బూమ్ బూమ్ రోబోడా..
డిఫరెంట్ థీమ్స్‌తో రూపొందిన రోబోలు భవిష్యత్ భారతిని ముందుంచాయి. ఘట్‌కేసర్ సమీపంలోని శ్రీనిధి కాలేజీలో శనివారం నిర్వహించిన రోబోవేద-2014 సరికొత్త ప్రతిభను ఆవిష్కరించింది. రొబోటిక్స్‌లో ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల కృషిని వుుందుంచింది. ఈ పోటీల్లో పలు ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఈ పోటీకి హాజరయ్యూరు. విద్యార్థులు రూపొందించిన రోబోలు ఒకదానితో వురొకటి పోటీ పడ్డాయి. డిఫరెంట్ థీమ్స్‌తో తయూరు చేసిన రోబోలు అందర్నీ ఆకట్టుకున్నాయి. రోబోల పనితనం ఎలా ఉందో తెలుసుకునేలా డిఫరెంట్ ట్రాక్స్ ఏర్పాటు చేశారు. క్వాలిఫైరుుంగ్ రౌండ్ సక్సెస్ ఫుల్‌గా దాటిన వారిని తర్వాతి రౌండ్లకు అనువుతించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.