![Megastar Chiranjeevi Voice Message To Aata Sandeep Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/11/Aata-Sandeep.jpg.webp?itok=HVYU9G7n)
ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్- జ్యోతీ రాజ్ దంపతులకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ మెసేజ్ పంపించారు. 'మీ థ్యాంక్యూ మెసేజ్ నాకు అందింది. అమ్మ మాటలు, ఆమె దీవెనలు నాకు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. మీరు ఇద్దరు చేసే డ్యాన్స్ బిట్స్ అప్పుడప్పుడు నా దృష్టికి వస్తుంటాయి. మీ కపుల్స్ చాలా లవ్లీ డ్యాన్సర్స్. మీ క్రేజ్ నన్ను బాగా ఆకటుకుంటుంది. భవిష్యత్తులో మీరు ఇంకా పెద్ద కొరియోగ్రాఫర్‌గా రాణించాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నాను' అని స్వయంగా చిరంజీవి పంపిన వాయిస్ మెసేజ్‌ను ఆట సందీప్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ఆధ్వర్యంలో చిరంజీవి ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఆట సందీప్ తల్లికి కూడా వ్యాక్సిన్ వేయించినట్లు తెలుస్తోంది.
లాక్‌డౌన్ వల్ల ఎంతోమంది డ్యాన్సర్లు కూడా పని లేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అండగా నిలుస్తూ, గత కొన్ని రోజులుగా డ్యాన్సర్లకు సందీప్ దంపతులు నిత్యవసర వస్తువులు పంపిస్తున్న సంగతి తెలిసిందే. షో, ఆడియో ఫంక్షన్లు, సంగీత్ వంటి కార్యక్రమాలు ఆగిపోవడంతో గ్రూప్ డ్యాన్సర్లు సహా చాలామందికి ఆదాయం లేకుండా పోయింది. దీనివల్ల పూట గడవక చాలామంది బాధపడుతున్నారు. వాళ్లను ఆదుకునేందుకు ఆట సందీప్ దంపతులు తమవంతు సహాయం చేస్తున్నారు.
మరోవైపు సందీప్‌కు మరింత సహకారం అందించేందుకు చిరంజీవి అల్లుడు, హీరో కల్యాణ్ దేవ్ సైతం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు స్వయంగా చిరంజీవి నుంచి వాయిస్ మెసేజ్ అందడంతో ఆట సందీప్ దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నోటి నుంచి తమ పేరు రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇక ఆట సందీప్ పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. చిరంజీవి నుంచి మెసేజ్ రావడం నిజంగా సూపర్ అంటూ అభినందిస్తున్నారు.
చదవండి : సినీ కార్మికులందరికి ఉచితంగా వ్యాక్సిన్ : చిరంజీవి
'ఆట ఫేమ్ గీతిక ఎన్ని కష్టాలు పడుతుందో'.. ఆమె ఏం చెప్పిందంటే!
Comments
Please login to add a commentAdd a comment