
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు 2021 మే ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ సోమవారం తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేశారు. గతేడాది సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనందున అప్పుడు ఫస్టియర్ పరీక్షలు రాసిన వారు ఈ పరీక్షల్లో ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసుకునేందుకు వీలు కల్పించారు.
మార్చి 31 నుంచి ప్రాక్టికల్స్
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి ఆదివారాలు సహా ఏప్రిల్ 24 వరకు జరుగుతాయి. ప్రతి రోజు రెండు సెషన్లలో.. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు జరుగుతాయి.
ఎథిక్స్, ఎన్విరాన్మెంటల్ పేపర్లు
ఎథిక్స్ అండ్ హ్యూమన్ వేల్యూస్ పరీక్ష మార్చి 24న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష మార్చి 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment