చెన్నై: దేశంలో కొన్ని ఉద్యోగాలు చేయాలంటే తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ చేసిన సిఫార్సులను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. హిందీని బలవంతంగా తమ నెత్తిపై రుద్దితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ఈ మేరకు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి స్టాలిన్ లేఖ రాశారు. భిన్నత్వంలో ఏకత్వమున్న మన దేశంలో రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న 22 భాషలనూ సమానంగా చూడాలని హితవు పలికారు. దేశంలో హిందీ మాట్లాడే వారి కంటే, ప్రాంతీయ భాషలు మాట్లాడే వారి సంఖ్యే ఎక్కువని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment