తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు రూపొందించిన టీఎస్‌బీఐఈ ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ యాప్ అందుబాటులోకి వచ్చింది. మార్చి 1 నుంచి జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాన్ని వెతుక్కునేందుకు ఇబ్బంది పడకుండా స్మార్ట్‌ఫోన్ ద్వారా తమ పరీక్షా కేంద్రాన్ని తెలుసుకునేలా ఈ యాప్‌ను రూపొందించింది. సోమవా రం సచివాలయంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఈ యాప్‌ను ప్రారంభించారు. ఇంటర్ బోర్డు అందుబాటులోకి తెచ్చిన ఈ యాప్‌ను విద్యార్థులు ఉపయోగించుకో వాలని ఆమె సూచించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో విద్యార్థులు పరీక్షా కేంద్రాన్ని వెతుక్కోవడంలో గందరగో ళానికి గురయ్యే పరిస్థితి ఉన్నందున, ఇది వారికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.