
వాట్సాప్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాడే సోషల్ మెసేజింగ్ యాప్. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ సొంతం. వాట్సాప్ ద్వారా సందేశాలను ఇతరులకు పంపుతాము. అప్పుడప్పుడు మనం పంపే మెసేజ్‌ల్లో ఏమైనా తప్పులు ఉన్నాయో లేదో..చూసి మెసేజ్‌లను పంపుతాం. ఈ సౌలభ్యం కేవలం వాట్సాప్‌లో మెసేజ్‌లకు మాత్రమే ఉంది. వాయిస్ మెసేజ్‌లకు లేదు. వాయిస్ మెసేజ్‌లను ఎలాంటి పునః పరిశీలన చేయకుండానే పంపుతుంటాం. మనలో కొంత మంది అరేరే..! తప్పుగా వాయిస్ మెసేజ్ సెండ్ చేశానే..!అని నాలుక కర్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో మనలో కొందరు వాటివల్ల అనేక పర్యవసానాలను కూడా ఎదుర్కొని ఉంటారు.
ఈ సమస్యకు వాట్సాప్ త్వరలోనే చెక్ పెట్టనుంది. అవును మీరు విన్నది నిజమే... రానున్న రోజుల్లో వాట్సాప్ తీసుకురానున్న ఈ ఫీచర్‌తో వాయిస్ మెసేజ్‌లను తిరిగి ఒకసారి వినే వీలు కల్గుతుంది. ఈ ఫీచర్‌ను ప్రస్తుతం వాట్సాప్ పరీక్షిస్తోంది. అంతేకాకుండా వాయిస్ మెసేజ్‌లను యూజర్లు ఎంపిక చేసుకున్న స్పీడ్‌ల్లో మెసేజ్‌లను వినవచ్చును. ఈ ఫీచర్‌తో యూజర్లు వాయిస్ మెసేజ్ ప్లేబ్యాక్ వేగాన్ని నియంత్రించవచ్చును. రానున్న రోజుల్లో వాయిస్ మెసేజ్‌లను పంపేటప్పడు ‘రివ్యూ’ బటన్ ఉండేలా వాట్సాప్ ఏర్పాటు చేస్తోంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలో వాట్సాప్ తీసుకురానుంది.
Comments
Please login to add a commentAdd a comment