ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవు తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,291 కేంద్రాల్లో మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు జరిగే పరీక్షలకు సంబంధించి ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. విద్యార్థు లను ఉదయం 8 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. దీంతో విద్యార్థులు సాధ్యమైనంత ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. మొత్తంగా ఈ పరీక్షలకు 9,76,631 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపింది.