forward
-
గ్రీన్ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్ మున్ముందుకే
ఆటోమొబైల్ రంగంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న ఇండియా ఇక ముందు ఎలెక్ట్రిక్ ఆటోమొబైల్ వాహనాల రంగంలో కూడా ముందుకు సాగే అవసరంతోపాటు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పెట్రోలు, డీసెల్ బదులు విద్యుత్ బ్యాటరీలతో నడిచే వాహనాల వినియోగాన్ని నేటి ప్రపంచంలో ‘గ్రీన్ మొబిలిటీ’ అని పిలుస్తున్నారు. గ్రీన్ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్ సైతం ప్రగతి సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన కృషి చేస్తోంది. ప్రపంచంలో ఆటోమొబైల్ రంగంలో చైనా, అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది మూడో ర్యాంకర్ జపాన్ను ఆటో అమ్మకాల్లో ఇండియా అధిగమించింది. కిందటేడాది జపాన్ 42 లక్షల ఆటోమొబైల్ వాహనాలను అమ్మగా, ఇండియాలో 42 లక్షల 50 వేల వాహనాలు అమ్ముడయ్యాయి. వచ్చే ఐదు సంవత్సరాల్లో దేశంలో ఎలెక్ట్రిక్ కార్లు, ఇతర రకాల వాహనాల ఉత్పత్తి పెరిగితే ఆటో రంగంలో చైనా, అమెరికాలను ఇండియా దాటిపోతుందని కేంద్ర ప్రభుత్వం అంచనావేస్తోంది. అమెరికాలోని అట్లాంటిక్ మహాసముద్ర తీరంలోని పెద్ద రాష్ట్రం జార్జియా గ్రీన్ మొబిలిటీలో అగ్రభాగాన నిలిచే దిశగా ముందుకు సాగుతోంది. ఈ రాష్ట్రాన్ని అమెరికాకు ‘ఎలెక్ట్రిక్ మొబిలిటీ రాజధాని’గా చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఆటోమొబైల్ రంగంలో అమెరికాలో మొదటి స్థానంలో ఉన్న మిషిగన్ రాష్ట్రాన్ని మించిపోతుందని అంచనా. గ్రీన్ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్ నాలుగేళ్ల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరిగింది. ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ, వాటికి అవసరమైన బ్యాటరీలు, చార్జింగ్ పరికరాలు ఉత్పత్తి విస్తరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని సర్కారు ఏటా ప్రోత్సాహకాలు ప్రకటాస్తూ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో ఎలెక్ట్రిక్ (గ్రీన్) మొబిలిటీకి తగిన వ్యవస్థ, వాతావరణం ఏర్పాటు చేయడానికి గతంలోనే ఈ రంగంలో అనుభవం ఉన్న ‘ఊర్జా గ్లోబల్’ అనే కంపెనీతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి బోర్డు (ఏపీఈడీబీ) ఒప్పందం చేసుకుంది. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం లిథియం-అయాన్ బ్యాటరీలు, ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లు ఏపీలో ఏర్పాటవుతాయి. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఊర్జా గ్లోబల్ రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే పరిశ్రమల వల్ల 250 మందికి ప్రత్యక్షంగా, 1000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలుంటాయని అప్పుడు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ ను ఎలెక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ కేంద్రంగా చేయడానికి వరల్డ్ ఇకనామిక్ ఫోరమ్ తో కలిసి ఏపీ సర్కారు కిందటేడాది ఆగస్టులో ఏర్పాటు చేసిన తొలి వర్చ్యుల్ మీటింగ్ విజయవంతంగా జరిగింది. విద్యుత్ వాహనాల రంగంలో ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని ఈ సమావేశంలో ప్రసంగించిన నీతి ఆయోగ్ సలహాదారు సుధేందు సిన్హా విశ్వాసం ప్రకటించారు. రాష్ట్రంలో పెరుగుతున్న సాంప్రదేయేతర ఇంథన వనరుల ఉత్పత్తి కారణంగా ఎలెక్ట్రిక్ వాహనాల రంగం విస్తరణకు అనువైన వాతావరణం ఉందని అందరూ గుర్తిస్తున్నారు. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు -
వాట్సాప్ లో మరో అదిరిపోయే అప్డేట్..
-
లాభాలు కావాలంటే...సారథ్య బాధ్యతల్లో మహిళలు పెరగాలి
ముంబై: మహిళా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ లీడర్లు మరింత పెద్ద సంఖ్యలో సారథ్య బాధ్యతలను చేపట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో మహిళా లీడర్ల సంఖ్య తగినంత స్థాయిలో లేదని ఆమె పేర్కొన్నారు. నాయకత్వం వహించడానికి తాము అర్హులమేనని మాటిమాటికి నిరూపించుకోవాల్సి వస్తుందనే అభిప్రాయం మహిళల్లో అంతర్గతంగా పేరుకుపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. దీన్ని అధిగమించి, మరింత మంది స్త్రీలకు అవకాశాలు కల్పించేందుకు మహిళా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ లీడర్లు మార్గదర్శకులుగా వ్యవహరించవలసి ఉన్నట్లు తెలియజేశారు. స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈ ప్రధాన కార్యాలయంలో జరిగిన మహిళా డైరెక్టర్ల సదస్సులో మంత్రి ప్రసంగించారు. సంఖ్య చాలా తక్కువ.. గణాంకాల ప్రకారం దేశీ కంపెనీల బోర్డుల్లో సగటు మహిళల సంఖ్య 1.03కాగా .. వీరిలో 58 శాతం మంది స్వతంత్ర డైరెక్టర్లేనని సీతారామన్ పేర్కొన్నారు. మిగిలిన 42 శాతం స్వతంత్రేతర డైరక్టర్లుగా తెలియజేశారు. కార్పొరేట్లు తమ బోర్డుల్లో మరింతమంది మహిళలకు అవకాశాలివ్వవలసి ఉన్నట్లు సూచించారు. అంతర్జాతీయంగా బోర్డుల్లో స్త్రీల నాయకత్వం కలిగిన కంపెనీలు అత్యధిక లాభాలు, వృద్ధిని సాధిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు సహా ఇప్పటికీ పలు కంపెనీలు ఒక్క మహిళా డైరక్టరునూ నియమించుకోకపోవడంతో జరిమానాలు కడుతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాబోదని, కార్పొరేట్ ప్రపంచమే ముందడుగు వేయాలని స్పష్టం చేశారు. అయితే మహిళా కార్పొరేట్ లీడర్ల కొరత కారణంగా కొంతమందే పలు కంపెనీలలో బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకుల మధ్య అనుసంధానత అవసరం బ్యాంకులు తమ వ్యవస్థల మధ్య సంప్రదింపులకు వీలుగా అనుసంధామై ఉండాలని, అప్పుడే కస్టమర్లకు మెరుగైన మార్గాల్లో సేవలు అందించడం సాధ్య పడుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. శుక్రవారం ముంబైలో జరిగిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) 75వ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. చాలా సందర్భాల్లో కస్టమర్లు ఒకటికంటే ఎక్కువ బ్యాంకుల వద్ద లావాదేవీలు నిర్వహించాల్సి వస్తోందంటూ.. ఇందుకోసం బ్యాంకులు తమ మధ్య సంప్రదింపులకు వీలు కల్పించుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. బ్యాంకు ఉద్యోగులు స్థానిక బాషలో కస్టమర్లతో సంప్రదింపులు చేసేలా చూడాలని మంత్రి కోరారు. అప్పుడే కస్టమర్లకు మెరుగ్గా సేవలు అందించడం సాధ్యపడు తుందనీ, మోసాలను నివారించేందుకు బ్యాంకులు పెట్టుబడులు పెంచాలన్నారు. ఎంఎస్ఎంఈల బకాయిలను 45 రోజుల్లోగా చెల్లించండి ప్రయివేట్ రంగ కంపెనీలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ(ఎంఎస్ఎంఈ)ల బకాయిలను 45 రోజుల్లోగా చెల్లించ వలసిందిగా ఆర్థికమంత్రి మరో కార్యక్రమంలో ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ కంపెనీలు సైతం ఎంఎస్ఎంఈలకు చెల్లింపులను సకాలంలో చేపట్టడంలేదంటూ విమర్శించారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి చిన్న సంస్థలకు సకాలంలో బకాయిల చెల్లింపులపై హామీ లభించవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్వోసీకి ఖాతాలు దాఖలు చేశాక 45 రోజుల్లోగా ఎంఎస్ఎంఈ చెల్లింపులను పూర్తి చేయవలసిందిగా ప్రయివేట్ కంపెనీలకు సూచించారు. ఈ బాటలో ప్రభుత్వ శాఖలు, కంపెనీలు 90 రోజుల్లోగా చెల్లింపులు చేపట్టేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోనున్నట్లు లఘు ఉద్యోగ్ భారతీ నిర్వహించిన సదస్సు సందర్భంగా వెల్లడించారు. ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తగిన విధంగా స్పందించవలసి ఉన్నట్లు చెప్పారు. -
వాట్సాప్‌లో మెసేజ్‌లను తెగ ఫార్వర్డ్ చేస్తున్నారా..! అయితే
వాట్సాప్ ప్రపంచంలో ఎక్కువగా వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకురానుంది.ఈ ఫీచర్‌తో ఫార్వర్డ్ మెసేజ్‌లకు కళ్లెం వేయనుంది వాట్సాప్. ఫార్వర్డ్ చేయలేరు..! ఫార్వర్డ్ మెసేజ్‌లపై వాట్సాప్ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకోసం కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్‌తో ఆయా వాట్సాప్ యూజర్లు సదరు మెసేజ్‌లను ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ గ్రూప్స్‌కు ఫార్వార్డింగ్ చేయడాన్ని పరిమితం చేయనుంది. దీంతో ఒక మెసేజ్‌ను సదరు యూజరు ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ గ్రూప్స్‌కు ఒకే సమయంలో ఫార్వర్డ్ చేయలేరు. ఈ చర్యతో ఫేక్ న్యూస్ లేదా తప్పుడు సమాచార వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్చునని వాట్సాప్ అభిప్రాయపడుతోంది. WABetainfo ప్రకారం...వాట్సాప్ ఒకేసారి ఒక గ్రూప్ చాట్‌కు మాత్రమే సందేశాలను ఫార్వార్డ్ చేసే అవకాశాన్ని పరీక్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫీచర్‌తో ఒక సందేశాన్ని ఫార్వార్డ్ చేసినట్లుగా గుర్తించనప్పుడు, దానిని ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ గ్రూప్ చాట్లకు ఫార్వార్డ్ చేయడం ఇకపై సాధ్యం కాకుండా చేయనుంది. ఒక వేళ సదరు సందేశాన్ని ఒకటి కంటే ఎక్కువ గ్రూప్ చాట్లకు ఫార్వార్డ్ చేయాల్సి వస్తే, యూజర్లు ఆయా సందేశాన్ని సెలక్ట్ చేసుకొని, మళ్లీ ఫార్వార్డ్ చేయాల్సి ఉంటుంది. తొలుత ఫీచర్ వాట్సాప్‌బీటా వెర్షన్ యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. మెసేజ్ ఫార్వార్డింగ్ విషయంలో వాట్సాప్ గతంలో ఒక అప్డేట్ను విడుదల చేసింది. దీని ద్వారా యూజర్లు ఒకేసారి ఒక చాట్‌కు సందేశాలను ఫార్వార్డ్ చేయవచ్చు. వాట్సాప్ సదరు మెసేజ్ అనేక సార్లు ఫార్వార్డ్ చేశారని ‘ ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అంటూ ఆయా మెసేజ్‌కు లేబిలింగ్ను వాట్సాప్ ఇస్తోంది. చదవండి: శాంసంగ్‌కు గట్టిషాకిచ్చిన హ్యాకర్లు..! ప్రమాదంలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు.! -
యూట్యూబ్‌లో ఈ కొత్త ఫీచర్ ఏదో బాగుందే..!
యూట్యూబ్ గురించి తెలియని వారు ఏవరుండరు. మనకు నచ్చిన టీవీ ప్రోగ్రాంలను మిస్సైనా, ఇతరత్రా వీడియోలను చూడాలంటే వెంటనే యూట్యూబ్ యాప్‌ను ఓపెన్ చేస్తాం..! మనలో చాలా మంది యూట్యూబ్ వీడియోలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటాం. యూట్యూబ్‌లో ఒక వీడియో చూస్తుంటే మనకు కాస్త నచ్చకపోయినా, లేదా తరువాత ఏం జరుగుతుందో అనే ఆత్రుతతో ఫోన్లో డబల్ ట్యాప్ చేసి వీడియోలను ఫార్వర్డ్ చేస్తు ఉంటాం. వీడియోలను ఫార్వర్డ్ చేసే క్రమంలో డబుల్ ట్యాప్ సరిగ్గా చేయకపోతే తదుపరి వీడియోకు వెళ్తుంది. ఇలా మనలో చాలా మంది ఇలాంటి సమస్యను చాలా మంది ఎదుర్కోన్న వాళ్లమే..! కాగా ఈ సమస్యకు చెక్‌పెడుతూ కొత్త పరిష్కారాన్ని చూపింది యూట్యూబ్. యూట్యూబ్ త్వరలోనే యూజర్లకు కొత్త ఫీచరును అందుబాటులోకి తీసుకురానుంది. యూజర్లకు స్లైడ్ టూ సీక్ అనే కొత్త ఫీచరును యూట్యూబ్ త్వరలోనే యాడ్ చేయనుంది. వీడియోను చూసే సమయంలో వీడియోపై ఒక గీతపై డాట్ ఉండే సింబల్ త్వరలోనే యూజర్లకు కనిపించనుంది. సింబల్‌కు పక్కనే ‘స్టైడ్ టూ లెఫ్ట్ ఆర్ రైట్ టూ సీక్’డిస్క్రిప్షన్ మేసేజ్ కన్పిస్తోంది. అంతేకాకుండా ఆపిల్, షావోమీ స్మార్ట్ఫోన్లలో కన్పించే రౌండ్బాల్ హోల్డ్ గెస్చర్‌ను కూడా యూట్యూబ్ అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో ఒక వీడియోలో ముందుకు ఫార్వర్డ్ వెళ్లాలంటే బాల్‌ను డ్రాగ్ చేస్తే సరిపోతుంది. మనకు నచ్చినట్లుగా వీడియోలను ఫార్వర్డ్, రివైండ్ చేయవచ్చును. ప్రస్తుతం ఈ ఫీచరును యూట్యూట్ టెస్ట్ చేస్తోంది. కాగా ఈ ఫీచర్ యూట్యూబ్ యాప్ వెర్షన్ 16.31.34 వాడుతున్న ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. -
వాట్సాప్ కొత్త నిబంధన : ఒక్కసారే
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారానికి, నకిలీ వార్తలు అడ్డూ అదుపులేకుండా కొనసాగుతోంది. పాత వార్తలు, పాత వీడియోలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తూ, వ్యాఖ్యానాలను జోడిస్తూ పోస్ట్ చేస్తు వుండటం ఆందోళన రేపుతోంది. చట్టపరంగా వీటి నిరోధానికి చర్యలను ప్రకటిస్తున్నప్పటికీ ఫేక్ న్యూస్ ప్రవాహం ఆగడం లేదు. ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించిన నకిలీ వార్తలు, వీడియోలు వాట్సాప్, ఫేస్ బుక్, ట్విటర్, టిక్ టాక్ లాంటి ప్లాట్ ఫాంలలో విరివిగా షేర్ అవుతూ అనేక అపోహలను, ఆందోళనలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక మీద తరుచుగా షేర్ చేసిన సందేశాన్ని లేదా, వీడియోను ఒకసారి ఒక చాట్ కు మాత్రమే ఫార్వార్డ్ చేసేలా వాట్సాప్ ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో మెసేజ్ షేరింగ్ యాప్ వాట్సాప్ లో ఆన్లైన్లో తప్పుడు సమాచారాన్ని తెలుసుకునే వాట్సాప్ కొత్త ఆంక్షలను విధించింది. ఇక మీద తరుచుగా షేర్ చేసిన సందేశాన్ని లేదా, వీడియోను ఒక చాట్ కు ఒక్కసారి మాత్రమే ఫార్వార్డ్ చేసేలా పరిమితి విధించింది. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులకు ఈ రోజునుంచే ఈ కొత్త నిబంధన వర్తించనుంది. అలాగే తరచుగా ఫార్వార్డ్ చేయబడిన సందేశాలను వాట్సాప్‌లో డబుల్ టిక్ ద్వారా సూచిస్తుంది. కోవిడ్-19 తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. దీని ప్రకారం వాట్సాప్ లో ఐదుసార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు షేర్ చేయబడిన సందేశాలను ఒక చాట్‌కు మాత్రమే ఫార్వార్డ్ చేయగలం. అలాగే తరచుగా ఫార్వార్డ్ చేసిన వాటిని యూజర్లు గుర్తించేలా డబుల్ టిక్ తో హైలైట్ చేస్తుంది. గతంలో నకిలీ వార్తలను అడ్డుకునే నేపథ్యంలో ఐదుసార్లకు మించి ఫార్వార్డ్ చేయకుండా పరిమితి విధించడంతో 25 శాతం ఫేక్ న్యూస్ బెడద తప్పిందని వాట్సాప్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అలాగే సందేశాలను ధృవీకరించడానికి వినియోగదారులను అనుమతించే కొత్త ఫీచర్‌పై కూడా వాట్సాప్ పనిచేస్తోంది. ఫార్వార్డ్ చేసిన సందేశాలను తెలుసుకునేలా వెబ్‌లో ఒక ఫీచర్‌ను వాట్సాప్ పరీక్షిస్తోంది. ఇందుకోసం వెబ్ లో భూతద్దం చిహ్నాన్ని జోడించింది. ప్రస్తుతం ఐవోఎస్, ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది త్వరలో వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. చదవండి : ఎన్నారై డాక్టర్‌ను బలిగొన్న కరోనా బంగారం రికార్డు : రూ. 45 వేలను దాటేసింది -
వాట్సాప్‌లో ఆ ఫీచర్ కూడా వచ్చేసింది
సాక్షి,న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ, రెచ్చగొట్టే తప్పుడు వార్తలు బాగా షేర్ అవుతున్న వైనంపై భారత ప్రభుత్వం సీరియస్‌గా స్పందించిన నేపథ్యంలో ఫార్వర్డ్ మెసేజ్‌లను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలు ఒకేసారి పెద్ద సంఖ్యలో షేర్ చేయకుండా ఐదుగురికి మాత్రమే వాటిని పంపేలా ‘వాట్సాప్’ నియంత్రణ చర్యలు చేపట్టింది. భారతదేశంలో 200 మిలియన్లకు పైగా యూజర్లను కలిగివున్న వాట్సాప్ సందేశాల షేరింగ్‌పై ఈ ఆంక్షలు విధించింది. వాట్సాప్ ప్రస్తుత వెర్షన్లో కేవలం ఐదుగురికి మాత్రమే ఒక మేసేజ్‌ను ఫార్వార్డ్ చేసే అవకాశం ఉంది. ఈ వారం నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు వినియోగదారుల అవగాహన కోసం ఒక వీడియోను కూడా విడుదల చేసింది. వాట్సాప్‌లో ఇప్పటికే ఈ నిబంధన వాట్సాప్‌లో షేరింగ్ ప్రక్రియలో అమల్లోకి వచ్చిన తీరును మనం గమనించ వచ్చు. ఒక మెసేజ్‌ను ఐదుగురికి మించి షేర్ చేసేందుకు ప్రయత్నిస్తే.. వెంటనే ఒక వార్నింగ్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. మరోవైపు గత నెలలో ఫేస్బుక్ సొంతమైన ఫ్లాట్‌ఫాం వాట్సాప్‌లో ఐదు చాట్లకు సందేశాన్ని ఫార్వర్డ్ చేయడానికి కట్టడి చేసేలా టెస్టింగ్ ఫీచర్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. భారత ప్రభుత్వ ఒత్తిడితో వాట్సాప్ సందేశాలను, చిత్రాలు, వీడియోల సామూహిక ఫార్వార్డింగ్‌ను తగ్గించేందుకు ఈ నియంత్రణ విధిస్తున్నట్టు పేర్కొంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మాములుగా వచ్చిన మెస్సేజ్ లకు, ఫార్వార్డ్ ద్వారా వచ్చిన మెస్సేజ్‌లకు మధ్య డిఫరెన్స్ ను స్పష్టంగా చూపించేలా ‘ఫార్వార్డెడ్’ అని సింబల్ రూపంలో చూపిస్తూ వుండటం మనకు తెలిసిందే. -
ట్రంప్ విజయంపై సత్య నాదెళ్ల
శాన్ఫ్రాన్సిస్కో: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 45 వ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి బుధవారం అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వారందరితోనో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మెక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డ్ఇన్ పోస్ట్ లో చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించారని ప్రశంసించిన ఆయన ఈ ఎన్నికలు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత సాధించాయని పేర్కొన్నారు. అధ్యక్షుడు సహా నిన్న ఎంపికయిన వారందరినీ అభినందించిన నాదెళ్ల వారందరితో పనిచేయడానికి తాము ఎదురుచూస్తున్నా మన్నారు. తమ ధృడమైన సిద్ధాంతాలు, విలువలకు కట్టుబడి ఉంటామని, ముఖ్యంగా విభిన్నమైన సంస్కృతులను చిత్తశుద్ధితో కలుపుకుపోతామని తెలిపారు. దీంతో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో టెక్ కంపెనీలకు వ్యతిరేకంగా చేసిన సంచలన వ్యాఖ్యలను ఫాలో కావొద్దని సంకేతాలను అమెరికా నూతన అధ్యక్షుడికి సూచన ప్రాయంగా అందించారు భారతీయ సంతతికి చెందిన సత్య నాదెళ్ల. అలాగే కంపెనీ ఆలోచనలు, సిఫార్సులను అమెరికా కొత్త అడ్మినిస్ట్రేషన్, కాంగ్రెస్‌కు వివరిస్తూ మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ కూడా కంపెనీ బ్లాగులో ఒక పోస్ట్ పెట్టారు. -
కారు దూకుడు