మహిళకు ఫేస్‌బుక్‌లో అసభ్య సందేశాలు | dharna againest police | Sakshi
Sakshi News home page

మహిళకు ఫేస్‌బుక్‌లో అసభ్య సందేశాలు

Jan 6 2018 6:36 PM | Updated on Aug 21 2018 6:02 PM

సాక్షి, మైసూరు:  ఆమె పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్లు అయ్యింది. ఓ రక్షక భటుడి వేధింపుల నుంచి కాపాడాలని స్టేషన్‌ మెట్లు ఎక్కిన బాధితురాలికి అండగా నిలవాల్సిన హెడ్‌కానిస్టేబుల్‌ సైతం వేధింపుల పర్వం మొదలు పెట్టాడు.

ఫేస్‌బుక్‌లో అశ్లీల ఫొటోలు, సందేశాలు పంపాడు. దీంతో బాధితురాలు శనివారం నగరంలోని లక్ష్మీపురం పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగింది. వివరాలు...బాధితురాలు నగరంలోని మరిమల్లప్ప పాఠశాల సమీపంలో చాట్‌ దుకాణం నడుపుతోంది. ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకున్న ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆమెను వేధించసాగాడు. దీంతో బాధితురాలు అతనిపై ఫిర్యాదు చేయడానికి కొద్ది రోజుల క్రితం జయలక్ష్మీపురం పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది.

ఈ క్రమంలో న‍్యాయం చేస్తానని నమ‍్మబలికి ఆ మహిళతో పరిచయం పెంచుకున్న అక‍్కడి హెడ్‌కానిస్టేబుల్‌ ఫేస్‌బుక్‌లో అశ్లీల ఫొటోలు, సందేశాలు పంపుతూ వేధించసాగాడు. పలుమార్లు హెచ్చరించినా తీరుమారకపోవడంతో. బాధితురాలు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement