే! -
ఇంటి నుంచే ఇంటర్న్‌షిప్
సాక్షి, అమరావతి: దేశంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతోపాటు సామాజిక దూరాన్ని పాటించాలని సూచించడంతో.. వివిధ సాంకేతిక వృత్తి విద్యా కళాశాలల్లోని విద్యార్థుల ఇంటర్న్‌షిప్ విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కొన్ని మార్పులు చేపట్టింది. ఈ మేరకు అన్ని యూనివర్సిటీలు, విద్యా సంస్థలకు ఉత్తర్వులు జారీచేసింది. వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వ సూచనలను అన్ని విద్యా సంస్థలు విధిగా పాటిస్తూనే ఇంటర్న్‌షిప్‌లను ఇంటి నుంచే కొనసా గించాలని.. ఆయా విద్యాసంస్థల బయట చేయకూడదని స్పష్టంచేసింది. అలాగే.. - వేసవి ఇంటర్న్‌షిప్‌ల కోసం విద్యార్థులు బయటి ప్రాంతాల్లో చేపట్టాల్సిన అంశాలను కూడా ఏ విద్యా సంస్థ ఇప్పుడు చేపట్టరాదు. - ఇంటి నుంచి చేయగల అంశాలను మాత్రమే విద్యార్థులకు ఇవ్వాలి. ఇంటి దగ్గర ఉంటూనే సమస్యలను పరిష్కరించేలా ఉండే అంశాలపై ప్రాజెక్టు వర్కు తరహాలో ఇంటర్న్‌షిప్‌ను ఇవ్వాలి. - ఇప్పటికే ఇంటర్న్‌షిప్‌లో భాగంగా వివిధ సంస్థల్లో చేరిన వారు దాన్ని కొనసాగించడంపై కూడా కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. - ఆయా సంస్థలు కూడా విద్యార్థులను ప్రయాణాలు చేసే, వేరే వారితో కలిసి చేసే కార్యక్రమాలు కాకుండా ఇంటి నుంచే పనిచేయడానికి వీలుగా ఇంటర్న్‌షిప్‌ను నిర్వహించాలని పేర్కొంది. - కరోనా నివారణపై కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు భిన్నంగా ఏ సంస్థ కూడా వెళ్లరాదని స్పష్టంచేసింది. ఇంటర్న్‌షిప్‌ను నిలిపేయవద్దు ఇదిలా ఉంటే.. ఇంటర్న్‌షిప్‌లను తాత్కాలికంగా నిలిపివే యాలని ఏఐసీటీఈ ఆలోచనలకు ఆదిలోనే విద్యార్థుల నుంచి అభ్యంత రాలు వ్యక్తమయ్యాయి. అనేక రౌండ్ల ఇంట ర్వ్యూలను పూర్తిచేసి ఆయా సంస్థల్లో ఇంటర్న్ షిప్‌ల అవకాశం పొందామని.. ఈ తరుణంలో వాటిని నిలిపివేయడం వల్ల తాము నష్టపోతామని పలు వురు తెలిపారు కొంతకాలం పాటు వాయిదా వేసి తిరిగి ఇంటర్న్ షిప్ కొనసాగించేం దుకు అవకాశం కల్పించాలని వేడుకు న్నారు. దీంతో ఏఐసీటీఈ ఈ ఇంటర్న్‌షిప్‌లలో మార్పులు చేస్తూ ఇంటి నుంచే విద్యార్థులు పనిచేసేలా అన్ని సంస్థలు చర్యలు చేపట్టాలని సూచిం చింది. క్షేత్రస్థాయి ఇంటర్న్‌షిప్ లను పరిస్థితిని బట్టి కొంత కాలం తరువాత నిర్వహించేలా తదుపరి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది. -
మూడేళ్ల డిగ్రీలోనే ఇంటర్న్‌షిప్
సాక్షి, అమరావతి: డిగ్రీ కోర్సుల్లో ఇప్పుడున్న మూడేళ్ల కాల వ్యవధిలోనే విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను అమలు చేసే అంశంపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. కోర్సు సమయంలోనే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. డిగ్రీ కోర్సులు అభ్యసించే విద్యార్థులలో నైపుణ్యాలు పెంచేందుకు, చదువులు పూర్తికాగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకొనేలా వారిని తీర్చిదిద్దడానికి ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ అంశాలపై ఉన్నత విద్యామండలి సిలబస్ రివిజన్ కమిటీ ద్వారా కసరత్తు చేపట్టింది. మంగళవారం ఈ కమిటీ మరోసారి సమావేశమైంది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె.రామమోహనరావు, సిలబస్ రివిజన్ కమిటీ ఛైర్మన్ ప్రొఫసర్ రాజారామిరెడ్డి, అకడమిక్ ఆఫీసర్ డాక్టర్ బీఎస్ సెలీనా, ఇతర సభ్యులు పాల్గొన్నారు. సిలబస్, ఇంటర్న్‌షిప్.. ఏయే వ్యవధుల్లో వీటిని నిర్వహించాలన్న దానిపై చర్చించారు. - చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) విధానంలో సిలబస్‌లో చేయాల్సిన మార్పులపైనా ఉన్నత విద్యా మండలి దృష్టి సారించింది. - మూడేళ్ల డిగ్రీ కోర్సులోనే పది నెలల పాటు ఇంటర్న్‌షిప్ ఉండేలా ప్రతిపాదనలను సిద్ధం చేశారు. - మొదటి రెండేళ్లలో 10 నెలల పాటు ఆయా కోర్సుల సిలబస్ బోధన, అనంతరం 2 నెలల వేసవి సెలవుల్లో (రెండేళ్లకు కలిపి 4 నెలలు) ఇంటర్న్‌షిప్ నిర్వహిస్తారు. - మూడో ఏడాదిలో 6 నెలలపాటు కోర్సుల సిలబస్ బోధన, మిగతా 6 నెలలు ఇంటర్న్‌షిప్‌ను నిర్వహించాలన్న ప్రతిపాదనలపై చర్చించారు. - యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల డీన్లతో బుధవారం, అన్ని యూనివర్సిటీల ఉపకులపతులతో గురువారం సమావేశాలు నిర్వహించి ఉన్నత విద్యామండలి తుది నిర్ణయం తీసుకోనుంది. - కొత్తగా రూపొందించిన 25 మార్కెట్ ఓరియంటెడ్ కోర్సులను రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, అటానమస్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్నారు. - ఈ కోర్సులను అమలు చేసేందుకు అనుమతిస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర మంగళవారం జీఓ నం.34 విడుదల చేశారు. -
కోర్సు వారమే.. ఇంజనీరింగ్ విద్యార్థుల ఆసక్తి
సాక్షి, సోమాజిగూడ: సమాచార రంగంలో విప్లవాత్మకమైన మార్పులు ఎన్నివచ్చినా..హ్యామ్ రేడియోకి ఆదరణ తగ్గలేదని చెప్పొచ్చు. ఇప్పటి తరం వారిలో చాలా మందికి హ్యామ్ రేడియో గురించి అంతగా తెలియక పోయినా..తుపాను..వరదల సమయంలో హ్యామ్ రేడియో పాత్రను మనం మరవలేము. సెల్‌ఫోన్ సిగ్నల్ లేని చోట సైతం హ్యామ్ రేడియో ప్రతినిధులు సమాచారాన్ని చేరవేస్తారు. విద్యార్హతతో సంబంధం లేకుండా 12 ఏళ్లు పైబడిన వారు ఈ కోర్సు నేర్చుకోవచ్చు. బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ప్రొసీజర్‌పై వారం పాటు నిర్వహించే కోర్సుకు పరీక్ష అనంతరం ఉత్తీర్ణత సాధించిన వారికి భారత్ ప్రభుత్వం(డీఓటీ) లైసెన్స్ మంజూరు చేస్తుంది. నామమాత్రపు ఫీజు.. ఈ కోర్సు చేయాలను కున్న వారికి వయస్సుతో సంబంధం లేదు. 12 ఏళ్లు పైబడిన వారు కోర్సును పూర్తి చేసి అమెచ్యూర్ రేడియో ఆపరేటర్ కావచ్చు. ఒకప్పుడు వీఐపీలు మాత్రమే అమెచ్యూర్ రేడియోను వినియోగించేవారు. సెల్పోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్లు లేని కాలంలో అత్యాధునిక వైర్లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థగా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతమున్న కమ్యూనికేషన్ రంగానికి హ్యామ్ రేడియో మూలమని చెప్పవచ్చు. పుస్తకం విడుదల.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ అమెచ్యూర్ రేడియో వ్యవస్థాపకుడు ఎస్.సూరి దీనిపై ఆల్ ఎబౌట్ అమెచ్యూర్ రేడియో అనే పుస్తకాన్ని రచించారు. అమెచ్యూర్ రేడియో కోర్సు పట్ల ఉన్న ఉపయోగాన్ని ఆయన తన రచన ద్వారా వివరించారు. ఇటీవల జరిగిన కార్యక్రమంలో భారత్ ఉప రాష్ట్ర పతి దానిని ఆవిష్కరించినట్లు సంస్థ నిర్వాహకులు చెప్పారు. విద్యార్థులకు ఇంటర్న్షిప్గా... ♦ ఇంజినీరింగ్ ఈసీఈ విద్యార్థులు హ్యామ్ రేడియో కోర్సును ప్రాజెక్టు వర్కుగా చేస్తున్నారు. ఆయా కళాశాలలు ఇంటర్నషిప్ కోసం నగరంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అమెచ్చూర్ రేడియో కార్యాలయంలో శిక్షణ ఇపిస్తున్నారు. రాజ్‌భవన్ రోడ్డులోని ఈ కార్యాలయంలో ఎంతో మంది శిక్షణ పొంది లైసెన్సులు పొందినట్లు సంస్థ వ్యవస్థాపకుడు ఎస్.సూరి తెలిపారు. ♦ కూర్చున్న చోటనుంచే ఏదేశంవారితోనైనా మాట్లాడొచ్చు ♦ అమెచ్యూర్ ఆపరేటర్ ఏదేశంలోనున్నా కూర్చున్న చోటనుంచే వారితో మాట్లాడొచ్చు. ఎటువంటి విద్యుత్, కమ్యూనికేషన్ నెట్వర్క్ లేని ప్రాంతం నుంచి కూడా సమాచారం పంపొచ్చు. ♦ వరదలు, తుపాన్, భూకంపం వంటివి వచ్చినప్పుడు హ్యామ్ రేడియో ఎంతో ఉపయోగ పడుతోంది. ♦ అమెచ్యూర్ రేడియో అడ్వాన్స్ డిజిటల్ కమ్యూనికేషన్ నెట్ వర్క్ ద్వారా ఇంటర్నెట్ వినియోగించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 3.5 మిలియన్లకు పైగా ఉన్న హ్యామర్స్‌తో మాట్లాడుతోవచ్చు. ♦ కోర్సుపై ఆసక్తి చూపుతున్న యువత ♦ అమెచ్యూర్ (హ్యామ్) రేడియో కోర్సు పట్ల యువత ఆసక్తి చూపుతోంది. కోర్సుతో వారికి అంతగా పనిలేకున్నా. హాబీగా చేసుకుంటున్నారు. వైర్లెస్ హ్యాండ్ సెట్లు చేతపట్టి అటుఇటుగా తిరగడం అదోఫ్యాషన్గా మారింది.పోలీసు స్టేషన్లో ఉండే వైర్లెస్ సెట్ల కంటే దీని ఫ్రీక్వెన్సీ అధికమని చెప్పవచ్చు. ఉత్తి రోజుల్లో అమెచ్యూర్ ఆమరేటర్లతో మాటాత్రమే మాట్లాడుకునే వారు.. ప్రకృతి విలయ తాండవం చేసినపుడు..సమాచార వ్యవస్థ చిన్నా భిన్నమైన సమయంలో తామున్నామంటూ అమెచ్యూర్ ఆపరేటర్లు ముందుకు వచ్చి దేశ సేవలో నిమగ్నమవుతున్నారు. -
ఉద్యోగ విద్య
సాక్షి, అమరావతి: విద్యార్థులు చదువులు ముగించుకోగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేలా వారిలో నైపుణ్యాలు పెంచేందుకు రాష్ట్రంలో అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) కోర్సుల్లో అదనంగా ఒక ఏడాది ఇంటర్న్‌షిప్ (కోర్సు తదనంతర శిక్షణ) ప్రవేశపెట్టనున్నారు. ప్రతి విద్యార్థి తప్పకుండా ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు మూడేళ్ల డిగ్రీ కోర్సులో అదనంగా ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ ఉంటుందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో చేరేవారికి ఇది వర్తిస్తుందని చెప్పారు. ఇంటర్న్‌షిప్‌తో కలిపి మొత్తం కోర్సును నాలుగేళ్లపాటు అభ్యసించాలని, దీన్ని నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీగా పరిగణిస్తారని తెలిపారు. ఇంజనీరింగ్‌లో అదనంగా ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ను ప్రవేశపెట్టడంపై ఇప్పటికే ఏఐసీటీఈ లేఖ రాశామని వెల్లడించారు. ఏఐసీటీఈ నుంచి అనుమతి రాగానే ఇంజనీరింగ్‌లోనూ అదనపు ఇంటర్న్‌షిప్ ప్రారంభమవుతుందన్నారు. మొత్తం కోర్సు కాల వ్యవధి ఐదేళ్లు ఉంటుందన్నారు. ప్రస్తుతం డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సులు అభ్యసిస్తున్న వారు కూడా ఇంటర్న్‌షిప్‌కు వెళ్లేందుకు అవకాశం ఉందన్నారు. కేవలం కోర్సు మాత్రమే పూర్తి చేసి, కళాశాలల నుంచి బయటకు వెళ్తున్న విద్యార్థుల్లో సరైన నైపుణ్యాలు లేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కడం లేదని వివరించారు. అలాంటి పరిస్థితిని మార్చేస్తూ కోర్సులో భాగంగానే వారిలో నైపుణ్యాలు పెంచడానికి అదనంగా ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని పేర్కొన్నారు. తద్వారా చదువులు పూర్తి కాగానే విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందగలుగుతారని తెలిపారు. ఆన్లైన్లోనే డిగ్రీ కాలేజల్లో ప్రవేశాలు రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియను ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు ఫ్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. మెరిట్, హాజరు ఆధారంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్ మంజూరు చేయనున్నారని పేర్కొన్నారు. ప్రతి కాలేజీకి ‘న్యాక్’, ఎన్ఐఆర్ఎఫ్ గుర్తింపు తప్పనిసరి అని, ప్రమాణాలు లేని కళాశాలలను మూసివేయడం తప్పదని స్పష్టం చేశారు. అఫిలియేషన్ లేని కాలేజీలకు నోటీసులు ఇచ్చామని, లోపాలు సరిదిద్దుకోకుంటే వాటి అనుమతులు రద్దు చేస్తామన్నారు. హేమచంద్రారెడ్డి ఇంకా ఏం చెప్పారంటే... - యూజీ కోర్సుల్లో అదనంగా ఒక ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుంది. - ఇంటర్న్‌షిప్‌పై యూజీసీ, ఏఐసీటీఈకి లేఖలు రాశాం. - డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తికాగానే విద్యార్థులకు ఎగ్జిట్‌కు అవకాశమివ్వాలా? లేక ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేశాకనే ఇవ్వాలా? అన్నదానిపై సంప్రదింపులు జరుగుతున్నాయి. విద్యార్థులకు నష్టం లేనిరీతిలో త్వరలో నిర్ణయం ప్రకటిస్తాం. - డిగ్రీలో ఐదు సెమిస్టర్ల వరకు సంబందిత సబ్జెక్టుల సిలబస్ ఉంటుంది. ఆరో సెమిస్టర్లో పూర్తిగా స్కిల్స్ బోధన. తరువాత ఏడాది పాటు సంబంధిత రంగంలోని విభాగాల్లో ఇంటర్న్‌షిప్. - పారామెడికల్, లా, టీచింగ్, చార్టెడ్ అకౌంటెంట్, క్లరికల్, ఇండస్ట్రియల్.. ఇలా కోర్సును అనుసరించి ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది. - ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కు పంపిస్తారు. ఇది ప్రతి ఏటా కొనసాగుతుంది కనుక ఆయా సంస్థలకు మానవ వనరులు అందుబాటులో ఉండి మేలు జరుగుతుంది. - స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లోనూ విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఉంటుంది. - ఇంటర్న్‌షిప్‌కు సంబంధించి స్కిల్ సిలబస్ రూపొందిస్తున్నారు. అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. - స్కిల్ సబ్జెక్టు బోధనలో అధ్యాపకుల పనితీరును అసెస్మెంట్ చేస్తారు. - యూనివర్సిటీల్లో డేటాబేస్ సెంటర్ల ఏర్పాటు. - ప్రతిఏటా 3.20 లక్షల మంది ఇంటర్మీడియెట్ పూర్తిచేసి బయటకు వస్తున్నారు. కానీ.. డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మా తదితర ఉన్నత విద్యాకోర్సుల్లో 6 లక్షల సీట్లు ఉంటున్నాయి. - డిగ్రీలో 1.40 లక్షల మంది చేరుతుండగా, ఫైనల్ ఇయర్ పరీక్షలను 60 శాతం మందే రాస్తున్నారు. దీన్ని సరిదిద్దాలని ప్రొఫెసర్ బాలకృష్ణన్ నేతృత్వంలోని సంస్కరణల కమిటీ సూచించింది. - 25 శాతం కన్నా తక్కువ మంది ఉన్న కాలేజీలను మూసివేయాలని సిఫార్సు చేసింది. విద్యార్థులకు నష్టం కలగకుండా వేరే చోట చేర్పించాలని సూచించింది. - నూతన విద్యావిధానం ప్రకారం ప్రతి కాలేజీకి అక్రెడిటేషన్ తప్పనిసరిగా ఉండాలి. లేనిపక్షంలో అఫిలియేషన్ రాదు. - అన్ని కాలేజీలు న్యాక్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పొందేలా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తాం. దీనికోసం ఉన్నత విద్యామండలిలో క్వాలిటీ అసెస్మెంట్ సెల్ ఏర్పాటు చేస్తాం. - కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన గురజాడ యూనివర్సిటీ, ప్రకాశం వర్సిటీలను ఓపెన్ యూనివర్సిటీ, టీచింగ్ యూనివర్సిటీలుగా చేయాలన్న బాలకృష్ణన్ కమిటీ సూచనపై సంప్రదింపులు జరుపుతున్నాం. -
ఇంజిన్ ‘గేర్’ మార్చండి!
నువ్వు ఒక అంబాసిడర్ కారు కొనడానికి వెళ్లావు.. పక్కన బెంజ్ ఉంది.. నువ్వేం కొంటావ్.. నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్లావ్.. పక్కన ఓ పెద్ద ప్లాస్మా టీవీ ఉంది.. నువ్వేం కొంటావ్.. అక్క అంబాసిడర్.. నేను బెంజ్.. అది పోర్టబుల్.. నేను ప్లాస్మా.. అది లైఫ్‌బాయ్.. నేను లక్స్.. ఇది ఓ ఫేమస్ చిత్రంలోని సన్నివేశం.. ప్రస్తుతం ఇంజనీరింగ్ జాబ్ మార్కెట్ పరిస్థితీ ఇలాగే ఉంది.. అందరికీ కావాల్సింది స్మార్ట్ టీవీలే. కానీ మన కాలేజీలు ఇంకా ఆ పాత పోర్టబుల్ టీవీలనే ఇస్తున్నాయి.. తప్పెవరిది?? శిక్షెవరికి??చింతకింది గణేశ్ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న కోర్సులు ఇంజనీరింగ్ విద్యలో రావట్లేదు. మన దేశంలో, రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో గతంలో ప్రవేశ పెట్టిన కోర్సులు మినహా మార్కెట్ అవసరాలకు మేరకు ఒక్క కోర్సునూ ఇప్పటివరకు ప్రవేశపెట్టలేదు. దీంతో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఆశించిన మేర లభించట్లేదు. దేశవ్యాప్తంగా ఏటా 17 లక్షల మంది ఇంజనీరింగ్‌లో చేరు తుంటే, రాష్ట్రంలో 90 వేల మంది చేరుతున్నారు. రాష్ట్రంలో ఏటా 65వేల మందికి పైగా గ్రాడ్యుయేట్లు బయటకొస్తున్నా.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్న వారు 27 శాతానికి మించి ఉండట్లేదు. అందుకే ఇంజనీరింగ్ విద్యలో రీఇంజనీరింగ్ అవసరం ఏర్పడింది. మార్కెట్ అవసరాల మేరకు ఈ విద్యలో సమూల మార్పులు తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపునకు కేంద్రం చర్యలు చేపడుతున్నా.. రాష్ట్రంలో ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఇంజనీరింగ్ అంటే విలువలేని పరిస్థితి వస్తోంది. డిమాండున్న కోర్సులు అనేకమున్నా.. ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో డిమాండ్ ఉన్న కోర్సులు అనేకం ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ అండ్ రొబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మిషన్ లెర్నింగ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి అనేక కోర్సులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ప్రముఖ కంపెనీలన్నీ దృష్టిసారించాయి. సివి ల్, మెకానికల్ రంగాల్లో కూడా అనేక మార్పులొచ్చాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసింది. అయినా అందుకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యలో మార్పులు తీసుకురావడంలో యూనివర్సిటీలు విఫలమవుతున్నాయి. కంటిన్యూడ్ ఇండస్ట్రీ డిజిటైజేషన్.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీలు కంటిన్యూడ్ ఇండస్ట్రీ డిజిటైజేషన్ టెక్నాలజీని అనుసరిస్తు న్నాయి. అగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), త్రీడీ స్కానింగ్ అండ్ ప్రిటింగ్ వంటి వాటిని అమలు చేస్తున్నాయి. అయినా వీటిపై ప్రత్యేక బీటెక్ కోర్సులు లేవు. క్లౌడ్ కంప్యూటింగ్.. మెజారిటీ కంపెనీలన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీని వినియోస్తున్నాయి. ఏఆర్, వీఆర్ అండ్ ఇమ్మర్సివ్ ఆర్కిటెక్చర్ విధానం ప్లానింగ్ రంగంలో కీలకంగా మారింది. బిగ్ డేటా అనాలిసిస్, ఆర్కిటెక్చర్ రొబోట్స్, త్రీడీ ప్రింటింగ్ కూడా కీలకంగా మారాయి. ఇందులో కొన్ని వివిధ కోర్సుల్లో ఓ సబ్జెక్టుగానే ఉన్నాయి తప్ప కోర్సులుగా ఎక్కడా లేవు. మన రాష్ట్రంలో అయితే అవేవీ సబ్జెక్టుగా కూడా లేవు. ఏఐపై ప్రత్యేక దృష్టి ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. దేశంలోనే మొదటిసారిగా వచ్చే విద్యా సంవత్సరంలో ఏఐను బీటెక్ కోర్సుగా ప్రవేశ పెట్టేందుకు హైదరాబాద్ ఐఐటీ చర్యలు చేపట్టింది. దేశంలోని మరే విద్యా సంస్థ కూడా ఆ దిశగా అడుగులు వేయట్లేదు. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలే కొన్ని కోర్సులకు సర్టిఫికెట్ ఇస్తూ వాటిని నేర్చుకునేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. విద్యా సంస్థలు మాత్రం ఆ దిశగా కసరత్తు చేయట్లేదు. మైక్రోసాఫ్ట్ దేశవ్యాప్తంగా 10 పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసి ఏఐపై శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. డేటా సైన్సెస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటెలిజెంట్ క్లౌడ్ హబ్ వంటి అంశాల్లో వచ్చే మూడేళ్లలో 5 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ పరిజ్ఞానాన్ని 700కు పైగా కంపెనీలు వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న బీటెక్ డిగ్రీలతో పాటు వీటన్నింటినీ ప్రత్యేకంగా ప్రవేశపెడితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్థానిక అవసరాల మేరకు.. రాష్ట్రంలో 198 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిల్లో 95,235 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 72 వేల సీట్లే భర్తీ అవుతున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో సీట్ల భర్తీ క్రమంగా తగ్గిపోతోంది. ఏటా ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని బయటకొస్తున్న 65 వేల మంది గ్రాడ్యుయేట్లలో 27 శాతం మందికే ఉపాధి లభిస్తుండగా మిగతా వారంతా నిరుద్యోగులుగానే మిగులుతున్నారు. రాష్ట్రంలో ఫార్మా, సిమెంట్, ఐటీ, ఆటోమొబైల్, కన్స్ట్రక్షన్, మైన్స్ అండ్ మినరల్స్, టెక్స్టైల్స్ అండ్ అపెరల్స్, హార్టికల్చర్, పౌల్ట్రీ రంగాలు అధికంగా ఉన్నా వాటి అవసరాలకు అనుగుణంగా కోర్సులను రీడిజైన్ చేసి విద్యార్థులను అందించడంలో యూనివర్సిటీలు విఫలం అవుతున్నాయి. రాష్ట్రంలో నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టు పనుల్లో దాదాపు 2 వేల మందికి పైగా ఇంజనీర్లు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే పని చేస్తుండటం గమనార్హం. ఇదే సరైన సమయం.. ఇంజనీరింగ్‌లో కొత్త ఇంటర్న్‌షిప్ పాలసీని అమల్లోకి తేవాలని ఏఐసీటీఈ స్పష్టం చేసిన నేపథ్యంలో కోర్సుల రీఇంజనీరింగ్‌కు చర్యలు చేపట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ మార్కెట్‌కు అనుగుణంగా కోర్సుల రీడిజైన్‌తో పాటు స్థానికంగా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ కోర్సులను తీర్చిదిద్దాలని చెబుతున్నారు. అప్పుడే రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలకు మెరుగవుతాయని పేర్కొంటున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు 600–700 గంటల ఇంటర్న్‌షిప్‌ను ఇటీవల ఏఐసీటీఈ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో స్కిల్స్‌ను పెంపొందించడంతో పాటు పారిశ్రామిక అవసరాలపై పక్కాగా నేర్చుకునేలా ఇంటర్న్‌షిప్ అమలు చేయాలని చెబుతున్నారు. కమ్యూనికేషన్, ఇంట్రాపర్సనల్ రిలేషన్స్, ప్రాబ్లం సాల్వింగ్, డిసిషన్ మేకింగ్, టైం మేనేజ్మెంట్, సెల్ఫ్ మోటివేషన్ నైపుణ్యాలను, టెక్నికల్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్, టైమ్ మేనేజ్మెంట్, న్యూమరికల్ స్కిల్స్ కచ్చితంగా నేర్పించేలా సిలబస్‌లో మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు. ఇటీవల వెల్లడైన ఇండియా స్కిల్ రిపోర్టు–2019లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్లోనూ రెండో స్థానంలో ఉన్న తెలంగాణ విద్యార్థులు మిగతా వాటిన్నింటిలో వెనుకబడే ఉన్నారు. పట్టించుకోని వర్సిటీలు.. మార్కెట్, ఇండస్ట్రీ అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు సిలబస్‌లో మార్పులు తీసుకురావాల్సిన యూనివర్సిటీలు ఆ పని మానేశాయి. ఉస్మానియా, జేఎన్టీయూలు కేవలం కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలుగానే మిగిలిపోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. పరిశ్రమల అవసరాల మేరకు కోర్సుల రీఇంజనీరింగ్‌ను పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తామే కోర్సులను రీడిజైన్ చేసుకుని అనుమతివ్వాలని కొన్ని ప్రైవేటు కాలేజీలు కోరినా.. ‘యూనివర్సిటీ కాలేజీల్లోనే లేదు.. మీకెలా అనుమతిస్తాం’అంటూ తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. పీజీ ఇంజనీరింగ్‌లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కోర్సును ప్రవేశ పెట్టేందుకు సిలబస్ రూపొందించుకొని ఓ కాలేజీ అనుమతి కోరినా యూనివర్సిటీ ఇవ్వలేదు. దీంతో ఆ కోర్సును ఆ కాలేజీ ప్రవేశపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇంజనీరింగ్ రూపురేఖలు మార్చే కోర్సులివే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ అండ్ రొబోటిక్స్ క్లౌడ్ కంప్యూటింగ్ మిషన్ లెర్నింగ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బిగ్ డేటా అనలిటిక్స్ ఇకనైనా మారిస్తే మేలు: కృష్ణారావు, చైర్మన్, స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీ ఇకనైనా యూనివర్సిటీల తీరు మారాలి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సుల్లో మార్పులు తేవాలి. వీలైతే విద్యార్థులకు మొదటి ఏడాది కోర్సుకు సంబంధించి పరిశ్రమల్లోనే పని చేసేలా చర్యలు చేపట్టాలి. లేదంటే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను రీడిజైన్ చేయాలి. అవసరం లేనపుడు ఎలా వస్తారు: నర్సింహారెడ్డి, ఉన్నత విద్యా మండలి పాలక మండలి సభ్యుడు నల్లగొండలో యాభైకి పైగా సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. ఇంజనీరింగ్‌కు సంబంధించి యూనివర్సిటీలో సమావేశమైన ప్రతిసారి వారిని ఆహ్వానించినా వారు రావట్లేదు. ఒకసారి అడిగితే ‘మా పరిశ్రమకు అనుగుణంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో సిలబస్ లేదు.. మేమొచ్చి ఏం చేయాలి.. మీరు చెప్పే చదువు చదువుకునే విద్యార్థులు మాకు పనికి రారు.. అలాంటపుడు వచ్చి చేసేదేముంది’అని పేర్కొన్నారు. మార్పులపై ప్రభుత్వానికి నివేదిస్తాం: తుమ్మల పాపిరెడ్డి, చైర్మన్ ఉన్నత విద్యా మండలి ప్రస్తుతం రాష్ట్రంలోని కాలేజీల్లో అమలు అవుతున్న ఇంజనీరింగ్ విద్య స్థితి గతులను ప్రభుత్వానికి నివేదిస్తాం. జాతీయంగా, అంతర్జాతీయంగా, స్థానిక అవసరాల మేరకు సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులపై చర్చిస్తాం. రాష్ట్ర యువతకు నైపుణ్యాల పెంపుదలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతాం. – దేశవ్యాప్తంగా ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యం ఉన్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు 57 శాతమే. అంటే మరో 43 శాతం మందికి నైపుణ్యాల్లేవు. ఇందులో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు 42 శాతం మందిలోనే ఉద్యోగార్హ నైపుణ్యాలున్నాయి. 58 శాతం మందిలో ఆ నైపుణ్యాలు లేవు. ఇండియా స్కిల్ రిపోర్టు–2019 వెల్లడించిన వాస్తవాలివీ. – చదువుతున్న చదువుకు పారిశ్రామిక అవసరాలకు సంబంధం లేకపోవడం, అవి కోరుకునే విద్యను ఇంజనీరింగ్ కాలేజీలు అందించకపోవడంతో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు ముందుకు రావట్లేదు. ఫలితంగా ఐటీ, ఐటీ సంబంధ రంగాలు మినహా మిగతా రంగాల్లో ఎక్కువ మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించట్లేదు. ఏఐసీటీఈ సర్వేలో వెల్లడైన అంశాలివీ.. -
ఇంజనీరింగ్‌లో ఫుల్‌టైమ్ ఇంటర్న్‌షిప్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ఇప్పటివరకున్న ప్రాజెక్టు విధానం స్థానంలో ఇక ఇంటర్న్‌షిప్ విధానం అమల్లోకి రాబోతోంది. విద్యార్థులకు చదువుతోపాటు ప్రాక్టికల్ వర్క్ నేర్పించ డం తద్వారా.. ఉపాధి అవకాశాలు పెంచేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) బీటెక్, డిప్లొమా విద్యార్థుల కోసం కొత్తగా ఇంటర్న్‌షిప్ విధానాన్ని రూపొందించింది. దీంతో విద్యార్థులు వేసవి సెలవుల్లోనూ పూర్తిస్థాయిలో ఇంటర్న్‌షిప్ చేసేందుకు అవకాశం కలిగింది. ఇప్పటివరకు నాలుగేళ్ల బీటెక్‌లో విద్యార్థులు ప్రాజెక్టు వర్క్ చేస్తే సరిపోయేది. ఇక మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులకు 6నెలల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉండేది. అదీ పెద్దగా అమలయ్యేది కాదు. ఇకపై అలా కుదరదు. బీటెక్‌లో కేవలం ప్రాజెక్టు వర్క్ చేస్తామంటే సరిపోదు. బీటెక్ విద్యార్థులు ప్రథమ సంవత్సరం నుంచే ఇంటర్న్‌షిప్ చేసే విధానాన్ని ఏఐసీటీఈ రూపొందించింది. కోర్సులో భాగంగా ఇంటర్న్‌షిప్‌కు క్రెడిట్స్ పాయింట్లు (మార్కుల స్థానంలో) ఇచ్చేలా చర్యలు చేపట్టింది. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు రూపొందించిన ఈ విధానాన్ని 2019–20 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్‌లో 600–700 గంటలు ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు ఫుల్‌టైమ్ ఇంటర్న్‌షిప్‌లో వారానికి 40–45 గంటల పాటు ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టు వర్క్, సెమినార్ యాక్టివిటీస్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అలా ప్రతి 40–45 గంటలకు ఒక క్రెడిట్ ఇస్తారు. ఇలా బీటెక్‌లో 14–20 క్రెడిట్స్ ఉంటాయి. అంటే ప్రతి బీటెక్ విద్యార్థి తన నాలుగేళ్ల కోర్సు పూర్తయ్యే నాటికి 600 నుంచి 700 గంటల పాటు ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టు వర్క్, సెమినార్ యాక్టివిటీస్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అలాగే పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు మూడేళ్లలో 450 నుంచి 500 గంటల పాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుందని, వారికి 10–14 క్రెడిట్స్ ఇస్తారని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. అయితే విద్యార్థులు పార్ట్‌టైం ఇంటర్న్‌షిప్‌తోపాటు ఫుల్‌టైమ్ ఇంటర్న్‌షిప్‌ను చేసుకునేలా వెసలుబాటు కల్పించింది. విద్యాసంవత్సరం మధ్యలో కాకుండా వేసవి సెలవుల్లోనూ ఫుల్‌టైం ఇంటర్న్‌షిప్ చేసుకునేలా సంబంధిత విద్యా సంస్థలు విద్యార్థులకు సదుపాయం కల్పించాలని, సమయాన్ని సర్దుబాటు చేయాలని పేర్కొంది. ప్రతి కాలేజీలో శిక్షణ, ఉపాధి సెల్ ఇంటర్న్‌షిప్ వ్యవహారాలతోపాటు విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రతి విద్యాసంస్థలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్‌ను ఏర్పాటు చేయాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. ఇందులో ప్రత్యేకంగా ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్ ఆఫీసర్‌ను నియమించాలని వెల్లడించింది. విద్యార్థులు సరైన కెరీర్‌ను ఎంచుకునేలా వారికి ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేయాలని, వారిలో అవగాహన కల్పించాలని వెల్లడించింది. విద్యార్థులు తమకు వచ్చే అనుమానాలను నివృత్తి చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. ఈ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బయోడేటా సిద్ధం చేసుకోవడం నుంచి మొదలుకొని విదేశీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగేలా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అలాగే ఈ–మెయిల్ రైటింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ స్కిల్స్, ఆప్టిట్యూడ్ ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్ టెస్టు, టెక్నికల్ రిపోర్టు రైటింగ్, ప్రజంటేషన్ స్కిల్స్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాలని వెల్లడించింది. వాటిన్నింటి నిర్వహణకు ప్రతి విద్యా సంస్థ తమ బడ్జెట్ కచ్చితంగా 1% ని«ధులను ఇందుకోసమే వెచ్చించాలని స్పష్టం చేసింది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి: కృష్ణారావు ఈవిధానం అమల్లోకి వస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగమని స్టాన్లీ విద్యా సంస్థల ఛైర్మన్ కృష్ణారావు పేర్కొన్నారు. ఇంటర్న్‌షిప్ విధానం వల్ల విద్యార్థుల పట్ల ఇండస్ట్రీ వర్గాలకు ఓ అవగాహన వస్తుందని, తద్వారా విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వెల్లడించారు. విద్యార్థుల సామర్థ్యాలు ఏంటనేది పారిశ్రామిక వర్గాల వారికి పెద్దగా తెలియదని, ఇకపై మాత్రం 600–700 గంటలు విద్యార్థులు వారివద్దే పని చేస్తారు కనుక సంపూర్ణ అవగాహన వారికి వస్తుందన్నారు. తద్వారా ఎక్కువ మంది విద్యార్థులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఇదీ అమల్లోకి రానున్న ఇంటర్న్‌షిప్ విధానం బీటెక్ (వేసవి సెలవుల్లో) డిప్లొమా (వేసవి సెలవుల్లో) బీటెక్ (సమయం) డిప్లొమా (సమయం) బీటెక్ (క్రెడిట్స్) డిప్లొమా (క్రెడిట్స్) 2వ సెమిస్టర్ తరువాత 2వ సెమిస్టర్ తరువాత 3–4వారాలు 3–4 వారాలు 3–4 3–4 4వ సెమిస్టర్ తరువాత 4వ సెమిస్టర్ తరువాత 4–6 వారాలు 4–6 వారాలు 4–6 4–6 6వ సెమిస్టర్ తరువాత 6వ సెమిస్టర్లో 4–6 వారాలు 3–4 వారాలు 4–6 3–4 -
వసతిగృహ విద్యార్థులకు ‘విశ్వదర్శిని’
సాక్షి, హైదరాబాద్: వసతిగృహాల్లోని విద్యార్థుల కోసం ఎస్సీ అభివృద్ధి శాఖ సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. విశ్వదర్శిని పేరిట ప్రతిభావంతులైన విద్యార్థులను విదేశీ పర్యటనలకు తీసుకెళ్తోంది. అంతేకాదు.. అక్కడ వివిధ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌తో పాటు సంబంధిత అంశాలపై ప్రాజెక్టు రిపోర్టు తయారీకి సహకరించనుంది. పర్యటనలో భాగంగా సందర్శించిన సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫికెట్లు ఇవ్వనుంది. ఇదంతా విద్యార్థుల ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. ఈ పర్యటన వినోదాత్మకంగా కాకుండా విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడం, సరికొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి బాటలు వేయనుంది. ఎస్సీ అభివృద్ధి శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పోస్టుమెట్రిక్ హాస్టళ్లలోని ఆసక్తిగల విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేసింది. మొత్తం 100 మంది ఆసక్తి చూపగా.. వారిలో నుంచి 18 మందిని ఎంపిక చేసింది. తొలివిడత వీరిని విశ్వదర్శిని పర్యటనకు సిద్ధం చేస్తోంది. వచ్చే నెలలో ఈ పర్యటన ప్రారంభం కానుంది. మొత్తం 18 మందికిగాను రూ.28 లక్షలు విడుదల చేసింది. ఐదు దేశాలు.. నాలుగు వారాలు విశ్వదర్శిని కార్యక్రమంలో భాగంగా ఐదు దేశాల్లో విద్యార్థులు పర్యటించనున్నారు. ఫిన్లాండ్, గ్రీస్, పోలెండ్, టర్కీతో పాటు చైనాకు వెళ్లనున్నారు. నాలుగు వారాల పాటు సాగే ఈ టూర్లో విద్యార్థులు వారి సబ్జెక్టులకు సంబంధించి ప్రాజెక్టుల రూపకల్పన, సంబంధిత సంస్థల సందర్శన చేపడతారు. అదేవిధంగా ప్రాజెక్టుపై ఇంటర్న్‌షిప్ సైతం చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. పర్యటన అనంతరం సంక్షేమ శాఖ, సంబంధిత సంస్థ సర్టిఫికెట్లు ఇవ్వనుంది. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి తదితర పథకాల అర్హుల ఎంపికలో ఈ సర్టిఫికెట్లను ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రామాణికంగా తీసుకోనుంది. ప్రభుత్వ సాయంతో పాటు ఎంపికైన విదేశీ యూనివర్సిటీల్లో ఈ విద్యార్థులకు ఫీజు రాయితీలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ పర్యటనతో విద్యార్థులకు వివిధ దేశా లు, సంస్కృతులపై అవగాహన ఏర్పడటంతో పాటు నైపుణ్యాభివృద్ధికి దోహదపడుతుందని ఎస్సీ అభివృ ద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ పేర్కొన్నారు. -
దేశం గర్వపడేలా చేశారు..!
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల ప్రదర్శన దేశాన్ని గర్వపడేలా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నాలుగు మెడల్స్ సాధించిన టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా సహా.. సైనా, సింధు తదితర క్రీడాకారులను ఆయన ప్రశంసించారు. ఆటగాళ్ల నిరంతర శ్రమకు ప్రతిఫలమే ఈ ఫలితాలన్నారు. మాసాంతపు మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జాతినుద్దేశించి మోదీ మాట్లాడారు. వచ్చే ఏడాది అక్టోబర్ 2న మహాత్ముని 150వ జయంతి ఉత్సవాలకు ముందే.. దేశ స్వచ్ఛతపై నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు యువత నడుం బిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఇందుకోసం వేసవి సెలవుల్లో ప్రభుత్వం చేపట్టిన ఇంటర్న్‌షిప్ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. నీటి సంరక్షణ, వాజ్‌పేయి జై విజ్ఞాన్ నినాదం తదితర అంశాలపై మోదీ మాట్లాడారు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా మహ్మద్ ప్రవక్తను, బుద్ధ పౌర్ణిమ నేపథ్యంలో గౌతమ బుద్ధుడిని గుర్తుచేసుకున్నారు. క్రీడాకారులకు అభినందనలు కామన్వెల్త్ క్రీడల్లో భారత పతాకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారులందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. మరీ ముఖ్యంగా ఎక్కువ పతకాలు సాధించిన మహిళా క్రీడాకారులు చూపిన పోరాటపటిమను ప్రధాని ప్రశంసించారు. పతకాలు సాధించిన తర్వాత త్రివర్ణపతాకాన్ని భుజాన వేసుకుని జాతీయగీతాలాపన వింటుంటే గర్వంగా ఉంటుందన్నారు. ఇదే అభిప్రాయాన్ని పలువురు క్రీడాకారులు తనతో పంచుకున్నారన్నారు. బ్యాడ్మింటన్ ఫైనల్స్‌లో ఇద్దరు భారతీయ క్రీడాకారిణుల (సైనా నెహ్వాల్, పీవీ సింధు) మధ్యే పోటీ నెలకొన్నా.. మ్యాచ్‌పై ఎంతో ఆసక్తి పెరిగిందన్నారు. ‘గత నెల మన్‌కీ బాత్‌లో దేశ ప్రజలందరినీ.. ‘ఫిట్ ఇండియా’లో పాల్గొనాలని కోరాను. అనారోగ్యం దరిచేరకుండా నిరోధించేందుకు ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. సినీనటుడు అక్షయ్ కుమార్ సహా చాలా మంది.. ఫిట్నెస్ అవసరాన్ని తెలుపుతూ వీడియోలు, ఫొటోలు పోస్టు చేశారు. అందరికీ కృతజ్ఞతలు’ అని మోదీ తెలిపారు. ఫిట్‌గా ఉండటం, మానసిక, శారీరక సంతులకోసం యోగా చాలా ప్రత్యేకమైందన్నారు. రంజాన్, బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు ఉపవాసం ఉండటం ద్వారా ఎదుటివారి ఆకలిని అర్థం చేసుకోవచ్చని, దాహంగా ఉన్నప్పుడే ఇతరుల దాహం అర్థమవుతుందన్న మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మే 15నుంచి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా దేశవాసులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధ భగవానుడు శాంతి, సామరస్యం, సోదరభావాన్ని బోధించారని.. ఈ విలువలే నేటి ప్రపంచానికి చాలా అవసరమన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా తన ఆలోచనల్లో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పదాలను కూడా బుద్ధ భగవానుడి బోధనలనుంచే గ్రహించినట్లు చెప్పిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. మే 29న బుద్ధ పౌర్ణిమ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1998లో మే 11న (బుద్ధ పౌర్ణిమ) నాటి ప్రధాని వాజ్‌పేయి నిర్వహించిన అణుపరీక్షలను మోదీ గుర్తుచేశారు. నవభారత నిర్మాణం కోసం జై జవాన్, జై కిసాన్లతోపాటు వాజ్‌పేయి సూచించిన ‘జై విజ్ఞాన్’ నినాదంలోని అంతరార్థాన్ని నేటి యువత గుర్తించాలని ప్రధాని కోరారు. మే 7న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. స్వచ్ఛత కోసం ఇంటర్న్‌షిప్ వేసవి సెలవుల్లో ‘స్వచ్ఛ భారత్’లో భాగంగా నిర్వహిస్తున్న ‘సమ్మర్ ఇంటర్న్‌షిప్–2018’ కార్యక్రమంలో పాల్గొనాలని యువతను కోరారు. తద్వారా సమాజంతో మమేకమవటంతోపాటు సానుకూల మార్పు తీసుకురావటంలో భాగస్వాములం అవుతామన్నారు. ఇందులో పాల్గొన్న యువతకు సర్టిఫికెట్లు ఇస్తారని.. ఇందులో రాణించిన వారికి యూజీసీ రెండు క్రెడిట్ పాయింట్లు కూడా ఇస్తుందన్నారు. ‘మైగవ్’ యాప్ ద్వారా ఇంటర్న్‌షిప్‌కు రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. మన పూర్వీకులు కూడా జల సంరక్షణను ఓ ఉద్యమంలా చేపట్టారని.. పలు దేవాలయాల్లో ఇప్పటికీ ఈ శాసనాలను గమనించవచ్చన్నారు. మూడున్నరేళ్లలో జల సంరక్షణకు రూ. 35వేల కోట్లు వెచ్చించామన్నారు. దీని ద్వారా కోటిన్నర ఎకరాల భూమికి మేలు జరిగిందన్నారు. -
క్షేత్ర స్థాయి నైపుణ్యాలకు కీలకం.. ఇంటర్న్షిప్స్
ఎం.చంద్రశేఖర్, ప్రొఫెసర్, ఎన్ఐటీ-వరంగల్ ప్రస్తుతం జాబ్ మార్కెట్‌ను పరిశీలిస్తే.. ఇన్స్టిట్యూట్ల నుంచి డిగ్రీలతో బయటికి వస్తున్న విద్యార్థులు జాబ్ రెడీగా ఉండాలని పరిశ్రమలు ఆశిస్తున్నాయి. పుస్తకావగాహన కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు పెద్ద పీట వేస్తున్నాయి.. అకడమిక్‌గా నేర్చుకున్న అంశాలను వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే విషయంలో ఏమేరకు సామర్థ్యం కలిగి ఉన్నారు? అనే విషయాన్ని లోతుగా పరిశీలిస్తున్నాయి.. పని చేయాల్సిన రంగంపై కనీస అవగాహన ఉండాలని భావిస్తున్నాయి.. ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థికి ఉన్న ప్రాక్టికల్ అప్రోచ్ ఉద్యోగ సాధనలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది.. విద్యార్థుల్లో ఈ విధమైన ప్రాక్టీకల్ అప్రోచ్ పెంపొందించుకోవడానికి, క్షేత్ర స్థారుు అవగాహనకు ఇంటర్న్షిప్స్ ఎంతో తోడ్పాటునందిస్తాయి.. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ప్రాముఖ్యత, సంబంధిత అంశాలపై సూచనలు.. ఇంజనీరింగ్ విద్యార్థులు థియరీ కంటే ప్రాక్టికల్‌గా ఎక్కువ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడే.. వారి కెరీర్ సరైన దిశలో సాగుతున్నట్లు భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు కూడా ఈ విషయానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంజనీరింగ్ విద్యలో ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంచే కార్యకలాపాలకు ప్రాధాన్యత క్రమంగా పెరుగుతోంది. ఇంటర్న్షిప్స్, మినీ ప్రాజెక్ట్ వర్క్, టెక్నికల్ కాంపిటీషన్స్, ప్రాజెక్ట్ వర్క్ వంటివి ఈ కోవలోకి వస్తాయి. మూడో సంవత్సరంలో: సాధారణంగా ఇంజనీరింగ్ కోర్సులో మూడో సంవత్సరంలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ తర్వాత వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్ (ఇండస్ట్రీ ఓరియెంటెడ్ మినీ ప్రాజెక్ట్) ఉంటుంది. కొన్ని యుూనివర్సిటీల పరిధిలో ఇంజనీరింగ్ కరిక్యులంలో ఇంటర్న్‌షిప్ భాగంగా లేనప్పటికీ ప్రొఫెషనల్ స్కిల్స్‌ను పెంపొందించుకోవడంలో ఇంటర్న్‌షిప్స్‌ను వినియోగించుకోవాలి. ఇంటర్న్‌షిప్‌లు సాధారణంగా రెండు విధాలుగా అందుబాటులో ఉంటాయి. అవి.. అకడమిక్‌గా తప్పనిసరిగా చేయాల్సినవి. కొన్ని కంపెనీలు ఆఫర్ చేసే సమ్మర్ ఇంటర్న్షిప్స్. సమ్మర్ ఇంటర్న్షిప్స్: ఇంటర్న్‌షిప్స్‌లో కీలకమైనవి.. సమ్మర్ ఇంటర్న్షిప్స్. పాఠ్యపుస్తకాల్లో నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా వాస్తవ పరిస్థితుల్లో అన్వయించడానికి సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఒక ఫ్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడతాయి. వీటిని వేసవి సెలవుల్లో నిర్వహిస్తారు. సాధారణంగా వీటి వ్యవధి ఐదు నుంచి పది వారాల పాటు ఉంటుంది. విద్యార్థులు వేసవి సెలవులను వృథా చేసుకోకుండా.. ఇటువంటి ఇంటర్న్షిప్స్ ద్వారా విలువైన పని అనుభవాన్ని (వర్క్ఎక్స్పీరియెన్స్) పొందొచ్చు. సమ్మర్ ఇంటర్న్‌షిప్ వల్ల విద్యార్థులకు రెండు రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి. అవి.. ఒకటి, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం. రెండోది, చదువుతున్న బ్రాంచ్‌కు సంబంధించి మార్కెట్లోకి వచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పొందడం. ఒక్కోసారి కొన్ని కంపెనీలు ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులకు అలవెన్స్‌ను కూడా చెల్లిస్తున్నాయి. మల్టినేషనల్ కంపెనీల్లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల ప్రపంచ స్థాయి కంపెనీల పని వాతావరణం, వర్కింగ్ మెథడాలజీపై ఒక అవగాహన ఏర్పడుతుంది. సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేసిన విద్యార్థులకు మిగతా విద్యార్థులతో పోల్చితే కెరీర్ పరంగా చక్కని అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. ఇంటర్న్ టు జాబ్: ఇంటర్న్‌షిప్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు కంపెనీలు ఉద్యోగాన్ని ఆఫర్ చేసేందుకు కూడా వెనకాడటం (కోర్సు పూర్తయిన తర్వాత) లేదు. ప్రతిభావంతులైన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని కొన్ని కంపెనీలు ఇంటర్న్‌షిప్‌ను ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ (పీపీఓ) రూపంలో అందిస్తున్నాయి. అంతేకాకుండా విద్యార్థి భావి కెరీర్ దిశగా.. కీలకమైన వర్క్ ఎన్విరాన్మెంట్పై అవగాహన పొందొచ్చు. బృందంగా పని చేయడం వల్ల నాయకత్వ లక్షణాలు, టీమ్ మ్యాన్, పరిశోధన ఆధారంగా పని చేయడం (రీసెర్చ్ బేస్డ్ వర్క్) వంటి నైపుణ్యాలు అలవడతాయి. సంబంధిత రంగంలోని అనుభవజ్ఞుల ద్వారా.. ఉన్నత విద్య, ఉద్యోగం అనే అంశంపై విలువైన సూచనలను పొందొచ్చు. ఆసక్తి ఆధారంగా: చదువుతున్న బ్రాంచ్, ఎంచుకున్న పరిశ్రమను బట్టి ఇంటర్న్షిప్స్ వేర్వేరుగా ఉంటాయి. లోతైన స్వీయ విశ్లేషణ, పక్కా ప్రణాళిక ద్వారానే విజయవంతంగా ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయుడం సాధ్యమవుతుంది. ఇంటర్న్‌షిప్ అంశం ఎంపికకు ముందే అన్ని కోణాల్లో విశ్లేషించాలి. ఆసక్తి ఉన్న అంశాన్ని (ఏరియాను) ఇంటర్న్‌షిప్ కోసం ఎంచుకోవాలి. ఇంటర్న్‌షిప్ ఉద్దేశాలను, ప్రతిఫలాలను తప్పకుండా బేరీజు వేసుకోవాలి. భవిష్యత్‌లో సంభవించే మార్పులను దృష్టిలో ఉంచుకుని సీనియర్లు, ప్రొఫెసర్ల సహాయంతో ఇంటర్న్‌షిప్ అంశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇంజనీరింగ్‌లోని అన్ని విభాగాల్లో ఇంటర్న్షిప్స్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రొఫెషనల్ స్కిల్స్: ఇంటర్న్‌గా ఎంపికైన వారు సంబంధిత పరిశ్రమలో వారానికి నిర్దేశించిన గంటలు పని చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక సముహం (గ్రూప్)గా లేదా వ్యక్తిగతంగా ఇంటర్న్‌షిప్‌ను చేపడతారు. భావన (కాన్సెప్ట్) చిన్నదైనా.. ఇంటర్న్‌షిప్ అనుభవం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటర్న్‌షిప్ ఉండే రెండు/మూడు నెలలు విద్యార్థి ఆలోచన విధానంలో ఎంతో మార్పు తెస్తుందని చెప్పొచ్చు. విద్యార్థిగా కాకుండా ఒక ప్రొఫెషనల్‌గా వ్యవహరించే తత్వం అలవడుతుంది. పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి అనుసరిస్తున్న పద్ధతులను దగ్గరగా పరిశీలించే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా కోర్సులోని భావనలను పరిశ్రమలో అన్వయించే విధానాన్ని నేరుగా చూడడం ద్వారా కోర్సులోని సదరు అంశాలపై పట్టు వస్తుంది. అంతేకాకుండా కొన్ని కంపెనీలు ఇంటర్న్స్‌కు కూడా వాస్తవ పనులను అప్పగిస్తాయి. దాంతో అకడమిక్‌గా నేర్చుకున్న అంశాలను క్షేత్ర స్థారుులో అన్వయించే సాధ్యాసాధ్యాలపై స్పష్టత వస్తుంది. తద్వారా విద్యార్థి పరిశ్రమ కోరుకుంటున్న విధంగా జాబ్ రెడీగా ఉంటాడు. ఇంటర్న్‌షిప్‌లో చూపిన ప్రతిభ విద్యార్థి ఉద్యోగ సాధనలోనూ తోడ్పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఇంటర్న్‌షిప్‌ను ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్‌గా కూడా పేర్కొనవచ్చు. ఇంటర్న్‌షిప్‌లో చక్కని ప్రతిభ చూపిన విద్యార్థులకు అకడమిక్ పరంగా ఉండే ప్రాజెక్ట్ వర్క్‌ను రియల్ టైమ్‌లో తమ కంపెనీలో చేసే అవకాశాన్ని కూడా కొన్ని సంస్థలు కల్పిస్తున్నాయి. ఎంపిక ఇలా: ఇంటర్న్‌షిప్ చేయాలనుకున్న అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంటర్న్‌షిప్ చేయాల్సిన సంస్థ ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించాలి. కెరీర్ మీట్స్, జాబ్ మేళావంటి కార్యక్రమాలకు హాజరవుతుండడం, ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఇంటర్న్‌షిప్ బ్లాగులను చూడడం, యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థి కేంద్రాలను సందర్శించడం ద్వారా ఇంటర్న్షిప్స్ అవకాశాలను సులభంగా పొందొ చ్చు. ఇంటర్నెట్లో పలు వెబ్సైట్లు ఇంటర్న్‌షిప్ గురించిన విస్తృత సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇంటర్నెట్ లేదా కాలేజీల్లోని ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ద్వారా ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేసే కంపెనీల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. లేదా వ్యక్తిగతంగా సంబంధించిన పరిశ్రమల అధికారులను కలవడం ద్వారా కూడా ఇంటర్న్‌షిప్‌ను దక్కించుకోవచ్చు. కీలకం రెజ్యుమె: ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని దక్కించుకోవడంలో రెజ్యుమె పాత్ర కీలకం. విద్యార్థులు తమ గురించి సమగ్రంగా వివరించడానికి రెజ్యుమె నిర్ణయాత్మక పాత్రను పోషిస్తుంది. కాబట్టి రెజ్యుమెను పకడ్బందీగా రూపొందించాలి. రెజ్యుమెలో ఎంచుకున్న రంగంపై ఉన్న ఆసక్తి, అవగాహన, భవిష్యత్ ప్రణాళికలు స్పష్టం చేసే విధంగా ఉండేలా జాగ్రత్త పడాలి. వ్యక్తిత్వం, విద్యా ప్రవృత్తులు, ఉద్యోగ సంబంధిత సామర్థ్యాలను ప్రస్ఫుటించేలా రూపొందించుకోవాలి. ఎంప్లాయర్స్ అవసరాలు, ప్రాధాన్యతలను కూడా రెజ్యుమెలో పొందుపర్చడం మర్చిపోవద్దు. సాధారణంగా కంపెనీలు ఇంటర్న్షిప్స్ కోసం నిర్దిష్ట గడువును నిర్ణయిస్తాయి. కాబట్టి వీలైనంత ముందుగానే దరఖాస్తు చేయడం మంచిది. వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా ఇంటర్న్‌షిప్ కోసం విద్యార్థులను ఎంపిక చేస్తారు. వనరుగా: ఇంటర్న్‌షిప్ చేశాక,దాన్ని ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి వన రుగా ఉపయోగించుకోవాలి. ఇంటర్న్‌షిప్‌లో మీరు నిర్వహించిన బాధ్యతలను, ప్రాజెక్టు విజయంలో దాని పాత్రను మీ రెజ్యుమెలో పేర్కొనాలి. కళాశాలల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ జరుగుతున్నప్పుడు ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో ఇంటర్న్‌షిప్‌లో నిర్వర్తించిన విధులను వివరించడం ద్వారా కొలువును సులువుగా సొంతం చేసుకోవచ్చు. నిపుణులైన ఉద్యోగుల ఎంపికకు ఇంటర్న్‌షిప్‌ను కంపెనీలు చక్కని వేదికగా భావిస్తున్నారుు. ఇంటర్న్‌షిప్‌నకు అకడమిక్ పరంగా కొన్ని మార్కులను కూడా కేటాయించడం జరిగింది. ప్రాముఖ్యత కాలేజీ నుంచి బయటకు రాకముందే కొంతకాలంపాటు క్షేత్రస్థాయి కార్యకలాపాల్లో విద్యార్థులు పాల్గొంటారు. ............................. అనుభవజ్ఞుల పర్యవేక్షణలో పని అనుభవం సంపాదిస్తారు. ............................................................ అకడమిక్ నైపుణ్యాలతో పాటు పని అనుభవం ఉన్న వారికి కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. ............................................................ ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడు విద్యార్థులు కంపెనీలోని సీనియర్లతో నిరంతరం సంప్రదిస్తూ కెరీర్‌కు కావాల్సిన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. ............................................................ బృంద స్ఫూర్తి, కమ్యూనికేషన్ స్కిల్స్, సమయపాలన, ఒత్తిడిని జయించడం వంటి సాఫ్ట్‌స్కిల్స్‌ను అలవర్చుకోవడానికి ఇంటర్న్‌షిప్ వేదికగా నిలుస్తుంది. ............................................................ ఉద్యోగానికి ముందే తమ రంగానికి చెందిన పరిశ్రమలో వాస్తవ పరిస్థితులను పరిశీలించే అవకాశం లభిస్తుంది. ............................................... బ్రాంచ్‌ల వారీగా ఇంటర్న్‌షిప్ కోసం ఎంచుకోవాల్సిన కంపెనీలు.. మెకానికల్-ఎల్ అండ్ టీ, ఎస్ఆర్ స్టీల్స్, వైజాగ్ స్టీల్స్, బీహెచ్ఈఎల్, హెచ్ఏఎల్ మొదలైనవి. సివిల్ -ఎల్ అండ్ టీ, ఎన్సీసీ, కన్స్ట్రక్షన్ కంపెనీలు తదితరాలు. ఎలక్ట్రికల్- ఎన్టీపీసీ, ఆర్టీపీపీ, వీటీపీఎస్, సాగర్, పవర్ జనరేషన్ యూనిట్స్ మొదలైనవి. ఈసీఈ-బీడీఎల్, హెచ్ఏఎల్, ఇస్రో తదితరాలు. సీఎస్ఈ-టీసీఎస్, విప్రో, మైక్రోసాఫ్ట్ తదితరాలు. తప్పనిసరి.. ఏఐసీటీఈ దేశంలో సాంకేతిక విద్యను పర్యవేక్షిస్తున్న ఆల్ ఇండియా టెక్నికల్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ).. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసింది. నేషనల్ ఎంప్లాయబిలిటీ ఎన్హన్సమెంట్ మిషన్ (ఎన్ఈఈఎం-ూఉఉక)లో భాగంగా ఏఐసీటీఈ ఈ ప్రతిపాదన చే సింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఐదు, ఆరు, ఏడో సెమిస్టర్లలో మూడు నుంచి 24 నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వివిధ సంస్థలతో ఏఐసీటీఈ ఒక అవగాహన కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఈ విషయంలో ఇంజనీరింగ్ కోర్సులోని మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులకు కమ్యూనికేషన్స్ సంబంధింత విభాగంలో శిక్షణనిచ్చేందుకు బీఎస్ఎన్ఎల్తో ఒప్పందం చేసుకుంది. ఉపయోగకరమైన వెబ్‌సైట్స్ www.internshala.com www.twenty19.com www.hellointern.com www.letsintern.com