

అంతలోనే అతడు ఓ నటిని వేధిస్తున్నాడంటూ వార్తలు వైరలవుతున్నాయి.

పాక్ నటి నవాల్ సయూద్‌కు అసభ్య సందేశాలు పంపాడన్నది సదరు వార్తల సారాంశం.. ఈ ప్రచారంలో ఎంత నిజముందో చూద్దాం.. నటి నవాల్ సయూద్ 'లైఫ్ గ్రీన్ హై' అనే షోకి హాజరైంది.

ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. చాలామంది క్రికెటర్లు తనను ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఇప్పటికీ మెసేజ్లు చేస్తున్నారంది. అందులో పెళ్లైనవాళ్లు కూడా ఉన్నారని పేర్కొంది.

దీంతో ఆ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఐజాజ్, నదియా ఖాన్ ఒక్కసారిగా షాకయ్యారు. నీకు మెసేజులు పంపుతున్నది షోయబా?

అని అడగ్గా తను నవ్వేసింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం నాకిష్టం లేదు. సినీతారల కంటే కూడా క్రికెటర్లనే జనాలు స్ఫూర్తిగా తీసుకుంటారు.

అలాంటప్పుడు వారు ఇలా పిచ్చి పిచ్చి మెసేజ్‌లు చేయకుండా కాస్త హుందాగా ప్రవర్తిస్తే బాగుంటుంది అని చెప్పుకొచ్చింది. అయితే ఎక్కడా కూడా షోయబ్ మాలిక్ పేరు తన నోటి నుంచి రాలేదు.

నవాల్ సయూద్ విషయానికి వస్తే.. ఈ 25 ఏళ్ల ముద్దుగుమ్మ మొదట్లో వాణిజ్య ప్రకటనల్లో నటించింది.

2017లో బుల్లితెర ఇండస్ట్రీకి నటిగా పరిచయమైంది. దాదాపు 25కు పైగా సీరియల్స్‌లో నటించింది. పీచే తు దేకో, ముస్కాన్ చిత్రాల్లో నటించింది.
















