సాక్షి, అమరావతి: దేశంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతోపాటు సామాజిక దూరాన్ని పాటించాలని సూచించడంతో.. వివిధ సాంకేతిక వృత్తి విద్యా కళాశాలల్లోని విద్యార్థుల ఇంటర్న్‌షిప్ విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కొన్ని మార్పులు చేపట్టింది. ఈ మేరకు అన్ని యూనివర్సిటీలు, విద్యా సంస్థలకు ఉత్తర్వులు జారీచేసింది. వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వ సూచనలను అన్ని విద్యా సంస్థలు విధిగా పాటిస్తూనే ఇంటర్న్‌షిప్‌లను ఇంటి నుంచే కొనసా గించాలని.. ఆయా విద్యాసంస్థల బయట చేయకూడదని స్పష్టంచేసింది. అలాగే..
- వేసవి ఇంటర్న్‌షిప్‌ల కోసం విద్యార్థులు బయటి ప్రాంతాల్లో చేపట్టాల్సిన అంశాలను కూడా ఏ విద్యా సంస్థ ఇప్పుడు చేపట్టరాదు.
- ఇంటి నుంచి చేయగల అంశాలను మాత్రమే విద్యార్థులకు ఇవ్వాలి. ఇంటి దగ్గర ఉంటూనే సమస్యలను పరిష్కరించేలా ఉండే అంశాలపై ప్రాజెక్టు వర్కు తరహాలో ఇంటర్న్‌షిప్‌ను ఇవ్వాలి.
- ఇప్పటికే ఇంటర్న్‌షిప్‌లో భాగంగా
వివిధ సంస్థల్లో చేరిన వారు దాన్ని కొనసాగించడంపై కూడా కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది.
- ఆయా సంస్థలు కూడా విద్యార్థులను ప్రయాణాలు చేసే, వేరే వారితో కలిసి చేసే కార్యక్రమాలు కాకుండా ఇంటి నుంచే పనిచేయడానికి వీలుగా ఇంటర్న్‌షిప్‌ను నిర్వహించాలని పేర్కొంది.
- కరోనా నివారణపై కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు భిన్నంగా ఏ సంస్థ కూడా వెళ్లరాదని స్పష్టంచేసింది.
ఇంటర్న్‌షిప్‌ను నిలిపేయవద్దు
ఇదిలా ఉంటే.. ఇంటర్న్‌షిప్‌లను తాత్కాలికంగా నిలిపివే యాలని ఏఐసీటీఈ ఆలోచనలకు ఆదిలోనే విద్యార్థుల నుంచి అభ్యంత రాలు వ్యక్తమయ్యాయి. అనేక రౌండ్ల ఇంట ర్వ్యూలను పూర్తిచేసి ఆయా సంస్థల్లో ఇంటర్న్ షిప్‌ల అవకాశం పొందామని.. ఈ తరుణంలో వాటిని నిలిపివేయడం వల్ల తాము నష్టపోతామని పలు వురు తెలిపారు కొంతకాలం పాటు వాయిదా వేసి తిరిగి ఇంటర్న్ షిప్ కొనసాగించేం దుకు అవకాశం కల్పించాలని వేడుకు న్నారు. దీంతో ఏఐసీటీఈ ఈ ఇంటర్న్‌షిప్‌లలో మార్పులు చేస్తూ ఇంటి నుంచే విద్యార్థులు పనిచేసేలా అన్ని సంస్థలు చర్యలు చేపట్టాలని సూచిం చింది. క్షేత్రస్థాయి ఇంటర్న్‌షిప్ లను పరిస్థితిని బట్టి కొంత కాలం తరువాత నిర్వహించేలా తదుపరి ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment