Intermediate annual examinations
-
మార్చి 15 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మొదలయ్యే పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. మొత్తం 1,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. పరీక్షల ఏర్పాట్లపై బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సబితాఇంద్రారెడ్డి సోమవారం సమీక్షించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడారు. పరీక్షల కోసం తీసుకున్న జాగ్రత్తలు, విద్యార్థులకు ఇచ్చే సూచనలను పరీక్షల విభాగం డైరెక్టర్ జయప్రదాభాయ్ మీడియాకు వివరించారు. పకడ్బందీ ఏర్పాట్లు: మంత్రి సబిత ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. జిల్లా స్థాయి కమిటీ చైర్మన్లుగా కలెక్టర్లు పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు తాగునీరు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యార్థులు సకాలంలో చేరేందుకు వీలుగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు. సమస్యలకు సత్వర పరిష్కారం లభించే విధంగా ప్రత్యేకంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తక్షణమే స్పందిస్తాం: నవీన్ మిత్తల్ ’’ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తక్షణమే అధికారుల దృష్టికి తీసుకువస్తే స్పందించేందుకు సిద్ధంగా ఉంటాం. అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక యంత్రాంగం పని చేస్తోంది. ఎలాంటి మానసిక ఒత్తిడి అన్పించినా విద్యార్థులు కౌన్సెలింగ్ తీసుకోవాలి.. మనోధైర్యం ప్రతీ విద్యార్థికి అవసరం’’అని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ అన్నారు. గంట ముందే పరీక్ష హాలుకు... ♦ విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్షహాలులోకి అనుమతిస్తారు. 9 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. విద్యార్థులు హాల్ టికెట్లపై పేరు, మీడియం ఇతర వివరాలను ముందే సరిచూసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే ప్రిన్సిపాల్ చేత సరిచేయించుకోవాలి. హాల్‌టికెట్లను ్టటbజ్ఛీ.ఛిజజ.జౌఠి.జీn వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా అనుమతిస్తారు. ♦ ఏ విధమైన ప్రింటింగ్, చేతిరాత మెటీరియల్, సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పరీక్ష హాలులోకి అనుమతించరు. ♦ జిల్లా పరీక్షల కమిటీ(డీఈసీ)ని ప్రతీ జిల్లాలో నియమించారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి, నోడల్ అధికారి, ఇద్దరు ప్రిన్సిపాళ్లు, జూనియర్ లెక్చరర్ ఇందులో ఉంటారు. వీరితోపాటు జిల్లాస్థాయి హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ♦ రెవెన్యూ, విద్య, పోలీసు శాఖల నుంచి ఒకరు చొప్పున 75 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. పరీక్షాకేంద్రాల్లో 200 సిట్టింగ్ స్క్వాడ్స్ ఉంటాయి. ♦ జిల్లా కో–ఆర్డినేషన్ కమిటీలో అన్ని శాఖల అధికారులుంటారు. వారు ఆర్టీసీ, హెల్త్, విద్యుత్ సేవలు అందిస్తారు. అన్ని ప్రాంతాల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. పరీక్షకేంద్రాలకు సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేస్తారు. ప్రతీ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. -
వీడని సస్సెన్స్..! ఇంటర్ పరీక్షలు జరిగేనా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. ఆ దిశగానే అధికారులు ఆలోచిస్తున్నారు. కరోనా కేసుల వ్యాప్తి తగ్గకపోవడంతో ప్రభుత్వం కూడా ఇంటర్ పరీక్షలను వాయిదా వేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వచ్చే నెల 4వ తేదీ నుంచి నిర్వహించాల్సిన 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. ఇక పదో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా వారికి మార్కులను కేటాయించాలని నిర్ణయించింది. ఈ నేఫథ్యంలో రాష్ట్రంలోనూ పరీక్షల నిర్వహణపై నేడో, రేపో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిర్వహణ ఇబ్బందికరమే... కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో లక్షల మంది విద్యార్థులకు ఒకేసారి పరీక్షలు నిర్వహించడం ఇబ్బందికరమేనన్న భావనలో అధికారులు ఉన్నారు. ప్రత్యక్ష బోధన లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ బోధన అంతంతగానే కొనసాగుతోంది. విద్యార్థులందరికి ఆన్లైన్ పాఠాలు అందడం లేదు. టీశాట్ వీడియో పాఠాల ప్రసారాన్ని విద్యార్థులంతా చూడటం లేదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల్లోనూ పరీక్షలు ఎలా రాయాలన్న ఆందోళన నెలకొంది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్వహణ ఇబ్బందికరమేనన్న ఆలోచన అధికారుల్లో ఉంది. షెడ్యూలు ప్రకారం మే 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలను, 2వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అయితే ఆయా పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. రోజు విడిచి రోజు చొప్పున పరీక్షలు నిర్వహిస్తున్నందున ప్రతిరోజు 5 లక్షల మంది విద్యార్థులు వస్తారని, భౌతికదూరం పాటించడం కష్టమేనన్న భావన నెలకొంది. బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణించేప్పుడు, పరీక్ష కేంద్రాల్లోనూ ఇబ్బందికరమేనని అధికారులు పేర్కొంటున్నారు. సాధారణ సమయంలో ఏర్పాటు చేసే 1,350 కేంద్రాలకు బదులు రెట్టింపు కేంద్రాలను ఏర్పాటు చేసినా విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనన్న ఆలోచన అధికారుల్లో ఉంది. కేంద్రమే వద్దనుకున్నపుడు రాష్ట్రంలో ఎలా? కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇప్పుడే పరీక్షల నిర్వహణ అవసరమా? అన్న భావన విద్యాశాఖ వర్గాల్లో నెలకొంది. కేంద్ర ప్రభుత్వమే జూన్‌లో పరిస్థితి సమీక్షించి పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మే 1వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించడం అవసరమా? అన్న భావన అధికారుల్లో నెలకొంది. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో నేడో రేపో తేలనుంది. ఇక రాష్ట్రంలో 260 సీబీఎస్ఈ స్కూళ్లు ఉండగా అందులో 15 వేల మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వారందరికి పరీక్షలు రద్దయ్యాయి. 12వ తరగతి చదివే మరో 10 వేల మంది విద్యార్థులు జూన్ వరకు వేచి చూడాల్సిందే. టెన్త్ పరీక్షలపై వేచి చూద్దామా? సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో టెన్త్ పరీక్షల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది. షెడ్యూలు ప్రకారం మే 17వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అంటే మరో నెల రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో వాటిపై ప్రభుత్వం ఇప్పుడే నిర్ణయం తీసుకుంటుందా? కొన్ని రోజుల తరువాత కరోనా కేసుల పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటుందా? అనేది త్వరలోనే తేలనుంది. అయితే విద్యాశాఖ వర్గాలు మాత్రం పదో తరగతి పరీక్షలు అవసరమే లేదని, విద్యార్థులందరిని పాస్ చేస్తే సరిపోతుందన్న భావనలో ఉన్నాయి. జేఈఈ మెయిన్ పరీక్షలు జరిగేనా? ఈనెల 27, 28, 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్ మూడో దఫా పరీక్షలపైనా కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్ పరీక్షలను షెడ్యూలు ప్రకారం నిర్వహిస్తారా? లేదా? అన్నది త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: ఆదమరిస్తే అంతే! -
మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు 2021 మే ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ సోమవారం తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేశారు. గతేడాది సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనందున అప్పుడు ఫస్టియర్ పరీక్షలు రాసిన వారు ఈ పరీక్షల్లో ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసుకునేందుకు వీలు కల్పించారు. మార్చి 31 నుంచి ప్రాక్టికల్స్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి ఆదివారాలు సహా ఏప్రిల్ 24 వరకు జరుగుతాయి. ప్రతి రోజు రెండు సెషన్లలో.. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు జరుగుతాయి. ఎథిక్స్, ఎన్విరాన్మెంటల్ పేపర్లు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వేల్యూస్ పరీక్ష మార్చి 24న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష మార్చి 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. -
60% కంటే తక్కువ హాజరుంటే..
శ్రీకాకుళం: రాష్ట్రంలో ఇంటర్ సైన్స్ విద్యార్థులకు 60 శాతం హాజరు ఉంటేనే వార్షిక పరీక్ష రాసేందుకు అనుమతించాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఇది అమల్లోకి రానుంది. గతేడాది కూడా ఈ నిబంధన ఉన్నప్పటికీ అప్పట్లో ఆన్లైన్ హాజరు విధానం లేకపోవడం వల్ల కచ్చితంగా అమలయ్యేది కాదు. ఈ ఏడాది బయోమెట్రిక్, ఆన్లైన్ హాజరును ప్రవేశపెట్టడంతో విద్యార్థి హాజరు ఎప్పటికప్పుడు తెలిసిపోతోంది. దీంతో ఇకపై 60 శాతం హాజరు నిబంధన కచ్చితంగా అమలయ్యే అవకాశం ఉంది. సైన్స్ తప్ప మిగిలిన ఇతర సబ్జెక్టుల విద్యార్థులకు 60 శాతం కంటే తక్కువ హాజరు ఉంటే వారి నుంచి కాండినేషన్ ఫీజు వసూలు చేసి పరీక్షకు అనుమతిస్తారు. 10 రోజులు హాజరు తక్కువగా ఉంటే రూ.200, 18 రోజులు హాజరు తక్కువగా ఉంటే రూ.250, అంతకంటే హాజరు తక్కువగా ఉంటే రూ.400 కాండినేషన్ ఫీజుగా వసూలు చేస్తారు. డిసెంబర్ 28 వరకు గడువు ఇంటర్మీడియెట్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ముగిసినా, రూ.2,000 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించే అవకాశాన్ని ఇంటర్ బోర్డు తాజాగా కల్పించింది. వచ్చే ఏడాది ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో తొలిసారిగా జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. 2019 ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. వీలైనంత వరకు ఈ పరీక్షలను ప్రభుత్వ కళాశాలల్లోనే నిర్వహించాలని, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఆదేశాలను జిల్లా అధికారులకు జారీ చేసింది. సెకండియర్‌కు గ్రేడింగ్ విధానం ఈ ఏడాది నుంచి ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. గతేడాది మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేశారు. పరీక్షల నిర్వహణపై సందేహాలు వచ్చే ఏడాది ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి మాసాంతం నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. మార్చి నెలలో ఎన్నికలు వస్తే ఇంటర్ పరీక్ష నిర్వహణ కష్టసాధ్యమవుతుందని పలువురు అధ్యాపకులు చెబుతున్నారు. -
ఫిబ్రవరి 27 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. మంగళవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ.అశోక్ టైమ్‌టేబుల్ విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి పరీక్షలు ప్రారంభమై మార్చి 18తో ముగియనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయి. వచ్చే ఏడాది జనవరి 28న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, జనవరి 30న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. జనరల్, ఒకేషనల్ కోర్సులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
-
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ⇒ గంట ముందు నుంచే పరీక్ష హాల్లోకి అనుమతి ⇒ ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం ⇒ హాజరుకానున్న 9.76 లక్షల మంది విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమవు తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,291 కేంద్రాల్లో మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు జరిగే పరీక్షలకు సంబంధించి ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. విద్యార్థు లను ఉదయం 8 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. దీంతో విద్యార్థులు సాధ్యమైనంత ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. మొత్తంగా ఈ పరీక్షలకు 9,76,631 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపింది. హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం అక్కర్లేదు కాలేజీల యాజమాన్యాలు హాల్‌టికెట్లను నిరాకరిస్తే విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తమ వెబ్సైట్ (bజ్ఛ్టీ్ఛl్చnజ్చn్చ. ఛిజజ.జౌఠి.జీn లేదా ్టటbజ్ఛీ.ఛిజజ.జౌఠి.జీn) నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చని ఇంటర్ బోర్డు సూచించింది. ఇలా డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై కాలేజీ ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక హాల్‌టికెట్లను నిరాకరించే యాజమాన్యాలపై ఫిర్యాదు చేయాలని, కఠిన చర్యలు చేపడతామని వెల్లడించింది. విద్యార్థులకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి ► హాల్టికెట్లలోని వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి మార్పు చేయించుకోవాలి. ► ఓఎంఆర్ బార్కోడ్లో పేరు, హాల్‌టికెట్ నంబర్, మీడియం వివరాలు సరిచూసుకోవాలి. ► పరీక్ష హాల్లో ఇచ్చే జవాబుల బుక్‌లెట్‌లో 24 పేజీలు ఉన్నాయా, లేదా చూసుకోవాలి. వేరుగా అడిషనల్ షీట్స్ ఇవ్వరు. ► కొత్త సిలబస్, పాత సిలబస్‌ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంగ్లిషు, ద్వితీయ భాష తెలుగు–2, మోడర్న్ లాంగ్వేజ్ తెలుగు–2, ఉర్దూ–2 పేపర్ల విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. వొకేషనల్ కోర్సుల్లో ఇంగ్లిషు–1, 2, బ్రిడ్జి కోర్సు 1, 2లలో ఈ మార్పులను పరిశీలించాలి. ► మొదటిసారి పరీక్షలు రాసే వారంతా కొత్త సిలబస్ ప్రశ్నపత్రంతోనే రాయాలి. ► ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో ఏ రూట్ పాస్ ఉన్నా ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తారు. ► పరీక్ష కేంద్రం వద్దకు చేరుకునేందుకు ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ యాప్ ను వినియోగించుకోవచ్చు. ► సెల్ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకువెళ్లొద్దు. బోర్డు అనుమతి తీసుకోకుండానే తరగతులు వందలాది మంది విద్యార్థులను మోసం చేసిన వాసవి కాలేజీ ఇంటర్ బోర్డు నుంచి అనుమతి తీసుకోకుం డా, పరీక్ష ఫీజులు చెల్లించకుండా విద్యార్థులను మోసం చేసిన వాసవి కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ఇంటర్ అధికా రులు వెల్లడించారు. హైదరాబాద్‌లోని వనస్థలిపు రంలో ఉన్న ఈ కాలేజీ ఇంటర్ బోర్డులో నమోదు చేసుకోకుండానే వందల మంది విద్యార్థులను చేర్చుకుని మోసం చేసింది. బుధవారం నుంచి పరీ క్షలు ప్రారంభం కానుండగా.. కాలేజీ యాజమా న్యం విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇంటర్‌బోర్డు వెబ్సైట్లోనూ వారి హాల్‌టికెట్లు లేకపోవడంతో బోర్డు అధికారులను సంప్రదించగా.. మోసం విష యం బయటపడింది. అయితే ఇప్పుడు తామేమీ చేయలేమని, సదరు యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని ఇంటర్ బోర్డు పేర్కొంది. -
తెలుగుకు బదులు సంస్కృతం!
కందుకూరు/తుంగతుర్తి, న్యూస్‌లైన్: ఇంటర్మీడియె ట్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమన్న అధికారులు.. వారే రెండుచోట్ల బుధవారం మొదటిరోజు పరీక్ష ఆలస్యం కావడానికి కారణమయ్యూరు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో గంటన్నర, నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో రెండు గంటలు ఆలస్యంగా పరీక్ష నిర్వహించారు. వివరాలిలా ఉన్నారుు. కందుకూరులోని విద్యామయి జూనియర్ కళాశాల, కందుకూరు జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఇంటర్ పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాలు రెండురోజుల క్రితమే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సబ్జెక్టుల వారీగా సరఫరా అయ్యాయి. బుధవారం ఉదయం కందుకూరు చౌరస్తాలోని విద్యామయి జూనియర్ కళాశాల సిబ్బంది పోలీస్‌స్టేషన్ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రశ్నాపత్రాలు తెచ్చారు. 9 గంటలకు పరీక్ష కావడంతో 8.45కు పార్శిల్ తెరిచి చూశారు. తెలుగు ప్రశ్నపత్రాలు కావలసి ఉండగా సంస్కృతం పేపర్లు దర్శనమిచ్చాయి. దీంతో కంగుతిన్న సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అధికారులు హైదరాబాద్ నుంచి కారులో తెలుగు ప్రశ్నపత్రాలు తీసుకుని ఉదయం 10.25 గంటల సమయంలో పరీక్షా కేంద్రానికి వచ్చారు. దీంతో 9 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష.. గంటన్నర ఆలస్యంగా 10.30 గంటలకు ప్రారంభమైంది. ఈ విషయమై పరీక్షా కేంద్రం నిర్వాహకులు మాట్లాడుతూ.. తమకు సరఫరా చేసిన సెట్ పైన ‘102 కోడ్ న్యూ సిలబస్ తెలుగు’ అని ఉందని, కానీ లోపల సంస్కృతం పేపర్లు ఉన్నాయని తెలిపారు. మరోవైపు తుంగతుర్తిలోని మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రానికి అధికారులు ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు ప్రశ్నపత్రాలకు బదులు సంస్కృతం పేపర్లు పంపారు. ఉదయం సమయం కాగానే విద్యార్థులకు ప్రశ్నపత్రాలు ఇవ్వడానికి నిర్వాహకులు బండిల్ ఓపెన్ చేయగా తెలుగుకు బదులు సంస్కృతం ప్రశ్నపత్రాలు కనిపించాయి. వారు విషయం ఆర్ఐవో ప్రకాశ్బాబుకు చెప్పారు. ఆయన హుటాహుటిన సూర్యాపేట, తిరుమలగిరి కేంద్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తెలుగు పేపర్లు తెప్పించి విద్యార్థులకు అందజేశారు. దీంతో ఈ కేంద్రంలో విద్యార్థులు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పరీక్ష రాశారు. -
నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 63,636 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేశారు. మారుమూల గ్రామాల నుంచి విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్న దృష్ట్యా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు ఇంటర్మీడియెట్ రీజినల్ పర్యవేక్షణ అధికారి సీపీ గ్లాడిస్ తెలిపారు. మాస్ కాపీయింగ్ జరగకుండా గ్లోబల్ పొజిషన్ సిస్టమ్(జీపీఎస్) తో అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఉదయం 9 గంటలకే పరీక్షలు ప్రారంభం అవుతున్న దృష్ట్యా విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 8.45 గంటల లోపు చేరుకోవాలని సూచించారు. పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీప ప్రాంతాల్లోని జిరాక్సు సెంటర్లను మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. పరీక్ష కేంద్రాలకు సెల్ఫోన్లు, ఇతర ఎల క్ట్రానిక్ పరికరాలను తీసుకు రావద్దని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు తక్షణ వైద్యం అందించేందుకు ఒక ఏఎన్ఎంను నియమిస్తున్నామన్నారు. అలాగే తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు గ్లాడిస్ తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 23,886 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 33,943, ఒకేషనల్ ప్రథమ సంవత్సరంలో 2,298 , ద్వితీయ సంవత్సరంలో 3,509 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలను జిల్లాస్థాయిలో డీఈసీ హెచ్‌పీసీల కమిటీలు పర్యవే క్షిస్తున్నాయి. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆర్ఐఓ తెలిపారు.