bogus voters
-
దొంగ ఓట్లతో రాజకీయం చేసేదీ టీడీపీనే: సజ్జల
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతల ప్రచారం పచ్చకామెర్లవాడి సామెతలాగ ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లతోనే రాజకీయాలు చేసే టీడీపీ పార్టీలాగా తాము వ్యవహరించమని తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో తాను గాని, తన కుటుంబం కానీ ఓట్లు వేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఉంటున్న రెయిన్‌ట్రీ కాలనీలో రోడ్డుకు ఒకవైపున ఉన్న రెయిన్‌ట్రీ అపార్ట్మెంట్లు పొన్నూరు నియోజకవర్గంలోనూ, రెండో వైపున ఉన్న విల్లాలు మంగళగిరి నియోజకవర్గంలోనూ ఉంటాయని తెలిపారు. ఓటర్ల చేరిక సమయంలో పొన్నూరు నియోజకవర్గంలోనూ పేర్లు నమోదు చేయడం జరిగిందని అన్నారు. విషయం తెలిసిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో ఓట్ల నమోదుకు దరఖాస్తు చేశామని పేర్కొన్నారు. మొదటగా దరఖాస్తు చేసిన పొన్నూరు నియోజకవర్గ ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించాల్సిందిగా జనవరి 31వ తేదీనే దరఖాస్తు చేశామని తెలిపారు. ఇప్పటికే ఆ జాబితా నుంచి తొలగించే ఉంటారని భావిస్తున్నామని చెప్పారు. ఇన్నాళ్ళ ప్రజా జీవితంలో ఎన్నడూ టీడీపీ ముఠా మాదిరిగా అనైతిక చర్యలకు పాల్పడలేదని అన్నారు. తప్పుడు పద్ధతుల్లో, కుప్పంలో వేలాది దొంగ ఓట్లు నమోదు చేయించుకున్న మాదిరిగా ఎన్నికల్లో తలపడాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. తమ నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, గత ఐదేళ్ల ప్రభుత్వపాలనే వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపిస్తాయని చెప్పారు.ప్రజలు నిశితంగా వీటన్నింటినీ గమనిస్తూనే ఉన్నారని సజ్జల తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో నేను, నా కుటుంబం ఓట్లు వేయలేదు. పచ్చ కామెర్లు ఉన్న వాడికి లోకమంతా పచ్చగా కనబడినట్టుగా.. @JaiTDP నాయకుడు, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న మీడియా నాపై తప్పుడు ప్రచారం చేస్తోంది. -వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి#BanYellowMediaSaveAP… pic.twitter.com/eF95qaleNi — YSR Congress Party (@YSRCParty) February 14, 2024 -
పూర్తి ఆధారాలతో టీడీపీపై ఈసీకి ఫిర్యాదు: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి. విజయసాయి రెడ్డి నాయకత్వంలో పార్టీ ఎంపీల బృందం ఈరోజు ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)ని కలిసింది. పీపుల్స్ రిప్రెజెంటేషన్ యాక్టును ఉల్లంఘిస్తూ ఎన్నికల సంఘం డేటాను దుర్వినియోగం చేస్తూ టీడీపీ మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న ఘటనలను వైఎస్ఆర్సీపీ ఎంపీలు సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. సీఈసీ భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే...ఓటర్ల జాబితాల సమాచారంతో లబ్ధి పొందాలనే తెలుగుదేశం పార్టీ ప్రయత్నాల్ని వైఎస్ఆర్సీపీ పసిగట్టింది. ‘మై పార్టీ డ్యాష్‌బోర్డ్ డాట్ కామ్’ పేరిట ఆ పార్టీ వెబ్సైట్ కుట్రల్ని...సెక్షన్ 123(3) పీపుల్స్ రిప్రెజెంటేషన్ యాక్ట్‌ను ఉల్లఘిస్తున్న విషయానికి సంబంధించి ఎన్నికల కమిషన్‌ను ఈరోజు మేము కలిశాము. వైఎస్ఆర్సీపీ తరఫున మేము వినతిపత్రం అందించాం. చంద్రబాబు హయాంలో జరిగిన దొంగ ఓట్ల మాల్‌ప్రాక్టీస్‌పై అనేక అంశాల్ని కమిషన్‌తో సుదీర్ఘంగా చర్చించాం. వన్ సిటిజన్ .. వన్ ఓట్ అనే మాపార్టీ సిద్ధాంతాన్ని తెలియపరిచాం. ప్రధానంగా ఓటర్ల కులాల వివరాలు సేకరణ, పొలిటికల్ పార్టీ ప్రయార్టీపై తెలుగుదేశం చేస్తున్న డేటా సేకరణను ఆధారాలతో సహా సీఈసీకి చెప్పాం. వాటన్నింటిపై కమిషన్ అధికారులు పాజిటివ్‌గా స్పందించారు. ‘మైపార్టీ డ్యాష్‌బోర్డ్ డాట్‌కామ్’తో మాల్‌ప్రాక్టీస్... ఎన్నికల కమిషన్ డ్యాష్‌బోర్టులో ఉన్న డేటాను ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ రూపొందించిన ‘మై పార్టీ డ్యాష్‌బోర్డ్ డాట్‌కామ్’లో ఓటరు పేరు, ఊరు, చిరునామా, జెండర్, వయసు, కులంతోపాటు అతను సపోర్టు చేసే పొలిటికల్ పార్టీ, మొబైల్ నెంబర్ వంటి వివరాలున్నాయి. అంటే, రాజకీయ పార్టీల వారీగా ఓటర్లను వేరు చేయడమనేది చట్టవిరుద్ధ చర్యగా మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చాం. తెలుగుదేశం పార్టీ సేకరించిన ఈ ఓటర్ డేటా మొత్తాన్ని అమెరికాలోని న్యూయార్క్‌లో ఒక సర్వర్ పాయింట్ వద్ద స్టోర్ చేస్తున్నారు. అచ్చంగా ఇలాంటి మాల్‌ప్రాక్టీస్ గతంలోనూ టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా సేకరించడం...అప్పట్లో ఆ యాప్‌పై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం తదనంతరం దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం తెలిసిందే. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నమోదైన ఎఫ్ఐఆర్ నెంబర్ 174–2019పై కూడా ఎలాంటి పురోగతి లేదన్న సంగతిని ఎన్నికల కమిషన్ దృష్టికి తెచ్చాం. ఇప్పుడు ‘మైపార్టీ డ్యాష్‌బోర్టు డాట్‌కామ్’ ద్వారా టీడీపీ చేపట్టిన చట్టవిరుద్ధమైన కార్యక్రమంపై 120(బి), 379,420,188 (ఐపీసీ), 72, 66 (ఐటీఏ 2000 యాక్ట్) కింద చర్యలు తీసుకోవాలని మేము ప్రధాన ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాము. టీడీపీ మ్యానిఫెస్టో డాట్‌కామ్‌తో మరో కుట్ర… ఓటరు అంగీకారంతో సంబంధంలేకుండా ఓట్లను ఉంచాలా.. తొలగించాలా అనే సమాచారం కోసం తెలుగుదేశం పార్టీ మరో వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసుకుంది. మైపార్టీ డ్యాష్‌బోర్టు డాట్‌కామ్ ద్వారా సేకరించిన డేటా మొత్తం న్యూయార్క్ సర్వర్‌లో దాస్తుంటే.. టీడీపీ మ్యానిఫెస్టో డాట్‌కామ్ వెబ్సైట్ డేటా మొత్తాన్ని లండన్‌లోని మరో సర్వర్‌లో స్టోర్ చేస్తూ ఉన్నారు. టీడీపీ మ్యానిఫెస్టో డాట్‌కామ్ పేరిట ఎన్నికల కమిషన్ డ్యాష్ బోర్టులో ఇమేజ్ ఫార్మేట్లో ఉన్న సమాచారాన్ని ఎక్సెల్ ఫార్మేట్లోకి మార్చి ప్రతీ 30 ఓట్లకు తమ పార్టీకి చెందిన ఒక ఏజెంట్‌కు అప్పగిస్తారు. అతను ఒక ప్రభుత్వ ఉద్యోగిలా, ఎన్నికల సంఘం సిబ్బంది మాదిరిగా తనకు కేటాయించిన 30 మంది ఓటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల కులమేంటి..? వాళ్ల పొలిటికల్ గుర్తింపేంటి..? వారు ఏ రకమైన బెనిఫిట్స్ పొందుతున్నారు..? వారు ఆరాధించే మతమేంటనే వివరాలతో ఓటర్ల వ్యక్తిగతమైన డేటాను సేకరించడమనేది చట్టవిరుద్ధమని మేము ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా వివరించాము. ‘బాబు ష్యూరిటీ...భవిష్యత్‌కు గ్యారెంటీ’పై ఫిర్యాదు... తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి చట్టవిరుద్ధంగా సమాచారాన్ని సేకరించడం ఆ పార్టీ మాల్‌ప్రాక్టీస్‌లో ఒకభాగమైతే.. 2024 నుంచి రాబోయే ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ పథకాల ద్వారా ఓటరు ఎంత మేలు పొందుతాడనేది లెక్కలేసి ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ ’ అనే ప్రమాణపత్రంతో కూడిన కార్డుల్ని పంపిణీ చేస్తున్నారు. ఇలా దాదాపు 2 లక్షల 40 వేల మందికి ఈ కార్డులు అందచేసినట్లు మేము ఆధారాలతో సహా పట్టుకుని సీఈసీకి ఫిర్యాదు చేశాము. 4.36 లక్షల డూప్లికేట్ ఓట్లను గుర్తించాం... ఓటర్ల పేర్లలో ఒకటో రెండో అక్షరాలను మార్పు చేసి వారు స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల్లో నివాసమున్నట్లు పేర్కొంటూ ఓట్లు చేర్పించే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఒడిగట్టింది. తండ్రి పేరు మార్చడమో లేదంటే భర్తకు భార్య పేరు మార్చడమో ఇలాంటి చిన్నచిన్న మార్పులతో డూప్లికేట్ ఓట్లను తయారు చేసుకునేందుకు ఆ పార్టీ తెగించిందనేది తెలుసుకున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓట్లను కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలోకి తీసుకొచ్చే మాల్‌ప్రాక్టీస్ జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 4 లక్షల 36 వేల 268 ఓట్లు తెలంగాణ ఓటర్ల జాబితాలోనూ ఆంధ్రాలోనూ డూప్లికేటింగ్ ఓట్లుగా కనిపిస్తున్నాయి. వీటి వివరాల్ని కూడా ఆధారాలతో సహా సీఈసీకి అందజేసి.. వీటన్నింటినీ జాబితా నుంచి తొలగించాల్సిందిగా కోరాము. తెలంగాణలో ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు... తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినందున...అక్కడున్న ఆంధ్రప్రదేశ్ సెటిలర్స్ రేపటి ఆంధ్రా ఎన్నికల్లో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహం పన్నింది. అందులో భాగంగా ప్రత్యేకంగా తెలంగాణలో ఓటరు నమోదు శిబిరాలను ఏర్పాటు చేసి ఆన్లైన్లో ఓటర్ల చేర్పులు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అనుకూల సామాజికవర్గ ఓటర్లను తెలంగాణ జాబితాలో తొలగించకుండానే ఆంధ్రప్రదేశ్‌లో వారికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వ్యక్తుల్ని ప్రోత్సహించరాదు... తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ అయిన కోనేరు సురేష్ అనే వ్యక్తి డూప్లికేటింగ్, డబుల్ ఎంట్రీస్, నాన్ లోకల్ కింద ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10 లక్షల ఓట్లు ఉన్నట్లు...వాటిపై ఎంక్వైరీ చేయాలని గతంలో సీఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అక్కడి నుంచి జిల్లా కలెక్టర్లకు ఆ ఫిర్యాదుపై ఎంక్వైరీలు చేయాలని ఆదేశాలొచ్చాయి. అయితే, సదరు ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్లు చాలా సమయాన్ని వెచ్చించి పరిశీలిస్తే ఫిర్యాదులో నిజం లేదని తేలింది. దీనినిబట్టి కోనేరు సురేష్ అనే వ్యక్తి ఎన్నికల సంఘం సమయాన్ని ఎంతగా వృథా చేశాడో అర్ధం చేసుకోవాలి. దీనిపై వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఒకటే అడుగుతున్నాం. ఎవరైనా ఒక వ్యక్తి పది లక్షల మంది ఓటర్ల తరఫున మా ఓట్లు ఒరిజినలా... బోగస్‌వా వెరిఫై చేయండని కోరగలరా? అని అడుగుతున్నాము. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ అబద్ధపు ఫిర్యాదులిచ్చి...విలువైన ఎన్నికల సంఘం అధికారులు, జిల్లా కలెక్టర్లు, సిబ్బంది సమయాన్ని వృథాపరచడం చట్టవ్యతిరేక చర్యగా పరిగణించాల్సిందిగా సీఈసీకి వివరించాం. చదవండి: మార్చిలోనే ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి బొత్స -
సీఈసీని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు.. ఓట్ల తొలగింపుపై భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ హయాంలో ఏపీలో జరిగిన ఓట్ల అవకతవకలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీలు ఈసీని కలిశారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో సీఈసీతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏపీలో ఓట్ల తొలగింపుపై టీడీపీ తప్పుడు ప్రచారాన్ని ఎంపీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈసీతో భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భారీస్థాయిలో ఓట్ల అవకతవకలకు పాల్పడి దొంగ ఓట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు మేము అవకతవకలకు పాల్పడుతున్నామని ఆయన అంటుంటే దొంగే దొంగ అన్నచందాన ఉందన్నారు. ఎలక్షన్ కమిషన్‌కు చేసిన ఫిర్యాదులో 2014 నుంచి నమోదైన దొంగ ఓట్లపై విచారణ జరిపించాలని కోరినట్టు తెలిపారు. 2014-19 వరకు బాబు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించారని, ఆ లెక్క సంగతి తేల్చాలని డిమాండ్ చేస్తూనే దొంగ ఓట్ల ఏరివేత బాధ్యత పూర్తిగా ఈసీదేనని అన్నారు. వెంటనే ఓటరు కార్డులను ఆధార్ కార్డుతో లింక్ చేయాలని, ఒకరికి ఒక్క ఓటు మాత్రమే ఉండాలని.. రాబోయే ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకతతో జరిపించాలని ఈసీని కోరినట్టు స్పస్టం చేశారు. ఈ దఫా అత్యంత పారదర్శకతతో ఓట్ల నమోదు జరిగిందని 2019లో 3,98,34776 ఓట్లు ఉంటే, ఇప్పుడు 3,97,96,678 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఏపీలో ఎక్కడా దొంగ ఓట్ల నమోదు జరగలేదని అన్నారు. ఎన్నికలకు నిజమైన ఓటర్ల జాబితా ఉండాలన్నదే మా ఉద్దేశమని స్పష్టం చేశారు. చంద్రబాబు సేవా మిత్ర, మై టీడీపీ ద్వారా బోగస్ ఓట్లు నమోదు చేయిస్తున్నారని, టీడీపీ ఓటరు ప్రొఫైలింగ్ ఆపాలని ఈసీని కోరినట్టు తెలిపారు. దీనిపై ఈసీ ఫుల్ కమిషన్ ద్వారా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: చంద్రయాన్-3: చంద్రుడిపై భారీ గుంత.. రోవర్ రూట్ మార్చిన ఇస్రో -
టీడీపీ బోగస్ ఓట్లపై ఏపీ సీఈవోకి ఫిర్యాదు
సాక్షి, గుంటూరు: టీడీపీ బోగస్ ఓట్ల వ్యవహారాన్ని మాజీ ఎమ్మెల్యే, పర్చూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి ఆమంచి కృష్ణమోహన్.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం ఏపీ సీఈవోను కలిసిన ఆమంచి.. పర్చూరులో టీడీపీ నేతలు చేర్చిన 40వేల బోగస్ ఓట్లను తొలగించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంలో.. దొంగఓట్లు చేర్చిన ఏలూరు సాంబశివరావు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పర్చూరు వైఎస్ఆర్సీపీ ఇన్ ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ.. 1000మంది ఉన్న జనాభా రేషియోకు సుమారుగా 600మంది ఓటర్లు ఉండాలి. 2014 ఎన్నికల సమయంలో 20,801 ఓట్లు కొత్తగా అక్రమంగా చేరాయి. ఎలక్టరోల్ టు పాపులేషన్ రేషియో గణనీయంగా 760కి పెరిగింది. ఇది దేశంలోనే అత్యధికం. బోగస్ ఓట్లు భారీగా పెరిగినట్టు 2014లో వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ కేసును నీరుగార్చారు. 2014లో పెట్టిన ఆ కేసు ఇప్పటికే తేలలేదు. అందుకే ఇప్పుడు ఆ కేసును రీ ఇన్వెస్టిగేషన్ చేయమని ఈసీని కోరాం. పర్చూరులో బాగా చదువుకున్నవారు ఎక్కువమంది ఉన్నారు. 128మంది ఎన్నారైలు 6A ద్వారా ఇక్కడ ఓటు హక్కు కొనసాగిస్తున్నారు. వాళ్ళ బంధువుల ద్వారా దొంగఓట్లు వేస్తున్నారు. కారంచేడులో పక్క ఊర్లు, పక్క జిల్లాలు, పక్క రాష్ట్రాల్లో ఉన్న ఓట్లు 142 ఉన్నాయి. భారతదేశంలో ఏ పౌరుడికైన ఓటు ఒక్క చోటే హక్కు ఉండాలి. పెళ్ళైన మహిళల ఓట్లను ఇంకా అక్కడే ఉంచుతున్నారు. కర్ణాటక జిల్లా రాయచూరులో స్థిరపడి అక్కడ ఓట్లు ఉన్నవారికి పర్చూరులో ఓట్లు ఉన్నాయి. వేరే ఊర్లలో ఉంటూ పర్చూరులో బోగస్ ఓట్లు నమోదు చేసుకున్నారు. ఎలక్షన్ టైంకి బస్సులు, కారుల్లో వచ్చి ఓటు వేసి వెళ్తున్నారు. 2014, 2019లో మొత్తం 40వేల దొంగఓట్లు చేర్చారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లను సొంతంగా పెట్టుకుని దొంగ ఓట్లను కొనసాగిస్తున్నారు. వీఆర్వోల ద్వారా టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్తున్నాయి. పూర్తి ఆధారాలు ఈసీకి సమర్పించాను. 2014, 19లో దొంగ ఓట్లు చేర్చిన టీడీపీ నేతలతోపాటు వీఆర్వో, ఎమ్మార్వో, డేటాఎంట్రీ ఆపరేటర్లపై కేసులు నమోదు చేయాలి. చట్ట ప్రకారం శిక్షించాలని ఎలక్షన్ కమిషన్ కోరాం అని ఆమంచి తెలియజేశారు. -
కుప్పంలో ఇప్పటికీ లెక్క తేలని 36 వేల ఓట్లు
సాక్షి, కుప్పం(చిత్తూరు జిల్లా) : మూడు రాష్ట్రాల కూడలిలో ఉన్న కుప్పం నియోజకవర్గంలోని బోగస్ ఓట్లతోనే చంద్రబాబు గెలుస్తున్నారని రాజంపేట ఎంపీ, లోకసభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కుప్పం ప్రాంత వాసులకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న సంబంధాలతో బోగస్ ఓట్లు అధికంగా ఉన్నాయన్నారు. నియోజకవర్గంలో రెండు లక్షల పైచిలుకు ఓట్లుండగా, ప్రభుత్వం సంక్షేమ పథకాలు, వివిధ రకాలుగా ఆధార్ కార్డులతో లింక్ అయిన వారు 1.83 లక్షల మంది ఓటర్లే ఉన్నారని తెలిపారు. నియోజకవర్గంలో 17 శాతం అంటే.. ఇంకా 36 వేల ఓటర్లను గుర్తించడం కష్టంగా మారిందని, ఈ ఓటర్లు ఎక్కడి వారో, ఎక్కడ ఉన్నారో తేల్చలేకపోతున్నారని చెప్పారు. రామకుప్పం మండలం విజలాపురంలో కుమార్ అనే వ్యక్తికి విజలాపురంలో ఓటు హక్కు ఉందని, ఇతను పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రం వాణియంబాడిలోనూ ఓటు వినియోగించుకుంటున్నాడని మిథున్‌రెడ్డి చెప్పారు. కంగుంది గ్రామానికి చెందిన అమ్మణ్ణమ్మ కంగుందిలో, పక్కనే ఉన్న విజలాపురం పంచాయతీలోనూ ఓటు వినియోగించుకుంటున్నట్టు తెలిపారు. ఇలాంటి బోగస్ ఓట్లతో చంద్రబాబు ఏళ్ల తరబడిగా కుప్పంలో గెలుస్తున్నారని.. కుప్పంలోని బోగస్ ఓట్లపై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, రెస్కో చైర్మన్ సెంథిల్‌కుమార్ తదితరులున్నారు. చదవండి: (రోడ్లపై సభలు, రోడ్‌షోల నియంత్రణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు) -
Sakshi Cartoon 26-09-2022
అలాగే బోగస్ నాయకులను కూడా ఏరివేయమంటున్నాడు! -
చలో ఆంధ్రా..
సాక్షి, హైదరాబాద్: నగరంలో స్థిరపడ్డ ఏపీకి చెందిన వారిని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ పోటీపడుతున్నాయి. తెలంగాణలో సెటిలైన చాలా మందికి ఏపీలోని సొంతూళ్లలోనూ ఓట్లున్నాయి. అంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వీరు ఓటు హక్కు కలిగి ఉన్నారన్నమాట. దీంతో వీరికి ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది. వీళ్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నెల 11న పోలింగ్ ఉండటంతోపాటు శుక్రవారం సెలవు పెట్టుకుంటే, శని, ఆది సెలవు దినాలు కలసి వస్తున్నాయి. అలాగే ఏప్రిల్ 12 నుంచి పాఠశాలలకు కూడా సెలవులు ఇస్తున్నారు. దీంతో సెటిలర్లను సొంతూళ్లకు రప్పించేందుకు ఏపీలోని పార్టీల నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఫోన్లకు సందేశాలు పంపుతూ అప్రమత్తం చేస్తున్నారు. కొందరైతే స్వయంగా కలసి ఓటేసేందుకు ఊరికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉచిత రవాణా, భోజనం... సెలవుల కారణంగా కొందరు మాత్రమే ఊరెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. మిగిలిన వారిని పార్టీలు రకరకాల తాయిలాలు ఆశజూపి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం తమ ప్రాంత ఓటర్లు అధికంగా ఉండే చోట సామాజిక వర్గాలు, ఊళ్ల వారీగా వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపుతున్నారు. ఏప్రిల్ 9 నుంచే ఉచితంగా తీసుకెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. ఓటేశాక తిరిగి తీసుకొచ్చే బాధ్యత కూడా వీరిదే. మరునాడే రాలేనివారికి చార్జీలు పొందే సదుపాయం అదనం. దారిలో టిఫిన్లు, భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. మందుబాబులకు ప్రత్యేక సదుపాయం కూడా కల్పి స్తున్నారు. ఇక అన్నింటికీ మించి ఓటుకు రూ.2000 నుంచి రూ.3000 వరకు చేతిలో పెడుతున్నారు. ఇన్ని సదుపాయాలు కల్పిస్తుండటంతో చాలామంది సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ‘డబుల్’ఎలా వీలవుతుంది?... దశాబ్దాలుగా ఏపీలో, తెలంగాణలో వేర్వేరు దశల్లో పోలింగ్ జరుగుతూ వస్తోంది. రెండు దశల మధ్య తగినంత సమయం ఉండటంతో చాలా మంది ‘‘ఆడా ఉంటాం.. ఈడా ఉంటాం..’’అన్న ధోరణిలో ఓట్లేసేవారు. రాష్ట్ర విభజన తరువాత కూడా వీరు రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లోనూ ఇదే సంప్రదాయం కొనసాగించారు. పోలింగ్‌కు తగినంత సమయం ఉండటంతో ఇది సాధ్యమైంది. ఈ దఫా కూడా మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే అరుదైన అవకాశం ఉండటంతో వీరికి డిమాండ్ పెరిగింది. 18.5 లక్షల డబుల్ ఓట్లు.. రెండు రాష్ట్రాల్లో కలిపి దాదావు 18.5 లక్షల డబుల్ ఓట్లున్నాయి. అంటే ఏపీలో, తెలంగాణలో రెండు చోట్ల ఓటరు లిస్టులో వీరి పేరుంది. వీటిని బోగస్ ఓట్లుగా గుర్తించి కొట్టేయాలని హైకోర్టులో వ్యాజ్యం నమోదైంది. దీనికి ఏపీ ఎన్నికల సంఘం నిరాకరించింది. అవి బోగస్ ఓట్లు కావని, రెండు చోట్ల ఉన్నవి కాబట్టి, వాటిని డబుల్ ఓట్ల కింద పరిగణిస్తామని కోర్టుకు సమాధానమిచ్చింది. దీం తో వారి ఓట్ల తొలగింపు సాధ్యం కాలేదు. ఈసారి తెలంగాణలో డిసెంబర్లోనే శాసన సభ ఎన్నికలు ముగిశాయి. దీంతో వీరందరికి ఏపీలో రెండోసారి ఓటు వేసేందుకు అవకాశం వచ్చిందన్నమాట. -
ఈసీ ఓటు చాలెంజ్..!
సాక్షి, హుస్నాబాద్ రూరల్: పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లను గుర్తించేందుకు గుర్తింపు పత్రాలు అవసరం. ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు ఫొటో గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఓటరు జాబితాలో పేర్లు తప్పుగా ఉండటం వల్ల ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తిని ఓటు వేయకుండా ఆయా పార్టీల ఎలక్షన్ ఏజెంట్లు అభ్యంతరం చెప్తే ఓటు వేసేందుకు ఓటరు చాలెంజ్ చేసే అవకాశం ఉంది. ఎవరి గుర్తింపునైనా ఏజెంట్లు చాలెంజ్ చేయాలనుకుంటే ప్రిసైడింగ్ అధికారి వద్ద రెండు రూపాయలు జమ చేయాలి. వారు సవాల్ చేసిన ఓటరు గుర్తింపు విషయంలో విచారణ జరపాల్సి ఉంటుంది. విచారణ తర్వాత వ్యక్తి గుర్తింపు నిర్ధారణ అయినట్టు సంతృప్తి చెందితే అతడిని ఓటు వేయనీయవచ్చు. ఓటరు జాబితలో పేర్లు తప్పుగా ఉంటే ఓటు వేసేందుకు ఇతర రాజకీయ పార్టీల ఎలక్షన్ ఏజెంట్లు అభ్యంతరాలు చెప్తే, ఓటరు ‘చాలెంజ్ ఓటు’ హక్కును ఉపయోగించుకోవచ్చు. బోగస్ ఓటు అని తేలితే.. ఓటరు జాబితాలో పేరు ఉన్న ఓటరు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు అతని ఓటును ఇతరులు ఏవరైనా వేసినప్పుడు అక్కడ ఎలక్షన్ ఏజెంట్లు అభ్యంతరాలు చెప్పుతారు. అప్పుడు ఓటరు నేనే నిజమైన ఓటరును అని నిరూపించుకొనేందుకు చాలెంజ్ ఓటును ఎలక్షన్ కమిషన్ కల్పించింది. – కె.అనంత్‌రెడ్డి, ఆర్డీవో దీనికి ఛాలెంజ్ చేసిన వ్యక్తి ప్రిసైడింగ్ అధికారి వద్ద రెండు రూపాయల రుసుం చెల్లించి విచారణ అనంతరం ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. విచారణలో ఓటరు బోగస్ అని తేలితే చట్టరీత్య చర్యలు తీసుకుంటారు. ఓటరుపై విచారణ ఇలా.. బోగస్ ఓటరుపై సవాల్ చేసిన ఏజెంటు ఆ వ్యక్తిని అనుమానిస్తున్నందుకు రుజువులు చూపించాల్సి ఉంటుంది. తమ సవాల్‌ను సమర్థిస్తూ నిరూపణలు చూపలేని పక్షంలో సవాల్‌ను నిరాకరించవచ్చు. పోలింగ్ ఏజెంటు బోగస్ ఓటరుకు సాక్షాలను నిరూపిస్తే అతను ఓటరు కాదని నిర్ధారించిన తర్వాత ఓటరుకు నిరూపించుకొనే అవకాశం ఇవ్వాలి. దీనికి తాను ఓటరునని గుర్తింపును చూపిస్తే అతనిని ఓటు వేయనీయవచ్చు. అలా కాని పక్షంలో గ్రామ అధికారి ద్వారా లేదా ఇతర అధికారుల చేత గుర్తించవచ్చు. విచారణలో బోగసు ఓటరు అని తేలితే అక్కడే ఉండే పోలీసులకు అతనిని అప్పగించాల్సి ఉంటుంది. ఓటరు నిర్ధారణ జరిగితే ఓటు వేయనిస్తారు. -
ఎమ్మెల్యే కుటుంబానికి 1+1, 1+2 ఆఫర్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: బోగస్ ఓట్లు తొలగించాని కోరితే తప్పట! ఒకే వ్యక్తికి రెండు మూడు ఓట్లు ఉండడంపై ఫిర్యాదు చేస్తే నేరమట! ఓట్ల జాబితాలో ఉన్న అక్రమాలను సరిచేయాలని ఫారం–7పై దరఖాస్తు చేస్తే అదేదో అడ్డగోలుతనమట! ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్ సంస్థల ముసుగులో ప్రజల డేటాను చోరీ చేసి, తెలంగాణ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురుదాడిలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలివి. అబద్ధాలను పదేపదే చెప్పి నిజాలుగా నమ్మించడంలో సిద్ధహస్తుడైన ఆయనకు ఫారం–7 ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశమని తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించకమానదు. తానేది చెబితే అదే నిజం.. తాను చెప్పిందే వాస్తవం అన్నట్టుగా ప్రజల డేటా చోరీ వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో చంద్రబాబు వితండవాదం చేస్తున్నారు. ఇంత అడ్డంగా బుకాయిస్తున్న ఆయన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఓట్ల అక్రమాలపై, ముఖ్యంగా తన ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబంలోనివారికి రెండేసి మూడేసి ఓట్లు ఉండడంపై ఏమంటారో చూడాలి. ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలన్న తపనతో కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం ఇవేవీ వర్తించవా అనిపిస్తోంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబం మొత్తం దొంగ ఓట్లకు చిరునామాగా మారిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. కాకినాడ రూరల్‌తో పాటు పెద్దాపురం నియోజకవర్గం మాధవపట్నంలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబానికి ఓట్లు నమోదై ఉన్నాయి. అనంతలక్ష్మితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు రెండు నుంచి మూడు ఓట్లు ఉండడం విచిత్రం. ఆమె కుటుంబానికి వివిధచోట్ల ఉన్న ఓట్ల వివరాలివీ.. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి (రెండు ఓట్లు) : పెద్దాపురం నియోజకవర్గంలోని ఈమె స్వగ్రామమైన మాధవపట్నం బూత్ నంబర్ 188లో ఓటర్ నంబర్ హెచ్ఎస్ఎఫ్ 2456226 పేరిట ఎమ్మెల్యే అనంతలక్ష్మికి ఒక ఓటు ఉంది. అలాగే కాకినాడ రూరల్ పరిధిలోని బూత్ నంబర్ 38లో ఓటర్ నంబర్ ఐఎంజెడ్ 2075331పై మరో ఓటు ఉంది. ఎమ్మెల్యే భర్త సత్యనారాయణమూర్తి (మూడు ఓట్లు) : ఈయనకు కాకినాడ రూరల్ బూత్ నంబర్ 38లో ఓటర్ నంబర్ ఐఎన్జెడ్ 2078319లో ఒక ఓటు ఉంది. అలాగే, కాకినాడ రూరల్‌లోని బూత్ నంబర్ 106లో ఓటర్ నంబర్ ఐఎన్జెడ్ 1724087పై మరో ఓటు ఉంది. అలాగే, పెద్దాపురం నియోజకవర్గంలోని మాధవపట్నంలో బూత్ నంబర్ 188లో ఓటర్ నంబర్ ఏపీఓ 70430519155పై ఇంకో ఓటు ఉంది. పిల్లి కృష్ణప్రసాద్ (ఎమ్మెల్యే మొదటి కుమారుడు) (రెండు ఓట్లు) : ఈయనకు పెద్దాపురం నియోజకవర్గం మాధవపట్నంలోని బూత్ నంబర్ 188లో ఓటర్ నంబర్ ఏపీఓ 70430519410పై ఒక ఓటు ఉంది. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం బూత్ నంబర్ 38లో ఓటర్ నంబర్ ఐఎంజడ్ 2068310పై మరో ఓటు ఉంది. పిల్లి కృష్ణకళ్యాణ్ (ఎమ్మెల్యే రెండో కుమారుడు) (మూడు ఓట్లు) : ఈయనకు పెద్దాపురం నియోజకవర్గం బూత్ నంబరు 188లోని ఓటర్ నంబర్ హెచ్ఎస్ఎఫ్ 1182708పై ఒకటి, కాకినాడ రూరల్ నియోజకవర్గం బూత్ నంబర్ 38లో ఓటర్ నంబర్ ఐఎంజడ్ 2068211పై మరొకటి, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో బూత్ నంబర్ 46, ఓటర్ నంబర్ ఐఎంజడ్ 1493402లో మూడో ఓటు ఉన్నాయి. పిల్లి రాధాకృష్ణ (ఎమ్మెల్యే మూడో కుమారుడు) (3 ఓట్లు) : ఈయనకు పెద్దాపురం నియోజకవర్గం బూత్ నంబరు 188లో ఓటర్ నంబర్ హెచ్ఎస్ఎఫ్ 1182757పై ఒకటి, కాకినాడ రూరల్ నియోజకవర్గం బూత్ నంబర్ 38లో ఓటర్ నంబర్ ఐఎంజడ్ 2067205పై మరొకటి, కాకినాడ రూరల్ నియోజకవర్గం బూత్ నంబర్ 46లో ఓటర్ నంబర్ ఐఎంజెడ్ 1493550పై మరొకటి ఓట్లు ఉన్నాయి. ఈ ఒక్క ఎమ్మెల్యే కుటుంబంలోని సభ్యులకే రెండేసి మూడేసి ఓట్లు ఉన్నాయంటే మిగతాచోట్ల, మిగతావారికి ఇంకెన్ని ఉండవచ్చో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి ఓట్లను తొలగించాలని ఫారం–7పై అభ్యర్థన చేస్తే నేరమని చంద్రబాబు చెబుతున్నారు. అసలు ఇలాంటివి తొలగించడం కోసమే ఫారం–7 అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఇవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు ఎదురుదాడికి దిగి, ఫారం–7 దరఖాస్తులు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని, తీసుకుంటామని బెదిరింపులకు దిగడం ఎంతవరకూ సమంజసమో మరి! -
ఫామ్-7పై స్పష్టత ఇచ్చిన ఏపీ సీఈవో ద్వివేది
సాక్షి, అమరావతి : ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా పని చేస్తుందని, ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి జేకే ద్వివేది స్పష్టం చేశారు. ఆయన గురువారమిక్కడ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ...‘ఈ ఏడాది జనవరి 11వ తేదీ తర్వాత రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా తొలగించలేదు. ఫామ్-7 దరఖాస్తు మాత్రమే. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే ఓటు తొలగించినట్లు కాదు. నకిలీ దరఖాస్తులపై పోలీసుల కేసులు ప్రారంభం కాగానే దరఖాస్తులు ఆగిపోయాయి. ఓట్ల తొలగింపు వ్యవహారంలో రాజకీయ పార్టీల వైఖరి సరికాదు. ప్రజల్ని గందరగోళానికి గురిచేసే ప్రకటనలు సరికాదు. పార్టీల నేతలు ఎన్నికల సంఘానికి ఫామ్-7పై అభ్యంతరాలు చెబుతున్నారు. బయటకు వెళ్లి ఓట్లు తొలగిస్తున్నారని చెబుతున్నారు. ఎక్కడ ఓట్లు తొలగించారో విమర్శించేవారు నిరూపించాలి. ఏపీలో జనాభా కంటే ఓటరు నిష్పత్తి తక్కువగా ఉంది. 18 ఏళ్లు నిండిన యువతలో ఎక్కువమందికి ఓటు హక్కు లేదని గుర్తించాం. ఎన్నికల సంఘంపై అనుమానపడాల్సిన అవసరం లేదు.’ అని అన్నారు. ఈ సందర్భంగా ఫామ్-7పై ఏపీ సీఈవో ద్వివేది స్పష్టత ఇచ్చారు. ఫామ్-7 ఇచ్చినంత మాత్రాన ఓట్లు తొలగించం ఫామ్-7 దరఖాస్తులు ఇవ్వడం తప్పు కాదు ఫామ్-7 ఇచ్చిన దరఖాస్తులన్ని విచారిస్తాం ఫామ్-7 ఇచ్చినంత మాత్రాన ఓట్లు తొలగించం ఇప్పటివరకు 10 వేల ఓట్లు మాత్రమే తొలగించాం ఫామ్-7 దరఖాస్తుల్లో 40 వేల ఓట్లను మాత్రమే తొలగించేందుకు అనుమతి ఇచ్చాం ఫామ్-7 దరఖాస్తులు ఎన్ని ఇచ్చినా నష్టం లేదు తప్పుడు ఫిర్యాదులుపై కేసులు నమోదు చేయగానే దరఖాస్తులు తగ్గిపోయాయి కాగా 8లక్షల టీడీపీ ఓట్లు తొలగించారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓట్ల తొలగింపు కోసం ఫామ్-7ను ఉపయోగించారని, ’చూస్తుంటే రేపు నా ఓటు కూడా తొలగిస్తారేమో'నని చంద్రబాబు ట్విట్టర్లో పేర్కొనడం గమనార్హం. -
ఓట్ల గురించి నీకెందుకు?
-
ఎన్నికల పారదర్శకతకు వెబ్‌కాస్టింగ్
-
ఏపీ ఓటరు జాబితాలో పొరపాట్లను గుర్తించాం: సీఈఓ
సాక్షి, అమరావతి: రానున్న సార్వత్రిక, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడానికి వెబ్ కాస్టింగ్ పెడుతున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అదికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఓటర్ల జాబితాలో నకిలీ, డబుల్ ఎంట్రీ ఓటర్లను తొలగిస్తున్నామన్నారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగాయన్న రాజకీయ పార్టీల ఫిర్యాదులపై మూడు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలలో అధికారులు తనిఖీలు చేశారన్నారు. ఒక్క ఓటు తొలగించాలన్నా కలెక్టర్, ఎన్నికల సంఘం అనుమతి తప్పకుండా ఉండాలన్నారు. సుమోటోగా ఓట్లను తొలగించడానికి వీల్లేదని అధికారులకు సూచించారు. నకిలీ ఓటర్లను తొలగిస్తామని, అయితే దానికి కాస్త సమయం కావాలన్నారు. ఇప్పటికే ఓటర్ జాబితాలో పొరపాట్లను గుర్తించామని, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఇక ఎమ్మెల్సీ ఓటర్ జాబితా సిద్దమైందని అయితే.. ఎమ్మెల్యే కోటా ఎన్నికలకు ఎలక్షన్ కోడ్ వర్తించదన్నారు. పట్టభద్రుల, టీచర్ల ఎన్నికలకు పాక్షికంగా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఆయన తెలిపారు. -
ఒకే ఇంట్లో 50కిపైగా ఓట్లు..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు, ఇతర అవకతవకల గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేృతృత్వంలో పార్టీ నేతల బృందం సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ సందర్బంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. లోకసభ ఎన్నికల్లో ఓటర్ జాబితా పారదర్శకత ఉండాలని ఈసీని కోరారు. ఒకే ఇంటిలో 50కిపైగా ఓట్లు ఉన్న ఇళ్ల వివరాలను ఈసీకి అందజేశామని, తమ ఫిర్యాదు మీద విచారణ జరుపుతామని రజత్‌కుమార్ భరోసా ఇచ్చారని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను రజత్‌కుమార్ దృష్టికి తీసుకొచ్చామని, బోగస్, డూప్లికేట్ ఓట్లు, డబుల్ ఓట్లపై ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ విషయంలో ఈసీ ఎవరిని బాధ్యులను చేయకుండా ఎలా ఉందని ప్రశ్నించినట్టు తెలిపారు. కొత్త ఓట్ల నమోదులో బోగస్ ఓట్ల నమోదు జరిగిందని, డిసెంబర్లో బోగస్ ఓట్ల వివరాలు ఇచ్చినా కూడా ఇంతవరకు విచారణ చెయ్యలేదని, ఆ ఓట్లను తొలగించలేదని తెలిపారు. గత ఎన్నికల్లో ఓటరు స్లిప్స్ పంపిణీ కూడా సరిగా జరగలేదన్నారు. వీవీప్యాట్లు వచ్చాక పోలింగ్ సమయం ఎక్కువ అవసరమన్నారు. పోలింగ్ తేదీలు కూడా సెలవు దినాలలో కాకుండా వారం మధ్యలో పెట్టాలని కోరామన్నారు. -
బోగస్ ఓటర్లపై ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బోగస్ ఓటర్ల తొలగింపునకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు వెల్లడించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సోమవారం హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో ఇంతవరకూ ఏం పురోగతి సాధించారో తెలపాలని సూచిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితా నుంచి బోగస్ ఓటర్లను, అనర్హులను, డూప్లికేట్ ఓటర్లను తొలగించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, 50 లక్షలకు పైగా బోగస్ ఓటర్లున్నారని, వాటన్నింటినీ తొలగిస్తేనే ఓటర్ల జాబితాకు స్వచ్ఛత లభిస్తుందన్నారు. ఓటర్ల జాబితా తయారీలో అనేక అవకతవకలు జరిగాయని కోర్టుకు వివరించారు. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు నిరంతరం సాగే ప్రక్రియని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకునేంత వరకు జాబితాలో చేర్పులు, తొలగింపులకు ఆస్కారం ఉంటుందని వివరించారు. పిటిషనర్ లేవనెత్తిన బోగస్ ఓటర్ల తొలగింపు కూడా ఆ ప్రక్రియలో భాగంగా జరుగుతుందని తెలిపారు. -
ఆ ఓటర్లు ఇంకా బతికే ఉన్నారా?
సాక్షి, హైదరాబాద్: ఒకే ఇంట్లో 30 మందికి మించి ఓటర్లున్నారా? ఓటరు జాబితాలో పేర్లున్న 100 ఏళ్ల ఓటర్లలో బతికున్నవారెంతమంది? ఇంటి నంబరు లేని ఓటర్లు ఎవరెవరు? ఒకే విధమైన పేరు, తండ్రి పేరు, వయస్సు, ఫొటోలున్న డూప్లికేట్ ఓటర్లు ఎంత మందున్నారు? అన్న అంశంపై ఎన్నికల సంఘం లోతుగా పరిశీలన జరుపుతోంది. బోగస్ ఓటర్ల ఏరివేతలో భాగంగా పైన పేర్కొన్న నాలుగు రకాల అనుమానాస్పద ఓటర్ల వివరాలతో నివేదికలు రూపొందించి బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓ)కు అందజేయనుంది. బీఎల్ఓలు క్షేత్ర స్థాయికి వెళ్లి ఈ నివేదికల్లో పొందుపరిచిన ఓటర్ల గురించిన వివరాలపై విచారణ జరపనున్నారు. ఓటర్ల జాబితాలో లక్షల సంఖ్యలో ఇలాంటి బోగస్ ఓటర్లున్నారని ఆరోపిస్తూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలకు ముందు ఆధారాలతో సహా హైకోర్టులో కేసువేసింది. దీంతో ఎన్నికల సంఘం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనాల్సి వచ్చింది. శాసనసభ ఎన్నికల పోలింగ్ రోజు లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం చెలరేగింది. ఏకంగా ఓటర్ల జాబితా నుంచి 22 లక్షల మంది అర్హుల ఓట్లు గల్లంతయ్యాయని విమర్శలొచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి నెలరోజులైనా ఇంకా ఓటర్ల జాబితాలో లోపాలపై చర్చ జరుగుతుండటంతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీగా ఓటర్ల జాబితా రూపొందించాలని నిర్ణయించింది. 2019 జనవరి 1 అర్హత తేదీగా ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణలో భాగంగానే.. ఈ ఏరివేతకు పూనుకుంది. ఒకవేళ బోగస్, చనిపోయిన, చిరునామా మారిన ఓటర్లు అని తేలితే సంబంధిత ఓటర్లను వచ్చే ఏడాది ప్రకటించనున్న ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని సిఫారసు చేయనున్నారు. బీఎల్వోలకు లోపాల చిట్టా! ఓటర్ల జాబితాలో ఇంటినంబరు ఉండాల్సిన చోట ‘నో’, ‘న్యూ’, ‘ఓల్డ్’వంటి పదాలతో వేల సంఖ్యలో ఓటర్ల పేర్లున్నాయి. కనీసం మూడంకెలులేని బోగస్ ఇంటి నంబర్లతో సైతం పెద్ద సంఖ్య లో ఓటర్లున్నారు. ఇంటి నంబర్‌ను పేర్కొనకుండా ఖాళీగా ఉంచడం/సున్నా రాయడం/ఒకే అంకె ఇంటి నంబరున్న ఓటర్లు వేలలోనే ఉన్నారు. దీనిపై ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఫిర్యాదులొచ్చాయి. ఈ నేపథ్యంలో ఒకే ఇంటి నంబరుతో 30, అం తకు మించిన సంఖ్యలో ఓటర్లుంటే వారి జాబితాలను ఎన్నికల సం ఘం సిద్ధం చేస్తోంది. 18 ఏళ్ల లోపు, 100 ఏళ్లు మించిన వయస్సు గల ఓటర్లు సైతం వేల సంఖ్యలో ఉన్నట్లు గుర్తించింది. చనిపోయినవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ కుటుంబ సభ్యులెవరూ దరఖాస్తు చేయడం లేదు. దీంతో ఓటర్లు చనిపోయి దశా బ్దాలు గడుస్తున్నా వారి పేర్లు ఇంకా ఓటర్ల జాబితాలో కొనసాగుతు న్నాయి. పెద్ద సంఖ్యలో ఓటర్లు ఒకే ప్రాంతం/వేర్వేరు ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ సార్లు ఓటర్ల జాబితాలో పేర్లు కలిగి ఉన్నారు. ఓటర్ల జాబితా వెబ్సైట్లో శోధించిన కొద్దీ ఒకే విధమైన వోటర్ ఐడీ, పేరు, వయస్సు, లింగం, చిరునామా, ఫొటోలు కలిగిన ఓటర్లు ఉన్నట్లు బయటపడుతున్నారు. ఈఆర్వో నెట్ సాఫ్ట్వేర్ ఆధారంగా ఈ నివేదికలను ఎన్నికల సంఘం తయారు చేస్తోంది. ఇంటి నంబరు ఆధారంగా.. నేషనల్ ఓటరు సర్వీస్ పోర్టల్ (https://electoralsearch.in)లో ఇంటి నంబర్ ఆధారంగా శోధించే సదుపాయం ఉండేది. శాసనసభ ఎన్నికలకు ముందు ఈ సదుపాయాన్ని తీసేశారు. కేవలం ఓటరు పేరుతో మాత్రమే శోధించే అవకాశముంది. అయితే భారీ స్థాయిలో మార్పులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మళ్లీ ఇంటి నంబరు ఆధారంగా ఓటర్లను శోధించేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈఓ రజత్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడన్నా సక్కగవుతదా? తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2015లో చేపట్టిన నేషనల్ ఎలక్టోరల్ రోల్ ప్యూరిఫికేషన్ అండ్ అథెంటిఫికేషన్ ప్రోగ్రాం (నెర్పార్) కింద 35,00,700 బోగస్ ఓటర్లను తొలగించారు. 2016లో చేపట్టిన ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ (ఐఆర్‌ఈఆర్) కార్యక్రమం కింద మళ్లీ 24,20,244 ఓటర్లను తీసేశారు. జనవరి 2015 నాటికి రాష్ట్ర ఓటర్ల జాబితాలో 2.84 కోట్ల మంది ఓటర్లుండగా, ఈ రెండు కార్యక్రమాల కింద ఏకంగా 59,20,944 ఓటర్లను తొలగించారు. దీనికి అదనంగా వార్షిక ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కింద గత నాలుగేళ్లలో ప్రతి ఏటా లక్ష నుంచి రెండు లక్షల బోగస్ ఓటర్లను తొలగించారు. బోగస్, చిరునామా మారి, చనిపోయిన ఓటర్లను మాత్రమే తొలగించామని సీఈఓ రజత్‌కుమార్ తెలిపారు. పెద్ద సంఖ్యలో అర్హులైన ఓటర్లను తొలగించి, బోగస్ ఓటర్లను జాబితాలో ఉంచారని ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. గత నాలుగేళ్లలో ఏకంగా 60 లక్షలకు పైగా బోగస్ ఓటర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంటున్నా ఓటర్ల జాబితాలో ఇంకా బోగస్ ఓట్లున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కీలకంగా మారింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించనున్న ఓటర్ల జాబితాలో మళ్లీ అవే పొరపాట్లు పునరావృతమైతే ఆ తర్వాత జరగనున్న లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం మరోసారి అభాసుపాలు కాకతప్పదని విమర్శలు వస్తున్నాయి. -
‘బోగస్’ ఏరివేత..!
ఆదిలాబాద్‌అర్బన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద మొత్తంలో ఓట్లు తొలగింపునకు గురయ్యాయి. నాలుగు జిల్లాల పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో నాలుగేళ్ల కాలంలో 2,05,174 మంది బోగస్ ఓటర్లను తొలగించినట్లు ఆయా జిల్లాల ఎన్నికల అధికారుల వద్ద లెక్కలున్నాయి. ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గంలో అత్యధికంగా 92,337 ఓట్లు ఏరివేతకు గురయ్యాయి. దీంతో 2014లో ఉమ్మడి జిల్లా ఓటర్ల సంఖ్యకు.. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య పొంతన లేకుండా పోయింది. 2015లో స్పెషల్ సమ్మరి రివిజన్, 2017లో ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రోల్(ఐఆర్‌ఈఆర్) కార్యక్రమాల ద్వారా బోగస్ ఓటర్లను ఏరి వేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇవి కాకుండా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా జిల్లాల్లో మరో రెండు సార్లు ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాలు చేపట్టి అర్హులైన వారిని నమోదు చేశారు. కానీ యువత నుంచి స్పందన రాక లక్ష్యానికి అనుగుణంగా ఓటర్లు నమోదు కాలేదు. అంటే ఓటర్ల తొలగింపుపై కనబర్చిన శ్రద్ధ.. ఎన్నికల అధికారులు నమోదులో చూపలేదని స్పష్టంగా అర్థమవుతోంది. తొలగిపోయిన ఓటర్లలో చనిపోయిన వారు, రెండేసి గుర్తింపు కార్డులు ఉన్న వారు.. వలస వచ్చి ఇక్కడే ఉంటున్న వారు ఉన్నారు. వీరితోపాటు కొందరు అర్హులైన ఓటర్లు కూడా తొలగిపోయారని దృష్టికి రావడంతో అప్పట్లో ఆదిలాబాద్‌లో దుమారం రేగింది. అర్హులుగా ఉంటే ఈ నెల 25 వరకు నమోదు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. నిరంతరంగా కొనసాగుతూ వస్తున్న నమోదు కార్యక్రమాల ద్వారా ఓటర్ల సంఖ్య పెరగాలి కానీ తగ్గిపోవడం ఇక్కడ గమనించదగ్గ విషయం. 2,05,174 ఓట్ల తొలగింపు.. 2014 ఏప్రిల్ 16న విడుదల చేసిన ఓటర్ల ఫైనల్ డాటాబేస్ ప్రకారం ఉమ్మడి జిల్లాలో 19,59,660 మంది ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో ఏడు నియోజకవర్గాల్లో 2,05,174 బోగస్ ఓటర్లను వివిధ కారణాలతో తొలగించారు. మిగతా 17,54,486 మంది ఓటర్లను అర్హులుగా తేల్చారు. ఈ నాలుగేళ్ల కాలంలో చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమాల ద్వారా నాలుగు జిల్లాల్లో కేవలం 12,679 మంది యువతే కొత్తగా జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో అర్హత గల ఓటర్ల సంఖ్య 17,67,165కు చేరింది. ఈ జాబితానే 2018 సె ప్టెంబర్ 1న ముసాయిదా జాబితాగా నాలుగు జి ల్లాలో విడుదల చేశారు. ఈ తొలగింపులు, కొత్త ఓటరు నమోదులు, సవరణ ప్రక్రియలు ఆయా జిల్లాలో పరిధిలోనే జరిగాయి. ఓటర్లు తొలగిపోయిన ఏడునియోజకవర్గాలను ఓసారి పరిశీలిస్తే.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా.. సిర్పూర్ : ఈ నియోజకవర్గంలో 2014లో 1,90,722 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం 1,79,292 మంది ఓటర్లు ఉండగా, మిగతా 11,430 ఓట్లు తొలగించబడ్డాయి. తొలగిపోయిన ఓట్లలో 5,349 మంది పురుషులు ఉండగా, 6,084 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. బెల్లంపల్లి : ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో 2014లో 1,60,960 మంది ఓటర్లుగా ఉండగా, ప్రస్తుతం 1,55,153 మంది ఓటర్లు ఉన్నారు. అంటే 5,807 ఓట్లను అధికారులు తొలగించారు. తొలగిపోయిన వారిలో 2,779 మంది పురుషులు ఉండగా, 3028 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మంచిర్యాల: ఈ నియోజకవర్గంలో 2014లో 2,38,423 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం 1,46,086 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా 92,337 ఓట్లు తొలగించబడ్డాయి. తొలగిపోయిన వారిలో 48,425 మంది పురుషులు ఉండగా, 43,896 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఖానాపూర్ : ఈ నియోజకవర్గంలో 2014లో 1,86,435 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం 1,78,715 మంది ఓటర్లు ఉన్నారు. అంటే 7,720 ఓట్లు తొలగించబడ్డాయి. తొలగిపోయిన వారిలో 2699 మంది పురుషులు ఉండగా, 5,048 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆదిలాబాద్ : ఈ నియోజకవర్గంలో 2014లో 2,23,175 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం 1,73,951 మంది ఓటర్లు ఉన్నారు. ఏకంగా 49,224 ఓట్లు తొలగించబడ్డాయి. ఇందులో 26,630 మంది పురుషులు ఉండగా, 22,590 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నిర్మల్ : ఈ నియోజకవర్గంలో 2014లో 2,10,094 మంది ఓటర్లు ఉండగా, 1,86,512 మంది ఓటర్లు ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాక 23,582 మంది ఓటర్లు తొలగిపోయాయి. తొలగిపోయిన వారిలో పురుషులు 11,222 మంది ఉండగా, 12,363 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ముథోల్ : ఈ నియోజకవర్గంలో 2014లో 2,08,805 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం 1,93,731 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నాలుగేళ్లలో 15,074 మంది ఓట్లను తొలగించారు. తొలగిపోయిన వారిలో 6,984 మంది పురుషులు ఉండగా, 8,088 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇవే కాకుండా 22 ఇతర ఓటర్లు (థర్డ్ జెండర్) ఉన్నారు. తొలగించబడిన వారిలో చని పోయిన వారు సుమారు 35,670 మంది ఉండగా, మిగతా వారందరు వలస వచ్చి ఇక్కడ ఉం టున్న వారు, రెండేసి ఓట్లున్న వారు, బోగస్‌గా గుర్తించిన ఓట్లని అధికారులు పేర్కొంటున్నారు. మూడు నియోజకవర్గాల్లో పెరుగుదల ఉమ్మడి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఈ నాలుగేళ్ల కాలంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. చెన్నూర్ నియోజకవర్గంలో నాలుగేళ్లలో 1,897 మంది ఓటర్లు పెరగగా, అసిఫాబాద్‌లో 10,271 మంది పెరిగారు. ఇక బోథ్ నియోజకవర్గంలో తక్కువగా 511 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారుల రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. నాలుగేళ్లలో 12,679 మందే నమోదు.. ఎన్నికల సంఘం ప్రతీ ఏడాది అన్ని జిల్లాల్లో అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఓటరు సవరణ కార్యక్రమాలను చేపడుతూ వస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా అధికారులు కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తులు స్వీకరించడంతోపాటు కార్డుల్లో మార్పులు, చేర్పులు, తొలగింపులు, చిరునామాల మార్పులకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ నాలుగేళ్లు జరిగిన సవరణ కార్యక్రమాల ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12,679 మందే నమోదైనట్లు కన్పిస్తోంది. 2014లో ఉమ్మడి జిల్లాలో 19,59,660 మంది ఓటర్లు ఉంటే ఇందులోంచి 2,05,174 మంది తొలగించబడ్డాయి. మిగతా 17,54,486 మంది అర్హులుగా తేలారు. 2018 సెప్టెంబర్న విడుదల చేసిన జాబితా ప్రకారం 17,67,165 మంది ఓటర్లు ఉన్నారు. అంటే ఈ నాలుగేళ్ల కాలంలో 12,679 మంది మాత్రమే ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని చెప్పవచ్చు. జనాభా ప్రతిపాదికన ప్రతియేడాది లక్ష్యం మేరకు ఓటర్లను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఎన్నికల సంఘం ప్రతి యేడాది నమోదు చేపడుతోంది. ప్రతీ యేడాది ఓటర్ల సంఖ్య పెరుగుతూ రావాలి. కానీ ఉన్న ఓటర్లు తగ్గిపోవడం శోచనీయం. ఫలితాలివ్వని నమోదు కార్యక్రమాలు.. ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన లేకపోవడమో.. అధికారుల ప్రచారలోపమో మొత్తానికి ఓటర్ల నమోదు కార్యక్రమాలు ఫలితాలివ్వడం లేదు. గత నాలుగేళ్లుగా ఈ కార్యక్రమాలు చేపట్టిన యువత ముందుకు గమనార్హం. పద్దెనిమిదేళ్లు నిండిన యువత నమోదు చేసుకోవడం లేదా.. లేక వారికి తెలియడం లేదా అనేది అధికారులకు కూడా అంతుచిక్కడం లేదని తెలుస్తోంది. విద్యార్థి దశ నుంచే ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్న స్పందన రావడం లేదు. ఎన్నికల సమయంలో నమోదుపై హడావుడి చేయడం తప్పా మిగతా సమయాల్లో పట్టించుకున్న పాపన పోవడం లేదు. దీంతో ఒకేసారి యువత స్పందించి నమోదు చేసుకోవాల్సి రావడంతో వలన వచ్చిన వారు, ఒక్కొక్కరు రెండేసి చోట్ల నమోదు చేసుకోవడం లాంటివి జరుగుతున్నాయి. దీంతో మళ్లీ వారిని బోగస్‌గా గుర్తించాల్సి వస్తోందని సమాచారం. -
48 వేల బోగస్ ఓట్లా?
సాక్షి, చెన్నై: బోగస్ ఓటర్లను చేర్చేందుకు ప్రయత్నించే రాజకీయ నాయకులు, అందుకు సహకరించే అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఎన్నికల కమిషన్‌ను మద్రాస్ హైకోర్టు బుధవారం ఆదేశించింది. ప్రతిపక్ష డీఎంకే పార్టీ ఆందోళనలతో త్వరలో ఉపఎన్నికలు జరగనున్న ఆర్కే నగర్లో ఇప్పటివరకు 42 వేల బోగస్ ఓటర్లను అధికారులు తొలగించారు. అయితే ఆర్కే నగర్లో ఇంకా 6 వేలమంది బోగస్ ఓటర్లు ఉన్నారనీ..వీరందరినీ తొలగించాల్సిందిగా అధికారుల్ని ఆదేశించాలంటూ డీఎంకే ఎంపీ ఆర్.ఎస్.భారతీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ శివజ్ఞానం, జస్టిస్ రవిచంద్రల ధర్మాసనం ఒక్క నియోజకవర్గంలోనే దాదాపు 48 వేల బోగస్ ఓటర్లు ఉండటం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని వ్యాఖ్యానించింది. ఈ కేసులో దోషులుగా తేలిన రాజకీయ నాయకుల్ని ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించేలా చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించింది. -
ఆ నియోజకవర్గంలో భారీగా నకిలీ ఓటర్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో మొత్తం 5.93 కోట్ల మంది ఓటర్లుండగా.. ఎన్నికల కమిషన్(ఈసీ) నిర్వహించిన సర్వేలో 11 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నట్లు తేలింది. వీరిని ఏరివేయడంపై ఈసీ దృష్టి సారించింది. వీరిలో అధిక శాతం మంది ఉద్ధేశపూర్వకంగా నకిలీ ఓటర్లుగా చలామణి అవుతున్నట్లు గుర్తించారు. కొందరు మాత్రం ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం వేరే జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లిపోవడం వల్ల నకిలీ ఓటర్లుగా ముద్రపడ్డారు. మరోసారి సర్వే నిర్వహించి అనర్హులను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది. జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్లో 30,495 మంది నకిలీ ఓటర్లను గుర్తించారు. పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లు ఉన్నట్లు తేలడంతో ఈ విషయాన్ని ఈసీ సీరియస్‌గా తీసుకుంది. -
బోగస్ పట్టభద్రుల ఓటర్లను తొలగించండి
–అధికార పార్టీ నేతలు అక్రమంగా లబ్ధిపొందేందుకు బోగస్ ఓటర్లను చేర్పించారు –రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేస్తాం – వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్ రెడ్డి కర్నూలు(అగ్రికల్చర్): పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో అధికారపార్టీ నేతలు అధికారులను గుప్పిట్లో పెట్టుకొని అడ్డగోలుగా బోగస్ ఓటర్లను చేర్పించారని, వీటిని వెంటనే తొలగించాలని వైఎస్ఆర్సీపీ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలుగుదేశం నేతలు ఓటమి భయంతో ఇలా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ...పట్టభధ్రుల ఓటర్ల నమోదుకు ఎన్నికల కమిషన్ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిన అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. తెలుగుదేశం నేతల ఆధ్వర్యంలో ఓటర్ల జాబితాను తయారు చేసినట్లు అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. 2013 అక్టోబరులోపు డిగ్రీ, తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారినే ఓటర్లుగా నమోదు చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా పదో తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్ చేసిన వారిని ఓటర్లుగా నమోదు చేయడం దారుణమనా్నరు. ఒక్క కర్నూలు జిల్లాలోనే దాదాపు 8500 బోగస్ పట్టభద్రుల ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోందని, దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ప్రభుత్వానికి పట్టభద్రులు వ్యతిరేకంగా ఉన్నందున టీడీపీ నేతలు బోగస్ ఓటర్లతో ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రోజాను అడ్డుకోవడం దారుణం ఎమ్మెల్యే రోజాను అమరావతిలో నిర్వహించిన మహిళా పార్లమెంటు సదస్సుకు అనుమతించకపోవడం అత్యంత దారుణమని వైఎస్ఆర్సీపీ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు మహిళా ప్రజాప్రతినిధి పట్ల అమానుషంగా ప్రవర్తించడం బాధాకరమని చెప్పారు. వెంటనే ప్రభుత్వం రోజాకు క్షమాపన చేప్పాలని డిమాండ్ చేశారు. -
ఇకపై రెండు ఓట్లుంటే కేసులు
జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి * ఒక ఓటును తొలగించుకోవాలని సూచన * ఓటర్ల జాబితాలో పరిశీలన తప్పనిసరి * నోటిఫికేషన్ వరకు ఓటర్ల నమోదుకు అవకాశం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను పురస్కరించుకుని బోగస్ ఓటర్లపై ఎన్నికల యంత్రాంగం కన్నెర్ర చేస్తోంది. గ్రేటర్ పరిధిలో ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉంటే వెంటనే వాటిని తొలగించుకోవాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. కొందరు ఓటర్లు రెండు సార్లు నమోదు చేసుకోవడాన్ని గుర్తించిన ఎన్నికల యంత్రాంగం చర్యలకు సిద్ధమవుతోంది. మరోవైపు గ్రేటర్ వాసులు ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నయా?, లేదా? అన్నది తెలుసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేకుంటే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. గైర్హాజరైన అధికారులపై చర్యలు: జీహెచ్ఎంసీ ఎన్నికలకు వార్డుల వారీగా నియామకం అయిన రిటర్నింగ్, అసిస్టెంట్ అధికారుల్లో కొందరు ఇప్పటి వరకు రిపోర్ట్ చేయకపోవడాన్ని కమిషనర్ జనార్దన్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఆదివారం బల్డియా ఎన్నికల నిర్వహణపై అడిషనల్ జోనల్, డిప్యూటీ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల అధికారులుగా నియామకం అయిన వారిలో ఇప్పటి వరకు కొందరు రిపోర్టు చేయలేదన్నారు. వీరిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం అనుసరించి క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్నట్లు కమిషనర్ హెచ్చరించారు. సోమవారం ఉదయంలోగా రిపోర్టు చేయని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎన్నికల విభాగం అధికారులకు సూచించారు. అదే విధంగా బీసీ ఓటర్ల ముసాయిదా జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వాటిని ఏ రోజుకారోజు పరిష్కరించాలన్నారు. వార్డుల వారీగా బీసీ ముసాయిదా జాబితాను రాజకీయ పార్టీలకు అందజేశామన్నారు.. -
బోగస్ ఓటర్లు 2.52. లక్షలు
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో పెద్ద ఎత్తున బోగస్ ఓటర్లను అధికారులు గుర్తించారు. జిల్లా జనాభా 42,90,589 మంది కాగా 34,31,822 ఓటర్లు ఉన్నారు. ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం పూర్తయిన 66 శాతంలో 2,52,418 బోగస్ ఓటర్లు ఉన్నట్టు తేల్చారు. వీరు జిల్లాలో వేర్వేరు చోట్ల రెండు కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నట్టుగా గుర్తించారు. చనిపోయిన ఓటర్లు 57,846 మంది, అనర్హులైన ఓటర్లు 3136 మంది ఉన్నారు. వలస వెళ్లిన వారు (5,16,747), సర్వే సమయంలో డోర్లాక్డ్(4,64,365)గా గుర్తించిన ఓటర్లు ఏకంగా 9,81,112 మంది ఉన్నారు. అంటే డూప్లికేట్, డోర్ లాక్డ్, షిఫ్టెడ్, ఇన్ఎలిజబుల్, డెత్ ఓటర్లు కలిపి ఏకంగా 12,94,512 మంది ఉన్నారు. వీరి విషయంలో ఈ నెల 20వ తేదీలోగా క్షేత్ర స్థాయి విచారణ జరిపి తుది నివేదికలు ఇవ్వాల్సిందిగా తహశీల్దార్లకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. డూప్లికేట్ (డబుల్ ఎంట్రీ)విషయంలో ప్రస్తుతం ఎక్కడ నివాసం ఉంటున్నారో అక్కడ ఓటు హక్కును ఉంచి మిగిలిన చోట్ల జాబితాల నుంచి వారి పేర్లను తొలగించనున్నారు. ఇక చనిపోయిన ఓటర్లను వారి డెత్ సర్టిఫికెట్స్‌ను ఆధారంగా తొలగిస్తారు. ఇన్ఎలిజబుల్, షిఫ్టెడ్, డోర్లాక్డ్ జాబితాలో ఉన్న ఓటర్ల విషయంలో మాత్రం నోటీసులు.. విచారణాలనంతరమే నిర్ధారణకు వస్తారు. ఏది ఏమైనప్పటికీ ఓటర్ల జాబితాలో భారీగా కోతపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. 20లోగా విచారణ పూర్తి చేసి ఆ తర్వాత నోటీసులు జారీ చేస్తారు. చివరగా క్షేత్ర స్థాయిలో విచారణ అనంతరం తుది జాబితాలను సిద్ధం చేస్తారు. మరొకపక్క తుది ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ప్రక్రియను కూడా చేపట్టింది. ఇందు కోసం ఈనెల 19న అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. -
బోగస్ ఓటుకు నోటీసు..!
సిద్దిపేట జోన్ : బోగస్ ఓటర్ల ఏరివేత ప్రక్రియలో భాగంగా సిద్దిపేట పట్టణ పరిధిలోని వేలాది మంది ఓటర్లకు రెవెన్యూ యంత్రాంగం నోటీసులు జారీ చేయనుంది. గతంలో పలుమార్లు క్షేత్ర స్థాయిలో విచారణ, సర్వే నిర్వహించి ఓటర్ జాబితాకు ఆధార్‌కార్డును అనుసంధానం చేసే విధానాన్ని అధికారులు చేపట్టారు. అయినప్పటికి సంబంధిత జాబితాలో నేటికి సుమారు 23వేల మంది అధికారికంగా పట్టణంలో అనుసందానానికి దూరంగా ఉన్నట్లు గుర్తించారు. ఒక్క దశలో కలెక్టర్ ఆదేశాల మేరకు సిద్దిపేట ఆర్డీ ఓ ముత్యంరెడ్డి పర్యవేక్షణలో 23 వేల మందికి నోటిసులు జారీ చేయడం మొదలు పెట్టారు. మొదటి ద ఫాలో నోటిసులను అందుకున్న వారిలో ఇప్పటికి సుమారు 3 వేల మంది తమ ఆధార్ నంబర్‌ను ఓటర్ జాబితాతో సీడింగ్ చేయించినట్లు సమాచారం. 20 వేల మంది ఓటర్లు ఎక్కడా.. మరో వైపు సిద్దిపేట పట్టణంలోని 20 వేల ఓటర్లు ఆధార్ సీడింగ్ కు ముందుకు రావడం లేదని యంత్రాంగం గుర్తించింది. గత కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం, సమీక్షలు, ఆవగాహన సదస్సులు నిర్వహించినప్పటికి ఇప్పటికి పట్టణంలో 20 వేల మంది ఆచూకిని కనుక్కోవడంలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.మరో మారు సంబంధిత వ్యక్తులకు నోటిసులు జారీ చేసి చివరి అవకాశం ఇచ్చి అప్పటికీ స్పందించకుంటే జాబితా నుంచి శాశ్వతంగా పేర్లను తొలగించేందుకు అధికార యంత్రాంగం సమయాత్తమవుతోంది. ఇంటింటికి వెళ్లి విచారించినా.. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలీటి గా గుర్తింపు పొందిన సిద్దిపేటలో లక్షకు పై చిలుకు జనాభా ఉంది. 2015 రికార్డుల ప్రకారం ఇటీవల మున్సిపల్ విడుదల చేసిన జాబితాలో 88వేల పై చిలుకు ఓటర్లు ఉన్నారు. ప్రతి ఓటర్‌కు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసి బోగస్ ఓటర్ల ఏరివేతతో పాటు ఓటర్ జాబితా ప్రక్షాళనకు సిద్దిపేట అధికారులు శ్రీకారం చుట్టారు. విస్తృతంగా ప్రత్యేక క్యాంపును , నమోదు ప్రక్రియను చేపట్టిన అధికారులకు గత నెలలోనే 23 వేల మంది ఓటర్లు సీడింగ్ కు దూరంగా ఉన్నట్లు గుర్తించారు. ఒక్క దశలో పట్టణంలోని 34 వార్డులను ఆయా అంగన్వాడీ కేంద్రం వర్కర్ , మెప్మా ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలోనే సమ్రగ విచారణ జరిపించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ జాబితాను పరిగణలోకి తీసుకొని ఓటర్లకు ఆధార్‌ను సీడింగ్ చేసే విధానాన్ని వేగ వంతంచేశారు. అయినప్పటికీ సిద్దిపేట పట్టణంలోనే 23 వేల మంది ఓటర్లు సీడింగ్‌కు ముందుకు రావడంలేదు. నోటీసుల జారీ వేగవంతం.. రెవెన్యూ యంత్రాంగం ఓటర్ జాబితాను ఆధారంగా చేసుకొని ఆనుసంధానానికి దూరంగాఉన్న ఓటర్లకు వ్యక్తి గతంగా నోటీసులను జారీ చేసే ప్రక్రియను చేపడుతున్నారు. ముఖ్యంగా ఓటర్ జాబితాలో ఉన్న వారిలో కొందరు వలసలకు వెళ్లడం , మృతి చెందడం, రెండు చోట్ల ఓటరు జాబితాలో పేర్లు కలిగి ఉండడం , వివాహమై ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు ఆధార్ సిడింగ్ దూరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయినప్పటికీ మరో ప్రయత్నంగా రెవెన్యూ యంత్రాంగం రెండవ దశలో నోటీసుల జారీ చేసి అర్హులైన వారికి జాబితాలో అవకాశం కల్పించడం , అనర్హులను తొలగించి బోగస్ ఓటర్లను ఏరివేయడం లాంటి ప్రక్రియను వేగవంతం చేస్తోంది. -
సగంతో సరి!
ఓటర్ల ఆధార్ సీడింగ్ అంతంతే మొత్తం ఓటర్లు 30,91,455 పూర్తయిన అనుసంధానం 19,29,319 ఐదు నియోజకవర్గాల్లో పురోగతి అధ్వాన్నం కర్నూలులో 29.89 శాతం మించని ప్రక్రియ కుప్పలుతెప్పలుగా బోగస్ ఓటర్లు కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 లక్షల నుంచి 4 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు అంచనా. వీరిని ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు చేపట్టిన ఆధార్ అనుసంధాన ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. జిల్లాలో 30,91,455 మంది ఓటర్లు ఉండగా.. దాదాపు 70 శాతం ఓటర్ల నుంచి వివిధ రూపాల్లో ఆధార్ నెంబర్లు సేకరించారు. ఇప్పటి వరకు 19,29,319 మంది ఓటర్లను మాత్రమే బీఎల్ఓలు ఆధార్‌తో అనుసంధానించారు. ఈ లెక్కన ఆధార్ సీడింగ్ 62.41 శాతం మాత్రమే పూర్తయింది. 11,62,136 మంది ఓటర్లను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేయాల్సి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 25 నాటికి అనుసంధానం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించింది. జిల్లాలో బోగస్ ఓటర్లు లెక్కకు మించి ఉండటం వల్లే ఆధార్ అనుసంధానం అంతంతమాత్రంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటర్లను ఆధార్‌తో అనుసంధానం బీఎల్ఓలు చేస్తుండగా.. వీటిని ఈఆర్ఓలు పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంది. బీఎల్ఓలు 19,29,319 మంది ఓటర్లను ఆధార్‌తో అనుసంధానం చేస్తే.. ఈఆర్ఓలు కేవలం 2,67,940 పరిశీలించి ఆమోదం తెలిపారు. తక్కినవి పెండింగ్‌లో పెట్టారు. కర్నూలు, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, నియోజకవర్గాల్లో ఆధార్ సీడింగ్ అంతంత మాత్రమే. ఆదోని నియోజకవర్గంలో 2,15,311 మంది ఓటర్లు ఉండగా.. ఆధార్ సీడింగ్ 1,04,342 మాత్రమే(48.46 శాతం) చేశారు. కోడుమూరు నియోజకవర్గంలో 53.83 శాతం, ఎమ్మిగనూరులో 57.21 శాతం, ఆలూరులో 58.78 శాతం మాత్రమే ప్రగతి ఉంది. మిగిలిన నియోజకవర్గాల్లో 63 శాతం పైగా ఆధార్ సీడింగ్ పూర్తయింది. కర్నూలు కార్పొరేషన్లో 29.89 శాతమే కర్నూలు నగరానికి చెందిన 19,700 ఓటర్లకు ఇంటి నంబర్లు లేవు. ఏరియా(లొకేషన్) లేదు. ఓటర్ల జాబితాలో ఓటరు పేరు, తండ్రి పేరు, సీరియల్ నెంబరు తప్ప వారు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఇంటి అడ్రస్ వివరాలు లేవు. కానీ ప్రతి ఎన్నికల్లో ఈ ఓట్లన్నీ పోల్ అవుతున్నాయి. ఇవన్నీ బోగస్ ఓటర్లే కావడం గమనార్హం. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు జిల్లా కలెక్టర్ సిహెచ్.విజయమోహన్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. కర్నూలు నగరపాలక సంస్థలో బోగస్ ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్లే ఆధార్ అనుసంధానం 29.89 శాతానికే పరిమితమయింది. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో 2,46,135 మంది ఓటర్లు ఉండగా.. 73,568 మంది ఓటర్లను మాత్రమే ఆధార్‌తో అనుసంధానించారు. నేడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సమీక్ష కర్నూలు నగరపాలక సంస్థలోని ఓటర్లపై రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఓటర్లను ఆధార్‌తో అనుసంధానం చేసే కార్యక్రమంపై శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ సమీక్ష నిర్వహించనున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో, ఈఆర్ఓలు, తహశీల్దార్లతోను సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సమీక్షలు నిర్వహించనున్నారు. -
‘బోగస్’ ఏరివేత
సాక్షి, చెన్నై:రాష్ట్రంలో బోగస్ ఓటర్ల ఏరివేతకు కసరత్తులు ఆరంభమయ్యాయి. ఓటరు కార్డుకు ఆధార్ నంబర్లను అనుసంధానించే ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర ఎన్నికల యంత్రాం గం సిద్ధమవుతోంది. ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో శిబిరాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు గాను అన్ని రాజకీయ పక్షాలతో ఎన్నికల ప్రధాన అధికారి సందీప్ సక్సేనా సమాలోచించారు. ఎన్నికల నిర్వహణ, ఓటర్ల గుర్తింపు కార్డు తదితర వ్యవహారాల్లో సరికొత్త సవరణలతో కొత్త నిబంధనల అమలుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రంలోని నకిలీ, బోగస్ ఓటర్ల ఏరివేత పర్వానికి శ్రీకారం చుట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లను చేర్పించినట్టుగా కొంత కాలం ఒకరి మీద మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న రాష్ర్ట ఎన్నికల అధికారి సందీప్ సక్సేనా బోగస్ ఏరివేతతోపాటుగా ఓటరు కార్డుకు ఆధార్ లింక్ ప్రక్రియను వేగవంతం చేయడానికి సిద్ధమయ్యారు. ఇందు కోసం అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాల్ని సేకరించి, తన వ్యూహాల అమలుకు నిర్ణయించారు. ‘ఈసీ’ సమీక్ష: సచివాలయంలో సందీప్సక్సేనా అధ్యక్షతన ఈ సమీక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఇందులో డీఎంకే తరపున గిరిరాజన్, పరందామన్, అన్నాడీఎంకే తరపున పొన్నయ్యన్, పొల్లాచ్చి వి జయరామన్, బీజేపీ తరపున మోహన్ రాజులు, రాఘవన్, డీఎండీకే తరపున పార్తీబన్, ఇలంగోవన్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ తదితర పార్టీల తరపున ఇద్దరు చొప్పున ప్రతినిధులు పాల్గొన్నారు. ఆయా పార్టీల వారీగా అభిప్రాయాలను ఈసీ సందీప్ సక్సేనా సేకరించారు. నకిలీ, బోగస్ పేర్లతో, రెండు మూడు చోట్ల ఓటరు కార్డులు కలిగి ఉన్న వాళ్లు స్వయంగా ముందుకు వచ్చి తమ పేర్లను తొలగించుకోవాలని సందీప్ సక్సేనా సూచించారు. ఓటరు కార్డుకు ఆధార్ నెంబర్లను, ఫోన్ నెంబర్లను అనుసంధానించబోతున్న దృష్ట్యా, తమ పరిశీలనలో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయా పార్టీలు ఎన్నికల యంత్రాంగం చేపట్టే చర్యలకు సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 12 నుంచి జూలై నెలాఖరు వరకు ప్రత్యేక శిబిరాల్ని ఏర్పాటు చేసి, ఆధార్ నంబర్లను, ఫోన్ నంబర్లను అనుసంధానించే ప్రక్రియకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. శిబిరాల ఏర్పాటు వివరాల్ని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి జూలైలోపు ఈ ప్రక్రియను ముగించేందుకు ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టిన దృష్ట్యా, ఆధార్ కార్డులు లేని వారి పరిస్థితి ఏమిటో..!. గ్యాస్‌కు ఆధార్ లింక్ పుణ్యమా అని ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 75 శాతం మంది మాత్రమే ఆధార్ కార్డులను పొందారు. ఇక మిగిలిన వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.