మంచిర్యాల రూరల్ : కలుపు మొక్కలు అంటేనే రైతులకు ఎంతో దిగులు. వాటిని ఎలాగైనా తొలగించి, పంటను కాపాడుకోవాలని నిరంతరం శ్రమిస్తుంటారు. ఇందుకోసం ఎంతో ఖర్చు చేస్తుంటారు. అయితే పంటలపై తీవ్ర ప్రభావం చూపే కలుపు మొక్క వయ్యారిభామ(పార్థీనియం హిస్టిరోపోరస్) పంట ఎదుగుదలతోపాటు దిగుబడి రాకుండా అడ్డుకుంటుందని, పశువుల్లో వివిధ వ్యాధులు వచ్చేలా చేస్తుందని మంచిర్యాల ఏడీఏ వీరయ్య తెలిపారు. వయ్యారిభామ వల్ల కలిగే నష్టాలు, నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలను ఆయన వివరించారు.
మొక్క ఎలా వచ్చిందంటే..
అమెరికాలోని ఉష్ణప్రాంతంలో వయ్యారిభామ మొక్క ప్రస్థానం మొదలైంది. ఆహార ధాన్యాల దిగుమతి ద్వారా 1956లో మన దేశంలోకి ఈ మొక్క వచ్చి చేరిందని, 1973లో ఈ మొక్కను మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో కనుగొన్నట్లు ఏడీఏ తెలిపారు. ఈ మొక్క సీజన్‌తో సంబంధం లేకుండా నిరంతరం మొలుస్తుంది. ఒక్కో మొక్క పది వేలకుపైగా విత్తనాలను తయారు చేస్తుంది. ద్విదళ బీజంకు సంబంధించిన జాతి మొక్క కావడంతో ఒక్కో మొక్క ద్వారా కొన్ని వేల మొక్కలు వృద్ధి చెందుతాయి.
ఇవి గాలి, నీరు, కీటకాల ద్వారా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లి దేశమంతా వ్యాపించాయి. ఇవి ఎక్కువగా రోడ్లు, పంటపొలాల గట్లు, బంజరు భూములు, చేలు, కాలువలు, రైల్వే ట్రాకుల వెంట ఎక్కువగా మొలుస్తుంటాయి. ఈ మొక్క ఎత్తు 0.5 మీటర్ల నుంచి 1.5 మీటర్లు ఉంటుంది. ఎక్కువ కొమ్మలను కలిగి ఉంటుంది. వీటి ఆకులు చీలి ఉండగా.. పూలు 4 నుంచి 5 మిల్లీమీటర్ల(చుట్టుకొలత) మేరకు విస్తరించి పూస్తాయి. ఈ మొక్క కేవలం విత్తనం ద్వారానే వ్యాప్తి చెందుతుంది. ఈ మొక్క పూలు తెల్లగా ఉండడంతో వీటిని కాంగ్రెస్ గడ్డి, నక్షత్ర గడ్డి, పార్థీనియం అని పిలుస్తారు. మన వాడుక భాషలో మాత్రం వయ్యారిభామ మొక్క అని అంటాం.
‘వయ్యారిభామ’ పనిపట్టండి
Published Thu, Sep 25 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM
Advertisement
Advertisement