లాస్ ఏంజెలిస్: ఫేస్‌బుక్‌లో ఏ పోస్ట్‌లు, మెసేజ్‌లు చేయకుండా కేవలం ఇతరుల పోస్ట్‌లను మాత్రమే చూస్తూ ఉంటే మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం ఉంటుందని ఫేస్‌బుక్ తొలిసారిగా అంగీకరించింది. రెండు పరిశోధనలను పరిగణలోకి తీసుకుని ఫేస్‌బుక్ ఓ బ్లాగ్‌లో ఈ విషయం తెలిపింది. తొలి పరిశోధన అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులపై జరిగింది.
కొంతమంది విద్యార్థులను ఎంపికచేసి వారిని పది నిమిషాలపాటు కేవలం ఇతరుల ఫేస్‌బుక్ పోస్ట్‌లను చూడమని (పోస్ట్‌లు, మెసేజ్‌లు వంటివి చేయకుండా) చెప్పారు. మరికొంత మంది విద్యార్థులకు ఇతరులకు మెసేజ్‌లు పంపాల్సిందిగా, పోస్ట్‌లు చేయాల్సిందిగా చెప్పారు. ఆ రోజు చివరకు వచ్చేటప్పటికి కేవలం ఇతరుల పోస్ట్‌లు చూస్తూ కూర్చున్నవారు మిగిలిన వారి కంటే నిరుత్సాహంగా, నిర్లిప్తంగా ఉన్నారు. కాలిఫోర్నియా, యేల్ విశ్వవిద్యాలయాల వారు చేసిన మరో పరిశోధన ప్రకారం...ఎక్కువగా ఇతరుల ఫేస్‌బుక్ పోస్ట్‌లు చూసేవారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.
Comments
Please login to add a commentAdd a comment