సాక్షి, ముంబై: సోషల్ మీడియా ప్లాట్‌పాం ఇన్‌స్టాగ్రామ్ తాజాగా ‘రిసెంట్లీ డిలిటెడ్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మన ఎకౌంట్ నుంచి డిలిట్, రిమూవ్ చేసిన పోస్ట్‌లు, వీడియోలు, రీల్స్, ఐజీటీవీ వీడియోలు...30 రోజుల లోపు రీస్టోర్ చేసుకోవచ్చు. 30 రోజుల తరువాత ఇవి ఆటోమెటిగ్గా డిలిట్ అయిపోతాయి. డిలిట్ కంటెంట్ కోసం సెట్టింగ్-ఎకౌంట్-రీసెంట్ డిలిటెడ్‌లోకి వెళితే సరిపోతుంది. డిలిట్ అయినవి హ్యాకర్ల బారిన పడకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. యూజర్ల కోరికమేరకు ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు ఇన్‌స్టాగ్రామ్ ప్రకటించింది.
గూగుల్‌లోకొత్తగా...
సంగీత అభిమానులకు ఉపకరించే మార్పును డెస్క్‌టాప్ సెర్చ్ రిజల్ట్‌లో చేసింది గూగుల్. నెవిగేషన్ డ్రాయర్‌తో టాప్ లెఫ్ట్‌లో మనం కోరుకునే సమాచారానికి సంబంధించిన వివరణతో పాటు వోవర్ వ్యూ, లిజెన్, వీడియోసాంగ్...ఇలా సబ్‌కేటగిరిలు కనిపిస్తాయి. షేర్ బటన్ ఉంటుంది. తాజా మార్పు వల్ల మనం కోరుకునే పేజీని వెంటనే క్లిక్ చేయవచ్చు. టైమ్ సేవ్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment