
యశవంతపుర(కర్ణాటక): నటి సంజనా గల్రానికి అభ్యంతరకర సందేశాలు పంపిన ఓ ఫ్యాషన్ డిజైనర్ కుమారుడిని ఇందిరానగర పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఫిబ్రవరి 25 అర్ధరాత్రి నటి సంజనాకు అభ్యంతరకర సందేశాలు పంపాడు. దీంతో సంజనా వాట్సాప్ చాట్ సందేశాలను పోలీసులకు అందజేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తాను సంజనకు ఎలాంటి సందేశాలను పంపలేదని పోలీసులకు వివరించినట్లు సమాచారం.