drip irrigation
-
ఎలాంటి సింహమో ప్రజలు తేలుస్తారు..
పులివెందుల : మనం కొదమ సింహాలమా, వృద్ధ సింహాలమా.. గ్రామ సింహాలమా అనేది ప్రజలు తేలుస్తారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పులివెందుల పర్యటనలో బుధవారం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు భయస్తుడు కాబట్టే తాను ధైర్యవంతుడిని అని చెప్పుకునేందుకు మాటిమాటికి కొదమ సింహం అని అంటున్నాడని ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టులను సందర్శించేందుకు ఆయన ఏ ధైర్యంతో వస్తున్నాడో అర్థంకావడంలేదన్నారు. ఒక అబద్ధాన్ని కళ్లు ఆర్పకుండా చెప్పగలిగే వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 11వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్వల్ల రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించలేమని భావించి దాన్ని 44వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచిన ఘనత మహానేత డాక్టర్ వైఎస్సార్‌దే. దీనిని అడ్డుకునేందుకు అప్పట్లో ధర్నాలు చేయించిన విషయం బాబు మరిచిపోయినా ప్రజలు మర్చిపోలేదు. అలాగే, గండికోట రిజర్వాయర్ సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు కుదించిన ఘనుడు చంద్రబాబే. వైఎస్సార్ వచ్చాక 27టీఎంసీలుగా చేశారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులో ఎన్నడూ పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటిని నింపిన దాఖలాల్లేవు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక 27టీఎంసీల పూర్తి సామర్థ్యాన్ని నింపి సీమకు నీళ్లిస్తున్నారు. నిర్వాసితులకు రూ.950కోట్ల పరిహారం ఇవ్వబట్టే ఇది సాధ్యమైంది. అలాగే, చిత్రావతి ప్రాజెక్టు కూడా. తన 14ఏళ్ల పాలనలో ఏనాడూ సీమ ప్రాజెక్టుల గురించి పట్టించుకోని పెద్ద మనిషి చంద్రబాబు. డ్రిప్‌లో రూ.వెయ్యి కోట్ల బకాయి పెట్టి అబద్ధాలా.. డ్రిప్ ఇరిగేషన్‌కు సంబంధించి చంద్రబాబు హయాంలో ఆయా కంపెనీలకు రూ.1,000 కోట్ల బకాయిలు పెట్టడంతో స్కీం నిర్విర్యమైపోయింది. జగనన్న సీఎం అయ్యాక వాటిని చెల్లించి గత ఏడాది పునఃప్రారంభించారు. పంటల బీమా విషయంలోనూ చంద్రబాబు ఇచ్చిన దానికంటే రెండు రెట్లకు పైగా జగన్ ప్రభుత్వం అందించింది. వైఎస్సార్ జిల్లాలో 2012కు సంబంధించిన శనగపంట బీమా 2014–19 వరకు పెండింగ్‌లో ఉండేది.. జగనన్న వచ్చాక తొలి ఏడాదిలోనే రూ.112కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు. పైడిపాలెం వైఎస్సార్ బ్రెయిన్ చైల్డ్.. పైడిపాలెం రిజర్వాయర్ వైఎస్సార్ బ్రెయిన్ చైల్డ్. ఆయన హయాంలో 90శాతం పనులు పూర్తయ్యాయి. దానిని కూడా బాబు తన ఖాతాలోనే వేసుకుంటున్నాడు. కడప ఎయిర్పోర్ట్ రన్‌వే కోసం రూ.75కోట్లు జగనన్న ప్రభుత్వం చెల్లించింది. ఈరోజు రన్‌వే విస్తరణ జరిగి పెద్ద ఫ్లైట్లు వస్తున్నాయంటే అది జగన్ చలవే. అలాగే, కుప్పాన్ని కూడా గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్. ఇక జిల్లాలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. ఇవేవీ చంద్రబాబుకు కనిపించడంలేదు. మరోవైపు.. తన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని తన సోదరి, చంద్రబాబు, బీజేపీలోని టీడీపీ నేతలు, వ్యవస్థలోని ఒక పెద్ద మనిషి కలిసి రెండున్నరేళ్లుగా పన్నాగం పన్నారు. వారి అంతిమ లక్ష్యం వైఎస్సార్సీపీని, జగన్‌ను ఇబ్బంది పెట్టడమే. వివేకా కేసులో వాస్తవాలను పక్కన పడేసి రాజకీయ కోణంలో ముందుకు తీసుకువెళుతున్నారు. క్షమాపణ చెప్పి మాట్లాడాలి ఇక తెలుగుగంగ ప్రాజెక్టులో బ్రహ్మం సాగర్‌కు నీరు రావాలంటే కావాల్సిన కాలువ రిపేర్లు చేయాలని అనేకసార్లు విన్నవించినా చంద్రబాబు పట్టించుకోలేదు. జగన్ వచ్చిన తర్వాత ఆ కాలువలన్నీ ఆధునికీకరణ చేసి లైనింగ్ చేయించారు. ముందు ఈ ప్రాంత ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పి మాట్లాడాలి. -
బిందు సేద్యం.. సర్కారు సాయం
సాక్షి రాయచోటి: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను అన్ని విధాల ఆదుకుంటూ వస్తోంది. ఒకవైపు రైతు భరోసా, మరోవైపువైఎస్సార్ పంటల బీమా, ఇంకోవైపు సున్నావడ్డీ ఇలా చెబుతూ పోతే రైతు భరోసా కేంద్రాల వరకు అన్నదాతలకు సర్కార్ అండగా ఉంటూ వస్తోంది. రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లతోపాటు యంత్రపరికరాలను ఇటీవల ప్రభుత్వం అందించింది. పంట పొలాల్లో ప్రతి నీటి చుక్క వృథా చేయకుండా సద్వినియోగం చేయడం ద్వారా భవిష్యత్తులో నీటి విపత్తు తలెత్తకుండా ఉండేందుకు రైతులకు మైక్రో ఇరిగేషన్ ద్వారా బిందు, తుంపర పరికరాలను అందిస్తోంది. ప్రతి నీటి బిందువును పొదుపుగా వాడుకోవడం మొక్కలతోపాటు ప్రకృతికి మంచిదే. ఈ నేపధ్యంలోనే కాలువలు, బోర్ల ద్వారా పారగట్టే పద్ధతికి రైతులు స్వస్తి పలుకుతూ ఇటీవలి కాలంలో ఎక్కువగా బిందు, తుంపర సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడ్పాటును అందిస్తూ వస్తోంది. స్పింక్లర్లు, డ్రిప్‌లను వినియోగించుకునే రైతులకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలను అందించి ప్రోత్సాహం అందిస్తోంది. 2022–23కి సంబంధించి అన్నమయ్య జిల్లాలో 14 వేల హెక్టార్లకు పరికరాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకుని మైక్రో ఇరిగేషన్ శాఖ ప్రణాళికలు రూపొందించి అందుకు అనుగుణంగా ముందుకు వెళుతోంది. డ్రిప్, స్ప్రింకర్లకు భారీ ఎత్తన సబ్సిడీ ఇస్తున్నారు. ఇప్పటివరకు 16,920 మంది రైతుల నమోదు అన్నమయ్య జిల్లాలో ఇప్పటివరకు సుమారు 16,920 మంది రైతులు పరికరాలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ ఏడాది మే మొదటి వారంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అప్పటి నుంచి ఇప్పటివరకు రైతు భరోసా కేంద్రాల్లో 16,920 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోగా వారికి సంబంధించి 19046 హెక్టార్ల భూమి అవసరమని దరఖాస్తుల్లో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదికి సంబంధించి డ్రిప్‌లకు 12 వేల హెక్టార్లు, స్ప్రింకర్లకు 2 వేల హెక్టార్లకు పరికరాలు అందించాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటివరకు 2,893 మంది రైతులకు 3145 హెక్టార్లకుగాను బిందు, తుంపెర సేద్యం పరికరాలను అందించారు. రైతులందరూ జిల్లాలోని ఆర్బీకేల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు రైతు వాటాకు సంబంధించిన మొత్తాలను ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా అధికారులకు పంపుతున్నారు. అయితే 14 వేల హెక్టార్ల లక్ష్యం ఉన్న నేపథ్యంలో అవసరమైన ప్రతిరైతుకు అందించేలా మైక్రో ఇరిగేషన్ అధికారులు ముందుకు వెళుతున్నారు. రాష్ట్రంలో రెండోస్థానం అన్నమయ్య జిల్లాలో సూక్ష్మసేద్య పరికరాలకు సంబంధించి ప్రభుత్వం రాయితీతో అందిస్తోంది. వాటికి సంబంధించి వేగంగా రైతులకు అందించడంలో రాష్ట్రంలోనే అన్నమయ్య జిల్లా రెండవస్థానంలో ఉంది. మొదటి స్థానంలో అనంతపురం, రెండోస్థానంలో అన్నమయ్య, మూడవ స్థానంలో వైఎస్సార్ ఉన్నాయి. కంపెనీల ద్వారా పరికరాలు వేగవంతంగా అందేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. బోరు వద్ద డ్రిప్‌పైపు వద్ద ఈ మహిళ పేరు గుణసుందరి. ఈమెది ఓబులవారిపల్లె మండలం బొమ్మవరం గ్రామం. ఈమెకు 0.69 హెక్టార్ల భూమి ఉంది. అందులో పసుపు పంట సాగు చేశారు. అయితే డ్రిప్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇటీవలే అందించారు. 90,103 రూపాయలు అంచనా కాగా, రైతు వాటా పోను రూ 81,032 విలువైన డ్రిప్ పరికరాలు అందజేయడంతోపాటు పొలంలో బిగించారు. దీంతో ఆమె ప్రభుత్వంతోపాటు ముఖ్యమంత్రి, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తోంది. 8రైతులకు భారీ రాయితీ అన్నమయ్య జిల్లాలో ఉద్యాన పంటలు, ఇతర సాధారణ పంటలు సాగు చేసే రైతులకు బిందు, తుంపర పరికరాలను మైక్రో ఇరిగేషన్ శాఖ ద్వారా అందిస్తున్నారు. అయితే ప్రభుత్వం భారీ రాయితీలను కూడా రైతులకు పూర్తి స్థాయిలో అందించేలా ప్రణాళికలు రూపొందించి అందజేస్తోంది. డ్రిప్‌కు సంబంధించి ఐదు ఎకరాలలోపు పొలం ఉన్న రైతులకు 90 శాతం సబ్సిడీతో రూ. 2.18 లక్షల వరకు రాయితీ వర్తించనుంది. అలాగే 5–10 ఎకరాల పొలం ఉన్న రైతులకు 70 శాతం సబ్సిడీతో రూ. 3.46 లక్షల మేర రాయితీ అందించనున్నారు. స్ప్రింకర్లకు సంబంధించి ఐదు ఎకరాల్లోపు అయితే 55 శాతం రాయితీ, ఐదు ఎకరాలకు పైబడిన రైతులకు 45 శాతం రాయితీతో అందిస్తున్నారు. ఇప్పటివరకు నమోదు చేసుకున్న రైతులకు సంబంధించి వరుస క్రమంలో తుంపెర, బిందు సేద్యం పరికరాలను ఎంపిక చేసిన ఆయా కంపెనీల ద్వారా రైతన్నలకు అప్పజెబుతున్నారు. అర్హులందరికీ సబ్సిడీపై పరికరాలు అన్నమయ్య జిల్లాలో అర్హులైన రైతులందరికీ సబ్సిడీపై పరికరాలు అందిస్తున్నాం. జిల్లాకు డ్రిప్‌నకు సంబంధించి 12 వేల హెక్టార్లు, స్ప్రింకర్లకు సంబంధించి 2 వేల హెక్టార్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులు దరఖాస్తు చేసుకున్న అనంతరం వారికి కంపెనీల ద్వారా సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటికే 3145 హెక్టార్లకుగాను బిందు, తుంపెర సేద్యం పరికరాలను అందించాము. ప్రభుత్వం కూడా భారీ రాయితీతో పరికరాలను అందిస్తూ అన్నదాతకు అండగా నిలుస్తోంది. – వెంకటేశ్వరరెడ్డి, జిల్లా సూక్ష్మ నీటి సేద్య అ«ధికారి, రాయచోటి, అన్నమయ్య జిల్లా -
బిందు సేద్యం బకాయిలు విడుదల
సాక్షి, అమరావతి: ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు(ఏపీఎంఐపీ)కు సంబంధించి గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన రూ. 437.95 కోట్ల బకాయిలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. ఆయా కంపెనీలకు ఒకటి రెండ్రోజుల్లో నేరుగా ఈ మొత్తం చెల్లిస్తామన్నారు. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో బకాయిల విడుదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా రానున్న ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ సేద్యం ప్రాజెక్టు అమలు కోసం షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. సీఎం ఆదేశాల మేరకు 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,200 కోట్లతో 3.75 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం ప్రాజెక్టును అమలు చేయబోతున్నట్టు మంత్రి కన్నబాబు వెల్లడించారు. ఆర్బీకేల ద్వారా అవసరమున్న ప్రతి రైతుకు బిందు సేద్య పథకం ద్వారా లబ్ధి చేకూర్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. రాయలసీమ, ప్రకాశం తదితర జిల్లాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. సబ్సిడీపై పెద్దఎత్తున డ్రిప్, స్ప్రింక్లర్ల పరికరాలను సమకూర్చనున్నట్టు ఆయన తెలిపారు. -
వ్యవసాయ, అనుబంధ శాఖలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: చిన్న, సన్నకారు రైతులకు ఎలా మేలు చేయాలి అన్న దానిపై కార్యచరణ రూపొందించాలని.. మల్బరీ రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్, అగ్రి ఇన్‌ఫ్రాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నిర్ణీత కాలంలోగా చిన్న, సన్నకారు రైతులందరికీ కూడా డ్రిప్, స్ప్రింక్లర్ సదుపాయాలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలి. దీని వల్ల చిన్న, సన్నకారు రైతులందరికీ డ్రిప్, స్ప్రింక్లర్ సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించినట్టు అవుతుంది. చిన్న సన్నకారు రైతులకు ఎలాగూ బోర్లు వేయిస్తున్నాం కాబట్టి, వారికి సూక్ష్మ సేద్యం సదుపాయాలను ఇచ్చినట్లైతే మంచి ఫలితాలు వస్తాయి. ఏం చేసినా శాచ్యురేషన్ పద్ధతిలో ఉండాలి. కొందరికి మాత్రమే పథకాలు ఉండకూడదు.. అందరికీ అందాలి. వ్యవస్థలో అవినీతి ఉండకూడదు. చిన్న, సన్నకారు రైతులకు ఎలా మేలు చేయాలన్న దానిపై ఒక కార్యాచరణ ఉండాలి’’అని సీఎం జగన్ తెలిపారు. రివర్స్ టెండరింగ్‌లో సూక్ష్మ సేద్యం సదుపాయాలు ‘‘రాయలసీమ, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో 10 ఎకరాల్లోపు, మిగిలిన చోట్ల 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ సదుపాయాల్లో ప్రాముఖ్యత ఇవ్వాలి. దీనిపై పూర్తిస్థాయిలో ఆలోచనలు చేసి కార్యాచరణ రూపొందించాలి. సూక్ష్మసేద్యం సదుపాయాలను రివర్స్‌టెండరింగ్ పద్దతిలో కొనుగోలు చేయడం ద్వారా రేటు తగ్గుతుంది. దీనివల్ల ఎక్కువ మంది రైతులకు సూక్ష్మ సేద్యం సదుపాయాలను అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాయితీలను పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే.. ఎంత రేటులో డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయన్నదానిపై ఒక అవగాహన వస్తుంది. సెరికల్చర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రస్తుతం మల్బరీని సాగుచేస్తున్న రైతులకున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. వారి పరిస్థితులను పూర్తిస్థాయిలో మెరుగుపరచాలని’’ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అగ్రి ఇన్ఫ్రాపై సీఎం సమీక్ష అగ్రి ఇన్ఫ్రాలో భాగంగా ఏర్పాటు చేయనున్న మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా డ్రై స్టోరేజీ, డ్రైయింగ్ ఫ్లాట్ ఫాం, గోడౌన్లు, హార్టికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రైమరీ ప్రాససింగ్ సెంటర్లు, యంత్రపరికరాలు, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ఇ–మార్కెటింగ్, జనతాబజార్లు, ప్రైమరీ ప్రాససింగ్ యూనిట్లు తదితర 14 సదుపాయాల గురించి చర్చించారు. వీటి కోసం 14,562 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్దతులను ప్రమోట్ చేయాలి. దీనికి సంబంధించి పరికరాలను ప్రతి కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్‌సీ)లో ఉంచాలని’’ సీఎం సూచించారు. ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవియస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఆర్ధిక శాఖ కార్యదర్శి గుల్జార్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై మధుసూదనరెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్ ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. చదవండి: కరోనా కట్టడికి ఐదంచెల వ్యూహం -
సూక్ష్మసేద్యానికి నిధులు కరువు
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మసేద్యానికి బ్రేకులు పడ్డాయి. నిధులు లేకపోవడంతోనే ఈ కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.85 లక్షల ఎకరాలకుగాను కేవలం 70 వేల ఎకరాలకు మాత్రమే పరిపాలన అనుమతులిచ్చారు. ఇందులో ఇంకా ఒక్కటి కూడా క్షేత్రస్థాయిలో రైతులకు అందలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 1,26,054 మంది రైతులు డ్రిప్ ఇరిగేషన్‌కు మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఉద్యాన శాఖ వద్ద మూలుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 60 శాతం నిధులు కేటాయింపులు చేసినా రాష్ట్ర ఆర్థిక శాఖ తన వాటా నిధులు విడుదల చేయడం లేదు. కేంద్రం నుంచి రూ.348 కోట్లు కేటాయింపులు రాగా, రాష్ట్ర ఆర్థిక శాఖ దానికి రూ.283 కోట్లు కలిపి ఇవ్వాల్సి ఉంది. అవసరాల రీత్యా అదనంగా మరో రూ.263.55 కోట్లు ఇచ్చేలా యాక్షన్ ప్లాన్‌కు ఆమోదం కూడా ఇచ్చింది. ఇందులో కేంద్రం రూ.191 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. అయితే అందుకు రాష్ట్ర వాటా కలిపి ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మసేద్యాన్ని ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా బీసీలకు 90, ఇతరులకు 80 శాతం వరకు సబ్సిడీ ఇస్తోంది. సూక్ష్మసేద్యానికి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం గతంలో నాబార్డు నుంచి రూ.800 కోట్లు రుణంగా తీసుకుంది. ఆ సొమ్ము అంతా కూడా గతేడాది దర ఖాస్తులు, వాటి చెల్లింపులకు పూర్తయింది. పదో స్థానంలో రాష్ట్రం... దేశవ్యాప్తంగా 2.30 కోట్ల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అందుబాటులోకి వచ్చింది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే సూక్ష్మసేద్యంలో తెలంగాణ పదో స్థానంలో ఉంది. దేశంలో అత్యధికంగా రాజస్తాన్‌లో 44.71 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. -
నదుల అనుసంధానం బీజేపీ చొరవే: వీర్రాజు
సాక్షి, అమరావతి: కేంద్రం చొరవతోనే రాయలసీమకి డ్రిప్ ఇరిగేషన్ పథకం వచ్చిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గురువారం శాసన మండలిలో తెలిపారు. గురువారం మండలిలో ఇరిగేషన్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నదుల అనుసంధానం మొదటగా బీజేపీయే ప్రవేశ పెట్టిందని అన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వం 1998లోనే నదుల అనుసంధానం కోసం సురేష్ ప్రభు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశరని సోము వీర్రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి వరప్రసాదమైన పోలవరం ప్రాజెక్టు కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ముందుగానే కాలువలు తవ్వించారని వీర్రాజు పేర్కొన్నారు. పోలవరం మాదిరిగానే హంద్రీనీవా, తెలుగు గంగ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ఓ వారం కేటాయించాలని సూచించారు. ముంపు మండలాలను ఆంధ్రలో కలపడానికి కారణం బీజేపీయేనని వీర్రాజు తెలిపారు. ఆ మండలాలను ఆంధ్రలో కలపకుంటే కేసీఆర్ పోలవరానికి అడ్డుపడేవాడని ఆయన అన్నారు. -
భూగర్భ డ్రిప్‌తో కరువుకు పాతర!
⇒ కొత్త పోకడ ⇒ వాతావరణ మార్పుల నేపథ్యంలో బిందు సేద్యంలో కొత్తపోకడ.. భూగర్భ డ్రిప్‌కు ఆదరణ ⇒ తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ పంటకు రక్షణ ⇒ సాధారణ డ్రిప్‌తో కన్నా.. భూగర్భ డ్రిప్‌తో అదనపు ప్రయోజనాలు ⇒ ఉద్యాన తోటలతోపాటు మొక్కజొన్న, వరి, గోధుమ తదితర పంటలకూ భూగర్భ డ్రిప్ అనుకూలమే.. ⇒ ఇజ్రాయెల్ సాంకేతికతతో భూగర్భ డ్రిప్‌తో వరిని సాగు చేస్తున్న కాలిఫోర్నియా రైతులు ⇒ వరి, గోధుమ సాగులో భూగర్భ డ్రిప్ వాడకంపై అధ్యయనానికి సిద్ధమవుతున్న పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వర్షాకాలంలోనూ తిష్టవేస్తున్న కరువు రైతుల ఆశలను నిలువునా కాటేస్తున్నది. ప్రకృతిపై ఆధారపడి బతికే అన్నదాతల జీవనాధారాన్ని నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నది. భూతాపం పెరుగుతున్నకొద్దీ ప్రపంచవ్యాప్తంగా కరువు రక్కసి విస్తరిస్తూ ఉంది. కరువు పీడిత ప్రాంతాల జాబితా ఏటేటా తామరతంపరవుతూ ఉంది. మన దేశంలో 1960వ దశకంలో 5 రాష్ట్రాల్లో 66 జిల్లాలు కరువు కాటకాల పాలవ్వగా, 2010వ దశకంలో (2017 జూన్ నాటికి) 23 రాష్ట్రాల్లో 405 జిల్లాలకు కరువు రక్కసి విస్తరించిందని గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో వ్యవసాయ కేంద్రాలైన కాలిఫోర్నియా తదితర రాష్ట్రాలను సైతం కరువు వణికిస్తోంది. ఈ పూర్వరంగంలో మరింత సమర్థవంతంగా నీటి వినియోగంపై లోతైన అధ్యయనాలు సాగుతున్నాయి. రసాయనిక ఎరువులతో సాగయ్యే ఏక పంటల కన్నా... ప్రకృతి / సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో సాగయ్యే మిశ్రమ పంటలకు కరువును తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండడం మన రైతులకూ అనుభవంలో ఉన్న సంగతే. పంట మొక్కలు, పండ్ల చెట్ల మొదళ్ల దగ్గర్లో భూమిపైన డ్రిప్‌లు, స్ప్రింక్లర్లతోపాటు.. రెయిన్గన్లు ఏర్పాటు చేసుకొని కొందరు రైతులు సాగు నీటిని పొదుపుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, తరచూ కరువు పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో.. మరింత తక్కువ నీటితో పంటలు పండించ వీలయ్యే ‘భూగర్భ డ్రిప్’ పద్ధతి ముందుకు వస్తోంది. ఎడారిలోనూ సమర్థవంతంగా నీటి వినియోగంపై పరిశోధనలో ముందంజలో ఉన్న ఇజ్రాయెల్ భూగర్భ డ్రిప్ వాడకంలోనూ పైచేయి సాధించింది. ఏళ్ల తరబడి నిరవధికంగా సాగులో ఉండే ఉద్యాన తోటల్లో వినియోగించడం అమెరికాలోనూ అతికొద్ది మంది రైతుల అనుభవంలో ఉన్నదే. కరువు సమస్య తరచూ ఎదురుకాటంతో డెల్టా ప్రాంతాల్లోనూ పంటలకు సాగు నీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో.. కొద్ది నెలల్లో కోతకొచ్చే మొక్కజొన్న, సోయా చిక్కుళ్లను ఇప్పటికే భూగర్భ డ్రిప్‌తో సాగు చేసి.. కరువును సమర్థవంతంగా తట్టుకోవడంతోపాటు దిగుబడులనూ గణనీయంగా పెంచుకోగలిగినట్లు సమాచారం. భూగర్భ డ్రిప్ సంగతులు.. ♦ భూగర్భ డ్రిప్ అంటే.. పంట మొక్కలు, పండ్ల చెట్లకు నేలపైన కాకుండా.. వేర్ల దగ్గరలో నీటి తేమను అవసరం మేరకు తగుమాత్రంగా అందించే వ్యవస్థ. ముఖ్యంగా వరి సాగులో ఎకరానికి లక్షల లీటర్ల నీటిని ఆదా చేయడానికి ఈ పద్ధతి దోహదం చేస్తుంది. ♦ భూమి లోపల పంటను బట్టి 4 నుంచి 30 అంగుళాల లోతులో శాశ్వత డ్రిప్‌ను ఏర్పాటు చేస్తారు. నీటి తేమ వేర్లకు క్రమం తప్పకుండా అందుతుంది. మట్టిలో తేమ పరిస్థితిని సెన్సార్ల ద్వారా గమనిస్తూ.. పంటకు అవసరమైనప్పుడు తగుమాత్రంగా నీటిని అందిస్తారు. ♦ ఏ రకం పంట వేర్లు ఎంత లోతుకు వెళ్తాయన్నదాన్ని బట్టి.. ఆ పొలంలో మట్టి గట్టిపడే లక్షణాన్ని బట్టి.. భూమికి ఎన్ని అంగుళాల లోతున డ్రిప్ పైపులు, లైన్లు వేయాలన్నది నిపుణులు నిర్ణయిస్తారు. ♦ దీన్ని ప్రతి ఏటా మార్చుకోవాల్సిన పని ఉండదు. ఒకసారి వేసుకుంటే పదేళ్లపాటు కదిలించాల్సిన అవసరం ఉండదట. కరువొచ్చినా ఉన్న నీటితోనే మంచి దిగుబడులు తీయగలుగుతారు కాబట్టి.. దీర్ఘకాలంలో రైతులకు లాభదాయకమేనని చెబుతున్నారు. ♦ ట్రాక్టర్లు, ఇతర యంత్రాలు పొలంలో తిరగడం వల్ల భూగర్భ డ్రిప్‌కు ఎటువంటి నష్టమూ ఉండదు. ♦ రెయిన్ గన్ల ద్వారా ఖర్చయ్యే నీటిలో సగంతోనే భూగర్భ డ్రిప్ ద్వారా పంటలు పండించవచ్చు. ♦ వరి తదితర పంట విత్తనాలు మొలకెత్తడానికి మొదట ఒక తడి పెడతారు. మొలకెత్తిన తర్వాత.. భూగర్భ డ్రిప్ ద్వారా నీటిని అందిస్తారు. పొలంలో భూమి పై భాగం పొడిగానే ఉంటుంది. ఫలితంగా కలుపు సమస్య ఉండదు. చీడపీడల బెడద కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. ♦ మట్టిలో నీటి తేమ ఎంత లోతులో ఎంత ఉంది? అనేది ఎప్పటికప్పుడు గమనించి రైతు మొబైల్ లేదా కంప్యూటర్‌కు సెన్సార్లు సమాచారం ఇస్తాయి. నీరు పంటలకు అవసరం లేనంత కిందికి వెళ్తున్నదో లేదో తెలుసుకోవడానికి భూగర్భంలో అక్కడక్కడా సెన్సార్లు పెడతారు. ♦ భూగర్భ డ్రిప్‌తో అతి తక్కువ నీటితో, కరువు కాలంలోనూ పంట తీయవచ్చు. అయితే, దీన్ని ఏర్పాటు చేసుకోవడం అధిక ఖర్చుతో కూడిన పనే. ఎకరానికి రూ. 35 వేల నుంచి 50 వేల వరకు ఖర్చవుతుందని ఒక అంచనా. ♦ అమెరికాలోని మిన్నొసోట రాష్ట్రానికి చెందిన మొక్కజొన్న రైతు బ్రియాన్ వెల్డె తన 58 ఎకరాల పొలంలో భూగర్భ డ్రిప్‌ను గత ఏడాదిగా వాడుతున్నారు. మొక్కజొన్న రైతుల సంఘం ఆర్థిక సాయంతో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. 5 అడుగుల దూరంలో 14 అంగుళాల లోతులో.. 8 అంగుళాల వ్యాసార్ధం గల భూగర్భ డ్రిప్ పైపులను అమర్చారు. వీటి నుంచి డ్రిప్ టేపుల ద్వారా నీటిని మొక్కజొన్న మొక్కల వేర్లకు నేరుగా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ జూలైలో నీటి ఎద్దడి కాలంలోనూ తేలికపాటి ఇసుక నేలలో మొక్కజొన్న పంటను భూగర్భ డ్రిప్ వల్లనే కాపాడుకోగలిగానని, ఇదొక ఆశావహమైన ప్రత్యామ్నాయమని బ్రియాన్ వెల్డె అంటున్నారు. తొలుత ఎక్కువ పెట్టుబడి అవసరమైనప్పటికీ ఇది రైతుకు లాభదాయకమేనన్నారు. ♦ రసాయనిక వ్యవసాయంలోనైనా, సేంద్రియ / ప్రకృతి వ్యవసాయంలోనైనా భూగర్భ డ్రిప్ లైన్ల ద్వారా ద్రవ రూప ఎరువులను అందిస్తూ.. మంచి దిగుబడులు పొందడం అసాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ♦ అంతర పంటలు సాగు చేసుకోవాలనుకుంటే అందుకు అనుగుణంగా అదనపు భూగర్భ డ్రిప్ లైన్లను ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పంటల వ్యర్థాలు, గడ్డీ గాదంతో ఆచ్ఛాదనతో ప్రకృతి సేద్యం చేసే రైతులకు భూగర్భ డ్రిప్‌తో అధిక ప్రయోజనం చేకూరవచ్చు. ♦ మట్టి ఉష్ణోగ్రతలు, నేల స్వభావం, పంటల స్వభావం తదితర అంశాలను బట్టి భూగర్భ డ్రిప్ ప్రభావశీలత ఆధారపడి ఉంటుంది. బిందు సేద్యంలో ముందుకొస్తున్న ఈ కొత్తపోకడపై పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం దృష్టి సారిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు కూడా ఈ దిశగా దీక్షగా కదిలితే కరువు పీడిత రైతుల్లో కొందరికైనా మేలు కలుగుతుంది. భూగర్భ డ్రిప్‌తో వరి, గోధుమ సాగుపై పంజాబ్ వర్సిటీ అధ్యయనం! పంజాబ్‌లోని 138 నీటి బ్లాక్‌లకు గాను 110 బ్లాక్‌లలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గోధుమ సాగులో డ్రిప్ వాడకంపై పరిశోధనలు చేపట్టింది. రెండేళ్ల క్షేత్రస్థాయి పరిశోధన అనంతరం.. రబీలో డ్రిప్‌తో గోధుమ పంటను సగం నీటితోనే సాగు చేయవచ్చని డాక్టర్ ఎ. ఎస్. బ్రార్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం తేల్చింది. మొదట 4 అంగుళాల నీటితో పొలంలో నీటిని పారగట్టారు. గోధుమ విత్తనాలు మొలకెత్తిన తర్వాత.. భూగర్భ డ్రిప్ ద్వారా 5 విడతలుగా (కేవలం 20% నీటితోనే) నీటి తడులు ఇచ్చారు. డ్రిప్‌ను వాడటం ద్వారా 15 రోజులు ముందుగా గోధుమ విత్తుకోవడం వీలవుతుంది. తద్వారా 10% దిగుబడిని పెంచే అవకాశం ఉందని ఆయన ఇటీవల ప్రకటించారు. రెండేళ్లుగా డ్రిప్‌పై అధ్యయనం చేసిన డా. బ్రార్ బృందం ఇప్పుడు భూగర్భ డ్రిప్‌పై దృష్టిపెట్టింది. దీనిపై క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టడానికి ఇటీవలే నిధులు విడుదలయ్యాయని డా. బ్రార్ తెలిపారు. రబీలో గోధుమతోపాటు, ఖరీఫ్‌లో వరి పంటను కూడా భూగర్భ డ్రిప్ ద్వారా పండించడానికి అవకాశాలున్నాయన్నారు. వరి, గోధుమ సాగుకు భూగర్భ డ్రిప్‌ను వాడే పద్ధతిని రైతులకు పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరో రెండేళ్లలో సిఫారసు చేసే అవకాశాలున్నాయి. కాలిఫోర్నియాలో భూగర్భ డ్రిప్‌తో వరి సాగు! అత్యధిక పరిమాణంలో సాగు నీరు అవసరమయ్యే వరి పొలాల్లో సైతం భూగర్భ డ్రిప్ వాడకానికి అమెరికాలోని కాలిఫోర్నియా రైతులు ఇజ్రాయెల్ సాంకేతిక సహకారంతో శ్రీకారం చుట్టారు. వరి పంటను భూగర్భ డ్రిప్‌తో పండించే సాంకేతికతపై విశేష పరిశోధనలకు ఇజ్రాయెల్‌లోని బెన్–గురియన్ విశ్వవిద్యాలయం పెట్టింది పేరు. వరి సాగుకు పేరొందిన మూడు అమెరికన్ రాష్ట్రాల్లో కాలిఫోర్నియా ఒకటి. సేంద్రియ వరి సాగులో పేరుగాంచిన ‘లుండ్‌బెర్గ్ ఫామిలీ ఫామ్స్’ సంస్థ బెన్–గురియన్ విశ్వవిద్యాలయంతో గత ఏడాది ఒప్పందం చేసుకొని, తొట్టతొలిగా వంద ఎకరాల్లో భూగర్భ డ్రిప్‌తో వరి సాగుకు ఉపక్రమించింది. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
నేడు జిల్లాకు రెయిన్గన్లు
అనంతపురం అగ్రికల్చర్ : రక్షకతడికి అవసరమైన రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు, డీజిల్ ఇంజిన్లు, హెచ్డీ పైపులు సోమవారం జిల్లాకు రానున్నాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశనగ పంట ఎండిపోతున్నా ‘రక్షకతడి’ ప్రణాళిక అడుగు ముందుకు పడటం లేదని ఈనెల 16న సాక్షిలో ‘నైరుతి’ పేరుతోనూ, అంతకు మునుపు ‘జీవోకే పరిమితమైన రక్షకతడి ప్రణాళిక’ శీర్షికతో కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన ఏపీఎంఐపీ, వ్యవసాయశాఖ అధికారులు ఆదిశగా దృష్టి సారించారు. ఈ క్రమంలో రక్షకతడికి అవసరమైన రెయిన్గన్లు, స్ప్రింక్లర్లు సెట్లు, ఇంజిన్లు, పైపులు సోమవారం జిల్లాకు వచ్చే అవకాశం ఉందని ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. 63 మండలాల్లోనూ వ్యవసాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో స్టాకు పాయింట్లు గుర్తించారన్నారు. -
బిందు సేద్యానికి గ్రీన్ సిగ్నల్
► ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరు శాతం, ఓసీలకు 50 శాతం రాయితీ ► సన్నకారు రైతులకు 90 శాతం రాయితీపై పరికరాలు సరఫరా ► మీ సేవలో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఒంగోలు టూటౌన్ : బిందు సేద్యం(సూక్ష్మనీటి సాగుపథకం) అమలుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సాగు నీటి పరిరక్షణ, పంటల ఉత్పత్తి సామార్థ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సరానికి తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. గత ఏడాది ఐదు ఎకరాల మెట్ట లేదా 2.5 ఎకరాల మాగాణికి మించకుండా ఉన్న రైతులకు లక్ష రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వగా ఈ ఏడాది దానిని రూ.2 లక్షలకు పెంచారు. ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు సాగు చేసే రైతులకు రూ.2.80 లక్షల వరకు రాయితీ ఇవ్వనున్నారు. సన్నకారు రైతులు 2.5 ఎకరాల మెట్ట లేదా 1.5 ఎకరాల మాగాణి కలిగిన రైతులు, చిన్న కారు(ఐదు ఎకరాల మెట్ట లేదా 2.5 ఎకరాల మాగాణి) రైతులకు 90 శాతం రాయితీ ఇస్తారు. పది ఎకరాలు పైబడి సాగు చేసే రైతులకు(పెద్ద రైతులకు) 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. గత ఏడాది పెద్ద రైతులకు రూ.2 లక్షల వరకు మాత్రమే సబ్సిడీ ఇచ్చారు. ఇప్పడది రూ.4 లక్షలకు పెంచారు. గత ఏడాది డ్రిప్ పొందిన రైతులు ఎవరైనా లక్ష రూపాయల వరకు సబ్సిడీ వినియోగించుకుని ఉంటే ఈ ఏడాది ఆ రైతులకు మరో రూ.లక్ష వరకు సబ్సిడీ పొందే అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తి రాయితీ కల్పించారు. ఐదేళ్ల పైబడిన డ్రిప్ పరికరాలు మరమ్మతులకు గురైతే వాటి స్థానంలో కొత్త డ్రిప్ పరికరాలను 50 శాతం రాయితీపై ఇవ్వనున్నారు. తుంపర సేద్యం పైపులు(స్పింక్లర్లు), రెయిన్ గన్స్ అమలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఏపీఎంఐపీ అధికారులు తెలిపారు. వాటిని 50 శాతం రాయితీపై ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. దరఖాస్తు విధానం బిందు సేద్యం పరికరాల కోసం దరఖాస్తు చేసుకునే రైతులు మీ సేవలో సంప్రదించాల్సి ఉంటుంది. అప్లికేషన్‌తో పాటు భూ యాజమాన్యపు హక్కు పత్రం, (టైటీల్ డీడ్ లేదా 1బీ రిజర్వు కాపీ), అడంగల్ కాపీ, ఎఫ్‌ఎమ్‌బీ, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటో, ఎస్సీ, ఎస్టీ రైతులు అయితే సంబంధిత కులధ్రువీకరణ పత్రం జత చేయాలి. పరికరాలు కావాల్సిన రైతులు మీసేవలో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనలు ఇవీ.. మీ సేవలో దరఖాస్తు చేసుకున్న పది రోజులకు ఏపీఎంఐపీ ఫీల్డ్ స్టాఫ్, అధికారులు రైతు పొలాన్ని తనిఖీ చేస్తారు. తనిఖీ సమయంలో రైతు పొలంలో పంట వేసి ఉండాలి. తప్పని సరిగా బోరు ఉండాలి. అనంతరం రైతుకు ఇచ్చే రాయితీలు(సబ్సిడీ, నాన్ సబ్సిడీ వివరాల మొత్తం రైతు ఫోన్ నంబర్‌కు మెసెజ్ రూపంలో తెలియజేస్తారు. బిందు సేద్యానిక సబ్సిడీపోను మిగిలిన నగదును ప్రాజెక్టు డెరైక్టర్, ఏపీఐపీ, పేరు మీద డీడీ తీసి ఇవ్వాల్సి ఉంటుందని ఏపీఎంఐపీ డెరైక్టర్ టి.బాపిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన మైక్రో ఇరిగేషన్ కంపెనీలు డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలను రైతులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పలు కంపెనీలను గుర్తించింది. సుధాకర్ కంపెనీ, సిగ్నెట్, ప్రీమియర్, నెటాపిమ్, కొటారి, గోదావరి, ఫినోలెక్స్, హరిత, నాగార్జున, జైన్, కుమార్, నంది, కిసాన్, విశాఖ కంపెనీల్లో దేనినైనా రైతు ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న కంపెనీ అందించే పరికరాలకు పదేళ్లపాటు కంపెనీయే సర్వీస్ చేస్తుందని పీడీ తెలిపారు. అయితే ఒక సారి డ్రిప్ పరికరాలు పొందిన రైతులు పదేళ్ల వరకు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. -
పేదల బిందువు.. పెద్దల బంధువు
- దారితప్పిన డ్రిప్ ఇరిగేషన్ - ఎస్సీ, ఎస్టీల పేరిట మంజూరు - ఇతరుల భూముల్లో ఏర్పాట్లు - ఎంఐఏఓలు సూత్రధారులు - ఒకే రైతు పేరిట రెండు దరఖాస్తులు - నిర్వహణ మరిచిన కంపెనీలు నందికొట్కూరు మండలం నాగటూరు గ్రామానికి చెందిన ఎం.సుబ్బమ్మకు 2.50 ఎకరాల భూమి ఉంది. డ్రిప్ కోసం దరఖాస్తు చేసుకోగా.. మైక్రో ఇరిగేషన్ ఏరియా ఆఫీసర్ పరిశీలించి రెకమండ్ చేశారు. అయితే అవినీతి మత్తులో అదనంగా మరో పేరుతో దరఖాస్తు పంపారు. రెండింటికీ డ్రిప్ మంజూరయితే.. మరోదానిని అమ్ముకోవచ్చనేది ఆయన ఉద్దేశంగా తెలుస్తోంది. కర్నూలు(అగ్రికల్చర్): ఒకే పట్టాదారు పాసు పుస్తకంపై ఇద్దరు ముగ్గురికి డ్రిప్ మంజూరు చేయడం.. ఒకరి భూమి డ్రిప్ మంజూరైతే మరొకరి భూమిలో వేయడం.. ఎస్సీ రైతుల పేరిట డ్రిప్ మంజూరు చేయించి పెద్ద రైతుల పొలాల్లో వేయించడం.. ఇదీ డ్రిప్ ఇరిగేషన్ కథాకమామీషు. భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో నీటిని పొదుపుగా వాడుకుని అధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేసుకునేందుకు ఉద్దేశించిన డ్రిప్ ఇరిగేషన్ పథకం అక్రమాలకు కేంద్రంగా మారుతోంది. 2014-15లో 15,481 మంది రైతులు డ్రిప్ కోసం దరఖాస్తు చేసుకోవడం చూస్తే రైతుల్లో ఉన్న డిమాండ్‌ను తెలియజేస్తోంది. ఇదే సమయంలో అక్రమాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. మైక్రో ఇరిగేషన్ ఏరియా ఆఫీసర్లు కేంద్రంగా ఈ వ్యవహారం సాగుతోంది. ఒక రైతు పేరిట ఉద్దేశపూర్వకంగా రెండేసి దరఖాస్తులను రెకమండ్ చేసిన ఇద్దరు ఎంఐఏఓలు ఇటీవల సస్పెండ్ అయ్యారు. ప్రధానంగా డోన్, పత్తికొండ, ఆత్మకూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో ఈ తరహా అక్రమాలు అధికంగా ఉన్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీల పేరిట లబ్ధి ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం రాయితీతో డ్రిప్ సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే దీనిని ఆ వర్గాలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం లేదు. ఇదే అవకాశంగా ఇతర సామాజిక వర్గాలకు చెందిన పెద్ద రైతులు ఎస్సీ, ఎస్టీల పేరిట బిందు సేద్యం మంజూరు చేయించుకుని తమ పొలాల్లో వేసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఐదెకరాలు పైబడిన పెద్ద రైతులకు 50 శాతం సబ్సిడీపై డ్రిప్ కల్పిస్తున్నారు. నాన్ సబ్సిడీ మొత్తం ఎక్కువగా చెల్లించాల్సి ఉన్నందున ఎస్సీ, ఎస్టీ రైతుల పేర్లను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటివి వెల్దుర్తి, డోన్, బేతంచెర్ల, క్రిష్ణగిరి మండలాల్లో అధికంగా కనిపిస్తున్నాయి. యేటా డ్రిప్ మంజూరు ఒక రైతుకు ఒకసారి బిందు సేద్యం మంజూరయితే పదేళ్ల వరకు డ్రిప్ మంజూరు చేయరాదు. కానీ కొంతమంది ఎంఐఏఓలు మాత్రం యేటా దరఖాస్తులు రెకమెండ్ చేస్తుండటం గమనార్హం. 2013-14లో డ్రిప్ మంజూరు చేసిన రైతుల పేర్లతోనే ఎంఐఏఓలు 20 వరకు దరఖాస్తులు రెకమెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఒక రైతుకు ఒక సర్వే నెంబర్‌కు డ్రిప్ మంజూరు చేస్తే మరో రైతు భూముల్లో డ్రిప్ వేసుకున్న సంఘటనలు కోకొల్లలు. నిర్వహణ గాలికి... డ్రిప్ పరికరాలను అమర్చే కంపెనీలు గత ఏడాది వరకు ఐదేళ్ల పాటు నిర్వహణను పరిశీలించాల్సి ఉంది. 2014-15 నుంచి నిర్వహణ బాధ్యతలను ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచారు. డ్రిప్ కంపెనీలు నిర్వహణ బాధ్యతలను విస్మరిస్తున్నాయి. డ్రిప్ నిర్వహణ పట్ల రైతులకు అవగాహన లేకపోవడం, కంపెనీలు పట్టించుకోకపోవడంతో డ్రిప్ పరికరాలు ఏడాదికే మూలనపడుతున్నాయి. 2003లో ప్రారంభమైన ఏపీఎంఐపీ ఇప్పటి వరకు 31,105 మంది రైతులకు 37,470 హెక్టార్లలో డ్రిప్, స్ప్రింక్లర్ల మంజూరు చేశారు. ఇందులో 50 శాతం కూడా వినియోగం లేదు. కొన్ని డ్రిప్ కంపెనీలు రైతులకు నాసిరకం పరికరాలను సరఫరా చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. డ్రిప్‌కు డిమాండ్ పెరుగుతుండగా.. అక్రమాలు కూడా అదే స్థాయిలో ఉండటం గమనార్హం. -
సేద్యమేవ జయతే!
మూడెకరాల్లో పంటలతో యేటా రూ.2.5 లక్షల ఆదాయం ఆదర్శంగా నిలుస్తున్న చౌదర్పల్లి రైతు రాములు మండలంలోని చౌదర్‌పల్లికి చెందిన రాములుకు మూడు ఎకరాల పొలం ఉంది. రెండు బోరుబావుల్లోని కొద్దిపాటి నీటితో ఇంటి అవసరాలకు సరిపోను వరి పండిస్తున్నాడు. మిగతా పొలంలో బిందుసేద్యంతో కూరగాయలు పండిస్తున్నాడు. అక్షర జ్ఞానం లేని రాములు వ్యవసాయాధికారుల సూచనలను కచ్చితంగా పాటిస్తుంటాడు. ఏయే సీజన్లలో ఆయా కూరగాయలు పండిస్తున్నాడు. నిత్యం 5 నుంచి 10 మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఒక్కొక్కరికి రూ. 200 నుంచి రూ.250 వరకు కూలిడబ్బులు ఇస్తుంటాడు. దిగుబడులను సరూర్‌నగర్ రైతు బజారులో విక్రయిస్తుంటాడు. యేటా కూరగాయల విక్రయాలతో రూ.6 లక్షలు వస్తున్నాయి. ఇందులో పెట్టుబడులు, కూలీల ఖర్చులుపోను రూ. 2.5 లక్షలు మిగులుబాటవుతోందని చెబుతున్నాడు రాములు. రైతు సదస్సులన్నీ రాములు పొలంలోనే.. బిందుసేద్యంతో పలు రకాల కూరగాయలు పండిస్తూ.. రాములు మంచి లాభాలు పొందుతుండడంతో మిగతా గ్రామాల రైతులకు సూచనలు, సలహాలు తెలియజేయడానికి వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు తరచూ ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే సదస్సులు ఏర్పాటు చేస్తుంటారు. ‘మేం చదువుకున్నవాళ్లమైనా నీ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది’ అని రాములుతో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏడాది క్రితం అప్పటి ఉద్యాన శాఖ కమిషనర్ రాణీకుముదిని.. రాములు కూరగాయల పంటలు చూసి అభినందించారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఉద్యానశాఖ అధికారులు కనకలక్ష్మి, యాదగిరి, వ్యవసాయాధికారులు కవిత, సందీప్‌కుమార్, లక్ష్మణ్ తదితరులు రాములును ఆదర్శంగా తీసుకుని కూరగాయలు సాగు చేసుకోవాలని మిగతా గ్రామాల రైతులకు సూచిస్తున్నారు. ఇటీవల రాములు వ్యవసాయ పొలంలో సదస్సుకు వచ్చిన మైక్రో ఇరిగేషన్ ఏపీడీ హరిప్రసాద్‌రెడ్డి ఆయనను అభినందించారు. నిత్యం 12 గంటలు శ్రమిస్తూ.. టమాటా, చిక్కుడు, బెండ, దోస, కీర, దొండ, కాకర, వంగ, బీర, మిర్చి, పొట్లకాయ, దోస, మునగ పంటలను రాములు సాగు చేస్తున్నాడు. నిత్యం 12 గంటల పాటు శ్రమించడంతో పాటు రోజూ సరూర్‌నగర్ రైతు బజారుకు వెళ్లి కూరగాయల విక్రయించడం, మళ్లీ మధ్యాహ్నం వచ్చి వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతుంటాడు. -
బిందుసేద్యంతో సాగునీరు ఆదా
యాచారం: నీటి వనరులున్న ప్రతి రైతు బిందుసేద్యం ద్వారా పంటలు సాగు చేసుకోవాలని, తక్కువ నీటి వాడకంతో మూడింతల పంటలు తీయవచ్చని మైక్రో ఇరిగేషన్ జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ హరిప్రసాద్‌రెడ్డి సూచించారు. గురువారం మండల పరిధిలోని చౌదర్పల్లిలో బిందుసేద్యం వాడకంపై కాశమల్ల రాములు వ్యవసాయ క్షేత్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కాల్వల ద్వారా నీటిని పారించడం వంటి పద్ధతుల వల్ల నీరు వృథా కావడంతో పాటు తక్కువ పొలంలో పంటలు సాగు చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అదే బిందుసేద్యం పద్ధతుల్లో తక్కువ నీటితో మూడింతల పొలంలో పంటలు తీయవచ్చని సూచించారు. ఆధునిక పద్దతుల్లో వ్యవసాయ చేస్తేనే రైతులకు ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన రైతులు బిందు సేద్యం కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సదస్సు అనంతరం బిందుసేద్యం పరికరాలు సరఫరా చేసే జైన్ కంపెనీ ప్రతినిధులు ఫ్లోరైడ్ వల్ల బిందు పరికరాల్లో చేరే వ్యర్థాన్ని తొలగించే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సందీప్‌కుమార్, ఇబ్రహీంపట్నం డివిజన్ ఉద్యాన శాఖ క్షేత్రస్థాయి అధికారి యాదగిరి, ఇబ్రహీంపట్నం డివిజన్ మైక్రో ఇరిగేషన్ రాజేష్‌కుమార్, సర్పంచ్ గౌర నర్సింహ, ఎంపీటీసీ సభ్యుడు కృష్ణమూర్తి, ఉప సర్పంచ్ శ్రీధర్‌గౌడ్, రైతులు శ్రీకాంత్‌రెడ్డి, విష్ణు, బుగ్గరాములు పాల్గొన్నారు. -
బిందుసేద్యంపై..రైతుల దృష్టి
పరిగి రూరల్: వర్షాభావ పరిస్థితులు, క రెంటు కోతల దృష్ట్యా రైతులు బిందుసేద్యంపై దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వం బిందుసేద్యం, స్ప్రింక్లర్ల సాగును ప్రోత్సహిస్తూ సబ్సిడీలు కూడా ఇస్తోంది. అంతేకాకుండా కూరగాయల సాగుకు డ్రిప్ ఎంతో బాగుంటంతో రైతులు మక్కువ చూపిస్తున్నారు. మండల పరిధిలోని బసిరెడ్డిపల్లి, మాదారం, ఖుదావంద్‌పూర్, పొల్కంపల్లి తదితర గ్రామాల్లో రైతులు డ్రిప్ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్నారు. బీర, కీర, కాకర, సొరకాయ తదితర కూరగాయలను పండిస్తున్నారు. వర్షాలు లేకపోవడం, కరెంటు కోతల కారణంగా ఉన్న బోరు బావిలోని నీటిని పొదుపుగా వాడుకుంటూ తక్కువ నీటితో ఎక్కువ సేద్యం చేసేందుకు శ్రీకారం చుట్టారు. తీగజాతి కూరగాయల సాగుతో మరింత లాభం డ్రిప్‌తో ఎక్కువగా కీర, కాకర, సొరకాయ తదితర తీగజాతి కూరగాయల సాగును ఎంచుకున్నారు. తక్కువ శ్రమ, ఎక్కువ లాభం ఉండటంతో రైతుల ఈ సాగుపై దృష్టి సారించారు. మార్కెట్లో కీర, కాకర, సొరకాయలకు కూడా మంచి డిమాండ్ ఉండటంతో మూడేళ్లుగా రైతులు ఈ పంటలను సాగు చేస్తూ మంచి లాభాన్ని ఆశిస్తున్నారు. ఎకరా కీర సాగులో ఖర్చులన్నీ పోనూ ఈసారి రూ.70 వేలకు వరకు లాభం వచ్చినట్లు రైతులు పేర్కొంటున్నారు. -
తక్కువ నీరు.. ఎక్కువ సేద్యం
పరిగి రూరల్: బిందుసేద్యంతో నీటి వృథాను అరికట్టడమే కాకుండా తక్కువ నీటితో ఎక్కువ సేద్యం చేసేందుకు వీలుంటుందని తెలంగాణ రాష్ట్ర సూక్ష్మ నీటి పారుదల శాఖ ప్రాజెక్ట్ డెరైక్టర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని బసిరెడ్డిపల్లిలో కావలి మల్లేష్ వ్యవసాయ పొలంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో బిందుసేద్యంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకే గ్రామీణ ప్రాంతాల్లో డ్రిప్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులు ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతుల్లోనే పంటలు సాగు చేస్తున్నారన్నారు. కాల్వల ద్వారా పొలాలకు నీరందిస్తూ వ్యవసాయం చేయడం వల్ల నీరు వృథా అవుతోందన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న డ్రిప్ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. డ్రిప్ కావాల్సిన రైతులు ఆల్‌లైన్‌లో కూడా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. బిందు సేద్యం ద్వారా పొలాలకు నీరందిస్తున్న రైతులు మూడు నెలలకోసారైనా డ్రిప్ పైపుల్లో పట్టిన నాచును తొలగించేందుకు యాసిడ్ ట్రీట్మెంట్ చేయాలన్నారు. అనంతరం యాసిడ్ ట్రీట్మెంట్ చేసే విధానం గురించి రైతులకు అర్థమయ్యేలా చేసి చూపించారు. అవగాహన సదస్సులో మైక్రో ఇరిగేషన్ జిల్లా కో ఆర్డినేటర్ బిచ్చయ్య, నెటాఫిమ్ కంపెనీ ప్రతినిధులు మధుప్రసాద్, జీవన్‌రెడ్డి, ఏరియా ఆఫీసర్ రాంరెడ్డి విజయ్, రాజనర్సింహులు, బాగన్న, శ్రీశైలం, జగన్మోహన్రెడ్డి, నర్సింహారెడ్డి, వెంకట్‌రెడ్డి, వినాయకరెడ్డి, నర్సింహులు,వెంకటయ్య, రామకృష్ణ పాల్గొన్నారు. -
పొగాకు పంటకు డ్రిప్ సౌకర్యం
కొరిటెపాడు(గుంటూరు) : పొగాకు పంటకు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీఇచ్చారు. స్థానిక రింగ్‌రోడ్డులోని సిద్ధార్థ గార్డెన్స్‌లో శనివారం టీటీఐఐ (ది టుబాకో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఉత్తమ పొగాకు రైతు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి మంత్రి ప్రత్తిపాటి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. తొలుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియమ, నిబంధనలు పాటిస్తూ పొగాకు పండిస్తున్న రైతులను మంత్రి అభినందించారు. పంటకు గిట్టుబాటు ధర లభించేలా కృషి చేస్తానని హామీఇచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పొగాకు బోర్డు చైర్మన్ చురుగ్గా వ్యవహరించినప్పుడే రెతులు, వ్యాపారులకు మేలు జరుగుతుందన్నారు. పొగాకు ధర తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి పొగాకు బోర్డు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. పంటల బీమా సౌకర్యం కల్పించాలి : ఎంపీ వైవీ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ, పొగాకు సాగులో నూతన విధానాలను అవలంబించటానికి ఉత్తమ రైతులను ఎంపిక చేసి వారికి అవార్డులు ప్రదానం చేయటం అభినందనీయమన్నారు. మూడేళ్లుగా రైతులు వ్యవసాయంలో ఎంతో నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పొగాకు బోర్డు పంటల బీమా సౌకర్యం కచ్చితంగా కల్పించాలని కోరారు. రాష్ట్రంలో పొగాకు సాగు విస్తీర్ణం పెంచాల్సిన అవసరం వుందన్నారు. పెట్టుబడులు పెరిగి సాగు ఖర్చులు అధికమయ్యాయని ఆయన చెబుతూ, అపరాధ రుసుం లేకుండా 50 క్వింటాళ్ల వరకు బోర్డు కొనుగోలు చేయాలని సూచించారు. కిలోకు సగటున రూ.150లు ధర కల్పించేలా చూడాలన్నారు. శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పంట పొలాలను సందర్శించి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా అవార్డు పొందిన ఉత్తమ రైతులను ఎంపీ అభినందించారు. బోర్డుకు రైతులు, వ్యాపారులు రెండు కళ్లు : ఎంపీ రాయపాటి నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ పొగాకు బోర్డుకు రైతులు, వ్యాపారులు రెండు కళ్లులాంటివారన్నారు. భారత్‌లో సిగరెట్ అక్రమ అమ్మకాలు జరగకుండా చూడాలన్నారు. ధరలు తగ్గినప్పుడు బోర్డు కొనుగోలు చేసి బఫర్‌స్టాక్ పెట్టాలని సూచించారు. సిగరెట్లపై అధిక పన్నులు వేయటం వల్ల వినియోగదారులు నష్టపోతున్నారు తప్ప తయారీదారులు నష్టపోవటం లేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. మంచి ధర లభించేలా చూస్తా : చైర్మన్ డాక్టర్ గోపాల్ పొగాకు బోర్డు ఛైర్మన్ డాక్టర్ కె.గోపాల్ మాట్లాడుతూ బోర్డు చట్టం ప్రకారం పంటకు మంచి ధర లభించేలా చూస్తామన్నారు. 100 రోజుల్లో వేలం చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. రైతులకు మంచి ధర ఇవ్వలేక పోతే విజయవంతం కాలేనట్లేనని తెలిపారు. మేలైన వంగడాలు అందించాలి :ఎమ్మెల్యే ముస్తఫా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా మాట్లాడుతూ సీటీఆర్ఐ నాణ్యమైన, అధిక దిగుబడులను ఇచ్చే విత్తనాలను తయారు చేసి రైతులకు అందించాలని సూచించారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర లభించేలా చూడాల్సిన బాధ్యత అందరిపై వుం దన్నారు. పొగాకు రైతులతోపాటు వ్యాపారులకు ఇబ్బందులు తప్పటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ 60 శాతం పొగాకు ఒక్క ప్రకాశం జిల్లాలోనే పండుతుందని తెలిపారు. ఎకరా పండించటానికి రూ.1.20 లక్షల ఖర్చు అవుతుందన్నారు. శాసన మండలి చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ పొగాకు బోర్డు, ఐటీసీ కలసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు. అనంతరం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఉత్తమ పొగాకు రైతులకు అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సీటీఆర్ఐ డెరైక్టర్ దామోదరరెడ్డి, బోర్డు సభ్యుడు శేషగిరిరావు, ఐటీసీ ప్రతినిధి సంజీవ్ రంగరాజు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులు పాల్గొన్నారు. -
బిందువు..రైతు బంధువు..
టేకులపల్లి : బిందు సేద్యం ద్వారా సాగు చేపడితే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని బిందు సేద్యం జిల్లా ఏపీడీ రావిలాల శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని సులానగర్ గ్రామానికి చెందిన రైతు వజ్జా రమేష్ పొలంలో బిందు సేద్యంను శనివారం ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా బిందు సే ద్యం పరికరాల ఉపయోగాలు, బిందు సేద్యం వల్ల కలిగే లాభాలపై రైతులకు ఆయన అవగాహన కల్పించారు. అనంతరం రైతులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సమతుల నీరు, ఎరువులు బిందు సేద్యం ఉన్న అపోహలను రైతులు తొలగించుకోవాలని, ఇప్పటి వరకు కూడా రైతులు ‘పొలం నిండా నీరు పెట్టాం.. ఇక చాలు పంట బాగా పంట బాగా పండుతుంద’ని అనుకుంటున్నారని, కానీ మొక్కలకు కావాల్సింది సమతుల నీరు, ఎరువులు, తేమ అని అన్నారు. అలా కాకుండా మొక్కలకు విపరీతంగా నీరు పెట్టడం వల్ల భూమిలోని గాలి తగ్గుతుందని, దీంతో తేమ శాతం తగ్గి చీడపీడలు ఆశించి మొక్క ఎదుగుదల లోపిస్తుందని బిందు సేద్యం ఏపీడీ శ్రీనివాసరావు అన్నారు. బిందు సేద్యం వల్ల మొక్కకు ఎంత నీరు కావాలి, ఎంత ఎరువు కావాలో అంతే వేసే వెసులుబాటు ఉంటుందని, సమయం, నీరు, విద్యుత్, ఎరువులు ఆదా కావడమే కాకుండా ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా రైతులు మైండ్ సెట్ మార్చుకుని బిందు సేద్యంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఇంకా ఎన్నో ఉపయోగాలు మామూలు సాగుతో పోలిస్తే బిందు సేద్యం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయన రైతులకు వివరించారు. విద్యుత్ కోతల నేపథ్యంలో రైతన్నలు రాత్రి పూట పొలాల్లో జాగరణ చేయాల్సిన అవసరం ఉండదని, బిందు సేద్యం వల్ల ప్రతీ మొక్కకు సమస్థాయిలో నీరందుతుందని అన్నారు. ఆకులు కూడా పొడిగా ఉండడంతో చీడపీడలు ఆశించే అవకాశం కూడా చాలా తక్కువని అన్నారు. మరోపక్క కలుపు మొక్కల పెరుగుదల కూడా తగ్గుతుందని అన్నారు. మొక్క మొక్కకు ఎరువులు, రసాయన మందులు చల్లాల్సిన పని ఉండదని, బిందు సేద్యానికి ఉపయోగించే పరికరమే ఈ పనులన్నీ చేస్తుందని అన్నారు. సాధారణ సాగులో నూటికి 60 శాతం ఎరువులు వృథా అవుతాయని, బిందు సేద్యంలో మాత్రం ఎరువులు వృథా కావని అన్నారు. దిగుబడులు అధికంగానే ఉంటాయని అన్నారు. బిందు సేద్యం కోసం ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం వందశాతం, ఇతరులకు 75 శాతం సబ్సిడీ ఇస్తోందని, ఇది అన్నదాతలకు మరింత లాభాన్ని ఇస్తుందని అన్నారు. చాలా గ్రామాల్లో వర్షాధార సాగు కావడంతో మొక్కలు సరిగా మొలకెత్తక రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. జిల్లాలో బిందు సేద్యంతో చేపట్టిన పంటలు కళకళలాడుతున్నాయని అన్నారు. జిల్లాలో 2160 హెక్టార్లలో 2014 - 15 ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో 2160 హెక్టార్లలో బిందు సేద్యం చేపట్టేలా లక్ష్యం నిర్దేశించుకున్నామని ఏపీడీ శ్రీనివాసరావు అన్నారు. వీటిలో 1650 హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్, 510 హెక్టార్లలో స్పింక్లర్ల ద్వారా బిందు సేద్యం సాగు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. గతేడాది 75 వేల ఎకరాల్లో బిందు సేద్యం సాగు చేపట్టారని, దీని ద్వారా 30 వేల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. అర్హులైన వారందరికీ సబ్సిడీపై బిందు సేద్యం పరికరాలు అందజేస్తున్నామని అన్నారు. ఎవరు అర్హులు ? ఐదు ఎకరాల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయల వరకు పూర్తిగా ఉచితం. లక్ష దాటితే అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులకు 90 శాతం సబ్సిడీ. బిందు సేద్యం పరికరం కావాల్సిన రైతులు ఆధార్, బ్యాంకు ఖాతా, టైటిల్ డీడ్, ఇ పహాణీ, వీఆర్వో ధ్రువీకరించిన నక్షా జిరాక్స్ కాపీలతో ఏవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుంది. గ్రామీణ స్థాయిలో సర్పంచ్, కార్యదర్శి , వీఆర్వో, సంతకాలు అయిన తర్వాత మండల స్థాయిలో తహశీల్దార్, ఎంపీడీవో, ఏఓలతో కూడిన కమిటీ ధ్రువీకరించిన తర్వాత దరఖాస్తులను ఏపీడీ కార్యాలయానికి పంపితే మంజూరు చేస్తారు. -
అందుబాటులో బిందు సేద్యం పరికరాలు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో వివిధ రకాల పంటలు పండించుకోవడానికి నీటి సరఫరా కోసం బిందు సేద్యం(డ్రిప్) పరికరాలు అందుబాటులో ఉన్నాయని బిందు సేద్యం పథకం సంచాలకులు నర్సింగ్ తెలిపారు. జిల్లాకు భౌతిక లక్ష్యం 2,500 హెక్టార్లకు పైపులు, నాజిల్లు మంజూరైనట్లు తెలిపారు. పత్తి, పసుపు, మిర్చి, సోయా, మొక్కజొన్న పంటలకు రెండు వేల హెక్టార్లకు, కూరగాయల సాగుకు 500 హెక్టార్లకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఎంపీడీవో, మండల వ్యవసాయ అధికారి, ఉద్యానవన శాఖ అధికారి వద్ద దరఖాస్తులు లభిస్తాయని, వాటిని పూర్తి చేసి అక్కడే గానీ, ఆదిలాబాద్‌లోని కార్యాలయంలో గానీ అందించవచ్చని తెలిపారు. 13 కంపెనీలకు చెందిన పరికరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. దరఖాస్తు చేసుకునే విధానం టైటిల్ బుక్ జిరాక్స్‌పై తహశీల్దార్ లేదా డెప్యూటీ తహశీల్దార్ సంతకం ఉండాలి. లేదా మీ సేవ ద్వారా తీసుకున్న 1బీ ఫారం జతపర్చాలి. కౌలు రైతులు రిజిస్ట్రార్ లీజు డాక్యుమెంటు ఐదేళ్ల వరకు తీసుకున్నది జతపర్చాలి. కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలపై గెజిటెడ్ అధికారి సంతకంతోపాటు ఈసీ జతచేయాలి. ఆధార్, రేషన్‌కార్డు, ఓటరు ఐడీ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్ ఏదేని ఒకటి జతచేయాలి. ఎస్సీ, ఎస్టీ రైతులు సంబంధిత అధికారి జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం జిరాక్స్ జతపర్చాలి. దరఖాస్తు ఫారంపై ఇటీవల కాలంలో దిగిన పాస్‌పోర్టుసైజ్ ఫొటో అతికించాలి. ఒకసారి రాయితీ పొందిన రైతులకు పదేళ్ల వరకు ఈ పథకం వర్తించదు. రాయితీ వివరాలు.. ఐదెకరాల్లోపు విస్తీర్ణం కలిగిన ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.లక్షకు మించకుండా వంద శాతం రాయితీ ఇస్తారు. చిన్న, సన్నకారు రైతులకు రూ.లక్షకు మించకుండా 90శాతం రాయితీ లభిస్తుంది. ఐదు నుంచి పదెకరాల భూమి ఉన్న రైతులకు రూ.లక్షకు మించకుండా 75శాతం సబ్సిడీ వర్తిస్తుంది. పదెకరాల కంటే ఎక్కువగా ఉంటే రూ.లక్షకు మించకుండా 60శాతం రాయితీ అందిస్తారు. ధర రూ.లక్షకు పైగా అయితే 12ఎకరాల వరకు బిందు సేద్యం ఏర్పాటు చేసుకునే రైతులకు 40 శాతం రాయితీ ఇస్తారు. తుంపర్ల(స్ప్రింక్లర్స్) సేద్య పథక ం తుంపర్ల సేద్యం ద్వారా సాగు చేసుకోవడానికి జిల్లాలోని 52 మండలాలకు గాను ప్రతి మండలానికి 24 చొప్పున తుంపర్ల సేద్య పరికరాలు అందజేస్తాం. బిందు సేద్య పరికరాల దరఖా స్తు నమూనా వలనే దరఖాస్తుతో జిరాక్స్ పత్రాలు జతపరిచి ఏంపిడీవో లేదా మండల వ్యవసాయ అధికారికి అందించాలి. 8 రకాల కంపెనీలకు చెందిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. రాయితీ వివరాలు పరికరాల ఖరీదు రూ.18,417.. ప్రభుత్వ రాయితీ 50 శాతం రూ.9.208 చెల్లిస్తుంది. రైతు రూ.9.209 భరించాలి. ఒక సెట్‌కు 25 హెచ్‌డీఈపీ పైపులు, 5 నాజిల్స్, 5 జీఐ పైపుల(రైజర్స్)తోపాటు ఇతర సామగ్రి అందజేస్తారు. గతంలో లబ్ధి పొందిన రైతులకు పదేళ్ల వరకు అవకాశం ఉండదు. -
పందిరి వేద్దాం..పాకిద్దాం..
ఖమ్మం వ్యవసాయం: ఉద్యానశాఖ ద్వారా రాయితీ పొంది జిల్లాలో 135 ఎకరాల్లో శాశ్విత పందిర్లపై తీగజాతి కూర పంటలను సాగు చేస్తున్నారు. శాశ్విత పందిరిపై బీర సంవత్సరానికి మూడుసార్లు, కాకర, సొర రెండు సార్లు, బోడ కాకర ఒక పంటను తీసుకునే వెసులుబాటు ఉంది. శాశ్విత పందిర్లతో తీగజాతి సాగు ద్వారా ఎకరాకు రూ.2.50 లక్షల ఆదాయం లభిస్తుందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. శాశ్విత పందిర్లతో కూడిన కూరగాయ పంటల్లో పాటించాల్సిన మెళకువలు తెలుసుకుద్దాం... రకాలు: కాకర: యూఎస్- 6214, యూఎస్- 33, మహికోగ్రీన్, వినయ్, ఉజాల, పీహెచ్బీ, పునమ్ సొర: మహికో వరద్, రవీనా, యూఎస్-161, శ్రామిక్, కావేరి బీర: సురేఖ, నిశాంత్, సానియా-4, యూఎస్-134, సరిత దొండ, పొట్ల, బోడ కాకర లోకల్ రకాలు వాతావరణం: వేడి వాతావరణం అనుకూలం. నేలలు: నీటిని నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు అనుకూలం. విత్తనం విత్తే పద్ధతి: భూమి మీద పాకించే పాదులు, వర్షాకాలంలో నీటి కాలువలకు తోడుగా మురుగు నీరు పోవటానికి రెండు మీటర్ల దూరంలో కాలువలు చేయాలి. వేసవిలో పాదులకు పొలం అంతట నీటిపారుదల కోసం బోదెలు చేయాలి. అన్ని రకాల పాదులకు మూడు విత్తనాలను 1-2 సెం.మీ లోతులో విత్తుకోవాలి. దొండకు చూపుడు వేలు లావున్న కొమ్మలు నాలుగు కణుపులున్నవి రెండు చొప్పున నాటుకోవాలి. వర్షాధారంతో కూడిన అన్ని తీగజాతి కూర పంటలను 15ఁ10 సెం.మీ కొలతలున్న పాలిథిన్ సంచుల్లో విత్తుకొని 15-20 రోజులు పెరిగిన తరువాత అదను చూసి నాటుకోవాలి. విత్తన శుద్ధి: కిలో విత్తనానికి మూడు గ్రాముల థైరమ్, ఐదు గ్రాముల ఇమడాక్లోప్రిడ్తో ఒకదాని తరువాత మరొకటి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఎరువులు: విత్తేముందు ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువు, 32-40 కిలోల భాస్వరం, 16-20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను గుంటల్లో వేయాలి. 32-40 నత్రజనినిచ్చే ఎరువును రెండు సమభాగాలుగా చేసి విత్తిన 25-30 రోజులు అంటే పూత, పిందే దశలో వేయాలి. కలుపు నివారణ: కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. రెండు, మూడు తడుల తరువాత మట్టిని గుల్ల చేయాలి. ఎకరాకు పిండిమిథాలిన్ 1.2 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 24-48 గంటలలోపు పిచికారీ చేయాలి. ఆడపువ్వుల నిష్పత్తి పెంచుట: మొక్కలు రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి మూడు గ్రాముల బొరాక్స్ కలిపి పిచికారీ చేస్తే ఆడపువ్వుల నిష్పత్తి పెరుగుతుంది. నీటి యాజమాన్యం: బిందు సేద్యం ద్వారా నీరు పారించటం మంచింది. సస్యరక్షణ: పెంకు పురుగులు: పిల్ల పురుగులు పెరుగుద ల దశలో ఉన్న ఆకులు, పూలను కొరికి తిం టాయి. దీని నివారణకు మూడు గ్రాముల కార్బొరిల్ లేదా రెండు మి.లీ మలాథీన్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పొట్ల ఆకు పురుగు: గొంగళి పురుగులు ఆకు లు, పూలను తింటాయి. నివారణకు 2.5 మి.లీ క్లోరీఫైరీఫాస్ లేదా 2 మి.లీ క్వినాల్ఫాస్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పండు ఈగ: పూత దశలో తల్లి ఈగలు పూలపై గుడ్లు పెడతాయి. ఈ గుడ్ల నుంచి వచ్చిన పరుగులు పిందెలలో చేరి తీవ్రంగా నష్టపరుస్తాయి. దీని నివారణకు లీటర్ నీటిలో రెండు మి.లీ మలాథీన్ను పూతదశలో పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. తెగుళ్లు ఆకుమచ్చ : ఆకులపై ఆకుపచ్చ, ముదురాకుప చ్చ కలిసి మొజాయిక్ రూపంలో కనిపిస్తాయి. ఆకుపై భాగంలో పసుపు రంగు, కింద ఊదా రంగు మచ్చలు ఏర్పడి పండుబారి ఎండిపోతాయి. దీని నివారణకు లీటర్ నీటిలో రెండు గ్రాముల సాఫ్ లేదా మెటాక్సిల్ యంజెడ్ రెండు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. వేరుకుళ్లు: దీనినే ఎండు తెగులు అంటారు. ఈ తెగులు సోకితే తీగలు వడలి ఎండిపోతాయి. ఈ శిలీంధ్రం భూమి ద్వారా వ్యాపిస్తుంది. నివారణకు లీటర్ నీటిలో మూడు గ్రాముల బ్లైటాక్స్ కలిపి పిచికారీ చేయాలి. ఆఖరి దుక్కిలో 250 కిలోల వేప పిండిని వేయాలి. ట్రైకోడెర్మా విరిడీ కల్చర్‌ను భూమిలో వేయాలి. బూడిద తెగులు: ఆకులపై బూడిద వంటి పొడి కప్పబడి ఉంటుంది. పోడి వాతావరణంలో ఈ తెగులు తీవ్రత ఎక్కువ. నివారణకు లీటర్ నీటిలో మూడు గ్రాముల గంధకం పొడి, లేదా ఒక మి.లీ డైనోకాప్ లేదా రెండు మి.లీ హెక్సాకోనోజోల్ కలిపి పిచికారీ చేయాలి. శంకు/పల్లాకు తెగులు: ఈనెలు పసుపు రంగుకు మారి, కాయలు గిడసబారుతాయి. ఈ తెగులును గుర్తించి వెంటనే కాల్చి వేయాలి. నివారణకు లీటర్ నీటిలో రెండు మి.లీ డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ పిచికారీ చేయాలి. గమనిక: పొట్టదశలో రెండు రోజుల పిందెకు చివర చిన్న రాయిని పురికోసతో కట్టాలి. లేకుంటే కాయలు మెలితిరుగుతాయి. -
రైతుల రంది తీర్చే మొబైల్ స్టార్టర్
బాల్కొండ : మొబైల్ స్టార్టర్ కనెక్షన్ ఉన్న మోటర్‌కు సంబంధించిన ప్రతి వివరం రైతు ఫోన్‌కు ఎస్సెమ్మెస్ రూపంలో లేదా వాయిస్ మెసేజ్ రూపంలో వస్తుంది. మొబైల్ స్టార్టర్ బిగించిన మోటర్లకు విద్యుత్ సరఫరా అయ్యి మోటర్ ఆన్ అయిన పది సెకండ్లలో రైతు ఫోన్ నంబర్‌కు మెస్సేజ్ వెళ్తుంది. మోటర్ పనిచేయకపోతే ఏ కారణం చేత నడవడం లేదో కూడా గుర్తించి రైతుకు సమాచారాన్ని చేరవేస్తుంది. తెలుగులోనూ వాయిస్ మెస్సేజ్ అందుబాటులో ఉంది. ‘మీ మోటర్ ప్రారంభం కాలేదు’ అని స్పష్టంగా తెలుపుతుంది. ఇది మోటర్‌కు విద్యుత్ ఎప్పుడు ప్రసారమైంది, ఎప్పుడు ఆగి పోయింది అన్న టెన్షన్ రైతుకు లేకుండా చేస్తుందని లింగారెడ్డి వివరించారు. పంపు సెట్లకు రక్షణ ఈ యంత్రం మోటర్ ఆన్, ఆఫ్ సమాచారం తెలపడానికి మాత్రమే కాకుండా పంపు సెట్లకు రక్షణగా కూడా కల్పిస్తుంది. బావిలో, బోరులో నీరు అయిపోయిన సందర్భంలో రైతుకు మెస్సేజ్ పంపుతుంది. దీంతో రైతు ఆ మోటర్‌ను ఆఫ్ చేసుకోవచ్చు. ఎవరైనా పైప్లైన్లను పగుల గొట్టాలని గేట్ వాల్వులు తిప్పి నీటిని జామ్ చేసినా.. రైతుకు వెంటనే సమాచారాన్ని అంది స్తుంది. స్కాన్ చేసుకుని మోటర్లను ఆఫ్ చేస్తుంది. బిందు సేద్యానికి ప్రయోజనకరం బిందు సేద్యం చేసే రైతులకు ఈ మొబైల్ స్టార్టర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతు లింగారెడ్డి తెలిపారు. డ్రిప్ పైప్‌లలో ఏ వాల్వ్ పని చేయకపోయినా రైతు ఫోన్‌కు మెస్సేజ్ వస్తుంది. దీంతో దానికి మరమ్మతులు చేసుకోవచ్చు. గ్రామంలో లేకున్నా మెకానిక్కు ఫోన్ చేసి ఫలానా మోటర్లో ఫలానా సమస్య వచ్చిందని చెప్పే అవకాశం రైతుకు ఉంటుంది. మొబైల్ స్టార్టర్‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని రైతు లింగారెడ్డి పేర్కొన్నారు. త్రీఫేజ్ కరెంట్ ఉందా లేదా అని రైతులు ట్రాన్స్‌కో అధికారులకు కాకుండా తనకే ఫోన్ చేసి అడుగుతున్నారన్నారు. ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికి 20 మంది వరకు రైతులు ఈ స్టార్టర్‌ను ఉపయోగిస్తున్నారని, దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
లాభాల బిందువు
నేరుగా మొక్క వేరుకు నీరు డ్రిప్పు పరికరాలను అమర్చి బిందు సేద్యం చేయడం ద్వారా నీటి వనరులు ఆదా అవుతాయి. కాల్వల ద్వారా నీరు వృథాగా పోయే అవకాశం లేదు. అంతేకాకుండా మొక్క వేరు భాగానికి నేరుగా నీరు అందుతుంది. దీనివల్ల పంట భూముల్లో కలుపు మొక్కలు పెరిగే అవకాశం లేకుండాపోతుంది. మొక్కలకు సమృద్ధిగా నీరందుతుంది. దీంతో పంట దిగుబడి పెరుగుతుంది. పంటలకు ఎరువులను డ్రిప్పు పైపుల ద్వారా సరఫరా చే సే అవకాశం ఉంది. డ్రిప్పు పైపులతో పాటు ట్యాంకును కూ డా సరఫరా చేస్తున్నారు. ట్యాంకులో యూరి యా వేస్తే చాలు పంట అంతటికీ అందుతుంది. సబ్సిడీపై పరికరాలు డ్రిప్పు పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు 75 శాతం సబ్సిడీపై, పెద్ద రైతులకు 65శాతం సబ్సిడీపై డ్రిప్పు పరికరాలను అందిస్తున్నారు. రైతు పాస్‌బుక్‌లో ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ 1.50 ఎకరాలను ఒక యూనిట్ మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. 1.5 ఎకరాల కోసం ఇచ్చే యూనిట్ పరికరాలు కేవలం ఎకరానికి మాత్రమే సరిపోతున్నాయని రైతులు అంటున్నారు. కావాల్సినన్ని పరికరాలను సబ్సిడీపై అందించాలని కోరుతున్నారు. డ్రిప్పు ద్వారా పసుపు, సోయా, మొక్కజొన్న, బెండ, వంగ, టామాట, పంటలను సాగు చేస్తున్నారు. -
డ్రిప్.. డ్రాప్
ఏలూరు : ప్రభుత్వ నిబంధనలు.. అధికారులు, వ్యాపారుల స్వార్థం జిల్లాలో బిందుసేద్యాన్ని కాటేస్తున్నాయి. అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు బిందుసేద్య (డ్రిప్ ఇరిగేషన్) విధానాన్ని అవలంభించాలని చెబుతున్న ప్రభుత్వం.. డ్రిప్ పరికరాలపై ఇచ్చే సబ్సిడీలో కోత విధించింది. మరోవైపు అధికారులు నాణ్యతలేని డ్రిప్ పరికరాలను కొనుగోలు చేస్తూ వాటిని రైతులకు అంటగడుతున్నారు. అవి తరచూ మరమ్మతులకు గురవడంతో కర్షకులు సమస్యలతో సతమతం అవుతున్నారు. తోటల నుంచి డ్రిప్ యంత్రాలను తొలగిస్తున్నారు. సబ్సిడీ తగ్గింది జిల్లాలో 1.39 లక్షల హెక్టార్లలో కోకో, కొబ్బరి, నిమ్మ, ఆయిల్‌పామ్, అరటి, బత్తాయి వంటి ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. వీటిలో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి పాటిస్తే విద్యుత్, నీరు ఆదా అవుతాయని, కూలీ ఖర్చులు తగ్గుతున్నాయని, మంచి దిగుబడులు లభిస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ దిశగా రైతులను ప్రోత్సహిం చేందుకు ప్రభుత్వం ఈ పరికరాలపై సబ్సిడీ ఇస్తోంది. దీంతో జిల్లాలో సుమారు 30శాతం మంది ఉద్యాన రైతులు బిందుసేద్యం చేస్తున్నారు. సాధారణంగా 7 గంటలపాటు విద్యుత్‌తో 3 ఎకరాల పంటకు నీరందిస్తే.. డ్రిప్ ద్వారా అదే సమయంలో 10 ఎకరాలకు నీరందించే అవకాశం ఉంది. ఈ కారణంగా రైతులంతా డ్రిప్ విధానంపై ఆసక్తి చూపారు. గతంలో ఈ పరికరాలపై ప్రభుత్వం 90శాతం సబ్సిడీ ఇచ్చేది. మూడేళ్ల క్రితం ఆ మొత్తాన్ని 40 శాతానికి కుదించింది. దీంతో కొత్తగా రైతులెవరూ బిందుసేద్యంపై ఆసక్తి చూపడం లేదు. మరోవైపు పాత రైతులు డ్రిప్ పరికరాలను తొలగిస్తున్నారు. డ్రిప్ యంత్రాలు మరమ్మతులకు గురైన సందర్భాల్లో రైతులు ముప్పుతిప్పలు పడుతున్నారు. బయట మార్కెట్లో వీటికి సంబంధించిన పరికరాల ధరలు రెట్టింపయ్యూరుు. పైగా ఏ పరికరమైనా నాసిరకంగా ఉంటున్నారుు. ఈ పరిస్థితుల్లో డ్రిప్ వాడకం నుంచి రైతులు వైదొలుగుతున్నారు. ధర పెరిగింది గతంలో ఎకరం తోటలో డ్రిప్ ఏర్పాటు చేయూలంటే రైతుకు రూ.7 వేలు ఖర్చయ్యేది. ప్రస్తుతం రూ.16 వేలు ఖర్చవుతోంది. డ్రిప్ ఏర్పాటు చేసుకునే రైతులు ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరిట సబ్సిడీ పోగా మిగిలిన మొత్తానికి డీడీ తీయూల్సి ఉంటుంది. అది అందిన వెంటనే డ్రిప్ యంత్రాన్ని ఎంపిక చేసిన కంపెనీల ద్వారా రైతులకు అందిస్తారు. డ్రిప్ యంత్రాలు గతంలో నాణ్యంగానే ఉన్నా ఇప్పుడా పరిస్థితి లేదు. ధరలు చూస్తే రెట్టింపు అయ్యూరుు. డ్రిప్‌కు వాడే 16 ఎంఎం ట్యూబ్ మీటరు ధర గతంలో రూ.5.80 ఉండేది. ప్రస్తుతం రూ. 9.50కి పెరిగింది. డ్రిప్‌లో స్క్రీన్ ఫిల్టర్ గతంలో రూ.3 వేలు ఉండేది. ప్రస్తుత ధర రూ.4,500 వరకు ఉంది. గతేడాది హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ రూ.5,500 ఉండేది. ప్రస్తుతం రూ.8వేలకు పెరిగింది. ఇంత ఖర్చుచేసినా నాణ్యతలేని పరికరాలు అందుతున్నాయని రైతులు చెబుతున్నారు. బాల్ వాల్వ్స్ నుంచి ప్రతి వస్తువు ధర చుక్కల్లో ఉంటే, నాణ్యత మాత్రం డొల్లగా ఉంటోంది. హైడ్రోసైక్లోన్ ఫిల్టర్లు మరమ్మతులకు గురైతే ఆ సామగ్రి కోసం విజయవాడ వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి డ్రిప్‌పై ఇచ్చే సబ్సిడీ పెంచాలని, ఒకసారి తీసుకున్న డ్రిప్ పూర్తిగా పాడైతే.. సబ్సిడీపై కొత్త డ్రిప్‌ను ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. వీటి నాణ్యతపై అధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సబ్సిడీ పెంచాలి డ్రిప్ యంత్రాలను గతంలో మాదిరిగానే 90 శాతం సబ్సిడీపై అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. బిందుసేద్యంపై రైతులు ఆసక్తి చూపుతున్న సమయంలో ధరలు పెరుగుదల, సబ్సిడీలో కోత, నాసిరకం వస్తువుల విక్రయాల వల్ల రైతులు నిరాశ చెంది వీటి వినియోగాన్ని బాగా తగ్గిం చారు. ఇప్పటికైనా అధికారులు రైతులకు మేలు చేయాలి. -గంటా సత్యనారాయణ, రైతు, తిమ్మాపురం ఇబ్బందులు పడుతున్నాం ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్క్రీన్ ఫిల్టర్, హైడ్రోసైక్లోన్ ఫిల్టర్లలో నాణ్యత బాగా తగ్గింది. ఎనిమిదేళ్లకు పైగా పనిచేయాల్సిన డ్రిప్ యంత్రం కనీసం రెండేళ్లు కూడా పనిచేయడం లేదు. ఫిల్టర్లు ప్రతి రెండు, మూడు నెలలకు పాడైపోతున్నాయి. పదేళ్ల క్రితం కొనుగోలు చేసిన పరికరాలు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. సమస్య లపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. -జి.శ్రీనివాసరావు, రైతు, తిమ్మాపురం -
బిందుసేద్యంపై ఆసక్తి
లోకేశ్వరం, న్యూస్‌లైన్ : నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బిందుసేద్యం విధానంలో పంటల సాగుతో అక్కడి రైతులు సాధిస్తున్న సత్ఫలితాలు ఇక్కడి రైతుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో జిల్లాలోనూ అదే విధానంలో కొందరు పంటలు సాగు చేపట్టి విజయవంతంగా ముందుకెళ్తున్నారు. మండలంలోని వాట్టోలి, కిష్టాపూర్, ధర్మోరా, పంచగుడి, పుస్పూర్, లోకేశ్వరం తదితర గ్రామాల్లో సుమారు 200 మంది రైతులు బిందుసేద్యం అనుసరిస్తున్నారు. నాలుగేళ్ల నుంచి పసుపు, మొక్కజొన్న, పత్తి, నువ్వు, కూరగాయలు పండిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 800 ఎకరాల్లో బిందు పద్ధతిలో పంటలు సాగవుతున్నాయి. రాయితీపై పరికరాలు బిందుసేద్యం విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీపై యూనిట్లు అందిస్తోంది. రైతుల కోసం ఈ ఏడాది మండలంలో 90 శాతం రాయితీపై రూ.50 వేల విలువైన బిందుసేద్యం పరికరాల (కిట్)ను 80 మంది రైతులకు పింపిణీ చేసింది. ప్రస్తుతం సుమారు 80 మంది రైతులు బిందు సేద్యం విధానంలో పత్తి, మిర్చి, నువ్వు సాగు చేస్తున్నారు. బిందుసేద్యంతో ప్రయోజనాలు.. 20 నుంచి 30 శాతం పంట దిగుబడి అధికంగా వస్తుంది. మామూలుగా ఒక ఎకరానికి అవసరమైన నీటితో నాలుగెకరాలు సాగు చేయవచ్చు. ఎత్తుపల్లాల భూమికి కాలువల ద్వారా నీరు పారించడం సాధ్యం కాదు. ఆ నేలలకు బిందుసేద్యం అనుకూలమైనది. రాత్రివేళ కరెంటుతో మామూలుగా నీరు పెట్టడం కష్టం. కానీ బిందుసేద్యంతో సులువుగా రాత్రిపూట విద్యుత్ సరఫరా కష్టాలను అధిగమించవచ్చు.పంటలకు రసాయన ఎరువుల ను సైతం డ్రిప్ ఫిల్టర్ బాక్సులో పోస్తే ప్రతీ మొక్కకు చేరుతుంది. నీరు పెట్టేందుకు మసుషుల అవసరం ఎక్కువగా ఉండనందున కూలీల వ్యయం బాగా తగ్గుతుంది కలుపు మొక్కలు ఎక్కువగా పెరగవు.