డ్రిప్పు పరికరాలను అమర్చి బిందు సేద్యం చేయడం ద్వారా నీటి వనరులు ఆదా అవుతాయి.
నేరుగా మొక్క వేరుకు నీరు
డ్రిప్పు పరికరాలను అమర్చి బిందు సేద్యం చేయడం ద్వారా నీటి వనరులు ఆదా అవుతాయి. కాల్వల ద్వారా నీరు వృథాగా పోయే అవకాశం లేదు. అంతేకాకుండా మొక్క వేరు భాగానికి నేరుగా నీరు అందుతుంది. దీనివల్ల పంట భూముల్లో కలుపు మొక్కలు పెరిగే అవకాశం లేకుండాపోతుంది.
మొక్కలకు సమృద్ధిగా నీరందుతుంది. దీంతో పంట దిగుబడి పెరుగుతుంది. పంటలకు ఎరువులను డ్రిప్పు పైపుల ద్వారా సరఫరా చే సే అవకాశం ఉంది. డ్రిప్పు పైపులతో పాటు ట్యాంకును కూ డా సరఫరా చేస్తున్నారు. ట్యాంకులో యూరి యా వేస్తే చాలు పంట అంతటికీ అందుతుంది.
సబ్సిడీపై పరికరాలు
డ్రిప్పు పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు 75 శాతం సబ్సిడీపై, పెద్ద రైతులకు 65శాతం సబ్సిడీపై డ్రిప్పు పరికరాలను అందిస్తున్నారు. రైతు పాస్‌బుక్‌లో ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ 1.50 ఎకరాలను ఒక యూనిట్ మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. 1.5 ఎకరాల కోసం ఇచ్చే యూనిట్ పరికరాలు కేవలం ఎకరానికి మాత్రమే సరిపోతున్నాయని రైతులు అంటున్నారు. కావాల్సినన్ని పరికరాలను సబ్సిడీపై అందించాలని కోరుతున్నారు. డ్రిప్పు ద్వారా పసుపు, సోయా, మొక్కజొన్న, బెండ, వంగ, టామాట, పంటలను సాగు చేస్తున్నారు.