బాల్కొండ : మొబైల్ స్టార్టర్ కనెక్షన్ ఉన్న మోటర్‌కు సంబంధించిన ప్రతి వివరం రైతు ఫోన్‌కు ఎస్సెమ్మెస్ రూపంలో లేదా వాయిస్ మెసేజ్ రూపంలో వస్తుంది. మొబైల్ స్టార్టర్ బిగించిన మోటర్లకు విద్యుత్ సరఫరా అయ్యి మోటర్ ఆన్ అయిన పది సెకండ్లలో రైతు ఫోన్ నంబర్‌కు మెస్సేజ్ వెళ్తుంది. మోటర్ పనిచేయకపోతే ఏ కారణం చేత నడవడం లేదో కూడా గుర్తించి రైతుకు సమాచారాన్ని చేరవేస్తుంది. తెలుగులోనూ వాయిస్ మెస్సేజ్ అందుబాటులో ఉంది. ‘మీ మోటర్ ప్రారంభం కాలేదు’ అని స్పష్టంగా తెలుపుతుంది. ఇది మోటర్‌కు విద్యుత్ ఎప్పుడు ప్రసారమైంది, ఎప్పుడు ఆగి పోయింది అన్న టెన్షన్ రైతుకు లేకుండా చేస్తుందని లింగారెడ్డి వివరించారు.
పంపు సెట్లకు రక్షణ
ఈ యంత్రం మోటర్ ఆన్, ఆఫ్ సమాచారం తెలపడానికి మాత్రమే కాకుండా పంపు సెట్లకు రక్షణగా కూడా కల్పిస్తుంది. బావిలో, బోరులో నీరు అయిపోయిన సందర్భంలో రైతుకు మెస్సేజ్ పంపుతుంది. దీంతో రైతు ఆ మోటర్‌ను ఆఫ్ చేసుకోవచ్చు. ఎవరైనా పైప్‌లైన్‌లను పగుల గొట్టాలని గేట్ వాల్వులు తిప్పి నీటిని జామ్ చేసినా.. రైతుకు వెంటనే సమాచారాన్ని అంది స్తుంది. స్కాన్ చేసుకుని మోటర్లను ఆఫ్ చేస్తుంది.
బిందు సేద్యానికి ప్రయోజనకరం
బిందు సేద్యం చేసే రైతులకు ఈ మొబైల్ స్టార్టర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతు లింగారెడ్డి తెలిపారు. డ్రిప్ పైప్‌లలో ఏ వాల్వ్ పని చేయకపోయినా రైతు ఫోన్‌కు మెస్సేజ్ వస్తుంది. దీంతో దానికి మరమ్మతులు చేసుకోవచ్చు. గ్రామంలో లేకున్నా మెకానిక్‌కు ఫోన్ చేసి ఫలానా మోటర్‌లో ఫలానా సమస్య వచ్చిందని చెప్పే అవకాశం రైతుకు ఉంటుంది. మొబైల్ స్టార్టర్‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని రైతు లింగారెడ్డి పేర్కొన్నారు. త్రీఫేజ్ కరెంట్ ఉందా లేదా అని రైతులు ట్రాన్స్‌కో అధికారులకు కాకుండా తనకే ఫోన్ చేసి అడుగుతున్నారన్నారు. ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికి 20 మంది వరకు రైతులు ఈ స్టార్టర్‌ను ఉపయోగిస్తున్నారని, దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
రైతుల రంది తీర్చే మొబైల్ స్టార్టర్
Published Wed, Sep 3 2014 5:48 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM
Advertisement
Advertisement