మాజీ రెజ్లర్‌ను పెళ్లాడిన టెక్ సీఈఓ అంకుర్ జైన్.. ఫోటోలు | Ankur Jain Married To Ex WWE Star Erika Hammond | Sakshi
Sakshi News home page

మాజీ రెజ్లర్‌ను పెళ్లాడిన టెక్ సీఈఓ అంకుర్ జైన్.. ఫోటోలు

Published Sun, Apr 28 2024 8:08 PM | Last Updated on Sun, Apr 28 2024 8:13 PM

Ankur Jain Married To Ex WWE Star Erika Hammond

భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త, బిలినీయర్ 'అంకుర్ జైన్' గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. భారతీయ మూలాలున్న ఈయన బిల్ట్ రివార్డ్స్ సీఈఓగా ఉన్నారు. ఇటీవల ఈయన మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ 'ఎరికా హమ్మండ్‌'ను వివాహం చేసుకుని ఓ ఇంటివారయ్యారు.

అంకుర్ జైన్, ఎరికా హమ్మండ్‌ ఏప్రిల్ 26న ఈజిప్ట్‌లోని పిరమిడ్స్ ఎదురుగా పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు.. పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

పెళ్లి కొంత భిన్నంగా ఉండాలనే ఆలోచనతోనే వారు దక్షిణాఫ్రికాలోని సఫారీ సందర్శనలో మొదలు పెట్టి ఈజిప్ట్‌లో పెళ్లి వేడుకలను ముగించారు. న్యూయార్క్ సిటీకి చెందిన భారత సంతతి బిలియనీర్ అంకుర్ జైన్ రంబుల్ బాక్సింగ్ జిమ్‌కి వెళ్లే సమయంలో.. ఎరికా హమ్మండ్‌, అంకుర్‌కు ఫిజికల్ ట్రైనర్‌గా వ్యవహరించారు. ఈ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది.

ఎవరీ ఎరికా హమ్మండ్?
ఎరికా హమ్మండ్ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్. ఆమె రెజ్లింగ్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఫిట్‌నెస్ కోచ్‌గా మారింది. ఈ సమయంలోనే బిలినీయర్ 'అంకుర్ జైన్'ను కలుసుకున్నారు. ఈమె స్ట్రాంగ్ అనే యాప్‌ కూడా స్టార్ట్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement