Vasavi College
-
శ్రీనిధి, వాసవి కాలేజీలకు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని వాసవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వాసవి, శ్రీనిధి కాలేజ్‌లు విద్యార్థుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తున్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ కళాశాలల ఫీజు నియంత్రణ కమిటీ నిబంధనల ఆధారంగానే ప్రస్తుతానికి విద్యార్థుల నుంచి ఫీజుల వసూలు చేయాలని కోర్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ పేరెంట్స్ అసోషియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటే తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలతో ఈ కాలేజ్‌ల్లో చదువుతున్న విద్యార్థులకు ఉపశమనం కలిగినట్టయింది. -
ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: వాసవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. వ్యయాల ఆధారంగా వాసవి కాలేజీలో ఫీజును ఏడాదికి రూ.1.60 లక్షలుగా, శ్రీనిధి ఫీజును ఏడాదికి రూ.1.37 లక్షలుగా ఖరారు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎఫ్ఆర్సీ సభ్య కార్యదర్శి దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం కొట్టేసింది. ఫీజుల ఖరారు విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం సమర్ధించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. 2016–17 నుంచి 2018–19 విద్యా సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సు కు రూ.91వేలను ఫీజుగా తెలంగాణ ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ (టీఎఎఫ్ఆర్సీ) నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ శ్రీనిధి కాలే జీ హైకోర్టును ఆశ్రయించింది. తమ ఫీజును రూ.97వేలుగా ఖరారు చేయడం పై వాసవి కాలేజీ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు టీఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజుల ను తప్పుపట్టింది. ఆ కళాశాలల వ్యయాలను ఆధారంగా చేసుకుని ఫీజులను ఖరారు చేయాల్సిన అవసరం ఉందంది. వాసవి కాలేజీ ఫీజును రూ.1.60 లక్షలుగా, శ్రీనిధి ఫీజును రూ. 1.37 లక్షలుగా ఖరారు చేయాలని టీఎఫ్‌ఆర్‌సీని ఆదేశించారు. ఈ ఆదేశాలపై ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎఫ్ఆర్సీ సభ్య కార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల సుదీర్ఘ విచారణ జరిపింది. నిర్దిష్ట కాల వ్యవధి లోపు ఫీజులను ఖరారు చేయకపోవడంపై విచారణ సందర్భంగా ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. అనంతరం తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం శుక్రవారం ఉదయం తన తీర్పును వెలువరించింది. -
'ఇంటర్ బోర్డుకు లంచం ఇవ్వకపోవడం వల్లే'
-
అక్రమాలకు ‘బోర్డు’!
ఇంటర్మీడియట్ బోర్డులో అవినీతి బాగోతం - వాసవి కాలేజీ ఉదంతంతో మరోసారి బయటపడిన తీరు - రెండేళ్లుగా అనుమతి లేకున్నా కొనసాగిన కాలేజీ - గతేడాది అనుమతుల కోసం దరఖాస్తు - రూ. లక్షల్లో ముడుపులు పుచ్చుకున్న అధికారులు - తనిఖీలు చేశాక మరింత లంచం కోసం డిమాండ్ - యాజమాన్యం ఇవ్వకపోవడంతో పక్కన పెట్టిన వైనం - ముడుపులు ఇవ్వనందుకే బోర్డు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వలేదంటున్న యాజమాన్యం సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డులో అవినీతి, అక్రమాల బాగోతం మరోసారి బయటపడింది. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల నుంచి ముడుపులు పుచ్చుకునేందుకు అలవాటు పడిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు వాసవి కాలేజీ ఉదంతంతో స్పష్టమవుతోంది. రెండేళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండానే వనస్థలిపురంలో వాసవి కాలేజీ కొనసాగుతున్నట్లు అధికారులకు తెలిసినా.. లంచాలు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాసవి కాలేజీ అధికారుల అండదండలతో గతేడాది మరో ప్రైవేటు కాలేజీ ద్వారా తమ విద్యార్థులతో పరీక్షలు రాయించగా.. ఈసారి తమ కాలేజీ పేరిటే పరీక్షలు రాయించేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. రూ.లక్షల్లో ముడుపులు పుచ్చుకున్న అధికారులు అనుమతుల జారీ ప్రక్రియలో భాగంగా గతేడాది జూలైలోనే వాసవి కాలేజీలో తనిఖీలు చేశారు. అయినా అనుమతివ్వకుండా మరిన్ని ముడుపుల కోసం తమను పీడించారని కాలేజీ యాజమాన్యం ఆరోపిస్తోంది. పైగా తనిఖీలు చేసిన అధికారులు గుర్తింపు ఇస్తున్నారా, లేదా? అన్నది తేల్చకుండా ఇప్పటివరకు కాలేజీని ఎలా కొనసాగించారన్న దానికి బోర్డు నుంచి ఎలాంటి సమాధానం లేదు. మామూళ్ల మత్తులోనే..! అసలు సూర్యాపేటలో మూతపడిన వాసవి కాలేజీని రెండేళ్ల కిందట వనస్థలిపురంలో ఏర్పాటు చేసినా.. బోర్డు అధికారులు మామూళ్ల మత్తులో పడి చూసీ చూడనట్లు వదిలేశారు. అంతేకాదు గత జనవరిలో జరిగిన పర్యావరణ విద్య, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షలకు ఆ కాలేజీ విద్యార్థులు హాజరుకాలేదు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరగాల్సిన ప్రాక్టికల్ పరీక్షలనూ నిర్వహించలేదు. చివరకు యాజమాన్యం ఒత్తిడితో సూర్యాపేటలోని కాలేజీ పేరుతోనే విద్యార్థులు పరీక్ష రాసేందుకు వీలుగా వివరాలను అప్లోడ్ చేసేందుకు లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చారు. దాంతో వాసవి కాలేజీ యాజమాన్యం విద్యార్థుల వివరాలను అప్లోడ్ చేసింది. ఎలాగూ విద్యార్థుల వివరాలు అప్లోడ్ చేశాం కాబట్టి హాల్‌టికెట్లు వచ్చేస్తాయని, విద్యార్థులు పరీక్షలు రాస్తారని భావించింది. కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదుగానీ ఆ విద్యార్థులకు హాల్‌టికెట్లు రాలేదు. ఫలితంగా కాలేజీలోని 300 మందికి పైగా విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. దీనిపై తల్లిదండ్రులంతా ఆందోళనకు దిగడంతో కాలేజీ యాజమాన్యం చేసిన మోసం, బోర్డు అధికారుల అక్రమాలు బయటపడ్డాయి. అయితే విద్యార్థులు నష్టపోవద్దనే ఉద్దేశంతో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. ఆ కాలేజీ విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. లాగిన్ ఐడీ ఎలా ఇచ్చారు? ఇంటర్ చదివే విద్యార్థులు కచ్చితంగా పర్యవరణ విద్య, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షలు రాస్తేనే ఇంటర్ పరీక్ష పాస్ సర్టిఫికెట్ వస్తుంది. లేకపోతే ఇంటర్ ఉత్తీర్ణత పొందినట్లు సర్టిఫికెట్ ఇవ్వరు. ఇది బోర్డు అధికారులకు తెలుసు. పైగా విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు కూడా హాజరుకాలేదు. మరి ఈ రెండూ జరిగిపోయాక కూడా బోర్డు అధికారులు సూర్యాపేటలోని పాత కాలేజీ పేరుతో లాగిన్ ఐడీ ఎలా ఇచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అక్కడి కాలేజీ పేరుతో విద్యార్థుల వివరాలను ఎలా అప్లోడ్ చేయించారన్నది తేలాల్సి ఉంది. యాజమాన్యం వద్ద భారీగా ముడుపులు పుచ్చుకొని అధికారులే ఈ తప్పిదానికి కారణమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లంచం ఇవ్వనందుకే.. ‘‘ఇంటర్ బోర్డు అధికారులు అడిగిన లంచం ఇవ్వనందుకే మా కళాశాల విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వలేదు. మా విద్యార్థులకు జరిగిన అన్యాయానికి బోర్డు అధికారులదే బాధ్యత. వారిపై చర్యలు చేపట్టాలి. గతేడాది జూన్‌లోనే అనుమతి కోసం దరఖాస్తు చేశాం. తనిఖీలు కూడా చేశారు. రూ.2 లక్షలు లంచం కూడా తీసుకున్నారు. ఇంకా రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వనందుకు జూన్ నుంచి బోర్డు చుట్టూ తిప్పుకుని చివరకు ఫిబ్రవరిలో లాగిన్ ఇచ్చారు. తీరా ప్రాక్టికల్స్‌కు హాజరుకాలేదంటూ హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్ నాశనం చేశారు..’’ – వాసవి కాలేజీ యజమాని శ్రీనివాస్ కాలేజీపై క్రిమినల్ కేసు ‘‘వాసవి కాలేజీ యాజమాన్యం విద్యార్థులను, ఇంటర్ బోర్డును కూడా మోసం చేసింది. కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. మేధా అనే ఒక మూతపడే కాలేజీ నుంచి వాసవి కాలేజీ ద్వితీయ సంవత్సర విద్యార్థులను తీసుకున్నారు. పర్యవరణ విద్య పరీక్ష రాయనపుడు, ప్రాక్టికల్స్ చేయనపుడు తల్లిదండ్రులు స్పందించలేదు. అప్పుడే స్పందించి ఉంటే ఇలా నష్టం జరిగేది కాదు..’’ – ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ -
'ఇంటర్ బోర్డుకు లంచం ఇవ్వకపోవడం వల్లే'
హైదరాబాద్: 200 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు అందకపోవడంపై వాసవి కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఇంటర్ బోర్డు అధికారులకు లంచం ఇవ్వకపోవడం వల్లే తమ విద్యార్థులకు హాల్‌టికెట్లు జారీ చేయలేదని ఆయన ఆరోపించారు. విద్యార్థులకు హాల్‌టికెట్లు జారీ చేయకపోవడానికి ఇంటర్ బోర్డు అధికారులే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. తనను అరెస్టు చేసినా ఫరవాలేదని.. తనతో పాటు బోర్డు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతేడాది జూన్ నెలలోనే పర్మీషన్ ఇంటర్మీడియట్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. కళాశాలను పరిశీలించడానికి వచ్చిన అధికారులు పర్మీషన్ ఇచ్చారని చెప్పారు. అఫ్లియేషన్ ఇవ్వడానికి మాత్రం లంచం డిమాండ్ చేసినట్లు చెప్పారు. దాదాపుగా రూ.2 లక్షలు అధికారులకు లంచంగా ఇచ్చినట్లు తెలిపారు. మరో రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని.. ఇవ్వనందుకు జూన్ నుంచి బోర్డు చుట్టూ తిప్పించుకున్నట్లు చెప్పారు. చివరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో లాగిన్ ఇచ్చారని.. ఇప్పుడేమో విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా వారి భవిష్యత్తును నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
-
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ⇒ గంట ముందు నుంచే పరీక్ష హాల్లోకి అనుమతి ⇒ ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం ⇒ హాజరుకానున్న 9.76 లక్షల మంది విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవు తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,291 కేంద్రాల్లో మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు జరిగే పరీక్షలకు సంబంధించి ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. విద్యార్థు లను ఉదయం 8 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. దీంతో విద్యార్థులు సాధ్యమైనంత ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. మొత్తంగా ఈ పరీక్షలకు 9,76,631 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపింది. హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం అక్కర్లేదు కాలేజీల యాజమాన్యాలు హాల్‌టికెట్లను నిరాకరిస్తే విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తమ వెబ్సైట్ (bజ్ఛ్టీ్ఛl్చnజ్చn్చ. ఛిజజ.జౌఠి.జీn లేదా ్టటbజ్ఛీ.ఛిజజ.జౌఠి.జీn) నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చని ఇంటర్ బోర్డు సూచించింది. ఇలా డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై కాలేజీ ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక హాల్‌టికెట్లను నిరాకరించే యాజమాన్యాలపై ఫిర్యాదు చేయాలని, కఠిన చర్యలు చేపడతామని వెల్లడించింది. విద్యార్థులకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి ► హాల్టికెట్లలోని వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి మార్పు చేయించుకోవాలి. ► ఓఎంఆర్ బార్కోడ్లో పేరు, హాల్‌టికెట్ నంబర్, మీడియం వివరాలు సరిచూసుకోవాలి. ► పరీక్ష హాల్లో ఇచ్చే జవాబుల బుక్‌లెట్‌లో 24 పేజీలు ఉన్నాయా, లేదా చూసుకోవాలి. వేరుగా అడిషనల్ షీట్స్ ఇవ్వరు. ► కొత్త సిలబస్, పాత సిలబస్‌ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంగ్లిషు, ద్వితీయ భాష తెలుగు–2, మోడర్న్ లాంగ్వేజ్ తెలుగు–2, ఉర్దూ–2 పేపర్ల విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. వొకేషనల్ కోర్సుల్లో ఇంగ్లిషు–1, 2, బ్రిడ్జి కోర్సు 1, 2లలో ఈ మార్పులను పరిశీలించాలి. ► మొదటిసారి పరీక్షలు రాసే వారంతా కొత్త సిలబస్ ప్రశ్నపత్రంతోనే రాయాలి. ► ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో ఏ రూట్ పాస్ ఉన్నా ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తారు. ► పరీక్ష కేంద్రం వద్దకు చేరుకునేందుకు ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ యాప్ ను వినియోగించుకోవచ్చు. ► సెల్ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకువెళ్లొద్దు. బోర్డు అనుమతి తీసుకోకుండానే తరగతులు వందలాది మంది విద్యార్థులను మోసం చేసిన వాసవి కాలేజీ ఇంటర్ బోర్డు నుంచి అనుమతి తీసుకోకుం డా, పరీక్ష ఫీజులు చెల్లించకుండా విద్యార్థులను మోసం చేసిన వాసవి కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ఇంటర్ అధికా రులు వెల్లడించారు. హైదరాబాద్‌లోని వనస్థలిపు రంలో ఉన్న ఈ కాలేజీ ఇంటర్ బోర్డులో నమోదు చేసుకోకుండానే వందల మంది విద్యార్థులను చేర్చుకుని మోసం చేసింది. బుధవారం నుంచి పరీ క్షలు ప్రారంభం కానుండగా.. కాలేజీ యాజమా న్యం విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇంటర్‌బోర్డు వెబ్సైట్లోనూ వారి హాల్‌టికెట్లు లేకపోవడంతో బోర్డు అధికారులను సంప్రదించగా.. మోసం విష యం బయటపడింది. అయితే ఇప్పుడు తామేమీ చేయలేమని, సదరు యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని ఇంటర్ బోర్డు పేర్కొంది. -
ఇలా చేయండి!
‘రిటైరయ్యాక కూడా జీవితం ఉంటుంది ఆ జీవితాన్ని వ్యర్థంగా గడపరాదు... అర్థవంతంగా గడపాలి’ ఇది చదువుల శకుంతలమ్మ చెప్పే సూక్తి. ఈ లెక్కల టీచర్ భాషలో ‘అర్థవంతం’... అంటే పరోపకారం! అప్పుడే ఆమె దగ్గర లెక్క సరిగ్గా కుదురుతుంది. చదువంటే డిగ్రీ కాదు... జీవితాలు బాగుపడడం... ఇది ఆమె చెప్పే మరో సూక్తి. లెక్కల్లో విలువలకు నైతిక విలువలను రంగరించడమే ఆమెకు తెలిసిన లెక్క. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి చదువు చెప్పడం ఆమెకు ఆనందం. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ క్రాస్‌రోడ్స్ నుంచి లోపలికి వెళ్తే అశోక్‌నగర్ కల్చరల్ అసోసియేషన్ వారి కమ్యూనిటీ భవనం. ఆ భవనంలోని మధ్య హాలు గ్రంథాలయం. కాలనీలోని పెద్దవాళ్లు పుస్తకాలు చదువుకుంటున్నారు. అదే హాల్లో ఒక పక్కగా, మరో గదిలో ఎనిమిది, తొమ్మిది, పదవ తరగతి పిల్లలకు ట్యూషన్ క్లాసులు జరుగుతున్నాయి. ఆ భవనం గేటు ఎదురుగా కనిపించే ఇల్లే వేమూరి శకుంతలది. ఆమె ఇంట్లో... దాదాపుగా పదిమంది పెద్ద పిల్లలున్నారు. హారిక... వాసవి కాలేజ్‌లో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసింది. క్యాంపస్ ప్లేస్మెంట్లో కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌లో ఉద్యోగం వచ్చింది. ఆగస్టులో ఉద్యోగంలో చేరనుంది. రమాలీల... ఈ అమ్మాయి పాలిటెక్నిక్ విద్యార్థి. ఈ-సెట్లో 18వ ర్యాంకు తెచ్చుకుంది. ఆ పక్కనే ఉన్న కిరణ్‌సాయి 128వ ర్యాంకు తెచ్చుకున్నాడు. కౌన్సెలింగ్ మొదలైతే వీరిద్దరూ ఈ ఏడాది ఇంజినీరింగ్ రెండవ సంవత్సరంలో చేరుతారు. లీలావతి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సులో సీటు తెచ్చుకుంది. ‘‘ఈ అమ్మాయికి లెక్కల మీద పట్టు పెద్దగా లేదు. అందుకే తనకు ఇష్టమైన మరో రంగాన్ని సూచించాను’’ అంటూ ఒక్కొక్కరినీ పరిచయం చేశారు 79 ఏళ్ల వేమూరి శకుంతల. ఈ పిల్లలందరూ వాళ్ల కుటుంబాల నుంచి తొలితరం విద్యావంతులే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. వీరి తల్లిదండ్రుల్లో ఎవరూ పిల్లల చదువు కోసం వేలు, లక్షల రూపాయలు ఖర్చు చేయగలిగిన స్థితిలో లేరు. ఇస్త్రీ బండితో బతుకు వెళ్లదీసేవాళ్లు, ఇళ్లలో పనులు చేసుకునేవాళ్లు, వాచ్‌మ్యాన్, అటెండర్ వంటి చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్లే. ‘‘మేమంతా ఇంత బాగా చదివి, మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటున్నామంటే అమ్మ వల్లనే’’ అన్నారు ఈ పిల్లలందరూ ముక్తకంఠంతో. ‘‘మేము కూడా మంచిగా చదువుకుని ఉద్యోగాలు చేస్తాం’’ అని చిన్న పిల్లలు వంత పలుకుతున్నారు. లెక్కల టీచరమ్మ! నగరంలోని ఉన్నత విద్యావంతులు, సంపన్న వర్గాల పిల్లలు చదువుకునే కాలేజ్‌గా పేరున్న ఫ్రాన్సిస్‌లో మంచి లెక్చరర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శకుంతల, లెక్కల పాఠాలను దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికి అందించడం వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. ‘‘మా ఇంట్లో పని చేసే ఆమె ఒకరోజు చాలా బాధపడుతూ... తన రెక్కల కష్టంతో కొడుకుని చదివిస్తున్నానని, కానీ కొడుక్కి లెక్కలు రావడం లేదని, వాడికి లెక్కలు నేర్పించమని అడిగింది. ఫెయిలవుతాడని భయపడిన ఆ కుర్రాడు 72 మార్కులతో పాసయ్యాడు. రిటైరయ్యాక ఇదే వ్యాపకం’’ అన్నారామె చుట్టూ ఉన్న పిల్లలను చూస్తూ. విద్యార్థుల మధ్య వంతెన శకుంతలమ్మ దగ్గర చదువుకుని ఉన్నత స్థాయిలో ఉన్న సంపన్న విద్యార్థులు ఆమెకి చేదోడుగా ఉంటున్నారు. ఫీజులు కట్టడానికి ఒక్కో విద్యార్థినీ ఒక్కో సంపన్న పూర్వ విద్యార్థితో అనుసంధానం చేస్తారామె. సమాజంలో దిగువ స్థాయిలో జీవిస్తున్న వారి కోసం రిజర్వేషన్లు పెంచడమే పరిష్కారం కాదంటారామె ‘‘ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు సంపాదించుకోగలిగినంత నాణ్యమైన విద్యనందించాలి. అప్పుడు ఎవరికి వారు పోటీ ప్రపంచంలో నిలబడగలిగే శక్తి తెచ్చుకుంటారు. ధైర్యాన్ని సంపాదించుకుంటారు’’ అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు శకుంతలమ్మ. ఆమె చెబుతున్నట్లే ఆమె దగ్గర చదువుకుంటున్న విద్యార్థులు రిజర్వేషన్ కోటా కోసం చూడడం లేదు. ఓపెన్‌లో సీటు తెచ్చుకుని చదువుకుంటున్నారు. ‘ఓపెన్‌లో మెరిట్ సీటు తెచ్చుకుంటే నాకదే మీరిచ్చే గురుదక్షిణ’ అని పిల్లలకు లక్ష్యాన్ని స్థిరీకరిస్తున్నారామె. - సాక్షి ప్రతినిధి కొంతైనా చేయాలని... శకుంతల మేడమ్ చేస్తున్న పని నాకు బాగా నచ్చింది. ఆమెలా కాకపోయినా కొంతైనా చేయగలిగితే బావుణ్ణు అనుకునేదానిని. మా పాపకు పెళ్లయిన తర్వాత నేను కూడా ఇందులో భాగస్వామినయ్యాను. పిల్లలకు ట్యూషన్ క్లాసులు, వాళ్ల చేత ఏయే పరీక్షలు ఎప్పుడు రాయించాలి... వంటి పనుల్లో మేడమ్‌కి సహాయంగా ఉంటున్నాను. - శ్రీవల్లి, శకుంతలమ్మకు సహకార భాగస్వామి