బోగస్‌ పట్టభద్రుల ఓటర్లను తొలగించండి | Bogus graduates votes should remove | Sakshi
Sakshi News home page

బోగస్‌ పట్టభద్రుల ఓటర్లను తొలగించండి

Published Sun, Feb 12 2017 11:38 PM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

Bogus graduates votes should remove

–అధికార పార్టీ నేతలు అక్రమంగా లబ్ధిపొందేందుకు బోగస్‌ ఓటర్లను చేర్పించారు
–రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేస్తాం
– వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌ రెడ్డి
కర్నూలు(అగ్రికల్చర్‌): పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో అధికారపార్టీ నేతలు అధికారులను గుప్పిట్లో పెట్టుకొని అడ్డగోలుగా బోగస్‌ ఓటర్లను చేర్పించారని, వీటిని వెంటనే తొలగించాలని వైఎస్‌ఆర్‌సీపీ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం నేతలు ఓటమి భయంతో  ఇలా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ...పట్టభధ్రుల ఓటర్ల నమోదుకు ఎన్నికల కమిషన్‌ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిన అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. తెలుగుదేశం నేతల ఆధ్వర్యంలో ఓటర్ల జాబితాను తయారు చేసినట్లు అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు.
 
2013 అక్టోబరులోపు డిగ్రీ, తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారినే ఓటర్లుగా నమోదు చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా పదో తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్‌ చేసిన వారిని ఓటర్లుగా నమోదు చేయడం దారుణమనా​‍్నరు. ఒక్క కర్నూలు జిల్లాలోనే దాదాపు 8500 బోగస్‌ పట్టభద్రుల ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోందని, దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కు  ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన  ప్రభుత్వానికి పట్టభద్రులు వ్యతిరేకంగా ఉన్నందున టీడీపీ నేతలు బోగస్‌ ఓటర్లతో ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.  
 
  రోజాను అడ్డుకోవడం దారుణం
 ఎమ్మెల్యే  రోజాను అమరావతిలో నిర​‍్వహించిన మహిళా పార్లమెంటు సదస్సుకు అనుమతించకపోవడం అత్యంత దారుణమని వైఎస్‌ఆర్‌సీపీ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు మహిళా ప్రజాప్రతినిధి పట్ల  అమానుషంగా ప్రవర్తించడం బాధాకరమని చెప్పారు. వెంటనే ప్రభుత్వం రోజాకు క్షమాపన చేప్పాలని డిమాండ్‌ చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement