
ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో నిలిచే టర్కీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ను బ్లాక్ చేసి హెడ్‌లైన్స్‌లో చోటుదక్కించుకుంది. అమెరికన్ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌పై సెన్సార్‌షిప్ ఆరోపణలు చేస్తూ, ఈ నిర్ణయం తీసుకున్నట్లు టర్కీ నేషనల్ కమ్యూనికేషన్స్ అథారిటీ పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌ను ఆగస్టు 2 నుంచి బ్లాక్ చేస్తున్నట్లు బీటీకే కమ్యూనికేషన్స్ అథారిటీ తన వెబ్‌సైట్‌లో ఒక పోస్ట్‌లో వెల్లడించింది.
టర్కీలోని వినియోగదారులు తమ ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌ను రిఫ్రెష్ చేయలేకపోయామంటూ ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఫిర్యాదు చేశారు. కాగా టర్కీ ప్రెసిడెన్షియల్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఫహ్రెటిన్ ఆల్టున్.. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌పై పలు ఆరోపణలు చేశారు. ‘హమాస్ అమరవీరుడు హనియాకు సంతాప సందేశాలను పోస్టు చేయకుండా యూజర్స్‌కు ఇన్‌స్టా ఇబ్బందులు కలిగించిందని’ పేర్కొన్నారు. కాగా టర్కీ అధికారులు సోషల్ మీడియా సైట్స్‌కు యాక్సెస్‌ను బ్లాక్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. దీనికిముందు 2017 ఏప్రిల్, 2020 జనవరి మధ్య దేశ అధ్యక్షుడు- ఉగ్రవాదం మధ్య సంబంధాలపై రాసిన రెండు కథనాల కారణంగా వికీపీడియాను టర్కీ బ్లాక్ చేసింది.
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా టెహ్రాన్‌లో హత్యకు గురయ్యాడు. ఈ హత్య ఎవరు చేశారనే దానిపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అధికారికంగా వెల్లడికాలేదు. ఇతని మరణానికి 94 రోజుల ముందు, అతని ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్లు పాలస్తీనాలో హతమయ్యారు.
"Turkey’s communications authority blocked access to the social media platform Instagram,” apparently because Instagram had removed "posts by Turkish users that expressed condolences over [Israel's] killing of Hamas political leader Ismail Haniyeh." https://t.co/Mc4pERy9j5
— Kenneth Roth (@KenRoth) August 2, 2024