ఇంటి పనులన్నీ చేసే రోబోలను సినిమాల్లోనూ లేదా కార్టూన్ షోల్లోనే చూశాం. నిజ జీవితంలో ఉంటే ఎలా ఉంటుందనేది తెలియదు. అందుకోసం ఇప్పటికే పరిశోధనలు చేయడమే గాక పలు రూపాల్లో రోబోలను తీసుకొచ్చారుగానీ. ఎలా రోబోలతో పనిచేయించుకోవాలనేది కాస్త సమస్యాత్మకంగా ఉంది. ఏం చేయాలన్నిది రోబోకి ముందుగానే శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమస్య లేకుండా శాస్త్రవేత్తలు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కూడిన సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. దీని సాయంతో రోబోకు సాధారణ ఇంటి పనులను ఎలా నిర్వహించాలో సులభంగా నేర్చుకుని చేసేస్తుంది.
ఈ మేరకు రోబోని ట్రైయిన్ చేసేలా డాబ్ ఈ అనే కొత్త ఓపెన్ స్టోర్ సిస్టమ్‌ని రూపొందించారు. వాస్తవంగా ప్రతి ఇంట్లో ఉంటే పనులను పరిగణలోకి తసుకుని ఓ డేటాని రూపొందించారు న్యూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం. ఈ డాబ్ ఈకి మనం సాధారణంగా వినయోగించే రీచర్ గ్రాబర్ స్టిక్‌కి జోడించిన ఐఫోన్‌ను ఉపయోగిస్తే చాలు. రోబో ఈజీగా అన్ని పనులను నేర్చుకుంటుంది. ఈ ఐఫోన్ దేనికంటే మనమిచ్చిన ఇన్‌స్ట్రక్షన్‌లను డాబ్ ఈ డేటా రోబోకి ఎలా చేయాలో రికార్డు చేసిన వీడియోల ద్వారా తెలుపుతుంది. దీంతో రోబో ఆటోమేటిగ్గా సులభంగా ఆ పనిని చేసేస్తుంది .
ఈ సరికొత్త సాంకేతికతో కూడిన రోబో వర్కింగ్ గురించి న్యూయార్క్‌లోని దాదాపు 22 ఇళ్లల్లో టెస్ట్ చేయగా చక్కటి ఫలితం వచ్చింది. దీంతో శాస్త్రవేత్తలు ఈ డాబ్ ఈ సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా పరిశోధనలు చేస్తున్నారు. ఈ డేటా మరింత ఎక్కువగా ఉంటే కొత్త ఇంటిని చూడగానే ఆ రోబోని ట్రైయిన్ చేయాల్సిన పని కూడా ఉండదనేది పరిశోధకులు ఆలోచన. ప్రతి ఇంట్లో ఉండే పనులన్నీ రోబోలకు ఇప్పటికే తెలుసు, నేర్చుకున్నాయి కూడా అన్నారు. ఇక్కడ రోబో స్టిక్‌సిస్టమ్‌లను వినియోగిస్తుంది. వీటినన్నంటిని కలిపి డాబ్-ఇ అని పిలుస్తారు. ఈ రోబో ఇల్లు తుడవడం దగ్గర నుంచి లాండ్రీ వరకు అన్నింటిని చేసేస్తుంది.
(చదవండి: భారత రెస్టారెంట్‌కి మిచెలిన్ స్టార్ అవార్డు! ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా చెఫ్‌గా అరోరా)
Comments
Please login to add a commentAdd a comment