national anthem issue
-
వీడియో: జాతీయ గీతం పాడుతూ వెకిలి చేష్టలు.. తప్పదు భారీ మూల్యం!
Viral Video.. ముగ్గురు యువకులు జాతీయ గీతం పాడుతూ వెకిలి చేష్టలు చేశారు. జాతీయ గీతాన్ని అవమానించేలా ప్రవర్తించారు. ఈ క్రమంలో తగిన మూల్యం చెల్లించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఖంగుతిన్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెలిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యువకులు జాతీయ గీతం పాడుతున్నారు. టేపులో జాతీయ గీతం వస్తుండగా.. మధ్యలో అద్నాన్ అనే యువకుడు.. ఓవరాక్షన్ చేశారు. జాతీయ గీతం ఆలపిస్తూ వెకిలి చేష్టలు చేశారు. నేషనల్ అంథమ్ పాడుతూ.. కుప్పి గంతులు వేశాడు. జాతీయ గీతాన్ని అవమానపరిచేలా వ్యవహరించాడు. ఈ క్రమంలో అతడితో పాటే రుహెల్, మరో యువకుడు కలిసి పెద్దగా నవ్వుతూ డ్యాన్స్ చేశారు. జాతీయ గీతం చివరలో కూడా అసభ్యకరంగా డ్యాన్స్ స్టెప్పులు వేశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఈ వీడియోపై సచిన్ షిరోనీ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంజయ్ శర్మ తెలిపారు. If you can't respect the national anthem, you don't deserve to be free. 'Adnan' and 'Ruhel' from UP should be behind bars for this act. pic.twitter.com/cLCxCYGUbq — Zaira Nizaam 🇮🇳 (@Zaira_Nizaam) January 27, 2023 -
జాతీయ గీతం పాడనందుకు ఆటగాళ్లను చంపాలనుకున్నారు..!
ఫిఫా వరల్డ్‌కప్-2022లో తమ ఆరంభ మ్యాచ్‌లో ఐరాన్ జట్టు.. ఇంగ్లండ్ చేతిలో 6-2 గోల్స్ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఐరాన్.. పటిష్టమైన ఇంగ్లండ్‌ను సమర్ధవంతంగా ఢీకొట్టినప్పటికీ, ప్రత్యర్ధిని నిలువరించడంలో విఫలమైంది. ఈ మ్యాచ్‌లో ఐరాన్ ఓడినా.. ఆ జట్టు కనబర్చిన పోరాటపటిమ అందరినీ ఆకట్టుకుంది. ప్రాంతాలకతీతంగా విశ్వవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు ఐరాన్ ఆటగాళ్లను ప్రశంసించారు. అయితే, ఇంగ్లండ్‌తో మ్యాచ్ ప్రారంభానికి ముందు ఐరాన్ ఆటగాళ్లు తమ జాతీయ గీతాలాపన చేయకపోవడం పలు వివాదాలకు దారి తీసింది. స్వదేశంలో హిజాబ్ విషయంలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు మద్దతుగా ఆటగాళ్లు సామూహికంగా జాతీయ గీతాలాపనను బాయ్‌కాట్ చేశారు. ఇందుకు చాలా మంది ఐరాన్ అభిమానులు కూడా మద్దతు తెలిపారు. అయితే, తమ ఆటగాళ్లు ఇలా ప్రవర్తించడం కొందరు ఐరాన్ అభిమానులకు రుచించలేదు. జాతీయ గీతాన్ని ఆలాపించకపోవడం దేశాన్ని అవమానించినట్లు అని భావించిన వారు ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కొందరైతే ఇంగ్లండ్ చేతిలో మ్యాచ్ ఓడిపోయాక, ఆటగాళ్లను చంపాలని చూశారని ఐరాన్ మేనేజర్ కార్లోస్ క్విరోజ్ (పోర్చుగల్) ఆరోపించారు. విషయం ఏదైనప్పటికీ ఆటగాళ్లను చంపాలనుకోవడం దుర్మార్గమైన ఆలోచన అని, దీన్ని నేను పూర్తి ఖండిస్తున్నానని కార్లోస్ అన్నాడు. జట్టుకు మద్దతుగా నిలవడం ఇష్టం లేకపోతే, ఇంటికెళ్లి కూర్చోవాలే కానీ, ఆటగాళ్లను చంపుతామని ప్రకటనలు చేయడం సరికాదని అల్లరి మూకలను హెచ్చరించాడు. -
జాతీయ గీతంలో ఆ పదం తొలగించాలని తీర్మానం
-
జాతీయ గీతంలో ఆ పదం తొలగించాలని తీర్మానం
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ గీతంలో సింధ్ స్ధానంలో ఈశాన్యం అని చేర్చాలని ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా శుక్రవారం రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. భారత్‌లో ఈశాన్యం కీలక ప్రాంతమని, అయినా ఆ ప్రాంతానికి జాతీయ గీతంలో చోటుదక్కకపోవడం దురదృష్టకరమన్నారు. మరోవైపు ప్రత్యర్థి పాకిస్తాన్ భూభాగంలో ఉన్న సింధ్‌ను జాతీయ గీతంలో ప్రస్తావిస్తున్నారని ఎగువ సభలో ప్రైవేట్ సభ్యుడి తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం ఎంపీ బోరా అన్నారు. జాతీయగీతంలో సింధ్ అనే పదాన్ని తొలగించి, దాని స్ధానంలో ఈశాన్య భారతం అని చేర్చాలని ఈ సభ ప్రభుత్వాన్ని కోరుతోందని తీర్మానంలో పేర్కొన్నారు. గతంలో 2016లో జాతీయ గీతం జనగణమనలో సింధ్ అనే పదాన్ని తొలగించాలని, ఆ పేరుతో దేశంలో ఏ రాష్ట్రం లేదని సరైన పదంతో దాన్ని సవరించాలని శివసేన సభ్యుడు అరవింద్ సావంత్ లోక్‌సభలో ప్రస్తావించారు. జాతీయ గీతాన్ని నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లో రచించగా 1950లో పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. -
జాతీయ గీతాలాపనకు సీఎం గైర్హాజరు
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా గురువారం శాసనసభలో జరిగిన జాతీయ గీతాలాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గైర్హాజరయ్యారు. ఉదయం 9.04 గంటలకు స్పీకరు సభలో ప్రవేశించగానే అందరూ లేచి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు లేచి ప్రధాన ప్రతిపక్షానికి, ప్రతిపక్ష నేతకు జాతీయ గీతమంటే కూడా గౌరవం లేదని, జాతీయ గీతాన్ని బాయ్‌కాట్ చేయడం సలక్షణం కాదని వ్యాఖ్యానించారు. వాస్తవానికి అదే సమయంలో సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు కూడా సభలో లేరు. అంటే ఆర్థికమంత్రి యనమల పరిభాషలో ముఖ్యమంత్రికి, చీఫ్ విప్‌కు కూడా జాతీయ గీతమంటే గౌరవం లేదని అర్థమా? అని క్యాంటీన్లో కొందరు టీడీపీ సభ్యులు వ్యాఖ్యానించుకున్నారు. ''వాస్తవంగా కేంద్రప్రభుత్వం ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా వైఎస్సార్సీపీ సభ్యులు నిరసన ప్రదర్శన చేపట్టడం వల్ల ఆ సమయానికి అసెంబ్లీకి రాలేదు. ఈ విషయం తెలిసి కూడా యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ సభ్యుడు ఇలా వ్యాఖ్యానించి ఉండకూడదు. ఇలా మాట్లాడటం వల్ల మా రాయి మాకే తగిలినట్లు అయింది...'' అని అధికార పక్షానికి చెందిన ఒక శాసనసభ్యుడు వాఖ్యానించారు.