growth down
-
జీడీపీ.. జోరుకు బ్రేక్!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీలో వృద్ధి మందగమనం నెలకొంది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్, క్యూ2) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.4 శాతానికి (2023 ఇదే కాలంలో పోల్చి) పరిమితమైంది. గడచిన రెండేళ్లలో ఇంత తక్కువ స్థాయి జీడీపీ వృద్ధి రేటు ఇదే తొలిసారి. ఇంతక్రితం 2022–23 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం) భారత్ ఎకానమీ 4.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. సమీక్షా కాలంలో తయారీ, వినియోగం, మైనింగ్ రంగాలు పేలవ పనితీరును ప్రదర్శించినట్లు శుక్రవారం విడుదలైన జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) డేటా వెల్లడించింది. 5.4 శాతం వృద్ధి రేటు ఎలా అంటే.. 2023–24 రెండవ త్రైమాసికంలో (2011–12 ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికగా) ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తూ, స్థిర ధరల వల్ల వాస్తవ జీడీపీ విలువ రూ.41.86 లక్షల కోట్లు. తాజా సమీక్షా కాలం (2024 జూలై–సెపె్టంబర్) ఈ విలువ రూ.44.10 లక్షల కోట్లకు ఎగసింది. వెరసి జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదయ్యింది. ఇక ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయని ప్రస్తుత ధరల వద్ద ఇదే కాలంలో జీడీపీ విలువ రూ.70.90 లక్షల కోట్ల నుంచి రూ.76.60 లక్షల కోట్లకు చేరింది. ఈ ప్రాతిపదికన వృద్ధి రేటు 8 శాతం. ఆరు నెలల్లో వృద్ధి 6 శాతం ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్) ద్రవ్యోల్బణం సర్దుబాటుతో స్థిర ధరల వద్ద గత ఏడాది ఇదే కాలంలో జీడీపీ విలువ 82.77 లక్షల కోట్లుగా ఉంటే, తాజాగా 87.74 లక్షల కోట్లకు చేరింది. వెరసి వృద్ధి రేటు 6%గా నమోదైంది. ప్రస్తుత ధరల వద్ద చూస్తే, విలువ రూ.141.40 లక్షల కోట్ల నుంచి రూ.153.91 లక్షల కోట్లకు ఎగసింది. వెరసి వృద్ధి రేటు 8.9%.కీలక రంగాలు ఇలా... → తయారీ రంగంలో వృద్ధి రేటు 14.3 శాతం (2023 క్యూ2) నుంచి 2.2 శాతానికి పడిపోయింది. → వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 1.7 శాతం నుంచి 3.5 శాతానికి ఎగసింది. → మైనింగ్ అండ్ క్వారీయింగ్ విభాగంలో 11.1 శాతం వృద్ధి రేటు 0.01 శాతానికి క్షీణబాట పట్టింది. → ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సరీ్వసుల విభాగంలో వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 6.7 శాతానికి ఎగసింది. → ఎలక్ట్రిసిటీ, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల విభాగంలో వృద్ధి రేటు 10.5 శాతం నుంచి 3.3 శాతానికి మందగించింది. → నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 13.6 శాతం నుంచి 7.7 శాతానికి పడిపోయింది. → ప్రైవేటు తుది వినియోగ వ్యయం (పీఎఫ్‌సీఈ) వృద్ధి రేటు తాజా సమీక్షా కాలంలో 6 శాతంగా నమోదయ్యింది. క్యూ1 (ఏప్రిల్–జూన్) ఈ విభాగం వృద్ధి రేటు 7.4%గా ఉంది.అక్టోబర్‌లో ‘మౌలిక’ రంగమూ నిరాశే.. ఇదిలావుండగా, ఎనిమిది మౌలిక పారిశ్రామిక విభాగాల వృద్ధి రేటు అక్టోబర్‌లో 3.1 శాతంగా నమోదయ్యింది. 2023 ఇదే నెలతో పోలి్చతే (12.7 శాతం) వృద్ధి రేటు భారీగా పడిపోవడం గమనార్హం. బొగ్గు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాల్లో వృద్ధి మందగించగా, క్రూడ్ ఆయిల్, సహజ వాయువు రంగాల్లో ఏకంగా క్షీణత నమోదయ్యింది. రిఫైనరీ ప్రొడక్టుల్లో మాత్రం వృద్ధి రేటు పెరిగింది. కాగా, ఈ ఎనిమిది రంగాలూ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ 4.1 శాతం వృద్ధి సాధించగా, 2023 ఇదే కాలంలో ఈ రేటు 8.8 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ 40.27%.వృద్ధి వేగంలో గ్లోబల్ ఫస్ట్.. తాజాగా గణాంకాలు వెలువడిన క్యూ2లో వృద్ధి వేగంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలోనే కొనసాగింది. భారత్ ఈ సమయంలో 5.4 శాతం వృద్ధి సాధిస్తే, రెండవ స్థానంలో ఉన్న చైనా ఇదే కాలంలో 4.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. నిరుత్సాహమే, కానీ... జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదు కావడం నిరుత్సాహపరిచే అంశమే. అయితే ఎకానమీలోని కొన్ని విభాగాల్లో సానుకూలతలు కనిపిస్తున్నాయి. వ్యవసాయం–అనుబంధ పరిశ్రమలు, నిర్మాణ రంగం ఇందులో ఉన్నాయి. ఆ అంశాలు ఎకానమీ ప్రమాదంలో లేదని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. – వీ అనంత నాగేశ్వరన్, సీఈఏ -
ఆర్థిక పనితీరు ఫర్వాలేదు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగానే ఉందంటూ.. రానున్న రోజుల్లో డిమాండ్ పరిస్థితులపై పరిశీలన అవసరమని కేంద్ర ఆర్థిక శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల దృక్పథం ఉంది. సాగు రంగం పట్ల సానుకూల అంచనాలు, పండుగల్లో డిమాండ్ మెరుగుపడుతుందన్న అంచనాలు, ప్రభుత్వం నుంచి అధిక మూలధన వ్యయాలు పెట్టుబడులకు ఊతమిస్తాయి’’అని సెపె్టంబర్ ఎడిషన్ నెలవారీ ఆర్థిక సమీక్షా నివేదికలో ఆర్థిక శాఖ పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ 2024–25 సంవత్సరానికి 6.5–7 శాతం మధ్య వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. వినియోగ సెంటిమెంట్ మృదువుగా మారడంతో పట్టణ డిమాండ్ మోస్తరు స్థాయికి చేరుకుంటున్నట్టు కనిపిస్తోందని.. సాధారణం మించి వర్షాలతో ఫూట్ఫాల్ (షాపులను సందర్శించే కస్టమర్లు) పరిమితంగా ఉండడం, కాలానుగుణ కారణాలతో ప్రజలు కొత్త కొనుగోళ్లకు దూరంగా ఉన్నట్టు వివరించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక స్తబ్దత మరింత అధికం కావడం, అభివృద్ధి చెందిన దేశాల వాణిజ్య విధానాల్లో అనిశ్చితి ఇవన్నీ ఆర్థిక వృద్ధికి రిస్క్‌లుగా పేర్కొంది. వీటి ప్రభావాలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రసరించే రిస్క్ ఉందంటూ.. అదే జరిగితే డ్యూరబుల్ గూడ్స్‌పై వినియోగదారులు చేసే వ్యయాలపై ప్రభావం పడొచ్చని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం నియంత్రణలోనే.. వరుసగా రెండు నెలల పాటు తగ్గిన ద్రవ్యోల్బణం తిరిగి సెపె్టంబర్లో పెరిగిపోవడం తెలిసిందే. కానీ, కొన్ని కూరగాయలను మినహాయిస్తే ద్రవ్యోల్బణం దాదాపుగా నియంత్రణలోనే ఉన్నట్టు ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. రిజర్వాయర్లలో నీటిమట్టాలు మెరుగ్గా ఉండడం, ఖరీఫ్‌లో జోరుగా విత్తన సాగు వ్యవసాయ ఉత్పాదకత పట్ల ఆశాజనక అంచనాలకు వీలు కలి్పస్తోందని.. ఆహార ధాన్యాల నిల్వలు తగినంత ఉండడంతో మధ్యకాలంలో ధరల కట్టడికి వీలుంటుందని ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో భారత్ పట్ల సానుకూల సెంటిమెంట్ ఉన్నట్టు వెల్లడించింది. స్థిరమైన వృద్ధి సాధించడం ద్వారానే ఈ సెంటిమెంట్‌ను వాస్తవిక పెట్టుబడులుగా మలుచుకునేందుకు అవకాశాలుంటాయని పేర్కొంది. నెల రోజుల్లోనే విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లో రూ.85వేల కోట్లకు పైగా అమ్మకాలు చేయడం ఈ సందర్భంగా గమనార్హం. విదేశాలతో ఆర్థిక కార్యకలాపాలు (ఎక్స్టర్నల్ సెక్టార్) మెరుగ్గా ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది. పెరుగుతున్న పెట్టుబడులు, స్థిరమైన రూపాయి, మెరుగైన స్థితిలో విదేశీ మారకం నిల్వలను ప్రస్తావించింది. సెపె్టంబర్ చివరికి 700 బిలియన్ డాలర్లను విదేశీ మారకం నిల్వలు దాటిపోవడాన్ని గుర్తు చేసింది. తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు క్రమంగా విస్తరిస్తున్నట్టు తెలిపింది.వృద్ధి మందగమనంలోకి భారత్జపాన్ బ్రోకరేజీ సంస్థ నోమురా ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ సైక్లికల్ వృద్ధి మందగమనంలోకి అడుగు పెట్టినట్టు జపాన్ బ్రోకరేజీ దిగ్గజం నోమురా ప్రకటించింది. జీడీపీ 7.2 శాతం వృద్ధి సాధిస్తుందన్న ఆర్బీఐ అంచనాలు మరీ ఆశావహంగా ఉన్నట్టు పేర్కొంది. 2024–25లో 6.7 శాతం, 2025–26లో 6.8 శాతం మేర భారత జీడీపీ వృద్ధి సాధిస్తుందన్న తమ అంచనాలు మరింత క్షీణించడానికి రిస్‌్కలు పెరుగుతున్నట్టు పేర్కొంది. వృద్ధి సూచికలు జీడీపీ మరింత మోస్తరు స్థాయికి చేరుకుంటుందని సూచిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధిని సాధిస్తుందని ఇటీవలి ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష తన గత అంచనాలను కొనసాగించడం తెలిసిందే. పట్టణాల్లో వినియోగం సాధారణంగా మారుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయని.. ప్యాసింజర్ వాహన విక్రయాలు తగ్గడం, విమాన ప్రయాణికుల రద్దీ మోస్తరు స్థాయికి దిగిరావడం, ఎఫ్ఎంసీజీ సంస్థల అమ్మకాలు దీనికి నిదర్శనాలుగా పేర్కొంది. పట్టణ వినియోగంలో ఈ బలహీన ధోరణి కొనసాగుతుందని తాము భావిస్తున్నట్టు నోమురా తెలిపింది. కంపెనీలు వేతన వ్యయాలను తగ్గించుకుంటున్న విషయాన్ని ప్రస్తావించింది. ‘‘కరోనా అనంతరం ఏర్పడిన పెంటప్ డిమాండ్ సమసిపోయింది. ద్రవ్య విధానం కఠినంగా మారింది. అన్ సెక్యూర్డ్ రుణాలపై ఆర్బీఐ ఆంక్షలు వ్యక్తిగత రుణాలు, ఎన్బీఎఫ్సీ రుణాల వృద్ధి క్షీణతకు దారితీశాయి’’ అని నోమురా తన నివేదికలో వివరించింది. -
ICRA: ఆటో విడిభాగాల సంస్థల ఆదాయానికి బ్రేకులు
న్యూఢిల్లీ: దేశీయంగా అమ్మకాల పరిమాణం, ఎగుమతులు తగ్గే అవకాశాలు ఉండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) దిగ్గజ ఆటో విడిభాగాల తయారీ సంస్థల వార్షిక ఆదాయ వృద్ధి మందగించనుంది. 5–7 శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉంది. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఈ మేరకు అంచనాలతో నివేదికను రూపొందించింది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 2.7 లక్షల కోట్ల వార్షిక ఆదాయాలు ఉన్న 45 ఆటో విడిభాగాల సంస్థలను ఈ అధ్యయనం కోసం పరిగణనలోకి తీసుకుంది. అధిక బేస్, ఎగుమతుల్లో ఒక మోస్తరు వృద్ధే ఉన్నప్పటికీ దేశీయంగా డిమాండ్ ఆరోగ్యకరమైన స్థాయిలో ఉన్నందున వీటి ఆదాయాలు ఈ ఆర్థిక సంవత్సరం 9–11 శాతం ఉండవచ్చని అంచనా వేసింది. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరం మాత్రం దేశీయంగా అమ్మకాల పరిమాణం మందగించవచ్చని, ఎగుమతుల పరిస్థితి కూడా బలహీనంగానే ఉండవచ్చని ఇక్రా పేర్కొంది. ఈ నేపథ్యంలో కంపెనీల ఆదాయ వృద్ధి కూడా మందగించే అవకాశం ఉందని తెలిపింది. నివేదికలోని మరిన్ని వివరాలు.. ► సామర్ధ్యాలను పెంచుకునేందుకు, టెక్నాలజీని మెరుగుపర్చుకునేందుకు కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా ఇన్వెస్ట్ చేశాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే ధోరణి కొనసాగనుంది. 2024–25లో పరిశ్రమ పెట్టుబడి వ్యయాలు కనీసం రూ. 20,000–25,000 కోట్ల మేర ఉండవచ్చని అంచనా. ► కొత్త ఉత్పాదనల తయారీ, అధునాతన టెక్నాలజీ అభివృద్ధి మొదలైన అంశాలపై అదనంగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలు, సామర్ధ్యాల పెంపు, నియంత్రణ సంస్థపరంగా రాబోయే కొత్త మార్పుల అమలు మొదలైన వాటి కోసం మరింతగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ► అంతర్జాతీయ దిగ్గజ తయారీ సంస్థలు (ఓఈఎం) కొత్త తరహా వాహనాల కోసం సరఫరాదారులను విస్తృతంగా ఎంపిక చేసుకుంటూ ఉండటం, విదేశాల్లో ఆఫ్టర్ మార్కెట్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతూ ఉండటం వంటివి భారతీయ ఆటో విడిభాగాల సరఫరా సంస్థలకు సానుకూలం కాగలదు. ► మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు .. ప్రీమియం వాహనాలు .. స్థానికంగా తయారీకి ప్రాధాన్యం పెరుగుతుండటం, విధానాలపరమైన మార్పులు మొదలైన అంశాలు ఆటో విడిభాగాల సరఫరా సంస్థల స్థిర వృద్ధికి తోడ్పడే అవకాశం ఉంది. రెండంకెల స్థాయిలో టూ–వీలర్ల ఆదాయ వృద్ధి ప్రీమియం మోడల్స్‌కు మరింత డిమాండ్– వచ్చే ఆర్థిక సంవత్సరంపై హీరోమోటో సీఈవో గుప్తా అంచనా వచ్చే ఆరి్థక సంవత్సరం దేశీ ద్విచక్ర వాహనాల పరిశ్రమ ఆదాయాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. ప్రీమియం మోడల్స్‌కు డిమాండ్ మరింతగా పెరగనుండటం ఇందుకు దోహదపడగలదని చెప్పారు. టూ–వీలర్ల విషయంలో కొనుగోలుదారులు ఎక్కువ ఫీచర్లు ఉండే మోడల్స్ వైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. గత కొన్నాళ్లుగా అమ్మకాలు ఒక మోస్తరుగానే ఉంటున్న ఎంట్రీ స్థాయి బైకుల విభాగం కూడా కోలుకుంటోందని తెలిపారు. అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ డిమాండ్ గణనీయంగా మెరుగుపడిందని గుప్తా వివరించారు. ప్రీమియం సెగ్మెంట్ మోడల్స్ విక్రయం కోసం తమ అవుట్‌లెట్స్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు 300 డీలర్íÙప్‌లను అప్‌గ్రేడ్ చేసినట్లు గుప్తా పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి వీటి సంఖ్యను 400కు, వచ్చే ఏడాది 100 ప్రీమియా స్టోర్స్‌తో పాటు 500కు పెంచుకుంటామన్నారు. హీరో మోటోకార్ప్ గతేడాది అక్టోబర్‌లో ప్రీమియా బ్రాండ్ పేరుతో తొలి ప్రీమియం–ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌ను ప్రారంభించింది. ప్రీమియం సెగ్మెంట్లో కొత్తగా ప్రవేశపెట్టిన మావ్రిక్ 440 డెలివరీలు ఏప్రిల్ నుంచి ప్రారంభం కాగలవని గుప్తా పేర్కొన్నారు. -
నెమ్మదించిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: దేశీయంగా పారిశ్రామికోత్పత్తి వృద్ధి నెలవారీగా చూస్తే సెపె్టంబర్లో మందగించింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 5.8 శాతానికి పరిమితమైంది. ఆగస్టులో ఇది 10.3 శాతంగా ఉంది. గతేడాది సెపె్టంబర్లో ఐఐపీ 3.3 శాతంగా నమోదైంది. తాజాగా తయారీ, మైనింగ్ రంగాలు మెరుగుపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కాలంలో నమోదైన 7.1 శాతంతో పోలిస్తే సమీక్షాకాలంలో ఐఐపీ 6 శాతానికి పరిమితమైంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) విడుదల చేసిన ఐఐపీ గణాంకాల ప్రకారం.. ► తయారీ రంగ వృద్ధి 4.5 శాతంగా (గత సెప్టెంబర్‌లో రెండు శాతం) నమోదైంది. ► విద్యుదుత్పత్తి వృద్ధి గత సెపె్టంబర్లో 11.6 %గా ఉండగా ఈసారి 9.9%కి పరిమితమైంది. ► మైనింగ్ ఉత్పత్తి గతేడాది సెపె్టంబర్లో మైనస్ 5.2 శాతంగా ఉండగా ఈ ఏడాది సెపె్టంబర్లో 11.5 శాతం పెరిగింది. ► క్యాపిటల్ గూడ్స్ సెగ్మెంట్ వృద్ధి 7.4 శాతంగా (గత సెపె్టంబర్లో 11.4 శాతం) నమోదైంది. కన్జూమర్ డ్యూరబుల్స్ వృద్ధి గత సెపె్టంబర్లో మైనస్ 5.5 శాతంగా ఉండగా ఈసారి ఒక్క శాతం మేర నమోదైంది. కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ ఉత్పత్తి మైనస్ 5.7 శాతం నుంచి 2.7 శాతానికి చేరింది. ► మౌలిక/నిర్మాణ రంగ ఉత్పత్తుల వృద్ధి 7.5% గా ఉంది. గత సెపె్టంబర్లో ఇది 8.2 శాతం. -
మందగించిన మౌలిక రంగాల వృద్ధి..
న్యూఢిల్లీ: క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్ ఉత్పత్తి క్షీణించడంతో ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి ఏప్రిల్‌లో 3.5 శాతానికి పరిమితమైంది. ఇది ఆరు నెలల కనిష్టం. 2022 అక్టోబర్‌లో చివరిసారిగా ఇన్ఫ్రా వృద్ధి 0.7 శాతంగా నమోదైంది. 2022 ఏప్రిల్‌లో మౌలిక రంగాల వృద్ధి 9.5 శాతంగా ఉండగా, ఈ ఏడాది మార్చిలో 3.6 శాతంగా ఉంది. పారిశ్రామికోత్పత్తి సూచీలో ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్‌నకు 40.27 శాతం వెయిటేజీ ఉంటుంది. -
ఐటీ.. వృద్ధి మందగమనం!
న్యూఢిల్లీ: దేశీ ఐటీ రంగం వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మందగించనుంది. 8.4 శాతానికి పరిమితమై 245 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదు కానుంది. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఈ మేరకు అంచనాలు వెలువరించింది. గత ఆర్థిక సంవత్సరంలో టెక్ పరిశ్రమ 15.5 శాతం పెరిగి 226 బిలియన్ డాలర్లకు చేరింది. దశాబ్దకాలంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. కోవిడ్ మహమ్మారిపరమైన మార్పులతో కంపెనీలు టెక్నాలజీపై మరింతగా వ్యయాలు చేయడం ఇందుకు దోహదపడింది. అయితే, తాజాగా రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు భౌగోళికరాజకీయ సవాళ్లు విసురుతుండటం, ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తుండటం, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతుండటం తదితర అంశాలు టెక్నాలజీ పరిశ్రమకు ప్రతికూలంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాస్కామ్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న సీఈవోలు భవిష్యత్‌పై ’జాగరూకతతో కూడిన ఆశావహ’ అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్ణయాల్లో జాప్యం.. భౌగోళికరాజకీయ ఆందోళనల వల్ల ఐటీ కాంట్రాక్టులు ఇవ్వడంపై కంపెనీలు నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని, కొన్ని మార్కెట్లలో డిమాండ్ కూడా తగ్గుతోందని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ తెలిపారు. కొన్ని కంపెనీలకు మాత్రమే పటిష్టమైన ఆర్డర్లు ఉన్నాయని, పరిశ్రమకు ఇదే కాస్త ఊతంగా ఉంటోందని ఆమె వివరించారు. టాప్ 5 కంపెనీల ఆర్డర్ బుక్ 18 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండటం, నిర్దిష్ట కంపెనీల క్లయింట్ల సంఖ్య 10 శాతం మేర పెరగడం, సామరŠాధ్యల వినియోగం 6–7 శాతం పెంచుకోగలగడం వంటి సానుకూల అంశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగార్థుల్లో ఉద్యోగ సామర్థ్యాల కొరత ఉంటోందని ఘోష్ చెప్పారు. మన విద్యావ్యవస్థలోనే దీనికి మూలం ఉందని, ఫలితంగా సరైన నైపుణ్యాలున్న తాజా గ్రాడ్యుయేట్లు పరిశ్రమకు లభించడం లేదని ఆమె పేర్కొన్నారు. దీంతో తమ క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా వారికి శిక్షణనిచ్చేందుకు కంపెనీలు భారీగా వెచ్చించాల్సి వస్తోందని ఘోష్ వివరించారు. చాట్‌జీపీటీ లాంటి జనరేటివ్ కృత్రిమ మేథ (ఏఐ) ప్లాట్‌ఫాంల ప్రభావం ఉద్యోగాలపై పరిమితంగానే ఉంటుందని, వాస్తవానికి ఏఐతో ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆమె చెప్పారు. 54 లక్షలకు ఐటీ సిబ్బంది.. : మార్చి 31తో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీలో ఉద్యోగుల సంఖ్య 2.90 లక్షలు పెరిగి మొత్తం 54 లక్షలకు చేరనుంది. వీరిలో 20 లక్షల మంది మహిళలు ఉండగా, 36 శాతం మందికి డిజిటల్ నైపుణ్యాలు ఉన్నట్లు నాస్కామ్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే (4.5 లక్షల వృద్ధి) తక్కువే అయినప్పటికీ కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే ఇది ఎక్కువేనని పేర్కొంది. గత రెండు ఆర్థిక సంవత్సరాలు అసాధారణమైనవని వివరించింది. ఐటీ కంపెనీలకు ఇటీవల సమస్యగా మారిన అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) రేటు జూన్ క్వార్టర్‌తో పోలిస్తే (25.7 శాతం) డిసెంబర్ త్రైమాసికంలో కాస్త నెమ్మదించి 21.8 శాతానికి చేరింది. ఇక భారత ఐటీ ఎగుమతులు 9.4 శాతం పెరిగి 194 బిలియన్ డాలర్లకు చేరగలవని నాస్కామ్ పేర్కొంది. 2030 నాటికి దేశీ ఐటీ రంగం 500 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. -
India industrial production index: తగ్గిన పారిశ్రామిక వృద్ధి స్పీడ్
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 2022 డిసెంబర్లో మందగించింది. సమీక్షా నెల్లో ఇందుకు సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 4.3 శాతంగా నమోదయ్యింది. నవంబర్‌లో ఈ రేటు 7.3 శాతం. మొత్తం సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగం, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తులు, డిమాండ్‌కు ప్రాతిపదిక అయిన క్యాపిటల్ గూడ్స్ రంగాల పేలవ పనితీరు డిసెంబర్ గణాంకాలపై పడినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) వెలువరించిన లెక్కలు పేర్కొంటున్నాయి. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్ల రంగం ఉత్పత్తులకు సంబంధించిన కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం కూడా వృద్ధి (5.1 శాతం) నుంచి క్షీణతకు (–10.4 శాతం) మారింది. సబ్బులు, షాంపూల వంటి ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు సంబంధించిన కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ రంగంలో వృద్ధి రేటు తగ్గింది. వార్షికంగా పరిశీలిస్తే మాత్రం 2021 డిసెంబర్‌కన్నా 2022 డిసెంబర్లో పనితీరు మెరుగ్గా ఉండడం ఊరటనిస్తున్న అంశం. అప్పట్లో ఐఐపీ వృద్ధి రేటు కేవలం 1 శాతం మాత్రమే. 9 నెలల్లో ఇలా... మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్– డిసెంబర్) ఐఐపీ 5.4 శాతం పురోగమించగా, 2021 ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 15.3 శాతంగా ఉంది. 2022 ఏప్రిల్ నుంచి నవంబర్ నాటికి ఈ వృద్ధి రేటు 5.5 శాతం -
వృద్ధికి ఒమిక్రాన్ ముప్పు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ, ఎకానమీ స్థిరంగా ముందుకు సాగుతున్నప్పటికీ వృద్ధి సాధనకు ఒమిక్రాన్ వేరియంట్పరంగా ముప్పు ఇంకా పొంచే ఉంది. దీనికి ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్లు కూడా తోడయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండో ఆర్థిక స్థిరత్వ నివేదిక ముందుమాటలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్–మే మధ్యలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ పెను విధ్వంసం సృష్టించిన తర్వాత వృద్ధి అంచనాలు క్రమంగా మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ పెట్టుబడులు, ప్రైవేట్ వినియోగం గణనీయంగా పెరగడంపై నిలకడైన, పటిష్టమైన రికవరీ ఆధారపడి ఉంటుందని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు ఈ రెండూ ఇంకా మహమ్మారి పూర్వ స్థాయులకన్నా దిగువనే ఉన్నాయని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ అంశం ఆందోళనకరంగానే ఉందని అంగీకరించిన దాస్.. ఆహార, ఇంధన ధరల కట్టడి చేసే దిశగా సరఫరావ్యవస్థను పటిష్టం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీటుగా నిల్చిన ఆర్థిక సంస్థలు.. మహమ్మారి విజృంభించిన వేళలోనూ ఆర్థిక సంస్థలు గట్టిగానే నిలబడ్డాయని దాస్ తెలిపారు. ఇటు విధానపరంగా అటు నియంత్రణ సంస్థపరంగాను తగినంత తోడ్పాటు ఉండటంతో ఆర్థిక మార్కెట్లలో స్థిరత్వం నెలకొందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకుల దగ్గర పుష్కలంగా మూలధనం, నిధులు ఉండటంతో భవిష్యత్‌లోనూ ఎలాంటి సవాళ్లు వచ్చినా తట్టుకుని నిలబడగలవని దాస్ చెప్పారు. స్థూల ఆర్థిక.. ఆర్థిక స్థిరత్వంతో పటిష్టమైన, నిలకడైన సమ్మిళిత వృద్ధిని సాధించేందుకు తోడ్పడేలా ఆర్థిక వ్యవస్థను బలంగా తీర్చిదిద్దేందుకు ఆర్బీఐ కట్టుబడి ఉందని ఆయన వివరించారు. రిటైల్ రుణాల విధానాలపై ఆందోళన.. రిటైల్ రుణాల క్వాలిటీ అంతకంతకూ క్షీణిస్తుండటంపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం .. ఏప్రిల్ నుంచి డిసెంబర్ తొలి వారం మధ్యలో రుణ వితరణ 7.1 శాతం (అంతక్రితం ఇదే వ్యవధిలో 5.4 శాతం) వృద్ధి చెందింది. ఇటీవలి కాలంలో హోల్‌సేల్ రుణాలు వెనక్కి తగ్గగా.. వృద్ధి వేగం ఇంకా మహమ్మారి పూర్వ స్థాయి కన్న తక్కువగానే ఉన్నప్పటికీ .. రిటైల్ రుణాలు మాత్రం రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతున్నాయని నివేదిక పేర్కొంది. గత రెండేళ్లలో నమోదైన రుణ వృద్ధిలో హౌసింగ్, ఇతర వ్యక్తిగత రుణాల వాటా 64 శాతం మేర ఉంది. రిటైల్ ఆధారిత రుణ వృద్ధి విధానం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోందని నివేదిక తెలిపింది. కన్జూమర్ ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోలో ఎగవేతలు పెరిగినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో పెరిగిన రుణ వితరణలో రిటైల్ / వ్యక్తిగత రుణాల వాటా 64.4%గా (అంతక్రితం ఇదే వ్యవధిలో 64.1%) ఉంది. ఇందులో హౌసింగ్ రుణాల వాటా 31.2 శాతంగా (అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 30%) నమోదైంది. ఎన్నారైలు స్థిరాస్తులు కొనేందుకు.. ముందస్తు అనుమతులు అక్కర్లేదు.. కొన్ని సందర్భాల్లో మినహా ఎన్నారైలు (ప్రవాస భారతీయులు), ఓసీఐలు (ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా) భారత్‌లో స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి లేదా బదిలీ చేయించుకోవడానికి ముందస్తుగా ఎటువంటి అనుమతులు అవసరం ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది. వ్యవసాయ భూమి, ఫార్మ్ హౌస్, ప్లాంటేషన్ ప్రాపర్టీలకు మాత్రం ఇది వర్తించదని తెలిపింది. ఓఐసీలు భారత్‌లో స్థిరాస్తులను కొనుగోలు చేసే నిబంధనలకు సంబంధించి వివిధ వర్గాల నుంచి సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో ఆర్బీఐ ఈ మేరకు వివరణనిచ్చింది. మొండిబాకీలు పెరుగుతాయ్.. ఆర్థిక వ్యవస్థపై ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న పక్షంలో బ్యాంకుల స్థూల మొండిబాకీలు (జీఎన్‌పీఏ) వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఏకంగా 8.1–9.5 శాతానికి ఎగియవచ్చని ఆర్థిక స్థిరత్వ నివేదిక హెచ్చరించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇవి 6.9 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జీఎన్‌పీఏలు 8.8 శాతంగా ఉండగా 2022 సెప్టెంబర్ నాటికి ఇవి 10.5 శాతానికి ఎగియవచ్చని అంచనా. అలాగే ప్రైవేట్ బ్యాంకుల్లో 4.6 శాతం నుంచి 5.2 శాతానికి, విదేశీ బ్యాంకుల్లో 3.2 శాతం నుంచి 3.9 శాతానికి పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది. విభాగాలవారీగా చూస్తే వ్యక్తిగత, హౌసింగ్, వాహన రుణాల్లో జీఎన్‌పీఏ పెరిగింది. మరోవైపు, ఫుడ్ ప్రాసెసింగ్, రసాయనాలు వంటి కొన్ని ఉప–విభాగాలు మినహాయిస్తే పారిశ్రామిక రంగంలో జీఎన్‌పీఏల నిష్పత్తి తగ్గుతోంది. -
బ్యాంకింగ్ బోర్లా!
న్యూఢిల్లీ: భారత బ్యాంకింగ్ రంగ దృక్పథాన్ని స్థిరం నుంచి ప్రతికూలానికి (నెగెటివ్) మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తగ్గించేసింది. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అవరోధాలతో వృద్ధి మందగిస్తుందని.. దీంతో బ్యాంకుల ఆస్తుల నాణ్యత తగ్గిపోవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. కార్పొరేట్, సూక్ష్మ, మధ్య తరహా సంస్థలు, రిటైల్ విభాగంలోని మొండిబాకీలు పెరగవచ్చని.. ఫలితంగా బ్యాంకుల లాభాలు, నిధులపై ఒత్తిళ్లు పెరిగిపోతాయని మూడీస్ నివేదికలో పేర్కొంది. ‘‘ఉన్నట్టుండి ఆర్థిక కార్యకలాపాలు ఒకేసారి ఆగిపోవడంతో నిరుద్యోగం పెరుగుతుంది. ఇది గృహాలు, కంపెనీల ఆదాయాలు తగ్గిపోయేందుకు దారితీస్తుంది. దీంతో చెల్లింపుల్లో జాప్యం పెరిగిపోయేందుకు కారణమవుతుంది. ఎన్బీఎఫ్సీ సంస్థల్లో నిధుల ఒత్తిళ్లు బ్యాంకుల రిస్క్‌ను పెంచుతుంది. ఎందుకంటే ఎన్బీఎఫ్సీ రంగానికి బ్యాంకుల ఎక్స్పోజర్ (రుణ పోర్ట్‌ఫోలియో) ఎక్కువగా ఉంది’’ అని మూడీస్ వెల్లడించింది. ఈ అంశాలు బ్యాంకుల లాభదాయకతను దెబ్బతీయడంతోపాటు రుణ వృద్ధికి విఘాతం కలిగిస్తాయని అంచనా వేసింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిధుల లభ్యత స్థిరంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. యస్ బ్యాంకు డిఫాల్ట్‌తో రిస్క్ తీసుకోవడానికి కస్టమర్లు వెనుకాడడం చిన్న ప్రైవేటు బ్యాంకులకు నిధుల ఒత్తిళ్లు పెరగవచ్చని అంచనా వేసింది. ఈ బ్యాంకుల పట్ల నెగెటివ్.. ఇండస్ ఇండ్ బ్యాంకు రేటింగ్స్‌ను డౌన్‌గ్రేడ్ చేసేందుకు పరిశీలనలో పెడుతున్నట్టు మూడీస్ ప్రకటించింది. ఇండస్ ఇండ్ బ్యాంకు పోర్ట్‌ఫోలియో ఎక్కువగా వాహన రుణాలు, సూక్ష్మ రుణాలు కావడంతో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులతో బ్యాంకుపై ఎక్కువ ప్రభావం ఉండొచ్చని మూడీస్ పేర్కొంది. అలాగే, ప్రస్తుత సవాళ్లతో కూడిన వాతావరణంలో ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు రేటింగ్లను డౌన్‌గ్రేడ్ చేసింది. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకుల రేటింగ్‌ను స్థిరం (స్టేబుల్) నుంచి నెగెటివ్‌కు తగ్గించింది. ఐడీబీఐ బ్యాంకు రేటింగ్‌ను పాజిటివ్ నుంచి స్టెబుల్‌కు డౌన్‌గ్రేడ్ చేసింది. అయితే, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకుల గ్లోబల్ రేటింగ్స్‌లో మార్పులు చేయలేదు. లౌక్‌డౌన్ కారణంగా రుణ గ్రహీతల వేతనాలకు ఇబ్బందులు ఎదురైతే అది రిటైల్, క్రెడిట్‌కార్డు రుణాల చెల్లింపులపై ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది. ఈ రంగాలపై ఎక్కువ ప్రభావం.. ఎయిర్‌లైన్స్, ఆటోమొబైల్ ఓఈఎం కంపెనీలు, ఆటో విడిభాగాల సరఫరా కంపెనీలు, ఆయిల్ అండ్ గ్యాస్ తయారీదారులు, గేమింగ్, గ్లోబల్ షిప్పింగ్, విచక్షణా రహిత రిటైల్ వినియోగం, ఆతిథ్య రంగాలు కరోనా వైరస్ కారణంగా ఎక్కువ ప్రతికూలతలను చవిచూసే రంగాలుగా మూడీస్ పేర్కొంది. -
ప్రపంచ ఎకానమీకి వైరస్ ముప్పు!
ప్యారిస్: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కోవిడ్19 (కరోనా వైరస్) కారణంగా ఈ త్రైమాసికంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కూడా మందగించనుంది. దాదాపు దశాబ్దకాలం నాటి ఆర్థిక సంక్షోభం తర్వాత త్రైమాసికాలవారీగా చూస్తే వృద్ధి మందగించనుండటం ఇదే తొలిసారి. వైరస్ ప్రభావాలపై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) రూపొందించిన ప్రత్యేక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2020లో ప్రపంచ దేశాల వృద్ధి రేటు సుమారు అరశాతం నెమ్మదించి 2.4 శాతానికి పరిమితం కావొచ్చని.. ఒకవేళ వైరస్ తీవ్రత పెరిగిన పక్షంలో ఇది 1.5 శాతానికి కూడా పడిపోవచ్చని ఓఈసీడీ పేర్కొంది. ‘అంతర్జాతీయంగా వృద్ధి అవకాశాలు అంతంతమాత్రంగాను, అనిశ్చితిలోనూ ఉన్నట్లు కనిపిస్తోంది’ అని వివరించింది. చివరిసారిగా 2008లో అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు .. త్రైమాసికాలవారీగా వృద్ధి మందగించింది. పూర్తి సంవత్సరంపరంగా చూస్తే 2009లో వృద్ధి రేటు క్షీణించింది. గతంలో కన్నా తీవ్రం.. గతంలో వచ్చిన వైరస్ల కన్నా ప్రస్తుత కరోనా వైరస్ ప్రభావాలు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయని ఓఈసీడీ హెచ్చరించింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఒకదానితో మరొకటి మరింతగా అనుసంధానమై ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. ‘ ప్రపంచ ఉత్పత్తి, వాణిజ్యం, పర్యాటకం, కమోడిటీ మార్కెట్లలో చైనా పెద్ద పాత్ర పోషిస్తోంది. చైనాలో వైరస్ ధాటికి ఇప్పటికే ప్రపంచ దేశాలకు సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. వ్యాపార సంస్థల లాభాలకు గండి పడనుంది. కరోనా వైరస్ కారణంగా చైనాలో ఉత్పత్తి పడిపోవడంతో ప్రధానంగా ఆసియాపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అలాగే చైనాపై ఆధారపడిన ఇతర దేశాల కంపెనీలూ సమస్యలు ఎదుర్కొంటున్నాయి’ అని ఓఈసీడీ పేర్కొంది. భారత్ అంచనాలు కట్..: కరోనా వైరస్ రిస్క్ కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాలను 5.1 శాతానికి కుదించినట్లు ఓఈసీడీ తెలిపింది. గతంలో ఇది 6.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఆర్థిక మార్కెట్లు, పర్యాటక రంగం, సరఫరా వ్యవస్థల్లో సమస్యలు మొదలైన అంశాల వల్ల జీ20 దేశాల వృద్ధి రేటు మందగించవచ్చని తెలిపింది. వృద్ధి రేటును 4.9 శాతానికి తగ్గించిన ఫిచ్ న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి రేటు 2019–20 ఆర్థిక సంవత్సరానికి 5.1 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాను 4.9 శాతానికి తగ్గిస్తున్నట్టు ఫిచ్ సొల్యూషన్స్ సోమవారం ప్రకటించింది. దేశీయంగా డిమాండ్ బలహీనంగా ఉండడం, కరోనా వైరస్ కారణంగా సరఫరా పరంగా అడ్డంకులతో తయారీ రంగం ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్టు ఈ సంస్థ పేర్కొంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి అంచనాలను కూడా గతంలో వేసిన 5.9 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గించింది. ‘‘కోవిడ్ వైరస్ చైనాలో ప్రబలిన కారణంగా ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ సరఫరా చైన్‌లో ఏర్పడిన ఇబ్బందులు భారత ఎగుమతి ఆధారిత తయారీ రంగంపై ప్రభావం చూపిస్తుందన్న అంచనాలే తాజా సవరణకు నేపథ్యం’’అని ఫిచ్ వివరించింది. -
ఎకానమీకి వైరస్!!
న్యూఢిల్లీ: చైనాలో బైటపడిన కోవిడ్–19(కరోనా) వైరస్ ధాటికి ఈ ఏడాది ప్రపంచ ఎకానమీ వృద్ధి కుంటుపడనుంది. 2020లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను 2.3 శాతం నుంచి 2.2 శాతానికి కుదిస్తున్నట్లు ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ఒక నివేదికలో వెల్లడించింది. ‘ప్రపంచ ఎకానమీకి కరోనా వైరస్ ముప్పుగా పరిణమించింది. ఇది మరింతగా ప్రబలకుండా నివారించేందుకు చైనా ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రిస్కులు పొంచి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వృద్ధి అంచనాలను తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంది‘ అని ఈఐయూ పేర్కొంది. వాణిజ్య యుద్ధ భయాల మూలంగా 2019లో ప్రపంచ వృద్ధి మందగించిన సంగతి తెలిసిందే. యూరోపియన్ యూనియన్‌లోని పలు దేశాల్లో రాజకీయ అనిశ్చితి, అమెరికా.. చైనాలతో పాటు భారత్‌లోనూ స్థూల దేశీయోత్పత్తి మందగించింది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు తగ్గి, కొత్త ఏడాదిలో పరిస్థితులు చక్కబడవచ్చని సర్వత్రా ఆశాభావం వ్యక్తమవుతున్న తరుణంలో హఠాత్తుగా కరోనా వైరస్ తెరపైకి రావడం గమనార్హం. చైనా హుబెయ్ ప్రావిన్స్‌లోని వుహాన్ నగరంలో బైటపడిన ఈ వైరస్ ఆ దేశంతో పాటు ఇతరత్రా పలు దేశాలకు కూడా విస్తరించడం ప్రస్తుతం అందర్నీ కలవరపెడుతోంది. వైరస్ ప్రతికూల ప్రభావాల కారణంగా చైనా వృద్ధి రేటు అంచనాలను కూడా ఈఐయూ తగ్గించింది. ‘మార్చి ఆఖరు నాటికల్లా వైరస్ వ్యాప్తి.. అదుపులోకి రాగలదని భావిస్తున్నాం. దీనికి అనుగుణంగా 2020లో చైనా వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాలను ముందుగా పేర్కొన్న 5.9 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గిస్తున్నాం‘ అని ఈఐయూ తెలిపింది. భారత్‌పై బుల్లిష్..: ప్రపంచ ఎకానమీ, చైనా విషయంలో నిరుత్సాహపర్చే అంచనాలు ప్రకటించిన ఈఐయూ.. భారత్‌పై మాత్రం బులిష్ ధోరణి కనపర్చింది. కరోనా వైరస్ తాకిడి భారత్‌లో గణనీయంగా విస్తరించని పక్షంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు చాలా మెరుగ్గా ఉండగలదని పేర్కొంది. -
‘అప్పు’డే వద్దు!
ముంబై: బ్యాంకులు ఒకపక్క వడ్డీరేట్లు తగ్గిస్తున్నప్పటికీ.. రుణాలు తీసుకోవడానికి మాత్రం పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడంలేదు. వినియోగ డిమాండ్ బలహీనంగా ఉందనడానికి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనానికి బలమైన నిదర్శనంగా బ్యాంకింగ్ రుణ వృద్ధి ఘోరంగా పడిపోతోంది. సెప్టెంబర్ 27తో ముగిసిన పక్షానికి(15 రోజుల వ్యవధి) రుణ వృద్ధి రేటు సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. వృద్ధి ఈ స్థాయికి పడిపోవడం ఈ ఏడాది ఇదే తొలిసారి. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► 2019 సెప్టెంబర్ 27తో ముగిసిన పక్షానికి (అప్పటికి వార్షిక ప్రాతిపదికన చూస్తే) బ్యాంకింగ్ రుణాలు 97.71 లక్షల కోట్లు. ► 2018 ఇదే కాలానికి రుణాల పరిమాణం రూ.89.82 లక్షల కోట్లు. ► అంటే వృద్ధి రేటు 8.79 శాతమన్నమాట. ► వృద్ధి రేటు సింగిల్ డిజిట్‌కు పడిపోవడం ఈ ఏడాది ఇదే తొలిసారి. ► 2019 సెప్టెంబర్ 13 ముగిసిన పక్షం రోజులకు చూస్తే, రుణాల పరిమాణం రూ.97.01 లక్షల కోట్లుగా ఉంది. 2018 ఇదే కాలంలో పోల్చితే వృద్ధి రేటు 10.26 శాతంగా ఉంది. డిపాజిట్లూ మందగమనమే... ఇక బ్యాంకుల్లో డిపాజిట్ల విషయానికి వస్తే, ఈ విభాగంలో కూడా వృద్ధిరేటు మందగమనంలోకి జారిపోయింది. 2019 సెప్టెంబర్ 27తో ముగిసిన పక్షం రోజులకు డిపాజిట్లు రూ. 129.06 లక్షల కోట్లు. 2018 ఇదే కాలానికి ఈ మొత్తం రూ.118 లక్షల కోట్లుగా ఉంది. అంటే ఇక్కడ వృద్ధి రేటు 9.38 శాతంగా ఉంది. 2019 సెప్టెంబర్ 13తో ముగిసిన పక్షం రోజులకు చూస్తే, వృద్ధి రేటు 10.02 శాతంగా ఉంది. -
బీపీసీఎల్ మళ్లీ ‘విదేశీ’ పరం!
న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)ను విదేశీ చమురు సంస్థకు విక్రయించాలని కేంద్రం భావిస్తోందని సమాచారం. దేశంలోనే రెండో అతి పెద్ద రిఫైనరీ, ఇంధన రిటైల్ సంస్థ, బీపీసీఎల్‌లో తనకున్న నియంత్రిత వాటాను విక్రయించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగానే బీపీసీఎల్‌లో తన వాటా(53.3 శాతం)ను విదేశీ సంస్థలకు విక్రయించాలని, తద్వారా భారత ఇంధన రిటైల్ రంగంలోకి బహుళ జాతి సంస్థలను ఆకర్షించాలని కేంద్రం యోచిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ రంగంలో సుదీర్ఘకాలం ప్రభుత్వ రంగ సంస్థలే పెత్తనం చెలాయించాయని, దీనికి స్వస్తి చెప్పడానికి, మరోవైపు ఈ రంగంలో పోటీని పెంచడానికి ఈ చర్య ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 1,05 లక్ష కోట్ల నిధులు సమీకరించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బీపీసీఎల్‌లో వాటా విక్రయం కారణంగా ఈ లక్ష్యంలో 40 శాతం మొత్తాన్ని సమీకరించే అవకాశముందని అంచనా. (శుక్రవారం నాటి ముగింపు ధరతో పోల్చితే) అలాగే ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేసుకోవాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆర్థిక మందగమనం కారణంగా రెవెన్యూ వసూళ్లు తగ్గడంతో మౌలిక, సంక్షేమ పథకాలకు నిధుల లభ్యత దుర్లభమవుతోంది. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో బీపీసీఎల్ వాటా విక్రయం ఒకింత ఊరటనివ్వగలదని నిపుణుల అంచనా. ప్రారంభ స్థాయిలోనే చర్చలు.. అయితే విదేశీ సంస్థకు వాటా విక్రయ చర్చలు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయని, ఈ చర్చలు పూర్తవ్వడానికి ఎంతకాలం పడుతుందో స్పష్టత లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బీపీసీఎల్‌ను ఐఓసీకి విక్రయించాలని మొదట్లో ప్రభుత్వం భావించింది. అయితే బీపీసీఎల్‌ను కొనుగోలు చేయడానికి ఐఓసీ మళ్లీ నిధులు సమీకరించాల్సి రావడం తదితర తలనొప్పులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ ఆలోచనను అటకెక్కించింది. గతంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్)లో తన వాటాను కేంద్రం మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీకి విక్రయించిన సంగతి తెలిసిందే. దీనికోసం ఓఎన్జీసీ భారీగా నిధులను సమీకరించాల్సి వచి్చంది. ఇక బీపీసీఎల్ వాటా విక్రయానికి ఏ మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకుంటుందో ఇంత వరకైతే స్పష్టత లేదని నిపుణులంటున్నారు. అయితే బీపీసీఎల్ ప్రైవేటీకరణకు పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. విదేశీ కంపెనీగా ఉన్న బర్మా షెల్ కంపెనీని కేంద్రం 1970లో జాతీయం చేసి బీపీసీఎల్‌గా పేరు మార్చింది. మళ్లీ బీపీసీఎల్ విదేశీ సంస్థల పరమయ్యే అవకాశాలు ఉండటం విశేషం. భారత్‌పై చమురు దిగ్గజాల కన్ను... ఇక పలు బహుళ జాతి సంస్థలు భారత ఇంధన రిటైల్ రంగంపై ఆసక్తి చూపుతున్నాయి. సౌదీ ఆరామ్కో, రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్ పీజేఎస్సీ, టోటల్ ఎస్, షెల్, బ్రిటిష్ పెట్రోలియమ్(బీపీ)లు ఈ జాబితాలో ఉన్నాయి. భారత్‌లో ఇంధన డిమాండ్ 2040 కల్లా రెట్టింపవ్వగలదని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ అంచనా వేస్తోంది. మరోవైపు ఈ ఏడాది, వచ్చే ఏడాది... ఈ రెండేళ్లలో ప్రపంచంలోనే చమురుకు అత్యంత డిమాండ్ భారత్‌లోనే ఉండగలదని ఇటీవలే ఒపెక్ కూడా తన నెలవారీ ఆయిల్ డిమాండ్ నివేదికలో వెల్లడించింది. దీంతో భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి చమురు బహుళ జాతి సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటా విక్రయం ఆ సంస్థలకు ఆయాచిత వరంగా అందివచి్చంది. ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంధన రిటైల్ వ్యాపారంలో 49% వాటాను బీపీ కొనుగోలు చేసిన విషయం విదితమే. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో బీపీసీఎల్ షేర్ శుక్రవారం 6.4 శాతం లాభంతో రూ. 409 వద్ద ముగిసింది. రిఫైనరీల సంఖ్య (నుమాలీగఢ్, బినా, ముంబై, కోచి) =4 దేశవ్యాప్తంగా బంకులు =13,439 భారత్ గ్యాస్ కస్టమర్ల సంఖ్య కోట్లలో=4.2 ఆదాయం రూ. కోట్లలో 2018–19= 3,37,623 2018–19 నికర లాభం రూ. కోట్లలో=7,132 -
విని‘యోగం’ మళ్లీ ఎప్పుడు?
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగానికి చోదక శక్తిగా నిలుస్తున్న వినియోగ రంగం ఈ ఏడాది గడ్డు పరిస్థితులను చవిచూస్తోంది. దేశీయ వినియోగం, ఉత్పాదకతపైనే ఎక్కువగా ఆధారపడిన మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు వృద్ధి క్షీణతను చవిచూస్తోంది. భారీ మెజారిటీతో రెండోసారి కొలువు దీరిన ఎన్డీయే సర్కారు కుంగిన ఆర్థిక వ్యవస్థను పరుగెత్తించే చర్యలు చేపడుతుందన్న ఆకాంక్షలు బలంగా ఉండగా, బడ్జెట్ తర్వాత నిరాశ చెందాల్సి వచ్చింది. ముఖ్యంగా వ్యవస్థలో నిధుల లభ్యత పడిపోవడం, ఎన్బీఎఫ్సీ రంగం సంక్షోభం వినియోగాన్ని దెబ్బతీశాయన్న విశ్లేషణ వినిపిస్తోంది. తగ్గిన డిమాండ్... జూలై 5న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి చూస్తే నిఫ్టీ కన్జంప్షన్ ఇండెక్స్ 5.7 శాతం పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూసుకుంటే నిఫ్టీ కన్జంప్షన్ ఇండెక్స్ 9.4 శాతం నష్టపోగా, ఇదే కాలంలో నిఫ్టీ–50 3.8 శాతం మేర పెరిగింది. దేశ ఆర్థిక రంగ విస్తరణలో బ్యాంకులతోపాటు ఎన్బీఎఫ్సీ సంస్థలది కీలకపాత్రగా చెప్పుకోవాలి. ఎందుకంటే బ్యాంకింగ్ రంగం నుంచి లోటు ఉన్న రంగాలకు రుణ అవసరాలను ఎన్బీఎఫ్సీ విభాగమే తీరుస్తోంది. ఎన్బీఎఫ్సీ రంగం నిధుల కటకటతో ఆర్థిక రంగ విస్తరణ కూడా ఆగిపోయిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. వినియోగం తగ్గుదల అన్నది మరికొంత కాలం పాటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారత దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 2019–20 ఆర్థిక సంవత్సరానికి 0.3 శాతం మేర తగ్గించి 7%గా పేర్కొనడం గమనార్హం. డిమాండ్ తగ్గడమే అంచనాలను తగ్గించడానికి కారణమని ఐఎంఎఫ్ తెలిపింది. మరికొంత కాలం పాటు... కొత్త ఉద్యోగాలు లేకపోవడం, నగదు లభ్యత తక్కువగా ఉండడం తదితర కారణాలతో డిమాండ్/వినియోగం మరికొంత కాలం బలహీనంగానే ఉంటుందన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ రంగంపై ప్రభుత్వ వ్యయాలు పెరగడం సానుకూల చర్య అని, అయితే గతంలో అధిక బేస్‌తోపాటు ప్రభుత్వ వ్యయాలు గణనీయంగా లేని అంశాలను వారు గుర్తు చేస్తున్నారు. కంపెనీల పరంగా చూస్తే... ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) 2019–20లో తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో గత ఏడు త్రైమాసికాల్లోనే తక్కువ విక్రయాలను నమోదు చేసింది. ఇక వినియోగంలో భాగమైన ఆటోమొబైల్ రంగం కూడా గడ్డు పరిస్థితులను చూస్తోంది. వాహన అమ్మకాలు గత కొన్ని నెలలుగా అంతకంతకూ తగ్గుతూ వస్తున్నాయి. ‘‘ప్రస్తుతం వినియోగ రంగంలో ఉన్న పరిస్థితిని చూస్తుంటే... రానున్న త్రైమాసికాల్లోనూ అమ్మకాల వృద్ధి పెద్ద సవాలుగానే కనిపిస్తోంది. కన్జ్యూమర్ స్టాపుల్స్, ఆటో, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (క్యూఎస్ఆర్) జ్యుయలరీ విభాగాలు ఇప్పటికే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత మందగమనం కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విభాగంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించనుంది’’ అని ఈక్విరస్ సెక్యూరిటీస్ తన నివేదికలో పేర్కొంది. అప్రమత్తంగా ఉండాలి... సమీప కాలంలో ఆర్థిక వ్యవస్థ మరిన్ని సవాళ్లు ఎదుర్కోనున్న నేపథ్యంలో వినియోగ రంగ కంపెనీల ఫలితాల వృద్ధి పుంజుకోకవచ్చు. దీంతో స్టాక్స్ ధరలు మరింత క్షీణించే అవకాశాలు ఉన్నా యని ఈ రంగం షేర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. దీర్ఘకాల దృష్టితోనే కొనుగోళ్లకు దిగాలని సూచిస్తున్నారు. ఈ విభాగంలో ఎంఅండ్ఎం, టీవీఎస్ మోటార్, మారుతి సుజుకీ, హీరో మోటోకార్ప్, గోద్రేజ్ కన్జ్యూమర్, కోల్గేట్ పామోలివ్, బ్రిటానియా, డీమార్ట్, యునైటెడ్ స్పిరిట్స్, హెచ్‌యూఎల్ షేర్లు నిఫ్టీ కన్జంప్షన్ సూచీలో ఈ ఏడాది ఇప్పటి వరకు ఎక్కువగా నష్టపోయిన షేర్లు. -
మౌలిక రంగం వృద్ధి డౌన్!
♦ 2017 మేలో 3.6 శాతం ♦ క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధిరేటు 5.2 శాతం న్యూఢిల్లీ: ఎనిమిది కీలక రంగాల గ్రూప్ ఉత్పత్తి వృద్ధి రేటు 2017 మే నెలలో 3.6 శాతంగా (2016 ఇదే నెల ఉత్పత్తి విలువతో పోల్చిచూస్తే) నమోదయ్యింది. 2016 మే నెల్లో ఈ గ్రూప్ వృద్ధి రేటు 5.6 శాతం. బొగ్గు, ఎరువుల రంగాల పేలవ పనితీరు తాజా సమీక్షా నెలపై ప్రతికూల ప్రభావం చూపింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో దాదాపు 37 శాతం వాటా ఉన్న ఈ ఎనిమిది కీలక రంగాల పనితీరునూ వార్షికంగా పరిశీలిస్తే.... ♦ బొగ్గు: 6 శాతం వృద్ధి రేటు –3.3 క్షీణతలోకి జారిపోయింది. ♦ ఎరువులు: 6.2 శాతం వృద్ధి రేటు –6.5 శాతానికి క్షీణించింది. ♦ క్రూడ్ ఆయిల్: –3.3 క్షీణత నుంచి స్వల్పంగా 0.7 శాతం వృద్ధికి మారింది. ♦ సహజవాయువు: ఈ రంగం కూడా –6.5 శాతం క్షీణత నుంచి 4.5 శాతం వృద్ధికి మారింది ♦ రిఫైనరీ ప్రొడక్టులు: వృద్ధి రేటు 3.3 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. ♦ స్టీల్: 13.4 శాతం వృద్ధి 3.7 శాతానికి జారింది. ♦ సిమెంట్: వృద్ధి 2.7 శాతం నుంచి 1.8 శాతానికి పడిపోయింది. ♦ విద్యుత్: వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 6.4 శాతానికి చేరింది. కాగా నెలవారీగా చూస్తే మాత్రం వృద్ధి రేటు బాగుంది. ఏప్రిల్‌లో వృద్ధిరేటు 2.8 శాతంగా ఉంది.