సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) మళ్లీ జీవం పోసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోకెల్లా ఆంధ్రప్రదేశ్ స్వయం సహాయక సంఘాల మహిళలు పొదుపులో అగ్ర స్థానంలో నిలిచారు. ఈ సంఘాలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేశాయి. నిరర్ధక ఆస్తులు తగ్గిపోయాయి. ఇదంతా ఏడాదిన్నర కాలంలోనే జరిగిందని నాబార్డు నివేదిక వెల్లడించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్వయం సహాయక సంఘాల పనితీరుపై నాబార్డు నివేదిక రూపొందించింది. చంద్రబాబు సర్కారు తీరు వల్ల స్వయం సహాయక సంఘాలు నిర్వీర్యం కావడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో ఆ సంఘాలు తిరిగి గాడిలో పడటాన్ని నాబార్డు నివేదిక ప్రతిబింబిస్తోంది.క పేర్కొంది.
రుణాల్లోనూ టాప్
దేశం మొత్తం మీద 2019–20 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసినట్లు నాబార్డు నివేదిక పేర్కొంది. 2018–19 ఆర్థిక ఏడాదిలో 26.98 లక్షల
స్వయం సహాయక సంఘాలకు రూ.58,317 కోట్ల రుణాలు మంజూరు చేస్తే, 2019–20లో 31.46 లక్షల సంఘాలకు రూ.77,659 కోట్లు మంజూరైంది.
► ఒక్క ఏడాదిలోనే ఇంత పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేయడం ఇదే తొలిసారి అని, అత్యధికంగా దక్షణాది రాష్ట్రాల్లోనే రుణాలు మంజూరు చేసినట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బ్యాంకు రుణాల మంజూరు ఎక్కువగా ఉందని, తద్వారా ఆయా రాష్ట్రాల్లో కార్యకలాపాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నట్లు స్పష్టం అవుతోందని నివేదిక పేర్కొంది.
► 2018–19లో దేశ వ్యాప్తంగా ఒక్కో స్వయం సహాయక సంఘానికి సగటున బ్యాంకులు 2.16 లక్షల రుణం మంజూరు చేయగా 2019–20లో 2.47 లక్షల రుణం మంజూరు చేశాయి. ఈ లెక్కన 14.35 శాతం వృద్ధి కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే సగటున ఒక్కో సంఘానికి 3.35 లక్షల రుణం మంజూరు అయింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది 15 శాతం పెరుగుదల. ఏపీలో అయితే ఏకంగా సగటున ఒక్కో సంఘానికి రూ.4 లక్షల రుణం మంజూరైందని నివేదిక స్పష్టం చేసింది.
బాబు సర్కారుకు, ఇప్పటి జగన్ సర్కారుకు ఇదీ తేడా
► స్వయం సహాయక సంఘాల రుణాలు మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత మాఫీ తూచ్ అన్నారు. దీంతో ఆయా సంఘాల మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సంఘాల రుణాలు భారీ ఎత్తున నిరర్థక ఆస్తులుగా మారిపోయాయి. సంఘాలన్నీ నిర్వీర్యం అయిపోయాయి.
► ఈ తరుణంలో 2019 మే లో అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మేనిఫేస్టోలో చెప్పిన మాటలను కొద్ది నెలల కాలంలోనే అమలు చేయడంతో తిరిగి స్వయం సహాయక సంఘాలు మళ్లీ జీవం పోసుకున్నాయి. 2020 మార్చి 31 నాటికి నిరర్థక ఆస్తులు తగ్గిపోయాయని, 2019–20లో సంఘాల క్రెడిట్ లింకేజీ 61.9 శాతం ఉందని నివేదిక తెలిపింది.
సీఎం నిర్ణయం వల్లే ముందడుగు
– పొదుపులో, రుణాలు పొందడంలో రాష్ట్రానికి చెందిన స్వయం సహాయక సంఘాలు ముందుండటానికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలే. గత ఎన్నికల సమయానికి వారికున్న రుణాలను నాలుగు విడతల్లో ఇస్తానని ప్రకటించడమే కాకుండా ఇప్పటికే ఒక విడతలో 87.74 లక్షల మహిళలకు రూ.6,792.21 కోట్లు ఇచ్చారు.
– సకాలంలో రుణాలు చెల్లించిన సంఘాల్లోని 90.37 లక్షల మహిళకు సున్నా వడ్డీ కింద రూ.1,400 కోట్లను చెల్లించారు. దీంతో స్వయం సహాయక సంఘాలు గాడిలో పడి, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
– ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో మహిళలు వ్యాపారం చేసుకుని ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వీలుగా ప్రముఖ సంస్థలతో సర్కారు ఒప్పందాలు చేసుకుని వారికి చేదోడువాదోడుగా నిలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment