ఇంజనీరింగ్‌లో నాణ్యత సున్నా | Engineering quality of the zero | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌లో నాణ్యత సున్నా

Published Fri, Jun 13 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM

ఇంజనీరింగ్‌లో నాణ్యత సున్నా

ఇంజనీరింగ్‌లో నాణ్యత సున్నా

గత ఏడాది మిగిలిపోయిన 2 లక్షల సీట్లు
విభజనతో ఇంకా ఎక్కువే మిగులుతాయంటున్న నిఫుణులు
స్పష్టం చేస్తున్న ఆస్పరింగ్ మైండ్స్ నివేదిక


హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతాప్రమాణాలు పడిపోయి, గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోతున్నాయి. దీంతో ఇంజనీరింగ్ విద్యపై అనాసక్తి పెరిగిపోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నాలుగేళ్ల కిందట ఇంజనీరింగ్‌లో 1,94,203 సీట్లు భర్తీకాగా.. మూడేళ్ల కిందట 1,84,080 సీట్లు భర్తీ అయ్యాయి. రెండేళ్ల కిందట 1,58,700, సీట్లు మాత్రమే భర్తీ కాగా, గత ఏడాది 1,28,950 సీట్లే నిండాయి. గత ఏడాది 32 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఈసారి కూడా 3.20 లక్షల సీట్లు అందుబాటులో ఉంటే అర్హత సాధించిన వారు 1.81 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఒక్కో యాజమాన్యం పరిధిలోనే ఐదారు కాలేజీలు ఉండడం.. కాలేజీల మధ్య అనారోగ్యకర పోటీ... సీట్లు నింపుకునేందుకే తాపత్రయం.. వెరసి ఇంజనీరింగ్‌లో నాణ్యత కరువైంది. నిర్వహణకే తంటాలు పడుతున్న కాలేజీలు నాణ్యతపై దృష్టిపెట్టడం లేదు.  

25వ స్థానానికి పడిపోరుున రాష్ట్రం...

ఐటీలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ (ఇపుడు రెండు రాష్ట్రాలు) ఉద్యోగ అవకాశాల కల్పనలో ప్రస్తుతం దేశంలోనే 25వ స్థానానికి పడిపోయింది. ఒకప్పుడు అగ్రదేశాల్లో ఒక వెలుగువెలిగిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఇపుడు కమ్యూనికేషన్ స్కిల్స్, సబ్జెక్టు సామర్థ్యాలు లేక వెనుకబడిపోయారు. ఆరు మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్ చివరి నుంచి రెండో స్థానానికి దిగజారింది. కాగా, వుహారాష్ట్ర, కర్ణాటక  రాష్ట్రాలు ఉద్యోగ అవకాశాల కల్పనలో పురోగతి సాధించారుు. 2011లో చేసిన సర్వేతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ 2011లో కిందినుంచి 25 పర్సంటైల్లోనే ఉండగా, ఇపుడు అదే పర్సంటైల్లోనే ఉంది. కర్ణాటక  వూత్రం 50-25 స్థానంలోకి వెళ్లింది. ఇక వుహారాష్ట్ర అవకాశాలు పెంచుకొని 75-50 పర్పంటైల్‌లోకి వెళ్లింది. ఆందోళన కలిగించే ఇలాంటి నిజాలెన్నింటినో ‘ఆస్పరింగ్‌మైండ్స్’ అనే సంస్థ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల ఉద్యోగ అవకాశాలు, పరిస్థితులపై రూపొందించిన నేషనల్ ఎంప్లాయబిలిటీ రిపోర్ట్-2014లో వివరించింది. దేశ వ్యాప్తంగా 23 రాష్ట్రాల్లోని 2,500కు పైగా కాలేజీల కు చెందిన 10 ల క్షల వుంది విద్యార్థులపై ఈ సర్వే చేసినట్టు వెల్లడించింది.

నాణ్యత పట్టని యాజమాన్యాలు..

కొద్దిగా పేరున్న కాలేజీలు ఏటికేడు సీట్లు పెంచుకుంటున్నాయి. కామన్ ఫీజున్నప్పటికీ యాజమాన్య కోటాలో భారీగా వసూలు చేస్తున్నాయి. 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటానే కాకుండా, ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. సాధారణ కాలేజీల్లో ప్రవేశాలు లేక మూసివేత దిశగా నడుస్తున్నాయి. వసతుల్లేని కాలేజీలు, అర్హత లేని అధ్యాపకులతో నెట్టుకొస్తున్నాయి. అధిక మొత్తం ఫీజులున్న కాలేజీల్లో కూడా ప్రమాణాలు లేవు.దీంతో విద్యార్థుల్లో సామర్థ్యాలు కొరవడి, ఉపాధి లభించక ఇబ్బందులు పడుతున్నారు.

32 కాలేజీల్లో ఒక్కరూ చేరలేదు..

గత ఏడాది 32 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఒకటి నుంచి 5 మందిలోపు విద్యార్థులు చేరిన  కాలేజీలు 14 ఉండగా, 6 నుంచి 10 మందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీలు 14 ఉన్నాయి. 11 నుంచి 15 మందిలోపు విద్యార్థులు చేరినవి మరో 14 కాలేజీలు ఉండగా, 16 నుంచి 20 మందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీలు 19 ఉన్నాయి. ఒక్కో కాలేజీలో 400కు పైగా సీట్లు ఉంటే 100 మందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీలు 250 ఉండడం గమనార్హం.
 
2013లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు  ఉపాధి కల్పనలో రాష్ట్రాల పరిస్థితి..

 టాప్ 25 పర్సంటైల్‌లో               -     బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్
 75 - 50 పర్సంటైల్‌లో               -    గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్
 50-25 పర్సంటైల్‌లో                 -    హర్యానా, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్
 కింది నుంచి 25 పర్సంటైల్‌లో      -    ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్
 
 
ఆస్పరింగ్‌మైండ్స్ నివేదికలోని ముఖ్యాంశాలు...

దేశంలో అత్యధిక కాలేజీలు ఉన్న రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయూరుు.
ఇంజనీరింగ్ విద్యలో సావుర్థ్యాల పెంపునకు దేశంలో 3 వేల కాలేజీలే దీర్ఘకాలిక ప్రణాళికను కలిగి ఉన్నాయి.  
పట్టణాల్లోని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంగిష్ భాషానైపుణ్యం ఉండడం లేదు.  
అనాలిసిస్‌లో విద్యార్థులు పూర్తిగా వెనుకబడి పోతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement