సాక్షి, న్యూఢిల్లీ : ఇతర ఉన్నత విద్యా సంస్థలతో పోలిస్తే ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎంలే అధిక వేతన ప్యాకేజీలను ఆకర్షిస్తున్నాయని ఓ సర్వే వెల్లడించింది. మెటిల్ ఆన్‌లైన్ టాలెంట్ సొల్యూషన్ ప్రొవైడర్ నిర్వహించిన అథ్యయనంలో అగ్రశ్రేణి ఐఐఎం విద్యార్ధులే సగటు ఎంబీఏ గ్రాడ్యుయేట్‌తో పోలిస్తే 121 శాతం అధిక వేతన ప్యాకేజ్ పొందుతున్నారని తేలింది. ఇక టాప్ ఐఐటీల గ్రాడ్యుయేట్లు సగటు ఇంజనీర్, సీఎస్ , ఐటీ గ్రాడ్యుయేట్లతో పోలిస్తే137 శాతం అధిక ప్రారంభవేతనాలను పొందుతున్నారని వెల్లడించింది.
ఇక వేతన ప్యాకేజ్‌ల్లో ఎన్‌ఐటీలను కొత్తగా ఏర్పాటైన ఐఐటీలు అధిగమిస్తున్నాయని, ఇక మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి అత్యున్నత నైపుణ్యాలను సంతరించుకోవడంతో టాప్ ఐఐటీ గ్రాడ్యుయేట్లకు మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొంది.
దేశవ్యాప్తంగా 114 ఇంజనీరింగ్ కాలేజీలు, 80 మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో సర్వే చేపట్టారు. ఇక టెక్నాలజీ విభాగంలో అత్యధిక సగటు వార్షిక వేతనం రూ 14.8 లక్షలుగా నమోదైంది. జనరల్ మేనేజ్‌మెంట్ ఉద్యోగాల్లో దాదాపు 31 శాతం హైరింగ్ జరిగింది. సీనియర్ మేనేజ్‌మెంట్ ఉద్యోగాలకు ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ కంటే 118 శాతం అధికంగా వేతనాన్ని ఆఫర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment