వాట్సాప్ ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకురానుంది.ఈ ఫీచర్‌తో ఫార్వర్డ్ మెసేజ్‌లకు కళ్లెం వేయనుంది వాట్సాప్.
ఫార్వర్డ్ చేయలేరు..!
ఫార్వర్డ్ మెసేజ్‌లపై వాట్సాప్ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకోసం కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌తో ఆయా వాట్సాప్ యూజర్లు సదరు మెసేజ్‌లను ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ గ్రూప్స్‌కు ఫార్వార్డింగ్ చేయడాన్ని పరిమితం చేయనుంది. దీంతో ఒక మెసేజ్‌ను సదరు యూజరు ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ గ్రూప్స్‌కు ఒకే సమయంలో ఫార్వర్డ్ చేయలేరు. ఈ చర్యతో ఫేక్ న్యూస్ లేదా తప్పుడు సమాచార వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్చునని వాట్సాప్ అభిప్రాయపడుతోంది.
WABetainfo ప్రకారం...వాట్సాప్ ఒకేసారి ఒక గ్రూప్ చాట్‌కు మాత్రమే సందేశాలను ఫార్వార్డ్ చేసే అవకాశాన్ని పరీక్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫీచర్‌తో ఒక సందేశాన్ని ఫార్వార్డ్ చేసినట్లుగా గుర్తించనప్పుడు, దానిని ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ గ్రూప్ చాట్‌లకు ఫార్వార్డ్ చేయడం ఇకపై సాధ్యం కాకుండా చేయనుంది. ఒక వేళ సదరు సందేశాన్ని ఒకటి కంటే ఎక్కువ గ్రూప్ చాట్‌లకు ఫార్వార్డ్ చేయాల్సి వస్తే, యూజర్లు ఆయా సందేశాన్ని సెలక్ట్ చేసుకొని, మళ్లీ ఫార్వార్డ్ చేయాల్సి ఉంటుంది. తొలుత ఫీచర్ వాట్సాప్‌బీటా వెర్షన్ యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
మెసేజ్ ఫార్వార్డింగ్ విషయంలో వాట్సాప్ గతంలో ఒక అప్‌డేట్‌ను విడుదల చేసింది. దీని ద్వారా యూజర్లు ఒకేసారి ఒక చాట్‌కు సందేశాలను ఫార్వార్డ్ చేయవచ్చు. వాట్సాప్ సదరు మెసేజ్ అనేక సార్లు ఫార్వార్డ్ చేశారని ‘ ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అంటూ ఆయా మెసేజ్‌కు లేబిలింగ్‌ను వాట్సాప్ ఇస్తోంది.
చదవండి: శాంసంగ్‌కు గట్టిషాకిచ్చిన హ్యాకర్లు..! ప్రమాదంలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు.!
Comments
Please login to add a commentAdd a comment