సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. మంగళవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ.అశోక్ టైమ్‌టేబుల్ విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి పరీక్షలు ప్రారంభమై మార్చి 18తో ముగియనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయి. వచ్చే ఏడాది జనవరి 28న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, జనవరి 30న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. జనరల్, ఒకేషనల్ కోర్సులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 27 నుంచి ఇంటర్ పరీక్షలు
Published Wed, Nov 28 2018 2:18 AM | Last Updated on Wed, Nov 28 2018 8:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment