Srinidhi college
-
ఘట్కేసర్ శ్రీనిధి కాలేజీలో ఉద్రిక్తత.. ఫర్నిచర్, అద్ధాలు ధ్వంసం
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాలేజీ ఫర్నిచర్, అద్ధాలను విద్యార్థులు ధ్వంసం చేశారు. వర్శిటీ గుర్తింపు వస్తుందంటూ వసూలు చేసిన డబ్బు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ స్టూడెంట్ కాలేజీ బిల్డింగ్ పైకి ఎక్కడంతో కలకలం రేగింది. తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులు, తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకున్నారు. చదవండి: కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా.. కారణం ఇదే.. -
ప్రమోషన్స్ జోరు పెంచిన ‘మీకు మాత్రమే చెప్తా’ బృందం
-
శ్రీనిధి, వాసవి కాలేజీలకు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని వాసవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వాసవి, శ్రీనిధి కాలేజ్‌లు విద్యార్థుల నుంచి అధిక ఫీజు వసూలు చేస్తున్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ కళాశాలల ఫీజు నియంత్రణ కమిటీ నిబంధనల ఆధారంగానే ప్రస్తుతానికి విద్యార్థుల నుంచి ఫీజుల వసూలు చేయాలని కోర్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ పేరెంట్స్ అసోషియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటే తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలతో ఈ కాలేజ్‌ల్లో చదువుతున్న విద్యార్థులకు ఉపశమనం కలిగినట్టయింది. -
‘శ్రీనిధి’ వ్యయాలను మళ్లీ పరిశీలించండి
టీఏఎఫ్ఆర్సీకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 2016-17 నుంచి 2018-19 విద్యా సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సుకు తెలంగాణ ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిషన్ (టీఏఎఫ్ఆర్సీ) నిర్ణయించిన రూ. 91 వేల ఫీజును హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. శ్రీనిధి కాలేజీ సమర్పించిన వ్యయాల రికార్డులను మరోసారి పరిశీలన చేసి ఫీజును నిర్ణయించాలని టీఎఎఫ్‌ఆర్‌సీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు. తమ వ్యయాల ఆధారంగా ఇంజనీరింగ్ కోర్సుకు రూ.1.54 లక్షలను ఫీజు నిర్ణరుుంచాలని కోరితే, టీఏఎఫ్ఆర్సీ మాత్రం రూ. 91 వేలనే ఫీజును నిర్ణయించిందంటూ హైకోర్టును శ్రీనిధి కాలేజీ యాజమాన్యం ఆశ్రయించింది. తమ వ్యయాల రికార్డులను పూర్తిస్థారుులో పరిశీలన చేయకుండానే టీఏఎఫ్ఆర్సీ ఫీజును ఖరారు చేసిందని ఆ కాలేజీ యాజమాన్యం హైకోర్టుకు నివేదించింది. విచారణ జరిపిన జస్టిస్ రామచంద్రరావు ఆ కాలేజీ వ్యయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఫీజు ఖరారుపై తగిన నిర్ణయం తీసుకోవాలని టీఏఎఫ్ఆర్సీని ఆదేశించింది. టీఏఎఫ్ఆర్సీ ఫీజును ఖరారు చేసిన నాటి నుంచి రెండు వారాల్లో దానిని నోటిఫై చేయాలని ప్రభుత్వానికి న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
బూమ్ బూమ్ రోబోడా..
డిఫరెంట్ థీమ్స్‌తో రూపొందిన రోబోలు భవిష్యత్ భారతిని ముందుంచాయి. ఘట్కేసర్ సమీపంలోని శ్రీనిధి కాలేజీలో శనివారం నిర్వహించిన రోబోవేద-2014 సరికొత్త ప్రతిభను ఆవిష్కరించింది. రొబోటిక్స్‌లో ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల కృషిని వుుందుంచింది. ఈ పోటీల్లో పలు ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఈ పోటీకి హాజరయ్యూరు. విద్యార్థులు రూపొందించిన రోబోలు ఒకదానితో వురొకటి పోటీ పడ్డాయి. డిఫరెంట్ థీమ్స్‌తో తయూరు చేసిన రోబోలు అందర్నీ ఆకట్టుకున్నాయి. రోబోల పనితనం ఎలా ఉందో తెలుసుకునేలా డిఫరెంట్ ట్రాక్స్ ఏర్పాటు చేశారు. క్వాలిఫైరుుంగ్ రౌండ్ సక్సెస్ ఫుల్‌గా దాటిన వారిని తర్వాతి రౌండ్లకు అనువుతించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.