సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని వాసవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వాసవి, శ్రీనిధి కాలేజ్‌లు విద్యార్థుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తున్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
తెలంగాణ కళాశాలల ఫీజు నియంత్రణ కమిటీ నిబంధనల ఆధారంగానే ప్రస్తుతానికి విద్యార్థుల నుంచి ఫీజుల వసూలు చేయాలని కోర్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ పేరెంట్స్ అసోషియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటే తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలతో ఈ కాలేజ్‌ల్లో చదువుతున్న విద్యార్థులకు ఉపశమనం కలిగినట్టయింది.
Comments
Please login to add a commentAdd a comment