Last Texts of Three Women Found Dead on Ecuador Beach - Sakshi
Sakshi News home page

నేను డేంజర్‌లో ఉన్నా.. అని లవర్‌కు మెసేజ్‌.. కాసేపటికే ముగ్గురు అమ్మాయిలు బీచ్‌లో దారుణంగా..

Published Tue, Apr 18 2023 2:10 PM | Last Updated on Tue, Apr 18 2023 2:46 PM

Last Texts Of Three Women Found Dead Ecuador Beach - Sakshi

క్విటో: బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ముగ్గురు యువతులు దారుణ హత్యకు గురయ్యారు. చనిపోవడనికి ముందు తమ ప్రియమైన వారికి వీరు పంపిన సందేశాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. తాము డేంజర్‌లో ఉన్నామని, ఎదో జరగబోతుందని ముందే పసిగట్టి వారు మెసేజ్‌లు పంపిన కాసేపటికే కిరాతకంగా హత్యకు గురయ్యారు. దండగులు వీరి గొంతులు కోసి చిత్ర హింసలకు గురి చేసి హతమార్చారు.

ఈక్వెడార్‌లోని క్వినెడే సమీపంలో ఎస్మరాల్డస్ బీచ్‌లో ఏప్రిల్ 5న జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ముగ్గురు యువతుల పేర్లు.. డెన్నిసి రేనా(19), యులియానా మాసియస్(21), నయేలి తాపియా(22). ఏప్రిల్ 4న అదృశ్యమైన వీరు ఆ మర్నాడే దారుణంగా హత్యకు గురయ్యారు.

మంచి స్నేహితులైన వీరు బీచ్‌కు వెళ్లి సరదాగా గపడపాలని ప్లాన్ చేసుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని ఏప్రిల్ 4న అనుకున్నట్టే బీచ్‌కు వెళ్లారు. స్విమ్ సూట్ లాంటి దుస్తులు ధరించి అక్కడే హాయిగా సేదతీరారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఈ ముగ్గురూ ఊహించని ప్రమాదంలో పడ్డారు. ఎవరో వారిని వెంబడించారు. దీంతో తమకు ఏదో జరగబోతుందని భావించి తమ ప్రియమైన వారికి సందేశాలు పంపారు.  అయితే మెసేజ్‌లు రాత్రి 11:10 గంటల సమయంలో పంపడంతో కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళన చెందారు. వారు అనుకున్నట్టే.. జరగకూడని ఘటన జరిగింది.
నయేలి, డెన్నిసి

చనిపోయే ముందు నయేలి తన సోదరికి వాట్సాప్ సందేశం పంపింది.  'ఏదో జరగబోతుంది అని నాకు అనిపిస్తుంది. అందుకే మెసేజ్ చేస్తున్నా' అని నయేలి మెసేజ్ చేసింది. సోదరి వెంటనే ఆమెకు కాల్ చేయగా.. స్విచాఫ్ వచ్చింది. నయేలికి పెళ్లైంది. నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. దీంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మరో యువతి డెన్నిస్ హత్యకు గురికావడానికి ముందు తన బాయ్‌ఫ్రెండ్‌కు సందేశం పంపింది. 'ఏదో జరగబోతుందని నాకు అన్పిస్తుంది. ఒకవేళ నాకేదైనా జరిగితే.. ఒక్క విషయం గుర్తుంచుకో.. ఐ లవ్‌ యూ వెరీ మచ్‌' అని మెసేజ్ చేసింది.

జాలర్లు చూసి..
ఆ తర్వాత కాసేపటికే ముగ్గురిని ఎవరో దారుణంగా హత్య చేశారు. బీచ్‌లో అర్ధనగ్నంగా ఉన్న వీరిని చిత్ర హింసలు పెట్టి పదునైన ఆయుధాలతో గొంతులు కోశారు. ఆ తర్వాత శవాలను పూడ్చిపెట్టారు.  ఏప్రిల్ 5న చేపల వేటకు వెళ్లిన జాలర్లు.. ఓ కుక్క వీరి మృతదేహాల వద్ద తవ్వడం చూసి అక్కడకు వెళ్లగా శవాలు కన్పించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

అయితే ఈ హత్యలు ఎవరు చూసి ఉంటారనే విషయంపై పోలీసులకు ఇంకా ఎలాంటి క్లూ లభించలేదు. ముగ్గురిలో ఓ యువతి బీచ్‌కు వెళ్లినరోజు సమీపంలోని ఓ హోటల్‌లో గడిపింది. దీంతో అధికారులు క్లూ కోసం సీసీటీవీ రికార్డులను పరిశీలిస్తున్నారు. ముగ్గురిలో ఇద్దరు మంచి భవిష్యత్ కోసం వేరే దేశం వెళ్లి స్థిరపడాలనుకున్నారని, కానీ ఇంతలోనే ఇలా ప్రాణాలు కోల్పోతారని ఊహించలేదని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
చదవండి: వేరొకరి ఇంటి డోర్‌బెల్‌ మోగించాడని చంపేందుకు యత్నం..చివరికి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement