వాట్సాప్ ఎన్‌క్రిప్షన్‌పై ఆందోళన
న్యూఢిల్లీ: వినియోగదారుల సందేశాలు, వాయిస్ కాల్స్ హ్యాకర్ల బారినపడకుండా వాట్సప్ తెచ్చిన సెక్యూరిటీ ఎన్‌క్రిప్షన్ (భద్రతా చర్యలు)పై భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. దీన్ని జాతి వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేసే అవకాశముందన్నాయి. ఐఫోన్ అన్‌లాక్ విషయంలో ఆపిల్, ఎఫ్‌బీఐ మధ్య వివాదం నేపథ్యంలో.. వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.
ఎన్‌క్రిప్షన్ వల్ల వాట్సాప్ గానీ, మూడో వ్యక్తి గానీ మీ సందేశాలను చూడలేరు. ప్రభుత్వం కోరినా వాట్సాప్ మీ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వలేదు. 256 బిట్ ఎన్‌క్రిప్షన్‌ను వాడటం మన ఐటీ చట్టాల ప్రకారం నేరమైనందున వాట్సాప్‌పై ఎవరైనా దేశంలో కేసు పెట్టవచ్చని అంటున్నారు.