Self-help groups
-
మనది మహిళా పక్షపాతి ప్రభుత్వం: సీఎం జగన్
-
మహిళా సాధికారతలో రాష్ట్రం అగ్రగామి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి మహిళ వ్యాపార దక్షతతో ఎదిగేందుకు ఓ అన్నగా, తమ్ముడిగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పొదుపు సంఘాల మహిళల ఖాతాలకు వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకం కింద రూ.1,109 కోట్లను జమ చేసిన సందర్భంగా లబ్ధిదారులైన 1.02 కోట్ల మంది అక్కచెల్లెమ్మలకు శుక్రవారం ఆయన స్వయంగా లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలతో మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. సున్నావడ్డీ కింద ఇప్పుడిస్తున్న రూ.1,109 కోట్లతోపాటు జూన్‌లో ‘వైఎస్సార్ చేయూత’ కింద సుమారు రూ.4,500 కోట్లు, సెప్టెంబర్‌లో ‘వైఎస్సార్ ఆసరా’ ద్వారా రూ.6,792 కోట్లు, జనవరిలో ‘అమ్మఒడి’ ద్వారా రూ.6,500 కోట్లు ఇస్తామన్నారు. ఇలా వివిధ పథకాల కింద 2021–22లో అక్కచెల్లెమ్మలకు సుమారుగా రూ.18,901 కోట్లు అందచేస్తామన్నారు. -
‘సున్నా వడ్డీ నగదు’ జమ చేసిన సీఎం జగన్
-
‘సున్నా వడ్డీ నగదు’ జమ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఇవాళ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 1.02 కోట్ల మందికిపైగా పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు లబ్ధి చేకూరుతుందన్నారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ప్రతి నెలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వరుసగా రెండో ఏడాది కూడా చెల్లించింది. ఆన్లైన్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ శుక్రవారం జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మలకు అండగా నిలబడ్డామని పేర్కొన్నారు. ‘‘మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలబడుతూ వస్తున్నాం. మహిళా సాధికారితను ఆచరణలోకి తీసుకురాగలిగాం. బ్యాంకుల ద్వారా నేరుగా సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నాం. డ్వాక్రా సంఘాల అప్పుపై ఈ ఏడాది వడ్డీ రూ.1109 కోట్లు చెల్లిసున్నాం. మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నాం. అక్కాచెల్లెమ్మలకు వ్యాపారపరంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. మహిళా సాధికారత మా నినాదం కాదు.. మా విధానం. గత ప్రభుత్వం రుణాల పేరుతో మహిళలను మోసం చేసిందని’’ సీఎం వైఎస్ జగన్ అన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా.. మహిళలకు 50 శాతం నామినేటెడ్ పోస్టులు ఇచ్చేలా చట్టం చేశామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మహిళల రక్షణ కోసం ఎక్కడా రాజీ లేకుండా కృషి చేస్తున్నామని.. రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. మహిళల కేసులు వాదించేందుకు ప్రత్యేక పీపీలను నియమించామని పేర్కొన్నారు. 900 కొత్త వాహనాలను కొనుగోలు చేశామన్నారు. మద్య నియంత్రణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. చదవండి: సంక్షేమ పథకాల మొత్తం లబ్ధిదారులకు ఇవ్వాల్సిందే.. అసత్య కథనాలతో ఆందోళన సృష్టించొద్దు -
నేడు అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ నగదు
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ప్రతి నెలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వరుసగా రెండో ఏడాది కూడా ఠంచన్‌గా శుక్రవారం బ్యాంకుల్లో వడ్డీ డబ్బులను జమ చేయనుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 8.71 లక్షల పొదుపు సంఘాలకు 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి నెలాఖరు వరకు బ్యాంకు రుణాలపై ఉన్న వడ్డీ మొత్తాన్ని గతేడాది ఏప్రిల్ 24న చెల్లించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరుసగా రెండో ఏడాది కూడా 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు సంఘాల రుణాలపై ఉన్న వడ్డీ మొత్తం రూ.1,109 కోట్లను సరిగ్గా ఏడాదికి.. శుక్రవారం చెల్లించనున్నారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని సకాలంలో కిస్తీలు చెల్లించిన అక్కచెల్లెమ్మలకు ఆ రుణంపై వడ్డీ మొత్తాన్ని ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. సంఘాల వారీగా వడ్డీ డబ్బులను సీఎం వైఎస్ జగన్ ఆన్లైన్ విధానంలోశుక్రవారం ఆయా సంఘాల రుణ ఖాతాల్లో జమ చేస్తారు. జిల్లా స్థాయిలో ఇన్చార్జి మంత్రులు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 9.34 లక్షల సంఘాలు.. రాష్ట్రవ్యాప్తంగా 9,34,852 పొదుపు సంఘాలకు సంబంధించి 1.02 కోట్ల మంది మహిళలు బ్యాంకుల నుంచి రూ.19,989 కోట్ల రుణాలు తీసుకుని నిబంధనల ప్రకారం కిస్తీలు చెల్లించారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఆయా సంఘాలు సకాలంలో బ్యాంకులకు చెల్లించిన రుణాలపై రూ.1,109 కోట్ల మేర వడ్డీ ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పారదర్శకత కోసం ప్రతి ఊరిలో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించింది. మహిళలకు లేఖ రాసిన సీఎం.. పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ డబ్బులను చెల్లిస్తున్న సందర్భంగా సీఎం జగన్ లేఖలు రాశారు. ప్రతి మహిళను లక్షాధికారిగా, వ్యాపార రంగంలో తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను లేఖలో వివరించారు. లబ్ధిదారులకు శుక్రవారం నుంచి వీటిని పంపిణీ చేస్తారు. చదవండి: (ఎక్కడా అవినీతికి, అలసత్వానికి తావుండరాదు: సీఎం జగన్) -
ఊరూరా మహిళా దుకాణాలు
సాక్షి, రఘునాథపల్లి: మహిళలు స్వశక్తితో ఎదిగేలా బ్యాంకు రుణాలందించడంతో పాటు, స్వయం ఉపాధి పొందేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో మహిళా పొదుపు సంఘాల ద్వారా ప్రత్యేక స్టోర్లు ఏర్పాటు చేయించి వ్యాపారవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. జనగామ జిల్లా కలెక్టర్ నిఖిల చొరవతో రాష్ట్రంలోనే ప్రథమంగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 204 స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) స్టోర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, తొలివిడతగా 60 స్టోర్లు ఏర్పాటు చేశారు. స్టోర్ల ఏర్పాటు, అమ్మకాలు, శిక్షణలో బైరిసన్స్ సంస్థ సహకారం అందిస్తుండటంతో స్టోర్లకు బైరిసన్స్ ఎస్‌హెచ్‌జీ స్టోర్లుగా నామకరణం చేశారు. నిత్యావసర వస్తువులు బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు అందించడమే స్టోర్ల ఏర్పాటు ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఈ స్టోర్లలో సామగ్రి కొనుగోళ్లు, తయారీ, రవాణా, విక్రయం అంతా మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే జరగనుంది. 140 రకాల నిత్యావసర వస్తువులు సాధారణ కుటుంబాలకు నిత్యం ఎన్ని సరుకులు అవసరమన్న అంశంపై సెర్ప్ సిబ్బంది, బైరిసన్స్ ప్రతినిధులు అధ్యయనం చేశారు. ఒక్కో కుటుంబానికి 262 వస్తువులు అవసరమని, ఇందులో 140 అత్యంత అవసరమని గుర్తించారు. వీటితో పాటు ఇతర వస్తువుల క్రయవిక్రయాలపై పొదుపు సంఘాల సభ్యులకు జిల్లా సమాఖ్య ద్వారా శిక్షణ ఇచ్చారు. ఒక్కో మండలంలో 15 నుంచి 20 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇళ్లలో నిత్యం కావాల్సిన పప్పు, ఉప్పు, చక్కెర, బియ్యం, సబ్బులు తదితర సరుకులు విక్రయించనున్నారు. జూట్ సంచుల తయారీ, శారీ డిజైనింగ్, ప్రింటింగ్, సర్ఫ్, ఫినాయిల్, జండుబామ్, హార్ఫిక్, దూప్‌స్టిక్స్, తయారీపై వరంగల్‌కు చెందిన జనశిక్షణ సంస్థాన్ సంస్థ తరఫున శిక్షణ ఇస్తుండగా, వీటిని తయారుచేసి స్టోర్లలో బైరిసన్స్ అగ్రో ఇండియా ఉత్పత్తులతో కలిపి విక్రయించనున్నారు. శిక్షణ పొందిన మహిళలకు రుణాలు శిక్షణ పొందిన మహిళలు వస్తువులు తయారు చేసేందుకు బ్యాంకు, స్త్రీనిధి, సెర్ప్ ద్వారా రుణాలు అందించనున్నారు. ఇంటి వద్ద తయారు చేసిన ప్రతీ వస్తువును డీఆర్డీఓ ఆధ్వర్యాన ఎస్‌హెచ్‌జీ స్టోర్స్‌కు తరలిస్తారు. జిల్లావ్యాప్తంగా ఒకే ధరతో ఓపీఎస్ మిషన్ ద్వారా వినియోగదారులకు కంప్యూటర్ బిల్లులు అందిస్తారు. మార్కెట్ కంటే తక్కువ ధరతో పాటు నాణ్యమైన వస్తువులు స్టోర్లలో లభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళల ఆర్దికాభివృద్ధికి దోహదం మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేలా ప్రోత్సహించడమే స్టోర్ల ఏర్పాటు లక్ష్యం. తయారీ నుంచి విక్రయం వరకు అంతా చైన్ సిస్టం ద్వారా జరుగుతుంది. రఘునాథపల్లి మండలంలో 24 గ్రామాల్లో ఎస్‌హెచ్‌జీ స్టోర్లు ఏర్పాటు చేస్తున్నాం. మహిళలు తయారు చేసిన 15 రకాల ఉత్తత్తులను జిల్లావ్యాప్తంగా ఎస్‌హెచ్‌జీ స్టోర్లకు తరలించి అమ్మకాలు సాగేలా చూస్తాం. తద్వారా 100 మందికి పైగా కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. తయారీదారులతోపాటు విక్రయించే వారికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. – సారయ్య, ఏపీఎం, రఘునాథపల్లి ఇళ్ల నుంచే వస్తువులు తీసుకెళ్తాం డీఆర్డీఏ, సెర్ప్ ద్వారా మహిళా సంఘాల సభ్యులకు రుణాలు అందిస్తాం. వస్తువుల తయారీ, రామెటిరీయల్ ఎక్కడి నుంచి పొందాలన్న దానిపై అవగాహన కల్పిస్తాం. ఇళ్లకు వెళ్లి వస్తువులు సేకరించనుండటంతో మార్కెటింగ్ ఇబ్బందులు కూడా ఉండవు. జిల్లాలోని 11 మండలాల్లో ఎస్‌హెచ్‌జీ స్టోర్లు ఏర్పాటు చేయనున్నాం. కలెక్టర్ నిఖిల మహిళల ఆర్థికాభివృద్ధికి సంబంధించి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. మహిళలతోపాటు వినియోగదారులకూ ఇది ఉపయుక్తంగా ఉంటుంది. – గూడూరు రాంరెడ్డి, డీఆర్డీఓ, జనగామ జిల్లా -
ఏపీ మహిళలే అత్యధికంగా పొదుపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) మళ్లీ జీవం పోసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోకెల్లా ఆంధ్రప్రదేశ్ స్వయం సహాయక సంఘాల మహిళలు పొదుపులో అగ్ర స్థానంలో నిలిచారు. ఈ సంఘాలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేశాయి. నిరర్ధక ఆస్తులు తగ్గిపోయాయి. ఇదంతా ఏడాదిన్నర కాలంలోనే జరిగిందని నాబార్డు నివేదిక వెల్లడించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్వయం సహాయక సంఘాల పనితీరుపై నాబార్డు నివేదిక రూపొందించింది. చంద్రబాబు సర్కారు తీరు వల్ల స్వయం సహాయక సంఘాలు నిర్వీర్యం కావడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో ఆ సంఘాలు తిరిగి గాడిలో పడటాన్ని నాబార్డు నివేదిక ప్రతిబింబిస్తోంది.క పేర్కొంది. రుణాల్లోనూ టాప్ దేశం మొత్తం మీద 2019–20 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసినట్లు నాబార్డు నివేదిక పేర్కొంది. 2018–19 ఆర్థిక ఏడాదిలో 26.98 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.58,317 కోట్ల రుణాలు మంజూరు చేస్తే, 2019–20లో 31.46 లక్షల సంఘాలకు రూ.77,659 కోట్లు మంజూరైంది. ► ఒక్క ఏడాదిలోనే ఇంత పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేయడం ఇదే తొలిసారి అని, అత్యధికంగా దక్షణాది రాష్ట్రాల్లోనే రుణాలు మంజూరు చేసినట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బ్యాంకు రుణాల మంజూరు ఎక్కువగా ఉందని, తద్వారా ఆయా రాష్ట్రాల్లో కార్యకలాపాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నట్లు స్పష్టం అవుతోందని నివేదిక పేర్కొంది. ► 2018–19లో దేశ వ్యాప్తంగా ఒక్కో స్వయం సహాయక సంఘానికి సగటున బ్యాంకులు 2.16 లక్షల రుణం మంజూరు చేయగా 2019–20లో 2.47 లక్షల రుణం మంజూరు చేశాయి. ఈ లెక్కన 14.35 శాతం వృద్ధి కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే సగటున ఒక్కో సంఘానికి 3.35 లక్షల రుణం మంజూరు అయింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది 15 శాతం పెరుగుదల. ఏపీలో అయితే ఏకంగా సగటున ఒక్కో సంఘానికి రూ.4 లక్షల రుణం మంజూరైందని నివేదిక స్పష్టం చేసింది. బాబు సర్కారుకు, ఇప్పటి జగన్ సర్కారుకు ఇదీ తేడా ► స్వయం సహాయక సంఘాల రుణాలు మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత మాఫీ తూచ్ అన్నారు. దీంతో ఆయా సంఘాల మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సంఘాల రుణాలు భారీ ఎత్తున నిరర్థక ఆస్తులుగా మారిపోయాయి. సంఘాలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ► ఈ తరుణంలో 2019 మే లో అధికార పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మేనిఫేస్టోలో చెప్పిన మాటలను కొద్ది నెలల కాలంలోనే అమలు చేయడంతో తిరిగి స్వయం సహాయక సంఘాలు మళ్లీ జీవం పోసుకున్నాయి. 2020 మార్చి 31 నాటికి నిరర్థక ఆస్తులు తగ్గిపోయాయని, 2019–20లో సంఘాల క్రెడిట్ లింకేజీ 61.9 శాతం ఉందని నివేదిక తెలిపింది. సీఎం నిర్ణయం వల్లే ముందడుగు – పొదుపులో, రుణాలు పొందడంలో రాష్ట్రానికి చెందిన స్వయం సహాయక సంఘాలు ముందుండటానికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలే. గత ఎన్నికల సమయానికి వారికున్న రుణాలను నాలుగు విడతల్లో ఇస్తానని ప్రకటించడమే కాకుండా ఇప్పటికే ఒక విడతలో 87.74 లక్షల మహిళలకు రూ.6,792.21 కోట్లు ఇచ్చారు. – సకాలంలో రుణాలు చెల్లించిన సంఘాల్లోని 90.37 లక్షల మహిళకు సున్నా వడ్డీ కింద రూ.1,400 కోట్లను చెల్లించారు. దీంతో స్వయం సహాయక సంఘాలు గాడిలో పడి, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. – ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో మహిళలు వ్యాపారం చేసుకుని ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వీలుగా ప్రముఖ సంస్థలతో సర్కారు ఒప్పందాలు చేసుకుని వారికి చేదోడువాదోడుగా నిలుస్తోంది. -
సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం: డ్వాక్రా మహిళలు
సాక్షి, అమరావతి : సున్నా వడ్డీ పధకం తమ కుటుంబాల్లో వెలుగులు నింపిందని డ్వాక్రా సంఘాల మహిళలు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో వివిధ జిల్లాల నుంచి డ్వాక్రా మహిళలు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా కష్టకఆలంలో కూడా తమకు అండగా నిలుస్తున్న సీఎం జగన్‌కు రుణపడి ఉంటామన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. తామంతా ముఖ్యమంత్రి వెంటే నడుస్తామని, రాష్ట్రానికి సీఎం మార్గనిర్దేశం కావాలని పేర్కొన్నారు. (వైఎస్సార్ సున్నా వడ్డీని ప్రారంభించిన సీఎం) విశాఖపట్నం : సంక్షోభంలో బియ్యం, కందులు, శనగలు ఇచ్చారని, ఇళ్లపట్టాలు కూడా ఇస్తున్నారని మహిళలు వైఎస్ జగన్‌ను ప్రశంసించారు. తమపట్ల సొంత అన్నదమ్ముల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చేయలేదని, రుణాలు, వాటి వడ్డీలు తడిచి మోపిడయ్యాయని వాపోయారు. పాదయాత్రలో నేను విన్నాను.. ఉన్నాను.. అని మాట ఇచ్చారని, ఆ మాట ప్రకారం మమ్మల్ని ఆదుకుంటున్నారని ఆనందరం వ్యక్తం చేశారు. ఎప్పుడూ ముఖ్యమంత్రి వెంటే ఉంటామని, వైఎస్ జగనేముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాస్క్‌ల తయారీ ఎలా ఉందని విశాఖ కలెక్టర్‌ను ఆరా తీశారు. యుద్ధ ప్రాతిపదికన తయారు అవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. మాస్క్‌లను ముందు రెడ్జోన్లలో పంపిణీ ప్రారంభించాలని కలెక్టర్‌కు వైఎస్ జగన్ సూచించారు. (గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ.. 22 మంది ప్రాణాలు తీసింది.. !) కర్నూలు: దివంగత వైఎస్సరా్ వడ్డీ భారం తగ్గించడానికి పావలా వడ్డీ ప్రారంభించారని మహిళలు తెలిపారు. తమ దురదృష్టం కొద్దీ ఆయన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జీరో వడ్డీ, రుణమాఫీ లేదని వాపోయారు. పాదయాత్రలో తమ కష్ట సుఖాలను తెలుసుకొని, తండ్రికి తగ్గ తనయుడిగా సున్నా వడ్డీ పథకం తీసుకు వచ్చారని హర్షం వ్యక్తంచేశారు. ( నెల్లూరు : గత ప్రభుత్వ సమయంలో మమ్మల్ని మీటింగుల కోసం తిప్పుకున్నారని డ్రాక్రా సంఘాల మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట నిలబెట్టుకున్నారని, కరోనా సమయంలో ప్రజలను ఆదుకుంటున్న తీరు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్ మార్గనిర్దేశం కొనసాగాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. (కరోనా కొత్త లక్షణం: పాదాలు, బొటనవేలు వాపు..! ) కడప జిల్లా : కరోనా వచ్చి, నానా కష్టాలు తెచ్చిందని, ఈ సమయంలో సున్నా వడ్డీ వస్తుందా? లేదా? అని సందేహించామని తెలిపారు. అయినా ఆర్థిక భారాన్ని భరిస్తూ తమకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఆదాయం లేని సమయంలో కూడా తమకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా వల్ల వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయం తమను ఆర్థికంగా చాలా ఆదుకుందని అన్నారు. ప్రకాశం జిల్లా : అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. వాలంటీర్లు చాలా సేవ చేస్తున్నారు. వేయి రూపాయలు, మూడుసార్లు రేషన్ ఇవ్వడం చాలా మంది నిర్ణయాలు. మాస్క్‌ల తయారీ ద్వారా మహిళలకు ఉపాధి కల్పించడం హర్షణీయం. అలాగే అరటిలాంటి ఉత్పత్తులను మహిళా సంఘాల ద్వారా చేయిస్తున్నారు. దీనివల్ల ఉపాధి పొందుతున్నాం అని ప్రకాశం జిల్లా డ్రాక్రా మహిళలు తమ సంతోషాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పంచుకున్నారు. (రౌడీ షీటర్ ఎల్లం గౌడ్ దారుణ హత్య) తూర్పుగోదావరి : వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన డ్వాక్రా సంఘాల మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారు. సుదీర్ఘ పాదయాత్రలో అక్కచెల్లెమ్మలకు భరోసా ఇస్తామన్నారు. అనుకున్నట్టే మాకు అండగా నిలుస్తున్నారు. వైఎస్సార్ పావలా వడ్డీ కింద రుణాలు ఇస్తున్నారు. మమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చేస్తున్న యత్నాలు హర్షణీయం. కష్టకాలంలో కూడా మాకు అండగా ఉంటున్నారు. కరోనా సమయంలో కూడా ఆదుకుంటున్నారు. మా కుటుంబాల్లో మాకు గౌరవం పెరిగింది. అవ్వాతాతలకు వాలంటీర్ల ద్వారా సేవ చేయిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా గొప్ప ఆలోచనను అమల్లోకి తీసుకు వస్తున్నారు. వాళ్లు దేవుళ్లులా సహాయం చేస్తున్నారు. గతంలో పెన్షన్‌కోసం అవ్వాతాతలు ఎంతో ఎదురుచూపులు చూసేవారు. ఉదయం 8గంటల్లోపే మీరు పెన్షన్ అందించేలా చూస్తున్నారు. ప్రతి విషయంలో మాకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.(ఆ సీరియల్ మళ్లీ వచ్చేస్తోంది) ‘దిశ చట్టాన్ని తీసుకు వచ్చిమహిళలకు పూర్తి రక్షణ ఇస్తున్నారు. యావత్ మహిళా లోకం మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నవరత్నాలతో అందరికీ మంచి జరుగుతోంది. పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బందులు లేకుండా చేశారు. అందరం రుణపడి ఉంటున్నాం. కుటుంబంలో పెద్ద దిక్కై కరోనా సమయంలో మూడు సార్లు రేషన్ ఇస్తున్నారు. వేయి రూపాయలు కూడా ప్రతి కుటుంబానికీ ఇచ్చారు. గర్వపడేలా చేస్తున్నారు. అని తమ మనసులోని కృతజ్ఞతను తెలిపారు. రూ.100 కే పండ్లు కార్యక్రమాన్ని ప్రారంభించామని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి తెలిపారు. పూలరైతులను ఆదుకునేందుకు కార్యక్రమం చేపట్టామని, పండ్లతోపాటు పూలు కూడా ఉచితంగా ఇస్తున్నామని వెల్లడించారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. (కరోనాపై ఆనాడే స్పందించి ఉంటే..) -
వైఎస్సార్ సున్నా వడ్డీని ప్రారంభించిన సీఎం
-
జులై 8న 27 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు
సాక్షి, తాడేపల్లి: కరోనా కష్ట సమయంలో కూడా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకాన్ని తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా బటన్ నొక్కి నగదు బదిలీ చేశారు. ఈ బటన్ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్ఎంఎస్ ద్వారా ఒకే విడతన డబ్బులు జమ అయ్యాయి. 90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ అయ్యాయి. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుంచి డ్వాక్రా మహిళలతో సీఎం మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. జులై 8 వైఎస్సార్ జయంతి రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని వెల్లడించారు ఇళ్ల పట్టాలతో పాటు ఉచితంగా ఇల్లు కూడా కట్టించి ఇస్తామన్నారు. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50% అక్కచెల్లెమ్మలకు ఇవ్వాలని గొప్ప చట్టం తెచ్చామని పేర్కొన్నారు. ‘‘కఠినంగా శిక్ష పడేలా దిశ చట్టాన్ని తీసుకొచ్చాం.13 దిశ పోలీస్స్టేషన్లు, జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు తీసుకొచ్చాం. 13 దిశ పోలీస్స్టేషన్లు, జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు తీసుకొచ్చాం. త్వరలో రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నాం.ప్రతి గ్రామ సచివాలయంలో ఒక మహిళా పోలీస్‌ను నియమించాం..11వేలకు పైగా మహిళా పోలీసులను నియమించి ఉద్యోగాలు ఇచ్చాం. గ్రామ సచివాలయాల్లో 8 మంది మహిళా మిత్రలను ఏర్పాటు చేశామని’’ సీఎం పేర్కొన్నారు. వసతి దీవెన కింద 12 లక్షల మందికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నామని.. గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా.. మార్చి 31 వరకు ఉన్న బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని సీఎం తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి మూడు నెలల సంబంధించి.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నేరుగా తల్లుల అకౌంట్ల్లో జమ చేస్తామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.(భవిష్యత్తులో కూడా మేలు జరగాలి: సీఎం జగన్) 2016 నుంచి సున్నా వడ్డీ పథకం నిలిచిపోయిందని.. కరోనా వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా సున్నా వడ్డీ పథకం ప్రారంభించామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ప్రతి గ్రూపునకు రూ.20 వేల నుంచి రూ.40వేల వరకు మేలు జరుగుతుందన్నారు. ‘‘ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు..రూ.3లక్షల పరిమితి వరకు ఆరు జిల్లాల్లో 7% వడ్డీకి రుణాలు ఇస్తున్నారు. మిగిలిన 7 జిల్లాల్లో డ్వాక్రా మహిళలకు సుమారు 13 శాతం వడ్డీ భారం వేస్తున్నారు. సున్నా వడ్డీ అమలుకు 7-13 శాతం వరకు వడ్డీని ప్రభుత్వమే చెల్లించాలి. ప్రతి పథకంలోనూ అక్కచెల్లెమ్మలకే పెద్దపీట వేశామని’’ సీఎం పేర్కొన్నారు. తల్లుల చేతిలో అక్కచెల్లెమ్మల చేతిలో డబ్బులు పెడితే.. పూర్తిగా సద్వినియోగం అవుతుందని తన భావన అని సీఎం తెలిపారు. 82 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. పిల్లల చదువులు బాగుండాలనే ఉద్దేశంతో నాడు-నేడు కార్యక్రమం చేపట్టామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
పండగకు ‘పావలా’!
నేలకొండపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్వయం సహాయక సంఘాలపై దయతలిచింది. మూడేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసి న సభ్యులపై పండగ పూట కరుణ చూపింది. జిల్లాలోని 24,780 స్వయం సహాయక సంఘాలకు రూ.56.27కోట్ల పావలా వడ్డీ రుణాలను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఐకేపీ సిబ్బంది నగదును పొదుపు ఖాతాల్లో జమచేసే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే రుణాలను పొదుపు ఖాతాలో జమ చేస్తుండ డంపై కొందరు సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గ్రూపులో అప్పులు ఉన్న వారి కి బ్యాంకు నిర్వాహకులు ఆ మొత్తంలో కోత విధించి.. మిగతాది చెల్లించే అవకాశం ఉంటుంది. దీంతో తమకు రుణం పూర్తిస్థాయిలో అందదని ఆ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆనందం.. ఆవేదన.. వాస్తవానికి ప్రతి ఏడాది పావలా వడ్డీ రుణాలను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కానీ.. 2015 నుంచి ఇప్పటివరకు వాటిని మంజూరు చేయలేదు. ప్రస్తుతం మూడేళ్ల రుణాలను ఒకేసారి విడుదల చేసింది. అది కూడా దసరా సమయంలో మంజూరు చేయడంతో సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండగను ఘనంగా జరుపుకోవచ్చని ఆనందపడుతున్నారు. అయితే ఐకేపీ యంత్రాంగం తీసుకున్న నిర్ణయంతో కొందరు సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన రుణాలను ఐకేపీ సిబ్బంది సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే అప్పు తీసుకొని ఉన్న సభ్యులకు బ్యాంకు నిర్వాహకులు ఆ మొత్తాన్ని చెల్లించే అవకాశం ఉండదు. బ్యాంకుకు చెల్లించాల్సిన అప్పు పోను మిగిలిన మొత్తాన్ని సభ్యులకు అందజేస్తారు. దీంతో రుణాలను ఖాతాల్లో జమ చేయడం వల్ల తమకు ఎలాంటి లాభం ఉండబోదని, చెక్కు రూపంలో గానీ, నగదు రూపంలో గానీ అందజేయాలని అప్పు తీసుకున్న సంఘాల సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.లక్ష్యానికి మించి.. స్వయం సహాయక సంఘాలకు లింకేజీ రుణాల మంజూరులో జిల్లా ఐకేపీ యంత్రాంగం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది 8,267 సంఘాలకు గాను.. రూ.169.40కోట్ల రుణాలు లక్ష్యం కాగా.. అధికారులు దానికి మించి మంజూరు చేశారు. సెప్టెంబర్ నాటికే రూ.179.07కోట్లను సంఘాలకు అందజేశారు. లింకేజీ రుణాల మంజూరుతోపాటు.. వసూళ్లలో కూడా జిల్లా యంత్రాంగం ప్రథమ స్థానంలో ఉండటం గమనార్హం. ఖాతాల్లో జమ అవుతున్నాయి.. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో అర్హత సాధించిన సంఘాలకు మంజూరైన రుణాలు వారి ఖాతాలో జమ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లకు సంబంధించిన పావలా వడ్డీ రుణాలను మంజూరు చేసింది. దసరా పండగ ముందు విడుదల కావడంతో సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. – ఆంజనేయులు, ఐకేపీ, డీపీఎం నగదు ఇస్తే బాగుండేది.. పావలా వడ్డీ రుణాలను బ్యాంకు ఖాతాల్లో కాకుండా నేరుగా నగదు రూపంలో గానీ, చెక్కు రూపంలో గానీ ఇస్తే బాగుండేది. ఖాతాల్లో జమ చేయడం వల్ల బ్యాంకు వారు ఇదివరకు తీసుకున్న అప్పు కింద ఆ మొత్తాన్ని తీసుకుంటారు. అందుకే సభ్యులకు నగదు రూపంలో అందించే ఏర్పాట్లు చేయాలి. – బెల్లం లక్ష్మి, సంఘం సభ్యురాలు సభ్యులు డ్రా చేసుకుంటున్నారు.. పావలా వడ్డీ రుణాలు సంఘాల వారి ఖాతాలో జమ అయ్యాయి. సభ్యులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఒక్క నేలకొండపల్లిలోనే 150 సంఘాలకు పావలా వడ్డీ రుణాలు జమ అయ్యాయి. దసరా సమయంలో రుణాలు రావడం ఆనందంగా ఉంది. – ఆర్.పార్వతీబాయి, గ్రామ దీపిక, నేలకొండపల్లి -
మెడపై మిత్తి!
వడ్డీ బకాయిల కోసం మహిళల ఎదురుచూపులు రెండేళ్లుగా విడుదలకాని నిధులు నెలనెలా బ్యాంకుల్లో చెల్లిస్తున్నఎస్హెచ్జీల సభ్యులు హన్మకొండ : వడ్డీ లేని రుణాల పథకం ప్రారంభించిన వైఎస్.రాజశేఖరరెడ్డి ఆ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేసి ఉమ్మడి రాష్ట్రంలోని మహిళలకు పెద్దన్నగా నిలిచారు. అయితే, ప్రస్తుతం రుణాలకు సంబంధించి వడ్డీ నిధులను రెండేళ్లుగా విడుదల చేయని ప్రభుత్వం మహిళలకు ఎదురుచూపులు మిగిలేలా చేస్తోంది. స్త్రీ నిధి కింద రుణాలు తీసుకునే స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు.. ప్రభుత్వం వడ్డీ నిధులు విడుదల చేస్తుందన్న ఆశతో నెలనెలా బ్యాంకుల్లో అసలుతో పాటు కిస్తీల రూపంలో కడుతున్నారు. కానీ రెండేళ్లుగా వడ్డీ నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వారి ఆశలు అలాగే మిగిలిపోతున్నాయి. ఎదురుచూపులే.. వరంగల్ రూరల్ జిల్లాలోనే మొత్తం 15మండలాల్లో 10,529 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో 1,27,345 మంది సభ్యులు ఉండగా స్త్రీ నిధి రుణాలు తీసుకున్నారు. అయితే, రుణాలకు సంబంధించి జనరల్, బీసీ సంఘాలకు సంబంధించి 2015 జనవరి నుంచి అంటే ఇప్పటి వరకు 24నెలలుగా అసలుతో పాటు నెలనెలా వడ్డీని కిస్తీల రూపంలో బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత వడ్డీ డబ్బులు ప్రభుత్వం ఇప్పటివరకు సంఘాల ఖాతాల్లో జమ చేయలేదు. ఇక ఎస్సీ, ఎస్టీ సంఘాలకు సంబంధించి 2015 జూన్ నుంచి అంటే గత 18 నెలల పాటు వడ్డీ వారి ఖాతాల్లో ప్రభుత్వం ఇప్పటివరకు జమ చేయలేదు. ఇవన్నీ కలిపి రూ.7,22,093 వరకు విడుదల కావాల్సి ఉంది. ఈ నిధులను ప్రభుత్వం నెలనెలా విడుదల చేయకపోవడంతో స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఎదురుచూపులే మిగిలాయి. నీరుగారుతున్న లక్ష్యం మహిళలు ఆర్థికంగా> స్వావలంబన సాధించాలన్న ఆలోచనతో వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నారు. కానీ ప్రభుత్వం వడ్డీ నిధులు సక్రమంగా జమ చేయకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారే పరిస్థితి ఎదురవుతోంది. అసలు వడ్డీ బకాయి డబ్బులు వస్తాయా, వస్తే ఎంతమేరకు వస్తాయి, అవి ఎంతకాలానికి వస్తాయనే విషయమై స్వయం సహాయక మహిళల్లో గందరగోళం నెలకొంది. -
ఊరంతా ఒకే కుటుంబం
మన ఊరు అదేదో సినిమాలో ‘మానవా మానవా’ అని పిలిస్తే ‘మానను గాక మానను’ అంటాడో తాగుబోతు. ఆ ఊళ్లో ఒకప్పుడు అలాంటి దృశ్యాలు ఎటు చూసినా కని పించేవి. వేళా పాళా లేకుండా మందు బాబులు ఊరి మీద పడేవాళ్లు. పనీ పాటా మానేసి మందులోనే మునిగి తేలేవారు. కానీ ఇప్పుడు అక్కడ మందు వాసనే రావట్లేదు. మందు అన్న పేరే వినబడ ట్లేదు. ఉన్నట్టుండి ఆ గ్రామంలో అంత మార్పు ఎలా వచ్చింది?! మన దేశంలోని అనేక కుగ్రామాలలో లాగే మహారాష్ట్రలోని కతేవాడిలో కూడా సరియైన రోడ్లు ఉండేవి కాదు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా ఉండేది కాదు. మద్య పానం, ధూమపానం, జూదం మొదలైన వ్యసనాలు గ్రామాన్ని పట్టి పీడించేవి. అయితే ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్’ ఈ ఊరిని దత్తత తీసుకున్న తరువాత పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చింది. దుర్వ్యసనాల గ్రామం ఇప్పుడు ఆదర్శ గ్రామంగా ప్రశంసలందుకుంటోంది! ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్’ వారు అడుగుపెట్టేసరికి కతేవాడి పరిస్థితి భయంకరంగా ఉంది. గ్రామంలో డెబ్భై శాతం మంది మద్యానికి బానిసలై పోయారు. పని చేయకపోవడంతో సంపా దన ఉండేది కాదు. ఎక్కడ చూసినా పేద రికం. దానికి తోడు ఊళ్లో ఏ సౌకర్యాలూ ఉండేవి కాదు. ఈ పరిస్థితిని మార్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఊరిలో చాలా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఏర్పాటయ్యాయి. వీటిలో గ్రామస్తులందరినీ సభ్యులుగా చేర్చుకున్నారు. వారికి మద్యాన్ని దూరం చేశారు. బాధ్యతగా ఎలా నడుచుకోవాలో నేర్పారు. దాంతో ఒకప్పుడు గ్రామంలో మద్యం మీద రోజుకు వంద నుంచి రెండు వందల రూపాయల వరకు ఖర్చు చేసిన వాళ్లు కాస్తా ఇప్పుడు ఆ మొత్తాన్నీ ఇంటి కోసం, ఊరి కోసం వినియోగిస్తున్నారు. అలాగే ‘యస్హెచ్జీ’ల పుణ్యమా అని గ్రామంలో వడ్డీవ్యాపారం తగ్గిపోయింది. గ్రామస్తుల ఆర్థికస్థాయి మెరుగుపడింది. ప్రతి వ్యక్తీ స్థానిక బ్యాంకులో కొంత సొమ్మును డిపాజిట్ చేస్తున్నారు. ప్రతి ఇంటా సంపద చేరింది. ప్రతి కుటుంబంలో సంతోషం నెలకొంది. అందరి ఇళ్లలోనూ మరుగుదొడ్లతో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. ఊరిలో చక్కని రోడ్లు ఉన్నాయి. విద్యుత్ ఉంది. డ్రైనేజీ వ్యవస్థ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల్లో ఐకమత్యం ఉంది. ‘మద్యం ముట్టను’, ‘పొగ తాగను’ అని గ్రామస్తులందరూ ప్రమాణం చేశారు. ఊరి యువకులు ఒక భారీ ర్యాలీ నిర్వహించి ఇళ్లు, దుకాణాల్లో ఉన్న సిగరెట్లు, చుట్టలు, బీడీలు, మద్యం అన్నిటినీ సేకరించి దహనం చేశారు. అందుకే ఇప్పుడు కతేవాడిలో మద్యం దుకాణాలుకానీ, తాగేవాళ్లు కానీ కనిపించరు. శుభ్రత విషయంలో కూడా కతేవాడి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. గ్రామస్తులంతా కలిసి వీధులు, బహిరంగ ప్రదేశాలు, దేవాలయాలు మొదలైన ప్రదేశాలను శుభ్రం చేస్తుంటారు. భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కూడా విజయవంతం అయింది. ఈ అభివృద్ధికి గాను ప్రభుత్వం నుంచి ‘నిర్మల్ గ్రామ్ అవార్డ్’ను, ‘సంత్ గాడ్గెబాబా’ అవార్డ్ కూడా అందుకుంది కతేవాడి. ఇదంతా ఎలా సాధ్యపడింది అని అడిగితే... ‘‘ఒకప్పుడు ఊళ్లో మా ఇల్లుంది అనుకునేవాళ్లం. ఇప్పుడు ఊరినే మా ఇల్లు అనుకుంటున్నాం. ఊరు అభివృద్ధి చెందితే మేము అభివృద్ధి చెందినట్లే కదా’’ అని చెప్తారు ఆ గ్రామస్తులు ఉద్వేగంగా. వారిని ఆదర్శంగా తీసుకుంటే ప్రతి గ్రామమూ ఆదర్శ గ్రామమౌతుంది! కతేవాడిలో చెప్పుకోదగ్గ మరో విశేషం ‘దాన్ పేటి’. షాప్కీపర్ లేకుండా షాప్‌ను నడిపే పథకం ఇది. ఈ షాప్‌లో తక్కువ ధరకే నాణ్యత కలిగిన సరుకులు ఉంటాయి. ప్రజలు తమకు కావలసినవి తీసుకొని దాని వెల ఎంతో ఆ సొమ్మును ‘దాన్ పేటీ’ అనే క్యాష్‌బాక్స్‌లో వేస్తారు. దాన్ని ఊరి బాగుకై వినియోగిస్తారు. -
చేతులెత్తేశారు!
- ఇసుక విక్రయాల్లో అధికార యంత్రాంగం విఫలం అనంతపురం సెంట్రల్ : స్వయం సహాయక సంఘాల ద్వారా ఇసుక విక్రయం నిర్ణయం అక్రమార్కులకు వరంగా మారింది. నైపుణ్య లేమి కారణంగా డ్వాక్రా మహిళలు... రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు ఇసుకరీచ్లపై పట్టు సాధించలేకపోతున్నారు. అధికార పార్టీ నాయకులకు ఉన్నతాధికారులు సైతం జీ హుజూర్ అంటుండడంతో ప్రభుత్వ రీచ్‌ల నుంచే ఇసుక అక్రమంగా తరలిపోతోంది. శింగనమల మండలంలోని ఉల్లికల్లు రీచ్‌లో రూ. 43 లక్షల విలువైన ఇసుకను దారిమళ్లించారని అనంతపురం ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ విచారణలో తేలడంతో అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కుంభకోణంపై పోలీసులు, విజిలెన్స్ అధికారులు సమగ్ర విచారణ జరుపుతుండగానే.. కణేకల్లు మండలంలో ఇసుకరీచ్ బాగోతం తెరపైకి వచ్చింది. గతంలో వెలుగులోకి వచ్చిన అన్ని ఇసుక కుంభకోణాల్లోనూ అధికారపార్టీకి చెందిన చోటా నాయకులు తెరపైకి వచ్చారు. కణేకల్లు ఘటనలో మాత్రం ఏకంగా ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు పేరు తెరపైకి వస్తోంది. జిల్లాలో నాణ్యమైన ఇసుక రీచ్‌లన్నీ టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ఉల్లికల్లు, పెద్దపప్పూరు మండలం దేవుని ఉప్పలపాడు, తాడిమర్రి మండలం చిన్న చిగుళ్లరేవు, కణేకల్లు మండలం గంగులాపురం రీచ్‌లలో నాణ్యమైన ఇసుక దొరుకుతోంది. ఇవి స్థానిక ప్రజాప్రతినిధుల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. అధికారికంగా ఒక ట్రిప్పు తోలితే అనధికారికంగా మూడు, నాలుగు ట్రిప్పుల ఇసుక తరలిపోతోంది. రాత్రి సమయాల్లో ఏకంగా జేసీబీలను పెట్టి టిప్పర్ల సహాయంతో కర్ణాటకకు తరలిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ ఏర్పాటు చేసిన 28 రీచ్‌ల ద్వారా 2.28 లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక అమ్మకాలు చేపట్టారు. ప్రభుత్వానికి రూ. 10.91 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే స్థాయిలో అక్రమార్కులు ఇసుకను లూటీ చేశారు. 26వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మిన ఉల్లికల్లు రీచ్‌లోనే రూ. 43 లక్షలు లూటీ అయినట్లు విచారణలో తేలింది. జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా కర్ణాటక సరిహద్దు మండలాల్లోని రీచ్‌ల నుంచి రూ.కోట్లు విలువజేసే లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక దారి మళ్లిందని స్పష్టమవుతోంది. ఇసుకరీచ్‌లను పర్యవేక్షించే డీఆర్డీఏ- వెలుగు ప్రాజెక్టు అధికారులు బొమ్మల్లా తయారయ్యారు. పత్రికలలో వరుస కథనాలు వస్తే తప్పా వారిలో చలనం ఉండడం లేదు. రెగ్యులర్ ప్రాజెక్టు డెరైక్టర్ లేకపోవడం కూడా ఇసుకరీచ్‌లు అధ్వానంగా తయారవడానికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. జిల్లాలో ఇసుక రీచ్‌ల పరిస్థితి - తాడిమర్రి మండలం చిన్న చిగుళ్లరేవు(సీసీరేవు) రీచ్ నుంచి ఇసుకను స్థానిక ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు బెంగళూరు, బళ్ళారికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. - బ్రహ్మసముద్రం మండలం బుడిమేపల్లి ఇసుకరీచ్‌ను మూసేయించేందుకు ముఖ్య ప్రజాప్రతినిధి కుమారుడు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచా రం. ఇక్కడి నుంచి ఇసుకను అక్రమంగా తరలించాలంటే బ్రహ్మసముద్రం, గుమ్మఘట్ట, రాయదుర్గం పోలీస్ స్టేషన్లు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అదే మండలంలోని యనకల్లు, పీతకల్లు గ్రామాల్లో ఇసుకరీచ్‌లను ప్రారంభించాలని పట్టుబడుతున్నారు. - కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇసుక అక్రమ వ్యా పారాన్ని పోలీసులే దగ్గరుండి చేయిస్తున్నారన్న విమర్శలున్నాయి. - గోరంట్లలో మండల స్థాయి ప్రజాప్రతినిధి భర్త చి త్రావతి నది నుంచి ఇసుకను తోడి పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా రోజూ బెంగళూరుకు తరలిస్తున్నారు. దాదాపు 200లోడుల ఇసుకను గోరంట్ల మండల కేంద్రానికి సమీపంలో డంప్ చేశారు. ఈ విషయం అందరికీ తెలిసినా అక్కడికి వెళ్లేందుకు అధికారులు సాహసించడం లేదు. -
మహిళాభ్యుదయమే మా లక్ష్యం
స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తాం వడ్డీలేని రుణాల పరిమితి రెట్టింపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటన రంగారెడ్డి జిల్లా: స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేస్తామని, మహిళల ఆర్థికాభివృద్దే తమ ప్రభుత్వ లక్ష్యమ ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటిం చారు. గత ప్రభుత్వాలు మహిళా సంఘాలకు రూ.5 లక్షల వరకు మాత్రమే వడ్డీలేని రుణాలు ఇచ్చాయని, దీన్ని తమ ప్రభుత్వం రెట్టింపు చేసిందని సోమవారం ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పేర్కొన్నారు. ఇకపై అర్హత ఉన్న ప్రతి సంఘానికి రూ.10 లక్షల వర కు రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై వడ్డీ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. స్వయంసహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) రుణపరిమితిపై త్వరలో సచివాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశానికి అధికారులే కాకండా గ్రామ సంఘం నుంచి ఇద్దరు మహిళలను ఆహ్వానిస్తామని చెప్పారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా 150 మందిని ఆహ్వానించి, వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే రుణ పరిమితి మార్గదర్శకాలు రూపొందిస్తామని పేర్కొన్నారు. లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తూ రైతులకు ఎంతగానో సహకరిస్తున్నారని మహిళా సంఘాలను సీఎం ప్రశంసించారు. వానలు పరుగెత్తుకు రావాలి.. తెలంగాణ ప్రాంతంలో వర్షపాత లోటు తీవ్రంగా ఉందని, ఇందుకు గత ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యమే కారణమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘తెలంగాణలో బ్రహ్మాండమైన వృక్ష సంపద ఉండేది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం అడవుల్లో భారీగా టేకు చెట్లుండేవి. ఆంధ్రపాలనలో ఈ చెట్టన్నీ కొట్టుకుతిన్నారు. దీంతో ఇక్కడ వర్షపాతం గణనీయంగా పడిపోయింది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే మొక్కలు నాటాలి. ఒక్కో గ్రామానికి 40 వేల చెట్లు నాటేలా తెలంగాణ హరిత హారాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. వచ్చే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 120 కోట్ల మొక్కలు నాటడమే హరితహారం లక్ష్యం. దీనికి ప్రతి తెలంగాణ బిడ్డ సహకరించాలి. పచ్చదనం నిండితే వానలు ఉరుకొస్తయ్. చైనాలో ప్రజలంతా ఉద్యమంలా చెట్లు నాటి ఎడారి విస్తీర్ణాన్ని తగ్గించారు. నాగార్జునసాగర్‌లో జరిగిన సమావేశాల తర్వాత కొందరు రైతులు వచ్చి కోతుల బెడద భరించలేకపోతున్నామని చెప్పారు. వాటి నివాసాలైన వృక్ష సంపదను కొల్లగొడితే అవి మనమీద పడుతున్నయ్. వాళ్లకు కూడా చెట్టు నాటాలని చెప్పా.’ అని వివరించారు. నా కార్యసాధనపై ఆత్మవిశ్వాసం ఉంది: కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు తప్పకుండా అమలు చేస్తామని, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు, వ్యవసాయానికి పూర్తిస్థాయి విద్యుత్ ఇస్తానని, లేదంటే ఓట్ల డగ బోమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ‘నేను చేసే పనులు, సాధించే విధానంపై నాకు పూర్తిగా నమ్మకముంది. కేసీఆర్ మాటిస్తే నూరుశాతం అమలు చేస్తడు.’ అని పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్నీ త్వరగా పూర్తిచేసి రైతుల చిరకాల వాంఛను నెరవేరుస్తామన్నారు. సమావేశంలో డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, మంత్రులు హరీశ్, మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ఎంపీ బూరనర్సయ్య, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, సుధీర్‌రెడ్డి, సంజీవరావు, యాదయ్య పాల్గొన్నారు. -
అతివకు అభయం
మహిళల ప్రగతి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అతివల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఆపద్భాంధవుడిలా చేయూతనందిస్తోంది. ఆడవాళ్ల కోసం ఐకేపీ ఆధ్వర్యంలో అనేక పథకాలు అమలు చేస్తూ అతివకు అభయమిస్తోంది. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు వర్తించే పథకాల ప్రయోజనాలు.. వాటి దరఖాస్తు విధానంపై సాక్షి కథనం. * ఐకేపీ ఆధ్వర్యంలో అనేక పథకాలు * లబ్ధి పొందితేనే ఆర్థిక ప్రగతి జిల్లాలో మొత్తం 29,919 స్వయం సహాయ సంఘాలు ఉన్నాయి. ఇందులో 2,99,190 మంది సభ్యులుగా ఉన్నారు. ఐకేపీ అర్బన్‌లోని 7 మున్సిపాలిటీలో 7,019 స్వయం సహాయక సంఘాలు ఉండగా ఇందులో 70,190 మంది, ఐకేపీ రూరల్ పరిధిలో 22,919 సంఘాలు ఉండగా ఇందులో 2,29,000 మంది సభ్యులు ఉన్నారు. వీరికి వర్తించే పథకాలు ఇలా ఉన్నాయి. బంగారుతల్లి పథకం నానాటికి తగ్గిపోతున్న ఆడపిల్లల శాతం పెరగాలనే ఉద్దేశంతో 2013 జూలై 2 నుంచి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం బంగారుతల్లి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రస్తుతం అమలులోనే ఉంది. 2013 మే 1 తర్వాత పుట్టిన ఆడబిడ్డలకు ఇది వర్తిస్తుంది. ఇద్దరు ఆడపిల్లల వరకే లబ్ధి చేకూరుతుంది. రెండో కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా అర్హులే. తల్లి బిడ్డ ఫొటో, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్‌కార్డు, యూఐడీ, తల్లి, తండ్రి రేషన్‌కార్డు పత్రాలతో సంబంధిత మండల సమాఖ్య కార్యాయాల్లోని ఏపీఎంకు దరఖాస్తు చేసుకోవాలి. ధ్రువీకరణ పత్రాలన్ని వాస్తమని నిర్ధారించిన తర్వాత వెబ్సైట్లో వివరాల్ని నమోదు చేస్తారు. తర్వాత బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఆపన్నహస్తం వికలాంగ మహిళలకు కూడా ఐకేపీ చేయూతనిస్తుంది. కాళ్లు చేతులు చచ్చుబడి ఎటూ కదల్లేని నిర్జీవ స్థితిలో ఉన్నవారికి మూడు చక్రాల సైకిళ్లు, దృష్టి వినికిడి లోపాలు ఉన్నవారికి వైకల్యానికి సంబంధించిన యంత్రాలు అందజేస్తారు. వైకల్యానికి అవసరమైన శస్త్ర చికిత్సలు నిర్వహించి ఇతరులతో పోటీపడేలా చూస్తున్నారు. వికలాంగులకు క్రీడలు నిర్వహించటం, వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు చేపడుతున్నారు. వికలాంగులతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయించి వారికి తక్కువ వడ్డీతో రుణ సదుపాయం క ల్పిస్తున్నారు. స్త్రీ నిధి..కొండంత అండ స్త్రీ నిధి పథకం అవసరాలకు పెన్నిధి లాంటిది. స్వయం సహాయ సంఘాల్లోని మహిళలకు కొండంత అండగా నిలుస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ నిధి ద్వారా తక్షణ సహాయం పొందవచ్చు. బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండా సంఘం పని చేసే కార్యాలయం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్యం, వివాహం, పిల్లల చదువులు తదితర అవసరాలకు రూ. 20 వేల వరకు రుణం అందజేస్తారు. సంఘంలో ఎంతమంది సభ్యులున్నా ఆరుగురు సభ్యులకు మాత్రమే రుణం అందుతుంది. ఈ రుణానికి పావలా వడ్డీ వర్తిస్తుంది. బీమాతో పేదలకు ధీమా ఐకేపీ ద్వారా నిరుపేదలు అధికంగా లబ్ధిపొందే పథకాల్లో బీమా పథకం ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు వేలకు వేలు కిస్తులు చెల్లించి ప్రత్యేకంగా బీమా చేయించుకోలేని పరిస్థితి. ఐకేపీలోని అభయహస్తం, ఆమ్ఆద్మీ యోజన, జనశ్రీబీమా పథకాలు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తున్నాయి. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ఈ పథకం కిందరూ.75 వేల వరకు బీమా చెల్లిస్తున్నారు. ఇందుకు రూ.15 నుంచి రూ..100 వరకు ప్రీమియం చెల్లిస్తే వారు బీమాకు అర్హులవుతారు. సహజ మరణం అయినా, ప్రమాదంలో మృతి చెందినా ఈ బీమా వర్తిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏపీఎంల ద్వారా సంఘ అధ్యక్షుల ద్వారా ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అభయహస్తం స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన వారు అభయహస్తంతో సభ్యత్వం ఉన్నవారు 60 ఏళ్లు నిండితే నెలకు రూ.500 చొప్పున పింఛన్ పొందవచ్చు. ఏటా ఒక్కో సభ్యురాలు వాటా ధనంగా రూ. 365 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం మరో రూ. 365 చెల్లిస్తుంది. ఇలా పదేళ్ల పాటు వాటాధనం చెల్లిస్తే సభ్యురాలికి 60 ఏళ్లు దాటాకా నెలకు రూ. 500 చొప్పున గరిష్టంగా రూ. 2,200 వరకు పింఛన్ పొందవచ్చు. వరుసగా రెండేళ్లపాటు వాటాధనం చెల్లించకుంటే సభ్యత్వం రద్దవుతుంది. సభ్యురాలు మరణిస్తే సహజ మరణానికి రూ.35వేలు, ప్రమాద మరణానికి రూ.75 వేలు, పాక్షిక ప్రమాదమైతే రూ.37,500 చొప్పున అందిస్తారు. సభ్యురాలు మృతి చెందితే దహన సంస్కారాల కింద రూ. 5 వేలు తక్షణ ఆర్థిక సహాయంగా అందజేస్తారు. ఉపకార వేతనాలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులై ఉండి బీమా ప్రీమియం చెల్లించిన సభ్యుల పిల్లలు చదువుతుంటే వారికి ఉపకార వేతనాల్ని అందజేస్తారు. తొమ్మిది, పది తరగతులతోపాటు ఇంటర్, ఐటీఐ చదువుకునే పిల్లలకు ఏడాదికి రూ.1200 చొప్పున ఉపకార వేతనాన్ని అందిస్తారు. ఒక్కో సభ్యురాలి ఇంట్లో ఇద్దరు పిల్లలకు మాత్రమే ఉపకార వేతనం ఇస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివినా చాలు ఈ ఉపకార వేతనం అందుతుంది. వీటికోసం పిల్లలు చదువుతున్నట్లుగా పాఠశాల, కళాశాలలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో మండల, అర్బన్ ఏపీఎం ద్వారా ఐకేపీ కార్యాలయం లేదా జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయాల్లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. యువతుల కోసం.. నిరుద్యోగ యువతులు స్వయం సమృద్ధి సాధించేందుకు వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఎంప్లాయిమెంట్ జనరేషన్ మార్కెటింగ మిషన్ (ఈజీఎంఎం) పేరిట యువతకు కంప్యూటర్ సంబంధిత రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం పదో తరగతి ఉత్తీర్ణులైన యవ తులు జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో లేదా సంబంధిత మండల ఏపీఎంలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత భోజనం, వసతితో కూడిన శిక్షణ ఇస్తారు. యువతీ యువకులు ఆర్థికంగా స్థిరపడేందుకు ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. వ్యవసాయంలోనూ.. రసాయనిక ఎరువుల వాడకంతో పెట్టుబడులు పెరిగి దిగుబడులు ఆశించిన మేరకు రాకపోవడం, గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యకు పాల్పడుతున్న నేపథ్యంలో వాటిని తగ్గించే దిశగా ప్రోత్సహిస్తుంది. సేంద్రియ పద్ధతులపై మహిళా రైతులకు శిక్షణ, కూరగాయలు, ఇతరత్రా పంటల సాగుకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తారు. ఇందుకోసం ప్రతీ గ్రామానికి వీవోఏలను నియమించారు. వీరు సేంద్రియ ఎరువుల వాడకాన్ని తెలియజేయడంతో పాటు వాటి తయారీ విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. -
సాగులో.. స్వయంకృషి
అన్ని రంగాల్లో దూసుకుపోతున్న స్వయం సహాయక సంఘాల మహిళలు సాగులోనూ సగం అని నిరూపిస్తున్నారు. మండల పరిధిలోని కంబాలపల్లి, వెల్టూర్ గ్రామాల్లో ఎన్‌పీఎం ఆధ్వర్యంలో వీరు పండిస్తున్న పంటలు సాగు రంగానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. వీటిని పరిశీలించేందుకు వస్తున్న దేశ, విదేశాల ప్రతినిధులు, అధికారులు భేష్ అని మెచ్చుకుంటున్నారు. మండలంలో ప్రస్తుతం 15 గ్రామాల్లో ఈ పద్ధతిన పలు రకాల పంటలు సాగవుతున్నాయి. 400 గ్రూపులకు చెందిన 4,792 మంది మహిళా రైతులు 10,393 ఎకరాల్లో శ్రీవరి, పసుపు, కంది, బెం డ, కాకర, వంకాయ, మిర్చి, టమాటా, సోరకాయ, బీరకాయ, ఆకు కూరలతో పాటు ఉల్లిగడ్డ తదితర పంటలను పండిస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. ఎన్‌పీఎం తరఫున కంబాలపల్లి, పొట్టిపల్లి, మద్దికుంట, వెల్టూర్, నిజాంపూర్ గ్రామాలకు 50 వేలు మంజూరయ్యాయి. సేంద్రియ సాగుకు ముందుకు వచ్చే మహిళలకు ఎన్‌పీఎం నిధులను సమానంగా పంపిణీ చేశారు. స్త్రీనిధి ద్వారా కూడ కూరగాయల పంటలు పండించేందుకు మహిళలు డబ్బులు రుణంగా తీసుకున్నారు. పంటచేతికి వచ్చిన తరువాత నెలసరి వాయిదాల్లో వీటిని తిరిగి చెల్లిస్తున్నారు. సేంద్రియ ఎరువులు తయారు చేసి విక్రయించేందుకు ముందుకు వచ్చిన గ్రామానికి చెందిన ఒక్కో మహిళకు రూ.10 వేలు అందజేశారు. ఈమె ఇంటి వద్ద ఎన్‌పీఎం దుకాణం ఏర్పాటు చేసి ఒక లీటరుకు రూ.2 నుంచి రూ.5 వరకు తీసుకుంటుంది. ఎన్‌పీఎం ఆధ్వర్యంలో మహిళలు పండించిన కూరగాయలను సదాశివపేట పట్టణానికి తరలించి విక్రయిస్తున్నారు. ఎరువుల తయారీ ఇలా రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులతోనే మహిళలు కూరగాయల పంటలు పండిస్తున్నారు. చీడపీడల నివారణకు ఎన్‌పీఎం దుకాణంలో ఎరువులు, మందులు కొనుగోలు చేస్తున్నారు. ఇందులో నాడెపు కంపోస్టు ఎరువు, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఎరువులను వాడుతున్నారు. నాడెపు కంపోస్టు దీని తయారీకి ఇంటి వద్ద పెరట్లో ఇటుకలతో 60 ఫీట్ల పొడవు, మూడు ఫీట్ల వెడల్పు, మూడు ఫీట్ల ఎత్తులో గొయ్యి తీస్తారు. దీనిలో 100 కిలోల ఆకులు (ఏవైనా), వ్యర్థాలు వేసి వాటిపై ఆవుపేడ పూసి మూడు నెలల పాటు నిల్వ ఉంచ డంతో నాడెపు కంపోస్టు తయారవుతుంది. దీన్ని పంట వేసే ముందు దుక్కుల్లో వేసుకుంటే భూసారం పెరగడంతో పాటు మిత్ర పురుగులు వృద్ధి చెందుతాయి. నీమాస్త్రం కూరగాయ మొక్కలు మొలకెత్తాక ఎలాంటి చీడపీడలు సోకకుండా నీమాస్త్రం అందించాలి. ఒక ఎకరాకు సరిపడా ఎరువు, ద్రావణ తయారీకి.. 10 లీటర్ల ఆవు మూత్రం, 5 కిలోల ఆవుపేడ తీసుకుని డ్రమ్ములో వేసి 100 లీటర్ల నీటితో కలియబెట్టాలి. ఇలా 48 గంటలపాటు ఉంచాక నీమాస్త్రం తయారవుతుంది. దీన్ని నీటి కాలువల ద్వారా కానీ, మొక్కలపై కానీ పిచికారీ చేసుకోవాలి. 15 రోజులకు ఒకసారి దీన్ని మొక్కలకు అందించాలి. బ్రహ్మాస్త్రం మొక్కలకు తెగుళ్లు సోకకుండా దీన్ని వాడతారు. దీని తయారికి ఐదు రకాల చెట్ల ఆకులను 2 కిలోల చొప్పున తీసుకుని ముద్దగా నూరి 10 లీటర్ల ఆవు మూత్రంలో కలపాలి. ఒక పాత్రలో పోసి మూతపెట్టి అరగంటపాటు ఉడకబెట్టాలి. ద్రావణం చల్లారిన తర్వాత గుడ్డతో వడబోయాలి. ఇది ఒక ఎకరాకు సరిపోతుంది. 100 లీటర్ల నీటికి 2 నుంచి 3 లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని కలిపి 10 రోజులకు ఒకసారి మొక్కలపై స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుంది. -
సిండి‘కేట్ల’కు బ్రేక్
ఇసుక రవాణా టెండర్లు రద్దు సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఇసుక అమ్మకాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. సుదీర్ఘ విరామం తర్వాత అధికారికంగా ఇసుక అమ్మకాలను జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాలోని 71 ఇసుక రీచ్‌లను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారి ద్వారా ఇసుకను డంపింగ్ యార్డుల నుంచి వినియోగదారులకు రవాణా చేసేందుకు కాంట్రాక్ట్ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా రవాణా కాంట్రాక్టర్లకు సంబంధించి బుధవారం టెండర్లు పిలిచారు. అందుకు పెద్ద సంఖ్యలో టెండర్లకు షెడ్యూల్డ్ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు వేసిన షెడ్యూల్డ్ ధరలకు భారీ తేడాలు ఉండడంతో టెండర్లను రద్దు చేయాలని అధికారులు భావించారు. ఆ మేరకు అధికారులు గురువారం రాత్రి ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రభుత్వ ఆదాయానికి సిండికేట్ల తూట్లు : ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ఇసుక రవాణాను అధికారికంగా కట్టబెట్టాలని నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీన్ని కొందరు నాయకులు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి జేబులు నింపుకోవాలని ఎత్తు వేశారు. ఇసుక రీచ్‌ల నుంచి డంపింగ్‌యార్డులకు ఇసుకును తరలించేందుకు ఎవరు తక్కువ మొత్తానికి కోడ్ చేస్తారో వారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు కిలో మీటర్ రూ.20 పైన ఇవ్వాలని భావించారు. అయితే కొందరు కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి కిలో మీటరు అతి తక్కువగా రూ.4 నుంచి రూ.5 నిర్ణయించుకుని టెండర్లు దాఖలు చేశారు. ఇంత తక్కువ మొత్తంలో కోడ్ చేయడంలో ఏదో మతలబు ఉందన్న విషయాన్ని పసిగట్టిన ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుందని భావించి టెండర్లు రద్దు చేశారు. -
రుణమాఫీ మాటే మరిచారు?
- మంత్రి ప్రత్తిపాటి వివరాలు ప్రకటిస్తారని సభకు తీసుకువచ్చారు - చివరకు మంత్రే గైర్హాజరయ్యారు - స్వయం సహాయక సంఘాల మహిళల ఆగ్రహం చిలకలూరిపేట టౌన్: ‘అంతా మోసం.. రుణమాఫీ చేస్తామన్నారు.. మంత్రి వచ్చి రుణమాఫీ వివరాలు ప్రకటిస్తారని చెప్పి సభకు తీసుకువచ్చారు.. ర్యాలీ నిర్వహించి సభ పెట్టి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ అంటూ చేయించారు.. మా ఇళ్లు శుభ్రంగా ఉంచుకోవడం మాకు తెలియదా.. మాఫీ సంగతి చెప్పరేంటి..’ అంటూ స్వయం సహాయక సంఘాల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలో జన్మభూమి -మా ఊరు కార్యక్రమాన్ని పురస్కరించుకొని పురపాలకసంఘం ఆధ్వర్యంలో గురువారం పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎన్ఆర్టీ సెంటర్లో సభ ఏర్పాటుచేశారు. సభలో మున్సిపల్ చైర్పర్సన్ గంజి చెంచుకుమారి, వైస్‌చైర్మన్ రాచుమల్లు బదిరీనారాయణమూర్తి, పలువురు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. సభలో జన్మభూమి, ప్రభుత్వ కార్యక్రమాలపై వివరించి పరిశుభ్రతకు సంబంధించి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ప్రతిజ్ఞ అనంతరం సభ ముగిసిందంటూ ప్రకటించి చైర్‌పర్సన్‌తోపాటు అధికారులు మరో కార్యక్రమానికి తరలివెళ్లారు. అప్పటివరకు స్వయం సహాయక సంఘాల రుణమాఫీపై హామీ లభిస్తుందని ఎదురుచూసిన మహిళలకు నిరాశ ఎదురైంది. రుణమాఫీ ఊసే ఎత్తకుండా సభ ముగించడంతో మహిళలు అసహనానికి, ఆగ్రహానికి గురయ్యారు. రుణమాఫీ చేయని ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. అదిగో.. ఇదిగో అనడం తప్పించి ఒరగబెట్టింది ఏమిలేదంటూ విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఏర్పడగానే రుణమాఫీ చేస్తామని చెప్పడంతో ఆశ పడి ఓట్లు వేశామని, ప్రస్తుతం బ్యాంకులోళ్లు రుణాలు వడ్డీతో సహా చెల్లించాలని వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హాజరవుతారని, రుణమాఫీపై స్పష్టత ఇస్తారని చెప్పి తమను సభకు తీసుకువచ్చారని వాపోయారు. తీరా రుణమాఫీపై ప్రశ్నిద్దామని వస్తే కార్యక్రమానికి మంత్రి హాజరుకాలేదని, మిగిలినవారు ఈ విషయమై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని పనులు మానుకొని బిడ్డలను ఇళ్లకాడ వదిలివస్తే ప్రవర్తించే తీరిదా అంటూ సభ నుంచి వెళ్తున్న మున్సిపల్ వైస్‌చైర్మన్ రాచుమల్లు బదిరీనారాయణమూర్తితోపాటు మెప్మా సిబ్బందిని నిలదీశారు. త్వరలోనే అన్ని సమస్యలను ప్రభుత్వం తీరుస్తుందని చెప్పి వైస్‌చైర్మన్ అక్కడినుంచి తప్పుకున్నారు. సమాధానం చెప్పేవారు లేకపోవడంతో చేసేదిఏమీ లేక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. -
‘కస్టమ్’ వారికెంతో ఇష్టం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: దాదాపు రూ. 251 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని స్వయం సహాయక సంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులను పక్కనబెట్టి, ఈ శాఖతో సంబంధమున్న ఓ ఐఏఎస్ అధికారిని తప్పుదోవ పట్టించి, ద్వితీయశ్రేణి అధికారులు ఈ ధాన్యాన్ని ఇష్టారాజ్యంగా మిల్లర్లకు కేటాయించారు. ఫలితంగా తమ బ్యాంకు బ్యాలెన్సులను పెంచుకున్నారన్న ఆరోపణలు సొంత శాఖలోనే వినిపిస్తున్నాయి. సర్కారు ఖజానాకు ఎసరు పెడుతున్న ‘కస్టమ్’ బాగోతం వెనుక ఉన్న అధికారులపై ఉన్నతాధికారులు ఎందు కు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. మార్గదర్శకాలు ఏం చెప్తున్నాయి ప్రతీ సీజన్లో ప్రభుత్వం స్వయం సహాయక సం ఘాలు, పౌరసరఫరాల శాఖ, ఎఫ్‌సీఐ తదితర సంస్థ ల ద్వారా రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధా న్యం కొనుగోలు చేస్తుంది. సీఎంపీ మార్గదర్శకాల ప్ర కారం కొనుగోలు కేంద్రాల సమీపంలో ఉండే రైస్ మి ల్లులకు ఆ ధాన్యాన్ని తరలించాలి. వారు ఆ ధాన్యా న్ని మర పట్టించి బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. ఇక్కడే అధికారులు తమ పలుకుబడి ని ఉపయోగించి ధాన్యాన్ని ఇష్టారాజ్యంగా ఇచ్చేసి ‘మామూలు’గా తీసుకుంటున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ మిల్లర్లు క్వింటాల్ ధాన్యానికి 68 కిలోల చొప్పున బియ్యం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. మర పట్టినందు కు క్వింటాల్‌కు రూ.25 ప్రభుత్వం వారికి చెల్లిస్తుంది. పెద్దనూకలు, చిన్న నూకలు, తౌడు, ఊక మిల్లర్లకే అ దనపు లాభంగా ఉంటుంది. నూకలకు సైతం మా ర్కెట్లో కిలోకు రూ.10 నుంచి రూ. 20 వరకు ధర పలుకుతుండగా, తౌడు వంట నూనె, ఊక ఇటుక బట్టీలకు అమ్ముకుంటారు. తిరిగిరాని బియ్యం ధాన్యం కేటాయించిన 15 రోజులలో బియ్యాన్ని మి ల్లర్లు ప్రభుత్వానికి అందించాలి. దీనిపై పౌరసరఫరా ల శాఖ అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలి. అయితే ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారులు ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించడమే కాకుం డా, మిల్లర్లతో కుమ్ముక్కై సర్కారు సొమ్ముకే ఎసరు పెడుతున్నారు. ఫలితంగా కొందరు రైస్ మిల్లర్లు పైసా పెట్టుబడి లేకుండా, బియ్యాన్ని తిరిగి ఇవ్వకుం డా రూ.251 కోట్ల సర్కారు ధాన్యంతో వ్యాపారం చేస్తున్నారు. ఈ బాగోతంలో మిల్లర్ల సంఘం నేత ఒ కరు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని, ‘మామూలు’గా తీసుకుంటున్న అధికారి వారికే వంతపాడుతున్నారనే విమర్శలున్నాయి. 98,355 క్వింటాళ్ల బియ్యం మిల్లర్ల వద్దే జిల్లా పౌరసరఫరాల శాఖ సూచనల మేరకు 2013- 14 ఖరీఫ్, రబీలలో కలిపి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, 1,87,028 మెట్రిక్ టన్నుల టన్నుల ధాన్యాన్ని సేకరించాయి. ఖరీఫ్‌లో ఈ ధాన్యాన్ని 88 మిల్లులకు కేటాయించారు. వారు 1,27,179 మెట్రిక్ టన్నుల బి య్యాన్ని పౌర సరఫరాల శాఖకు అప్పగించాలి. ఇదంతా గడువులోపే జరగాలి. 2013-14 ఖరీఫ్ మార్కెట్ సీజను ఎప్పుడో ముగిసిపోయింది. ఇప్పటి వరకు కేవలం 29,746 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే సరఫరా చేశారని పౌరసరఫరాల శాఖ అధికారులే చెబుతున్నారు. అంటే, ఇంకా 98,355 టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. ‘లెవీ’ వారికే అనుకూలం ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ‘లెవీ’ ఉత్తర్వులు కూడా మిల్లర్లకే అనుకూలంగా ఉన్నాయి. దీంతో స ర్కారుకు చెల్లించాల్సి కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని కూడా కొందరు మిల్లర్లు ఇతర రాష్ట్రాలకు అమ్ముకుని ‘క్యాష్’ చేసుకున్నారన్న ప్రచారం ఉంది. కొందరు మిల్లర్లు మాత్రం నిజాయితీగా తమకు కేటాయించిన ధాన్నాన్ని టార్గెట్ ప్రకారం ప్రభుత్వానికి చేరవేశారు. వారు సొంత డబ్బుతో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంతో వ్యాపారం చేసుకుంటున్నారు. ఇంకొందరు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఈ అక్రమాలపై విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు. -
పొదుపు మహిళలకు వడ్డింపు
- స్త్రీ నిధి రుణాలకు వడ్డీ కట్టాలని ప్రభుత్వ ఆదేశం - ఇప్పటిదాకా ఆ భారం మోయని మహిళలు - సర్వత్రా వ్యక్తమవుతున్న ఆగ్రహం - కట్టిన వడ్డీ ఖాతాల్లో ఎప్పుడో జమ అవుతుందంట? అద్దంకి : స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకులు సక్రమంగా రుణాలు ఇవ్వడం లేదనే ఉద్దేశంతో స్త్రీనిధి బ్యాంకులను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో మహిళలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణం ఇచ్చే సదుపాయం ఉంది. అర్హత కలిగిన మహిళ తన సెల్‌ఫోన్ ద్వారా రుణం కావాలని దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోగా అవసరమైన మేరకు వడ్డీలేని రుణం మంజూరయ్యేది. నెలా నెలా అసలు మాత్రమే చెల్లిస్తే సరిపోయేది. ఇక నుంచి అలా కుదరదు. వడ్డీ కూడా రుణగ్రహీతలే చెల్లించాలి. నియోజకవర్గంలో రూ.11.70 కోట్ల రుణాలు అద్దంకి నియోజకవర్గంలోని పొదుపు మహిళలు స్త్రీనిధి రుణాల కింద సుమారు రూ.11.70 కోట్లు తీసుకున్నారు. సంతమాగులూరు మండలంలో రూ.2.50కోట్లు అద్దంకి మండలంలో రూ.3.20కోట్లు, బల్లికురవ మండలంలో రూ. 1.50కోట్లు, కొరిశపాడు మండలంలో రూ.2 కోట్లు, పంగులూరు రూ.2.50 కోట్లు స్వయం సహాయక సంఘ మహిళలకు రుణంగా ఇచ్చారు. 14 శాతం వడ్డీ కట్టాల్సిందే.. స్త్రీ నిధి రుణాలు తీసుకున్న మహిళలు వాయిదాలు చెల్లించే సమయంలో అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లించాలి. ఈ మేరకు ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్‌కు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలకు ఆదేశాలు వచ్చాయి. స్త్రీ నిధి అధికారిక వెబ్సైట్లో కూడా వడ్డీ కట్టాల్సిన సమాచారాన్ని పొందుపరిచారు. మహిళల్లో ఆగ్రహం ప్రభుత్వం తమ డ్వాక్రా రుణాలు మాఫీ చేసి బతుకులు బాగు చేస్తుందనుకుంటే.. స్త్రీనిధి రుణాలపై వ డ్డీ కట్టాలని చెప్పడం ఏమిటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఐకేపీ ఏపీఎం ఘంటా శ్రీనివాసరావును వివరణ కోరగా స్త్రీ నిధి రుణాలకు వడ్డీ చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన మాట వాస్తవమేనన్నారు. ఇక నుంచి చెల్లించాల్సిన రుణ వాయిదాలతోపాటు వడ్డీ కూడా చెల్లించాలి. ఆ బాధ్యత నుంచి తప్పుకునేందుకేనా? అధికారం వచ్చి నెల రోజులైనా డ్వాక్రా రుణాల మాఫీపై ఎటూ తేల్చని టీడీపీ ప్రభుత్వం స్త్రీనిధి రుణ బకాయిలకు 14 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. ఇప్పటి వరకు ఆ వడ్డీని ప్రభుత్వమే నేరుగా చెల్లించేది. జూలై ఒకటి నుంచి అసలుతోపాటు వడ్డీ కూడా సంఘాల మహిళలే చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది. బ్యాంక్ లింకేజి వచ్చినప్పుడు సంబంధిత నగదు వారికి జమ అవుతుందని చెబుతున్నప్పటికీ ఎప్పట్లోగా చెల్లిస్తామన్న హామీ మాత్రం ఇవ్వడం లేదు. దీనిని బట్టిచూస్తే పథకం అమలు బాధ్యతల నుంచి ప్రభుత్వం తిన్నగా తప్పుకోవాలనే యోచన కనిపిస్తోందని పొదుపు మహిళలు విమర్శిస్తున్నారు. -
దేశానికే ఆదర్శం
రాష్ర్ట మహిళలకు రాహుల్ ప్రశంస చెన్మమ్మ, మల్లమ్మల పోరాట పటిమ స్ఫూర్తిదాయకం మహిళలపై దాడులను నిరోధించేందుకు కృషి రాజకీయాల్లోకి విరివిగా మహిళలు రావాలి మిహ ళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటున్న విపక్షాలు సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలోని స్త్రీశక్తి దేశానికే ఆదర్శమంటూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శ్లాఘించారు. తుమకూరు మహాత్మాగాంధీ ప్లేగ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన మహిళా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కిత్తూరు రాణి చెన్మమ్మ, బెళవడి మల్లమ్మల స్మరణతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అలాంటి వీర వనితల పోరాట పటిమ, పరిపాలనా దక్షత అందరికీ ఆదర్శం కావాలన్నారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని, 20 లక్షల మంది స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు బ్యాంకులతో అనుసంధానం కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను నిరోధించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందని అన్నారు. తాను దేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ వచ్చానని, ఎక్కడైతే మహిళలకు పూర్తి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు లభించాయో అక్కడ మాత్రమే అభివృద్ధి కనిపించిందని, ఎక్కడైతే మహిళలు అణచివేతకు గురయ్యారో అక్కడ ఏ మాత్రం అభివృద్ధి కనిపించలేదని అన్నారు. మహిళలు రాజకీయ రంగంలోకి ఎక్కువ సంఖ్యలో రావాల్సిన అవసరం ఉందన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని తీసుకురావడానికి యూపీఏ ప్రభుత్వం ప్రయత్నించిందని, అయితే విపక్షాలన్నీ ఏకమై ఆ బిల్లును అడ్డుకుంటున్నాయని చెప్పారు. ఆరు లేన్ల జాతీయ రహదారి ప్రారంభం..:నాలుగో నంబర్ జాతీయ రహదారిలో తుమకూరు-చిత్రదుర్గలను కలుపుతూ నిర్మించిన ఆరు లేన్ల రహదారిని రాహుల్‌గాంధీ లాంఛనంగా ప్రారంభంచారు. తుమకూరును సందర్శించడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని రాహుల్ పేర్కొన్నారు. ఇక్కడి సిద్ధగంగ మఠం విద్యారంగంలో ఎంతో కృషి చేస్తోందని కొనియాడారు. తుమకూరులో మహిళా సదస్సులో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి కుణిగల్, మద్దూరు, మండ్య ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహిస్తూ మైసూరు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. నల్ల రిబ్బన్లతో ‘ఆప్’ ధర్నా : రాహుల్‌గాంధీ ప్రసంగం ప్రారంభమయ్యే సమయంలో ఆప్ కార్యకర్తలు నల్లరిబ్బన్లు, నల్లబ్యాడ్జీలతో కుణిగల్ దారిలో ధర్నాకు దిగారు. జనలోక్‌పాల్ బిల్లు అమల్లోకి రాకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో పోలీసులు ఆప్ కార్యకర్తలందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
నంబర్ 1
సాక్షి, రంగారెడ్డి జిల్లా : స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కిచ్చే బ్యాంకు లింకేజీ రుణాల్లో జిల్లా సరికొత్త రికార్డు సాధించింది. వార్షిక సంవత్సరం ముగింపునకు మరో రెండు నెలలు గడువున్నప్పటికీ నిర్దేశించిన లక్ష్యాన్ని అప్పుడే అధిగమించింది. జిల్లాలో 2013-14 వార్షిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు కేటాయించిన రుణ లక్ష్యాన్ని పూర్తిచేసి రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 8,614 స్వయం సహాయక సంఘాలకు రూ.214.87కోట్ల లింకేజీ రుణాలను పంపిణీ చేశారు. వార్షిక సంవత్సరం చివరినాటికి మరో రూ. 25 కోట్ల లింకు రుణాలు ఇచ్చేందుకు ఆ శాఖ అధికారులు పరుగులు పెడుతున్నారు. లక్ష్యానికి మించి రుణాలు... జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి 9,141 ఎస్‌హెచ్‌జీలకు రూ.228.98 కోట్లు ఇచ్చేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 4,999 ఎస్‌హెచ్‌జీలకు రూ.119.06 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంది. అయితే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఇప్పటివరకు 8,614 సంఘాలకు రూ.214.87 కోట్ల రుణాలు ఇచ్చారు. ఇందులో 142 సంఘాలకు రూ.5.03కోట్లు రెన్యువల్ కింద మంజూరు చేయగా.. మిగతా రుణాలన్నీ కొత్తగా ఇచ్చినవే. రికవరీల్లో జోష్.. మంజూరులో భేష్.. స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్న లింకు రుణాల రికవరీ ఆశాజనకంగా ఉంది. దాదాపు 92శాతం క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్నట్లు ఐకేపీ అధికారులు అంతర్గతంగా చేసిన సర్వేలో తేలింది. రివకరీలు క్రమం తప్పకుండా వస్తున్నందునే రుణ మంజూరు ప్రక్రియ వేగిరంగా పూర్తవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత వార్షిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యంలో దాదాపు 93శాతం రుణాలు మంజూరు చేశారు. ప్రస్తుతం మహిళా సంఘాలకు రూ.25కోట్ల రుణాలకు సంబంధించి గ్రామీణాభివృద్ధి అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. వార్షిక సంవత్సరం ముగిసేనాటికి మరికొన్ని సంఘాలకు కూడా రుణాలు ఇవ్వనున్నట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.