సాక్షి, హైదరాబాద్: దేశంలో ఈ ఏడాది రెండో అర్ధభాగం(జూలై–డిసెంబర్ మధ్యకాలం)లో కొత్త పట్టభద్రుల (ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్)కు 59 శాతం కంపెనీ లు, పరిశ్రమలు, సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ ఇండియా ఆధ్వర్యంలో రూపొందించి న ‘కెరీర్ ఔట్‌లుక్ రిపోర్ట్’పేర్కొంది. ఇది ఈ ఏడాది తొలి అర్ధభాగంకన్నా 12% అధి కంగా ఉండనుందని అంచనా వేసింది.
దేశవ్యాప్తంగా 865 కంపెనీలు, 18 పరిశ్రమలు, 14 ప్రదేశాల్లో అందుబాటులోకి రానున్న ఉద్యోగ అవకాశాలను విశ్లేషిస్తూ నివేదికను రూపొందించినట్లు టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ తెలిపింది. అత్యధికంగా ఐటీ రంగం 65% మంది ఫ్రెషర్లను తీసుకొనేందుకు ఆసక్తి కనబరుస్తుండగా ఈ– కామర్స్ రంగం 48%, టెలికమ్యూనికేషన్స్ రంగం 47% మంది కొత్త పట్టభద్రులకు ఉద్యో గాలివ్వాలని భావిస్తున్నట్లు నివేదిక వివరించింది.
అవకాశాలు పెరిగాయి...
దేశంలో ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాల కల్పన గణనీయంగా మెరుగైంది. విద్యారంగం, పరిశ్రమల మధ్య సమన్వయం వల్ల నవతరం మంచి నైపుణ్యాలతో బయటకు వస్తోంది
– శంతనూ రూజ్, సీఈవో, వ్యవస్థాపకుడు టీమ్‌లీజ్ ఎడ్‌టెక్
Comments
Please login to add a commentAdd a comment