Three UP Youth Dance Obscenely On National Anthem, Video Viral - Sakshi
Sakshi News home page

వీడియో: జాతీయ గీతం పాడుతూ వెకిలి చేష్టలు.. తప్పదు భారీ మూల్యం!

Published Sat, Jan 28 2023 6:54 PM | Last Updated on Sat, Jan 28 2023 8:25 PM

Three UP Youth Dance Obscenely On National Anthem Video Viral - Sakshi

Viral Video.. ముగ్గురు యువకులు జాతీయ గీతం పాడుతూ వెకిలి చేష్టలు చేశారు. జాతీయ గీతాన్ని అవమానించేలా ప్రవర్తించారు. ఈ క్రమంలో తగిన మూల్యం చెల్లించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఖంగుతిన్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెలిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యువకులు జాతీయ గీతం పాడుతున్నారు. టేపులో జాతీయ గీతం వస్తుండగా.. మధ్యలో అద్నాన్‌ అనే యువకుడు.. ఓవరాక్షన్‌ చేశారు. జాతీయ గీతం ఆలపిస్తూ వెకిలి చేష్టలు చేశారు. నేషనల్‌ అంథమ్‌ పాడుతూ.. కుప్పి గంతులు వేశాడు. జాతీయ గీతాన్ని అవమానపరిచేలా వ్యవహరించాడు. ఈ క్రమంలో అతడితో పాటే రుహెల్‌, మరో యువకుడు కలిసి పెద్దగా నవ్వుతూ డ్యాన్స్‌ చేశారు. జాతీయ గీతం చివరలో కూడా అసభ్యకరంగా డ్యాన్స్‌ స్టెప్పులు వేశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఈ వీడియోపై సచిన్‌ షిరోనీ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ సంజయ్‌ శర్మ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement