obscene behaving
-
18 ఓటీటీలపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: అసభ్యకర, అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేసినందుకుగాను 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, వాటికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయనున్నట్లు కేంద్రం గురువారం తెలిపింది. 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, వీటికి సంబంధం ఉన్న 19 వెబ్సైట్లు, 10 యాప్‌లు, 57 సోషల్ మీడి యా ఖాతాలను దేశంలో ఇకపై ప్రజలకు అందుబాటులో ఉండవని పేర్కొంది. తొలగించే 10 యాప్‌లలో ఏడు గూగుల్ ప్లే స్టోర్, 3 యాపిల్ యాప్ స్టోర్‌లో ఉండేవి. వేటుపడిన 18 ఓటీటీలివే.. డ్రీమ్స్ ఫిలిమ్స్, వూవీ, యెస్మా, అన్‌కట్ అడ్డా, ట్రీఫ్లిక్స్, ఎక్స్ప్రైమ్, నియోన్ ఎక్ వీఐపీ, బేషరమ్స్, హంటర్స్, రబ్బిట్, ఎక్స్‌ట్రామూడ్, న్యూఫ్లిక్స్, మూడ్ ఎక్స్, మోజోఫ్లిక్స్, హాట్ షాట్స్ వీఐపీ, ఫుగీ, చికూఫ్లిక్స్, ప్రైమ్ప్లే వంటి ఓటీటీ సోషల్ మీడియా ఖాతాలను తొలగించారు. తొలగించిన వాటిలో 12 ఫేస్బుక్ ఖాతాలు, 17 ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, 16 ఎక్స్ ఖాతాలు, 12 యూట్యూబ్ ఖాతాలు సోషల్ మీడియా ద్వారా అశ్లీలతను ప్రసారం చేస్తున్నాయి. -
వీడియో: జాతీయ గీతం పాడుతూ వెకిలి చేష్టలు.. తప్పదు భారీ మూల్యం!
Viral Video.. ముగ్గురు యువకులు జాతీయ గీతం పాడుతూ వెకిలి చేష్టలు చేశారు. జాతీయ గీతాన్ని అవమానించేలా ప్రవర్తించారు. ఈ క్రమంలో తగిన మూల్యం చెల్లించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఖంగుతిన్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెలిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యువకులు జాతీయ గీతం పాడుతున్నారు. టేపులో జాతీయ గీతం వస్తుండగా.. మధ్యలో అద్నాన్ అనే యువకుడు.. ఓవరాక్షన్ చేశారు. జాతీయ గీతం ఆలపిస్తూ వెకిలి చేష్టలు చేశారు. నేషనల్ అంథమ్ పాడుతూ.. కుప్పి గంతులు వేశాడు. జాతీయ గీతాన్ని అవమానపరిచేలా వ్యవహరించాడు. ఈ క్రమంలో అతడితో పాటే రుహెల్, మరో యువకుడు కలిసి పెద్దగా నవ్వుతూ డ్యాన్స్ చేశారు. జాతీయ గీతం చివరలో కూడా అసభ్యకరంగా డ్యాన్స్ స్టెప్పులు వేశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఈ వీడియోపై సచిన్ షిరోనీ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంజయ్ శర్మ తెలిపారు. If you can't respect the national anthem, you don't deserve to be free. 'Adnan' and 'Ruhel' from UP should be behind bars for this act. pic.twitter.com/cLCxCYGUbq — Zaira Nizaam 🇮🇳 (@Zaira_Nizaam) January 27, 2023 -
యువకుడి పాడుపని.. వివాహిత ఇంటికెళ్లి.. చేయి పట్టుకుని..
ద్వారకా తిరుమల(ఏలూరు జిల్లా): ఒక వివాహితతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ టి.సుధీర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారకాతిరుమలకు చెందిన ఎ.సురేష్ అనే యువకుడు ఈ నెల ఏడో తేదీ మధ్యాహ్నం అదే గ్రామానికి చెందిన ఒక వివాహిత ఇంటికి వెళ్లి, చేయి పట్టుకుని తన కోర్కె తీర్చమని బలవంతపెట్టాడు. చదవండి: ప్రేమ.. పెళ్లి.. భర్తకు దూరంగా అద్దె ఇంట్లో.. చివరికి ఇలా.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. గతంలో కూడా సురేష్ ఆమెను పలుమార్లు ఇబ్బంది పెట్టినట్టు, ఆ విషయాన్ని పెద్దలకు తెలిపినా ఫలితం లేకపోయిందని ఫిర్యాదులో వెల్లడించినట్టు పేర్కొన్నారు. -
బాలికతో ఆటోడ్రైవర్ అసభ్య ప్రవర్తన
కృష్ణలంక (విజయవాడ తూర్పు): ఓ బాలికకు ఆటోడ్రైవర్ మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన విజయవాడ నున్న ప్రాంతంలో జరిగింది. కృష్ణలంక సీఐ సత్యానందం కథనం మేరకు.. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బాలిక నూజివీడులో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. బెంగళూరులోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆంజనేయులుతో ఏడాది క్రితం ఫేస్బుక్ ద్వారా ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయిని కలవడానికని ఆంజనేయులు శనివారం బెజవాడ వచ్చాడు. ఉదయం 11 గంటలకు ఇద్దరు స్నేహితురాళ్లతో కలసి ఆ అమ్మాయి నూజివీడు నుంచి బెజవాడ వచ్చి ఆంజనేయులును కలుసుకుంది. సాయంత్రం 6 గంటల తర్వాత స్వగ్రామం బయలుదేరింది. ఆంజనేయులు ఓ లాడ్జిలో రూమ్ తీసుకుని రాత్రికి ఇక్కడే ఉండిపోయాడు. మళ్లీ రాత్రి 10 గంటలకు ఆ బాలిక బస్సులో విజయవాడకు చేరుకుని ఆంజనేయులుకు ఫోన్ చేసింది. అతని ఫోన్ స్విచాఫ్ రావడంతో ఎక్కడ బస చేశాడో తెలుసుకోవడానికి సింగ్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ షేక్ ఖదీర్ ఆటోను కిరాయికి మాట్లాడుకుని లాడ్జిల్లో వాకబు మొదలు పెట్టింది. ఆదివారం తెల్లవారుజాము 3 గంటల సమయం వరకూ వాకబు చేసినా ఆంజనేయులు ఆచూకీ లభించలేదు. దీంతో తన ఇంటికి రమ్మని బాలికకు ఆటోడ్రైవర్ మాయమాటలు చెప్పాడు. అతడి మాటలు నమ్మి ఆ బాలిక బయలుదేరగా ఆటోను నున్న సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక తప్పించుకుని సమీపంలోని ఓ ఇంటికి చేరుకుంది. వారు 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. 5 నిమిషాలలోనే పోలీసులు బాలికను రక్షించారు. ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం సోమవారం పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఉపేక్షించం – టి.కె.రాణా, విజయవాడ పోలీస్ కమిషనర్ 112కు కాల్ రాగానే పోలీసులు ఘటనా స్థలానికి 5 నిమిషాల్లోనే చేరుకుని ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. మహిళలు దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొంటే, ఆపద సమయంలో ఆ యాప్ ఉపయోగపడుతుంది. ముఖ పరిచయం లేని వ్యక్తులను నమ్మొద్దు. మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా, అమర్యాదగా వ్యవహరిస్తే ఉపేక్షించం. మహిళలు ఒంటరిగా వేళగాని వేళలో బయటకు వచ్చేటప్పుడు, కుటుంబసభ్యుల సహకారం తీసుకోవాలి. -
నటి సంజనకు అభ్యంతరకర సందేశాలు
యశవంతపుర(కర్ణాటక): నటి సంజనా గల్రానికి అభ్యంతరకర సందేశాలు పంపిన ఓ ఫ్యాషన్ డిజైనర్ కుమారుడిని ఇందిరానగర పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఫిబ్రవరి 25 అర్ధరాత్రి నటి సంజనాకు అభ్యంతరకర సందేశాలు పంపాడు. దీంతో సంజనా వాట్సాప్ చాట్ సందేశాలను పోలీసులకు అందజేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తాను సంజనకు ఎలాంటి సందేశాలను పంపలేదని పోలీసులకు వివరించినట్లు సమాచారం. -
సీపీ అంజనీ కుమార్‌ను బెదిరించిన వ్యక్తి ఆ రాష్ట్రంలోనే
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌ను ఫోన్ ద్వారా దూషించి, బెదిరించిన వ్యక్తి కర్ణాటకలో ఉన్నట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. మంగళవారం చోటు చేసుకున్న ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న అ«ధికారులు సాంకేతికంగా ముందుకు వెళ్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి దర్యాప్తు ముమ్మరం చేశారు. సీపీ అంజనీకుమార్ గత శుక్రవారం నుంచి సైదాబాద్ కేసులో తలమునకలై ఉన్నారు. ఇది లా ఉండగా..మంగళవారం ఉదయం ఆయనకు రెండు నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయి. అవతలి వ్యక్తి అభ్యంతరకంగా, బెదిరించే ధోరణిలో మాట్లాడారు. దీంతో ఆయన సదరు వ్యక్తి ఏదో ఇబ్బందిలో ఉండి ఉంటాడని భావించి, సహాయం అందించాల్సిందిగా సూచిస్తూ ప్రధాన కంట్రోల్ రూమ్‌కు ఆ రెండు నెంబర్లు పంపారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ కె.మురళి ఆ నెంబర్లతో సంప్రదించి విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా అవతలి వ్యక్తి అభ్యంతరకరంగా బదులిచ్చారు. దీంతో ఐపీసీలోని 189, 506, ఐటీ యాక్ట్‌లోని 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తి కర్ణాటకలో ఉన్నట్లు గుర్తించారు. -
హెడ్మాస్టర్ సస్పెన్షన్
చక్రాయపేట, న్యూస్‌లైన్: కీచక హెడ్మాస్టర్ కృష్ణానాయక్‌ను డీఈఓ అంజయ్య సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చారు. చక్రాయపేట మండలం మహదేవపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కృష్ణానాయక్ తోటి ఉపాధ్యాయురాలి పట్ల, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంపై వారు ఆదివారం పోలీసులకు అతనిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆదివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థులు బైఠాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కృష్ణానాయక్‌ను సస్పెండ్ చేస్తామని డీఈఓ ఆదివారం విద్యార్థుల వద్దకు వచ్చి హామీ ఇచ్చారు. కాగా సోమవారం విద్యార్థులు పాఠశాలకు మధ్యాహ్నం వరకు తాళాలు వేసి బయటనే కూర్చున్నారు. హెడ్మాస్టర్పై చర్యలు తీసుకునేంతవరకూ పాఠశాల తలుపులు తీయమని విద్యార్థులు తెగేసి చెప్పారు. మధ్యాహ్నం హెడ్మాస్టర్ను సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు మండల విద్యాకేంద్రానికి వచ్చాయని ఆ పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు చెప్పినా వారు వినలేదు. దీంతో ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు ఎమ్మార్సీ కార్యాలయం వద్దకు వచ్చి సస్పెన్షన్ ఉత్తర్వులు తీసుకెళ్లి విద్యార్థులకు చూపించడంతో వారు కేకలు వేస్తూ తరగతి గదుల్లోకి వెళ్లారు. కృష్ణానాయక్‌ను రిమాండ్‌కు తరలింపు... హెడ్మాస్టర్ కృష్ణానాయక్‌ను సోమవారం లక్కిరెడ్డిపల్లె మేజిస్ట్రేట్ కోర్టుకు తరలించి నట్లు ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆయన్ను రాయచోటి సబ్‌జైల్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.